ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావడం ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం రేకెత్తించిన టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఫెడరల్ ఫ్రంట్ అని, ఇలా అనేక ప్రచారాలు కొన్ని రోజులగా వినిపిస్తున్నాయి... ఈ విషయం పై చంద్రబాబు సోమవారం ఎంపీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ లో క్లారిటీ ఇచ్చారు... జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నామని మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీలతో బాబు అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే జాతీయ పార్టీల మద్దతు కోరుతున్నామని తెలిపారు... ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థుతులలో జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు...
ఇదే విషయం పార్టీ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.. బీజేపీ, కాంగ్రె్‌సలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌కు ఆయన నాయకత్వం వహిస్తారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతున్నా ఆయన దానికి ఆసక్తిగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకువెళ్లడంపైనే ఆయన తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారని, ప్రస్తుతం అది తప్ప ఆయన ముందు మరో ఆలోచన లేదని ఆ వర్గాలు వివరించాయి... టీడీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పలుకుబడికి దర్పణం పట్టింది. కొద్ది గంటల వ్యవధిలోనే అనేక పార్టీలు దీనికి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాయి...
ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలితో విసిగెత్తిపోయిన మిత్రపక్షాలు కూడా, కాంగ్రెస్, బీజేపీ రహిత పార్టీలని ఏకం చెయ్యాలంటే, చంద్రబాబు లాంటి నాయకుడే సమర్ధుడు అని అనుకుంటున్నాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీ ఢిల్లీలో మరింత క్రియాశీల పాత్ర పోషించాలని ఇతర పార్టీలు కోరుతున్నాయి... అయితే చంద్రబాబు మాత్రం, ఆంధ్రప్రదేశ్ కు మోడీ చేసిన అన్యాయాల ఎండగట్టే విషయంలో, మీ అందరి సహకారం కోరుతున్నాని చంద్రబాబు ఆ నాయకులకు చెప్తున్నారు... ముందు రాష్ట్ర ప్రయోజనాలే అని, తరువాతే జాతీయ రాజకేయాలని చంద్రబాబు అంటున్నారు..