రాష్ట్రంలోని మొక్కజొన్న, జొన్న రైతులకు ధర రాయితీ పథకం (పీఎస్‌ఎస్‌)లో రూ.259 కోట్ల ప్రోత్సాహకం అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గురువారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మొక్కజొన్న, జొన్న ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో పీఎస్‌ఎస్‌ పథకంలో క్వింటాలుకు రూ.200 చొప్పున (ఒక్కో రైతుకు గరిష్ఠంగా 100 క్వింటాళ్ల వరకు) సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ఈ పంటలు సాగు చేసిన రైతుల వివరాలు నమోదు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 2.96 లక్షల మంది రైతులు సుమారు 128 లక్షల క్వింటాళ్లకు ప్రోత్సాహకం కోరుతూ పేర్లు నమోదు చేసుకున్నారు.

farmers 02082018 2

జులై మొదటి వారం నుంచి అధికారులు గ్రామాలకు వెళ్లి పరిశీలించి తుది జాబితాలు తయారు చేశారు. తొలుత నమోదైన వివరాల ప్రకారం రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.265 కోట్లుగా అంచనా వేయగా.. తుది పరిశీలనలో రూ.259 కోట్లుగా లెక్క తేల్చారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13.72 లక్షల క్వింటాళ్ల జొన్న, 33.45 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న ఉత్పత్తిపై ప్రోత్సాహక నిధుల కోసం రైతులు నమోదు చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఒక్క క్వింటాలు కూడా నమోదు కాలేదు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 100 క్వింటాళ్లకు రూ.20 వేల వరకు అందనుంది.

రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టింది మొదలు తనదైన శైలిలో నూతన ఒరవడి కొనసాగిస్తున్న వెంకయ్యనాయుడు తాజాగా ఓ చిత్రమైన పరిస్థితి ఎదుర్కోనున్నట్టు కనిపిస్తోంది. అసోంకి చెందిన కాంగ్రెస్ సభ్యులంతా ఆయనపై ఆయనకే ఫిర్యాదు చేస్తూ లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. అసోం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఎన్‌ఆర్‌సీపై మాట్లాడేందుకు తగినంత సమయం కేటాయించడం లేదనీ... ‘‘చైర్మన్ మాకు అన్యాయం చేస్తున్నారని..’’ ఆరోపిస్తూ ఎంపీలు ఆయనకు లేఖ రాయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేత గులాం నబీ ఆజాద్ తుదినిర్ణయం తీసుకున్న తర్వాత ఈ లేఖను సంధించనున్నారు. దీనిపై మొత్తం ఐదుగురు ఎంపీలు సంతకాలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ వినూత్న నిరసనకు అసోంకి చెందిన మరో ఎంపీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

venkiah 02082018 2

ఎన్ఆర్సీపై రాజ్యసభలో బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సమయంలోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సంతకం చేసిన అస్సాం ఒప్పందంలో భాగంగానే ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తున్నామంటూ’’ బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించారు. 2005లోనే ఎన్‌ఆర్సీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించినప్పటికీ.. ‘‘బంగ్లాదేశీ అక్రమ వలసదారులను’’ దేశం నుంచి తరిమేందుకు కాంగ్రెస్‌కు ధైర్యం సరిపోలేదన్నారు. జాతీయ భద్రత, పౌరుల హక్కుల కంటే ఓటుబ్యాంకే ముఖ్యమని భావించబట్టే కాంగ్రెస్ దీనిని బుట్టదాఖలు చేసిందని అమిత్ షా ఆరోపించారు.

venkiah 02082018 3

ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. అమిత్ షా ప్రసంగం ముగియక ముందే ప్రతిపక్షాలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నాయి. అయితే సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తే సహించేది లేదంటూ వెంకయ్యనాయుడు విపక్షాలను వారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తమ పార్టీ చీఫ్ అమిత్‌షాను కాపాడుకునేందుకు బీజేపీ ఎంపీలంతా భుజం కలిపి నిలబడుతున్నారు. ఎన్‌ఆర్సీపై చర్చించేందుకు సమయం కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీలు కోరినప్పటికీ వెంకయ్య అనుమతించలేదు. దీంతో అసోం కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.

 

తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుంది కేంద్రం. స్పెషల్ ట్రీట్మెంట్ అంటే బాగా నిధులు ఇచ్చేసి, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చటం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టటం. ప్రతి ఫైలునూ అవసరానికి మించి, అసాధారణ స్థాయిలో పరిశీలించడం, రాజకీయ కోణంలో ఆలోచించడం! ఇదే ఆ స్పెషల్ ట్రీట్మెంట్. రాష్ట్రాల నుంచి వచ్చే ఫైళ్లను ఢిల్లీ స్థాయిలో సాధారణ ప్రకియ్రలో భాగంగానే ఆమోదిస్తుంటారు. నిధుల విడుదల నుంచి, విధానాల వరకు సాధారణ ప్రక్రియలో భాగంగానే జరుగుతాయి. కానీ... రాష్ట్రం నుంచి వెళ్లిన ఫైళ్లపై మాత్రం ఢిల్లీలో ఆసక్తికర చర్చ జరుగుతోందని సమాచారం. ఈ ఫైలును ఏ కోణంలో చూడాలి? ఎంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలి? అనే కోణంలో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.

ap 02082018 2

అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణంపైనా చర్చ జరుగుతోంది. ఇటీవలికాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం సంగతి ఎలా ఉన్నప్పటికీ... కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఢిల్లీలో కూర్చుని ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. కేంద్రంలో ఏ పథకాల నుంచి నిధులు తెచ్చుకోవచ్చన్న దానిపైనా ఒక మోస్తరు పరిశోధన కూడా జరిగింది. ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులే స్వయంగా ఢిల్లీకి వెళ్లి నిధులు సాధించాలని సీఎం ఆదేశిస్తున్నారు. అలా వెళ్లిన సమయంలోనూ కేంద్ర అధికారులు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, బీజేపీ-టీడీపీ మధ్య ఎందుకు చెడింది, ఏపీకి రావాల్సింది ఏంటి, ఇంతవరకూ కేంద్రం చేసిందేమిటి... అంటూ వివరాలు ఆరా తీస్తున్నారు.

ap 02082018 3

కేంద్రంతో విభేదించి ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే అని పేర్కొంటున్నారు. రాజకీయ పరిణామాలు, ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి శాఖలో ఎక్కడన్నా అవినీతి జరిగిందా ? రూల్స్ కి వ్యతిరేకంగా ఏమన్నా చేసారా అనేది కూడా, కేంద్రంలోని కొంత మంది ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నారు. అయితే, చంద్రబాబు అవినీతి చేసాడు, త్వరలో చుక్కలు చూపిస్తాం, జైల్లో పెడతాం అని మొన్నటి దాక మాట్లాడిన బీజేపీ వాళ్ళు, గత నెల రోజుల నుంచి, ఈ విషయం మాట్లాడటం మానేశారు. ఎందుకంటే, వారికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఏది ఏమైనా, కేవలం రాజకీయం కోసం, ఇలా ఒక రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టటం ఏంటో, వారికే తెలియాలి.

పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, తెలంగాణా వెళ్ళిపోయి, హైదరబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న చంద్రబాబుని ఎలా దించాలా అని ప్రణాలికలు వేస్తున్నారు. తన సలహాదారుడు చింతలబస్తీ దేవ్ ను పక్కన పెట్టుకుని, ఎలా ముఖ్యమంత్రి అవ్వాలో ప్రణాలికలు రచిస్తున్నారు. అందులో భాగంగా, ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు, దేశ ప్రజలు కూడా తిరస్కరించిన కమ్యూనిస్ట్ పార్టీలను హైదరాబాద్ పిలిచారు. అందరం కలిసి చంద్రబాబుని దించే ప్రయత్నం చేద్దాం అని ప్లాన్ వేసారు. ఇప్పటికే బీజేపీ అతి పెద్ద స్కెచ్ వెయ్యగా, జగన్ మోహన్ రెడ్డి అదే ప్లాన్ లో ఉన్నాడు, ఇప్పుడు పవన్ కూడా చంద్రబాబుని దించటమే లక్ష్యంగా హైదరాబాద్ నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

pk 02082018 2

ఇందులో భాగంగా, జనసేన, సీపీఐ, సీపీఎంలు కూడా టీడీపీ బలహీనతలను అవకాశంగా తీసుకుని ఆ పార్టీలు ప్రయోజనం పొందాలని యోచిస్తున్నాయి. అందులోభాగంగా గురువారం జనసేన కార్యాలయంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ను సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ కలిశారు. ఈ భేటీ అంతా టీడీపీ చూట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించామని, ఏపీలో టీడీపీ వేగంగా బలహీనపడుతోందని, ఇచ్చిన హామీలు సీఎం చంద్రబాబు అమలు చేయడంలేదని సీపీఎం నేత మధు ఆరోపించారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్ష నేత జగన్‌ సొమ్ము చేసుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు.

pk 02082018 3

విభజన హామీలు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేజోన్‌ సాధనే తమ లక్ష్యమని మధు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని, విజయవాడ నగర సమస్యలపై పోరాడతామని, కాపు రిజర్వేషన్లపై నిపుణులతో చర్చిస్తామని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. వీరికి పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. ఇప్పటి వరకు మోడీతో పోరాడింది నేనే అని చెప్పారు. చంద్రబాబుకు మోడీ అంటే భయం అని అందుకే ఆయన పోరాటం చెయ్యలేరని చెప్పారు. అలాగే చంద్రబాబుకు పరిపాలన చెయ్యటం రాదని, అవినీతి చెయ్యటమే వచ్చని, వచ్చే ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చిన తరువాత కాని ప్రజలకు మంచి జరగదని చెప్పారు. త్వరలో విజయవాడలో మరోసారి సమావేశమవుతామని, గోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన ముగిశాక జిల్లాల్లో సమస్యలపై పోరాడతామని జనసేన నేత మాదాసు గంగాధరం చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read