ఆంధ్రప్రదేశ్ కి మరో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ రాబోతోంది. ఇప్పటి వరకూ మన దేశంలో కేవలం ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. కానీ మొదటి సారి ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ రాబోతుంది. ఈ కంపెనీ మొబైల్ ఫోన్స్ తయారీ లో వినియోగించే కెమెరా మాడ్యూల్స్,టిఎఫ్టి స్క్రీన్స్ తయారు చెయ్యబోతుంది. తిరుపతిలో ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 లో ఏర్పాటు కాబోతోంది. రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంది. 1400 కోట్ల పెట్టుబడి ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టనుంది. నేరుగా 6 వేల మందికి ఈ కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ కంపెనీ మొదటి సారి మన దేశంలో పెట్టుబడి పెట్టబోతుంది. అధునాతన సాంకేతికత,పరిశోధన మరియు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించేందుకు కంపెనీ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డేవేలప్మెంట్ కూడా ఈ కంపెనీ ఏర్పాటు చెయ్యబోతుంది...

ఢిల్లీ లోని నోయిడా రీజియన్,మహారాష్ట్ర రాష్ట్రాల నుండి తీవ్రమైన పోటీ ఎదురైన కంపెనీ చివరికి ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గుచూపింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ బృందం ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేందుకు రెండుసార్లు చైనాకి పర్యటించింది. మరో సారి మంత్రి నారా లోకేష్ స్వయంగా కంపెనీ ప్రతినిధులని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించి ఆంధ్రప్రదేశ్ కి రావాలి అని ఆహ్వానించారు. ఈ కంపెనీ దేశంలో ఉన్న అన్ని మొబైల్ తయారీ కంపెనీలకు విడిభాగలు సప్లై చేసే అవకాశం ఉంది. సచివాలయంలోని బ్లాక్ 1 లో ఆగస్ట్ 6 వ తారీఖున ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి సమక్షంలో అనంతరం ముఖ్యమంత్రి గ్రీవెన్ హాల్ లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఈ ప్రెస్ మీట్ లో కంపెనీ ప్రతినిధులు పాల్గొని కంపెనీ ఏర్పాటు వివరాలు ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతుంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ 20 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. మొబైల్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్ లో 15 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.మరో పక్క తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో సెల్ కాన్,డిక్సన్ ప్రారంభం అయ్యాయి.త్వరలోనే కార్బన్ కూడా ప్రారంభం కాబోతోంది.రిలయన్స్ జియో సమగ్ర ప్రొజెక్ట్ రిపోర్ట్ తయారు అయ్యింది.125 ఎకరాల్లో జియో మొబైల్స్,ఎలక్ట్రానిక్స్ తయారీ మెగా కంపెనీ త్వరలోనే ఏర్పాటు కాబోతోంది.

ఇటీవల కాలంలోనే ఫ్లెక్స్ ట్రానిక్స్,ఇన్వెకాస్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నాయి.అలాగే లిథియం ఐయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ మునోత్ కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కి రాబోతుంది...ఈ రంగంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి నారా లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.అనేక కంపెనీల ప్రతినిధులను దేశంలోని వివిధ నగరాలు,వివిధ దేశాల్లోనూ,వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులోనూ వివిధ కంపెనీలను కలిసి రాష్ట్రం గురించి వివరించారు.దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి.వచ్చే నెల నుండి ప్రతి నెలా ఒకటి లేదా రెండు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి రానున్నాయి.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉండటం.ఎంఓయూ కన్వెర్షన్ లో దేశంలో నెంబర్ 2 లో ఉండటం వలన ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.... ఇతర రాష్ట్రాల నుండి ఉన్న పోటీ నేపథ్యంలో ఈ కంపెనీ వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి...6 వ తారీఖున ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే కార్యక్రమంలో కంపెనీ వివరాలు వెల్లడించనున్నారు.

రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులుకు శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి అనంతపురం నుంచి బయలుదేరారు. అదే సమయంలో అనంతపురం జిల్లా బెళుగుప్ప నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఓ కారు వెనుక టైరు కాలువపల్లి తండా వద్ద పంక్చరై అదుపుతప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కారును వేగంగా రాసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో మంత్రి ఉన్న కారు ఒకవైపు దెబ్బతింది.

kalva 04082018 2

డ్రైవర్ అప్రమత్తం కావడం, ఆ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, దెబ్బతిన్న కారును అక్కడే వదిలేసి మంత్రి మరో వాహనంలో గోళ్లకు వెళ్లిపోయారని స్థానిక ఎస్సై తెలిపారు. టైరు పంక్చర్‌ కావడంతోనే కారు అదుపుతప్పిందని గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసు సిబ్బంది, మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి క్షేమ సమాచారం కోసం చంద్రబాబు ఫోన్ చేసారు. ‘శీనూ ఎలా ఉన్నావ్‌... ఏమి జరగలేదుగా’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి కాలవ శ్రీనివాసులు వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న సీఎం ఫోన్‌లో మంత్రితో మాట్లాడి ఘటన గురించి ఆరా తీశారు. ‘ఏమి కాలేదు కదా... వెరీగుడ్‌’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

kalva 04082018 3

అలాగే డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప ఫోన్‌ చేసి మంత్రి కాల్వతో మాట్లాడి ఆరా తీశారు. జిల్లా మంత్రి పరిటాల సునీత ఆరా తీశారు. విషయం తెలిసిన వెంటనే అమరావతి నుంచి ఫోన్‌ చేసి మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ పూల నాగరాజుకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నామని వారు తెలుపగా.... ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, అధికారులు మంత్రి కాలవ శ్రీనివాసులుకు ఫోన్‌ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూపాతో పాటు పలువురు నాయకులు, తెలుగు తమ్ముళ్లు మంత్రి ఇంటికెళ్లి తమ నేతను పరామర్శించారు. రాత్రి 10 గంటల వరకూ మంత్రి స్వగృహం పరామర్శలతో సందడిగా కనిపించింది.

మన రాష్ట్రానికి జరిగిన అన్ని అవమానాలకంటే, ఇది ఎంతో దారుణమైనది. డబ్బులు మన ఎకౌంటులో వేసి మరీ వెనక్కు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని ఈ సంఘటన గురించి, చంద్రబాబు నేషనల్ మీడియాతో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెనుకబడిన జిల్లాలకు రావలసిన 350 కోట్ల నిధులు గురించి పార్లమెంట్ లో నిలదీశారు తెలుగుదేశం ఎంపీలు. వెనుకబడిన జిల్లాల కోసం గతంలో విడుదల చేసిన రూ.350 కోట్లకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు రాలేదని, అందుకే ఆ సొమ్మును వెనక్కు తీసుకున్నామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ సమాధానమిచ్చారు. ఇప్పటివరకూ ఆ సొమ్ము విడుదల చేయలేదన్నారు. శుక్రవారం లోక్‌సభలో కర్నూలు ఎంపీ బుట్టారేణుక అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

amaravati 04082018 2

‘‘విభజన చట్టంలోని సెక్షన్‌ 46(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకు రూ.300 కోట్ల చొప్పున రూ.2,100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాం. అందులో ఒక్కో జిల్లాకు ఏటా రూ.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు మూడు వాయిదాల్లో రూ.1,050 కోట్లు విడుదల చేశాం. విభజన చట్టం కింద కొత్త రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం తరఫున చేయాల్సిన సాయంపై 2015 డిసెంబర్‌ 1న నీతి ఆయోగ్‌ ఏడు వెనుకబడిన జిల్లాలకు ఒక్కో దానికి రూ.300 కోట్ల చొప్పున రూ.2,100 కోట్ల మొత్తాన్ని సిఫార్సు చేసింది. అందులోనే అంతకుముందు రెండేళ్లలో విడుదల చేసిన రూ.700 కోట్లు కూడా ఇమిడి ఉంది. వినియోగ పత్రాలను(యూసీ) నీతి ఆయోగ్‌ తనిఖీచేసిన తర్వాత, సంబంధిత అధికార యంత్రాంగం ఆమోదముద్ర వేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిధులు విడుదల చేస్తూ వస్తున్నాం. తాజా అంశంలో అవసరమైన అన్ని రకాల అనుమతులు లభించలేదు. అందువల్లే అనుకోకుండా రూ.350 కోట్లు విడుదల చేసి వెనక్కు తీసుకున్నాం. ఇంకా ఆ నిధుల విడుదల జరగ లేదు’’ అని మంత్రి పేర్కొన్నారు.

amaravati 04082018 3

అయితే, ఎవరు ఆ అనుమతులు ఇవ్వలేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే, ఇప్పటికీ నీతి ఆయోగ్, దీనికి సంబంధించిన అన్ని రకాల యుసీలు ఆమోదించింది. మరి, ఎవరి అనుమతి ఇవ్వలేదు అనే విషయం మాత్రం స్పష్టం లేదు. గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసమని కేంద్రం రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుందంటూ విమర్శలు చేస్తుండగా..భాజపా నేతలకు ఖండిస్తూ వస్తున్నారు. రెవెన్యూలోటు భర్తీ కింద ఇప్పటికే 96.94% మొత్తాన్ని ఇప్పటికే ఇచ్చేశామని ఎంపీ రాయపాటి సాంబశివరావు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో గణించిన ప్రకారం రూ.11,960.87 కోట్ల రెవెన్యూ లోటులో వ్యవసాయ రుణమాఫీ, రుణబాండ్లు తీసుకోవడానికి డిస్కంలకు చేసిన సాయం, పెంచిన పింఛన్లను కలిపారని చెప్పారు. వీటన్నింటినీ మినహాయిస్తే రెవెన్యూ లోటు రూ.4,117.89 కోట్లేనని తేలిందని, అందులో ఇప్పటికే రూ.3,979.50 కోట్లు ఇచ్చామని వెల్లడించారు.

అమ్మా పెట్టదు, అడుక్కుతిననివ్వదు అని.. వీళ్ళకు ఎలాగూ రాష్ట్రం పై ప్రేమ లేదు.. రాష్ట్ర హక్కుల కోసం, పోరాడే దమ్ము లేదు.. బానిసత్వం ఒకరిది, కేసుల మాఫీ కోసం ఒకరు.. ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. వీరే జీవీఎల్‌ నరసింహారావు.. A2 విజయసాయి రెడ్డి... ఇద్దరూ నిన్న కంప్లైంట్ ఇచ్చారు.. జీవీఎల్ నిన్న చేసింది ఇది... పార్లమెంటు ప్రతిష్ఠను దిగజార్చేలా తెలుగు దేశం పార్టీ ఎంపీలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీలు తమ హోదాకు భిన్నంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ పార్లమెంటును అభాసుపాలు చేస్తున్నారన్నారు.

amaravati 04082018 1

పార్లమెంటు రక్షణకు సంబంధించిన సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)లో సభ్యుడినైన తాను.. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. ఈ తరహా నాటకాలకు సోమవారంతో తెరపడుతుందన్నారు. గతంలో భాజపాతో సహా ఇతర పార్టీలు పార్లమెంటు ఆవరణలో ధర్నాలు చేశాయి కదా..మరి ఇప్పుడెలా తప్పవుతుందని విలేకరులు ప్రశ్నించగా...ఎప్పుడో ఓ సారి చేయడం తప్పుకాదని... రోజూ కొనసాగించడం సరికాదన్నారు. ఇక మరో పక్క విజయసాయి రెడ్డి కూడా ఇదే బాణీలో ఉన్నారు. లోక్‌సభను రాజ్యసభతో పోల్చి చూడొద్దని ఆయన రాజ్యసభలో ప్రసంగం చేసారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకునే వారికి జీతభత్యాలు ఇవ్వకూడదు అన్నారు. అంతరాయం కలిగిన సభా సమయానికి నష్టపరిహారంగా అంతే సమయాన్ని పొడిగించాలని విలువైన సూచన చేశారు.

amaravati 04082018 2

కొద్ది రోజుల క్రితం కూడా టీడీపీ నేతలకు జీవీఎల్‌ నరసింహారావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ప్రసంగం తర్వాత తనను టీడీపీ నేతలు బెదిరించారని నోటీసులో పేర్కొన్నారు. వీడియో ఆధారాలు రాజ్యసభ అధికారులకు ఆయన అందజేశారు. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో బెదిరించారని జీవీఎల్ ఆరోపించారు. వెంకయ్య నాయుడుకి ఇచ్చిన కంప్లైంట్ లో జీవీఎల్ రాస్తూ, టీడీపీ వైఫల్యాలను రాజ్యసభ వేదికగా ఎండగట్టడంతోనే తనను టీడీపీ నేతలు బెదిరించారని జీవీఎల్ అన్నారు. టీడీపీ నేతలు తనను హెచ్చరిస్తున్న వీడియో ఆధారాలను, ప్రెస్ లో వచ్చిన వాటిని రాజ్యసభ సెక్రటేరియట్ కు ఇస్తున్నట్టు జీవీఎల్ చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read