గత నాలుగేళ్ల నుంచి అస్తవ్యస్థ నిర్ణయాలతో ప్రజల జీవితాలతో చెలగాటమాడిన బిజెపి పెద్దలకు, ఎన్నికల సమయాన భారత ఓటర్లు షాక్‌ ఇవ్వబోతున్నారని ఓ సర్వే తేల్చింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే, అధికార బిజెపికి 137 నుంచి 175 సీట్లు మాత్రమే వస్తాయ, ఆ పార్టీ నిర్వహించుకున్న అంతర్గత సర్వేలో తేలిందట. మొత్తం దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలపై ఒక జాబితా రూపొందించి, ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నిసీట్లు ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తాం, అనేదాని పై బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం చర్చించుకుందట. వారు నిర్వహించుకున్న సర్వే ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ 150సీట్ల మార్క్‌ను దాటడం కష్టంగా కనిపిస్తోందట.

survey 05082018 2

2014 ఎన్నికల్లో ఏ రాష్ట్రం నుంచి ఎన్ని సీట్లు గెలిచాం, ప్రస్తుతం ఎన్ని గెలవబోతున్నాం, గట్టిగా కష్టపడితే వచ్చే సీట్లు ఎన్ని అనేదానిపై విశ్లేషణ చేసుకున్నారట. గట్టిగా కష్టపడ్డా, ఇతరత్రా ప్రలోభాలకు గురిచేసినా, మొత్తం మీద 175 సీట్లకు మించవని ఆసర్వే తేల్చిందట. రాష్ట్రాలవారిగా గతంలో గెలిచిన సీట్లు, ప్రస్తుతం..ఉన్న అవకాశాలను పార్టీ లోతుగా విశ్లేషించుకుందట. మొదట ఆంధ్రప్రదేశ్‌ విషయాన్ని తీసుకుంటే, గత ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకుని ఆ పార్టీ రెండు సీట్లను గెలిచింది. ఈ సారి, ఆ సీట్లు రావని, పార్టీ సర్వేలో తేలిందట. అదే విధంగా దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, బీహార, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,ఒరిస్సా, తెలంగాణ, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కష్టాలు ఎదురు కానున్నట్లు పార్టీ నిర్వహించిన సర్వే తేల్చి చెప్పిందట.

survey 05082018 3

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 75 సీట్లు గెలిస్తే, ఈ సారి బిజెపికి దక్కబోయేది 25 నుంచి 30 మాత్రమేనట. అదే విధంగా ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ లో గత ఎన్నికల్లో,ఆ పార్టీ 26కు 26 గెలిస్తే.ఈసారి 10 స్థానాలు దక్కితే గొప్పేనట. కర్ణాటకలో గత ఎన్నికల్లో 17 స్థానాలు సాధిస్తే, ఈసారి 6కు మించవు. అదే విధంగా మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి 27 స్థానాలు దక్కితే, ఈ సారి 10 నుంచి 17 మధ్యమాత్రమేనట. మహారాష్ట్రలో గతంలో 28 గెలిస్తే, ఈసారి 10 దక్కుతాయని సర్వే తేల్చింది. రాజస్థాన్‌లో గత ఎన్నికల్లో మొత్తం 25సీట్లను స్వీప్‌ చేసి కమలం పార్టీ ఈసారి ఐదు స్థానాలతో సరిపెట్టుకోవాలట. కాగా ఒరిస్సాలో మాత్రం బిజెపికి కాస్తా కూస్తో అవకాశం ఉందట. గత ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్‌ స్థానం మాత్రమే గెలుచుకున్న బిజెపి ఈ సారి అక్కడ 10స్థానాల వరకు సాధిస్తుందట. బీహార్‌లో గత ఎన్నికల్లో 22 స్థానాలు సాధించిన బిజెపి ఈ సారి 10 నుంచి 20 స్థానాలు సాధించే ఛాన్స్‌ ఉందట. ఆంధ్రాకు అన్యాయం చేసిన ఆ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గుండు సున్నకొట్టడం ఖాయమని కూడా సర్వే తేల్చింది.

రాష్ట్ర విభజన అంశాలపై మరోసారి ఉన్నతస్థాయి బృందాన్ని ఢిల్లీకి పంపించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. విభజన అంశాలపై ఇప్పటికే కేంద్రంపై మండిపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉన్నతస్థాయి బృందాన్ని పంపడం ద్వారా తాడోపేడో తేల్చుకోవాలనే ఆలోచనలో ఉన్నది. తాజాగా అధికారులతో సమావేశమైన సందర్భంగా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వివరాలు సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యంగా వివిధ పథకాలకు సంబంధించి న నిధుల విషయమై ఒక నివేధిక తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే ఆదేశించారు. అవే కాకుండా నాలుగేళ్లలో వివిధ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడాన్ని ప్రశ్నించాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

2G 21122017 2

ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరం పాలనాపరంగా చివరిది కావడంతో నిధులు ఎక్కువ రాబట్టాలనే ఆలోచన ఉంది. అయితే వరుస రిమైండర్ల పేరుతో గుర్తుచేసినప్పటికీ స్పందన లేదనే అభిప్రాయం ముఖ్యమంత్రిలో ఉంది. ఫలితంగానే ఈ సారి కేంద్రం వద్ద గట్టిగా వాదించేందుకు కసరత్తు చేయాలని నిర్ణయించడం జరిగింది. అదే విధంగా విభజన చట్టంలోని 18 అంశాలపై కూడా పనిలో పనిగా నిలదీయనున్నారు. మంత్రులు కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి లేదా ఇతర అధికారులను కలిసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఢిల్లీకి ఉన్నతస్థాయి బృందాన్ని పంపే విషయంలో తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే చివరి అస్త్రంగా కేంద్రం చేస్తున్న అన్యాయంపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం వుంది. కోర్టులో కేసు వేయడానికన్నా ముందే చివరి ప్రయత్నంగా ఉన్నతస్థాయి కమిటీని పంపాలని ప్రభుత్వం భావిస్తున్నది.

2G 21122017 3

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైందని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపి విభజన చట్టంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ ప్రారంభమైందని తెలిపారు. విభజన చట్టం హామీలు నెరవేర్చడంలో జాప్యంపై కాంగ్రెస్‌ నాయకుడు పొంగులేటి సుధాకరరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఇందుకు గాను ఇప్పటి వరకు కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. పొంగులేటి సుధాకరరెడ్డి, గిడుగు రుద్రరాజును పిటిషనర్లుగా పరిగణిస్తు సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకుందని రుద్రరాజు తెలిపారు.

పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న శుక్రవారం కావటంతో, జగన్ కోర్టు వాయిదా ముగించుకుని పిఠాపురం వచ్చారు. శనివారం పిఠాపురం మండలంలోని చెందుర్తి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర కొనసాగించారు. అయితే ఈ రోజు సాయంత్రం పాదయాత్రలో ఉండగా కొంత అస్వస్థతకు గురయ్యారు. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఆదివారం నుంచి పాదయాత్ర కొనసాగిస్తారా లేక విశ్రాంతి తీసుకుంటారనే అనేది సందిగ్ధంగా మారింది. పాదయాత్ర కొనసాగింపుపై వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటివరకు జగన్ 228 రోజులు పాదయాత్ర చేశారు. అయితే, ఈ లెక్క శుక్రవారం సెలవలతో కలిపో లేదో తెలియదు.

jagan 04082018 2

మరో పక్క, జగన్‌కు కాపుల సెగ ఈ రోజు కూడా తగిలింది. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశం చెప్పిన జగన్‌కు ఆ వర్గం నుంచి ఊహించని రీతిలో నిరసన ఎదురైంది. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో జగన్ పాదయాత్రకు కాపుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్లకార్డులు, నల్లజెండాలతో నిరసన తెలిపారు. జగన్ భద్రతా సిబ్బంది ఆందోళనకారులను నెట్టేశారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాపు వర్గానికి చెందిన యువకులు జగన్ తీరుకు వ్యతిరేకంగా సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అయితే జగన్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

jagan 04082018 3

పిఠాపురం మండలం ఎఫ్.కె పాలెం గ్రామంలో జగన్‌కు కాపు సెగ తగిలిన విషయం తెలిసిందే. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కాపు ప్రజలు, నాయకులు జగన్‌కు నిరసన తెలిపారు. కాపు రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడి పోరాడాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిలో మార్పు రాకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాపు నాయకులు స్పష్టం చేశారు. కాపుల ఆందోళన చూస్తూ ఉంటే జగన్ తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర ముగించే వరకు ఆ సామాజిక వర్గం నుంచి నిరసనలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

గత నెల రోజుల నుంచి చేపల ఎగుమతులు నిలిచిపోవడంతో మత్యకారులు , వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. ఎగుమతులు నిలిచిపోవడానికి కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌పై కక్షగట్టి ఆంధ్ర నుంచి చేపలు దిగుమతి చేసుకోరాదని బీజేపీ పాలిత రాష్ట్రాలను కోరినట్లు పెద్దెత్తున దుమారం రేగింది. జాతీయ టెలివిజన్లలో దీనిపై పెద్దెత్తున చర్చ కూడా జరిగింది. మొత్తానికి పరిస్థితులు సద్దుమణిగి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డంతో ఇటు చేపలపై ఆధారపడి జీవిస్తున్న మత్యకారులతో పాటు, వ్యాపారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెల కాలం నుంచి ఒకపక్క ఫార్మాలిన్‌, మరో పక్క లారీల సమ్మె ప్రభావంతోడు కావడంతో చేపల రైతులు, వ్యాపారులు విలవిల్లాడిపోయారు.

cbn 04082018 2

ఎట్టకేలకు మత్స్యశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలు ఫలించడంతో గత రెండు మూడు రోజుల నుంచి చేపల ఎగుమతులు మళ్లి ఊపుందుకున్నాయని తిరిగి చేపకు మంచిరోజులు వచ్చాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళుతున్న ఏపీ రాష్ట్రం చేపల ఎగుమతులకు ఫార్మాలిన్‌ పూత పెద్ద ఎత్తున దెబ్బతీసింది. దీంతో గత నెల రోజులుగా ఎగుమతులు నిలిచిపోయాయి. అస్సోం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ చేపలను నిషేధించింది. మణిపూర్‌, మేఘాలయ వంటి రాష్ట్రాలు అప్పట్లో తాత్కాలికంగా నిలిపినేసినా తరువాత తనిఖీలు నిర్వహించిన తర్వాత కొంత సరుకు దిగుమతులు చేసుకుంది. అయినప్పటికీ అక్కడి వ్యాపారులు ఆంధ్ర చేపల దిగుమతులను నిషేధించారు. ఎగుమతులు నిలిపి వేయడానికి ప్రధాన కారణం ఫార్మాలిన్‌ రసాయన ప్రభావమని ఈశాన్య రాష్ట్రాల వాళ్లు చేపల ఎగుమతులను నిషేధించారు. దీంతో చేపల మార్కెట్‌ ఒక్కసారిగా స్తంభించింది. చేపల పెట్టుబడులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అస్సోం ప్రభుత్వంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ రమాశంకర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో చర్చలు నిర్వహించారు.

cbn 04082018 3

చేపలకు రసాయన పూతలులేవని అధ్యయనం చేసి చెప్పడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. పైగా ఆయా రాష్ట్రాల మత్స్యరంగానికి చెందిన నిపుణులు నేరుగా వచ్చి ఇక్కడ జరుగుతున్న చేపల సాగు పరిశీలించుకోవాలని మత్స్యశాఖ సూచించడంతో నిషేదం తొలగించారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఉత్తరాంధ్ర నుంచి చేపలతో లోడ్‌లు వెళ్లినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి త్వరగానే బయటపడ్డామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అది కాకుండా ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో రైతులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలోని ఆకివీడు, కైకలూరు, భీమవరం కేంద్రాలుగా ప్రతిరోజు 200 లారీల వరకు చేపల సరుకు ఎగుమతి అవుతోంది. సీజన్‌లో అయితే మరో 100 లారీలు ఈ ప్రాంతాల నుంచి అదనంగా ఎగుమతులు చేస్తుంటారని తెలుస్తోంది. గత 35 ఏళ్ళుగా పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ , ఉత్తరప్రదేశ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు మన రాష్ట్రం లో పండే చేపలు ఎగుమతులు జరుగుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read