పార్లమెంటు సాక్షిగా, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, మన ఎంపీలు, ఆందోళన చేస్తున్నారు... చేస్తాం, చూస్తామంటే సంతృప్తి కలుగదు, ఆ స్థాయి దాటిపోయిందని, హామీలు కాదు, చేతలు కావాలి, స్పష్టమైన కార్యాచరణ కావలంటూ, బీజేపీ బుజ్జగింపులకు లొంగటం లేదు... ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో ప్రతిభంబిస్తున్నారు... హక్కుగా ప్రజల తరపున అడుగుతున్నామని, డిమాండ్‌ను వినిపిస్తున్నామని, మిత్రపక్ష ధర్మంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కేంద్రం దృష్టికి తీసుకువస్తున్నామని ఎంపీలు చెప్తున్నారు...

mamata 06022018 2

మన ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ఇప్పటికే అకాళీదళ్‌ పార్టీ, శివసేన పార్టీ మద్దతు ప్రకటించాయి... తాజాగా, మోడీని మొదటి నుంచి వెంటాడుతున్న వెస్ట్ బెంగాల్ సీఎం, తృణ‌ముల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా మనకు మద్దతు ప్రకటించారు... "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎన్డీయే ప్రభుత్వం సరైన విధంగా ఆదుకోవటం లేదు అని, అందుకే మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం కూడా, మోడీని వ్యక్తిరేకిస్తుంది" అని మమతా అన్నారు...

mamata 06022018 3

"ఆంధ్రప్రదేశ్ చేస్తున్న డిమాండ్ లో న్యాయం ఉంది అని, చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నామని... తెలుగుదేశం పార్టీ ఇంకా గట్టిగా పోరాడాలని, తెలుగుదేశం స్పూర్తితో, అన్ని రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీలు, మోడీ చేస్తున్న అన్యాయం పై పోరాడాలని" మమతా అన్నారు... మమతా లాంటి పవర్ఫుల్ లేడీ, కాంగ్రెస్ కంటే ఎక్కువగా మోడీని టార్గెట్ చేస్తున్న దీదీ, చంద్రబాబుకి సప్పోర్ట్ ఇవ్వటంతో, మరో సారి జాతీయ స్థాయిలో చర్చనీయంసం అయ్యింది...మొత్తానికి చంద్రబాబు, ఏ విధంగా అయితే మనకు జరిగిన అన్యాయం పై, దేశ వ్యాప్తంగా సపోర్ట్ కావలి అనుకున్నారో, అలాగే లభిస్తుంది..

‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి. అన్యాయమైన రీతిలో విభజన చేసి రాష్ట్రాన్ని అనాథగా మిగిల్చారు. నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆనాడు పార్లమెంటులో ఉన్న పార్టీలన్నీ కలిసి ఈ విభజనను ఆమోదించాయి. నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత ఆ పార్టీలన్నిటిపైనా ఉంది... ఇప్పుడు ఇలా చేస్తే ఎవర్నీ వదిలిపెట్టేది లేదు... ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు... మీరు ఎంత ఆందోళన చేస్తే అంత ఆందోళన చెయ్యండి... నేను చెప్తున్నా, ఎంత వరకు అయినా వెళ్ళండి ’ అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు తేల్చిచెప్పారు.

cbn 06022018 2

ముఖ్యమంత్రి ఆగ్రహంతో, ముందుగా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్‌ రంగంలోకి దిగారు... మన ఎంపీలతో నిన్న రాజ్‌నాథ్‌‌సింగ్‌ భేటీ అయ్యి, వారిని సముదాయించే ప్రయత్నం చేసారు.. దీంతో ఎంపీలు కొంచెం గట్టిగానే రాజ్‌నాథ్‌‌సింగ్‌ కు బదులు ఇచ్చారు... ఇక ఈ మాటలు ఎన్నాళ్ళు చెప్తారు, మామ్మల్ని ప్రజలు కొట్టేలాగా ఉన్నారు... ఎదో ఒకటి తేలిస్తేనే, మేము ప్రజల ముందుకు వెళ్ళగలం, మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆడుకోండి అంటూ రాజ్‌నాథ్‌‌సింగ్‌ ఎంపీలు గట్టిగా మాట్లాడారు... మీరు మాటలు చెప్తే, మేము చేతల్లో చూపిస్తాం... పార్లమెంట్ లో ఆందోళన చేసి తీరుతాం.. మీ నుంచి మేము చేతలు కావలి అంటూ, నిర్మొహమాటంగా రాజ్‌నాథ్‌‌సింగ్‌ కి చెప్పారు...

cbn 06022018 3

దీంతో రాజ్‌నాథ్‌‌సింగ్‌ వెంటనే ప్రధానితో మాట్లాడుతానని, మనం ప్రధాని దగ్గరకు వెళ్దాం రాజ్‌నాథ్‌‌సింగ్‌ ఎంపీలతో చెప్పారు.. చెప్పినట్టుగానే, ఉదయం ప్రధాని కార్యాలయం నుంచి ఎంపీలకు ఫోన్ వచ్చింది... మన నిరసన పై ప్రధాని వైపు నుంచి ఇదే ఫస్ట్ రియాక్షన్... ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని టీడీపీ ఎంపీలు కలవాల్సిందిగా కబురు వచ్చింది. భేటీలో ఏపీకి రావాల్సిన నిధులతోపాటు పలు అంశాలపై చర్చించే అవకాశముంది. నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చల తర్వాత ప్రధాని నుంచి పిలుపువచ్చినట్లు ఎంపీలు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు... దీంతో చంద్రబాబు కూడా దిశానిర్దేసం చేసారు... రాజ్‌నాథ్‌‌సింగ్‌ తో ఎలా మాట్లాడారో, ప్రధానితో కూడా అంతే గట్టిగా ఉండండి... ప్రధాని అపాయింట్మెంట్ ఉన్నా సరే, మీరు ఆందోళన విరమించవద్దు.. సభ వాయిదా పడితే, పార్లమెంట్ బయట నిరసన తెలపండి... ప్రజల ఆక్రోశం వినిపించండి... నిన్న కొంత మంది ఎంపీలు ఆందోళనకు రాలేదు, ఈ రోజు ప్రతి ఒక్కరు ఆందోళన చెయ్యండి... ప్రజలు మీ చర్యలు చూస్తున్నారు.. ప్రతిపక్షం నిద్రపోతుంది, మన ప్రజల గురించి మనమే, గొంతు వినిపించాలి అంటూ, ఎంపీలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు....

ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో... మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ అయినా, ప్రజల పక్షాన నిలబడేది, కలబడేది ప్రతిపక్షం... అధికార పక్షం చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతూ, ప్రజల మద్దతు పొంది, వారి కోసం పోరాడతారు... ఇది సహజంగా ఎక్కడైనా జరిగేది... మన దేశానికి వద్దాం.... కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది... రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది... అక్కడా, ఇక్కడే ఒకే ప్రభుత్వం ఉంటే, సహజంగా ఎక్కువ పోరాడలేరు... ఇలాంటి టైంలోనే ప్రతిపక్షం, అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని నిలదీస్తుంది... మన ఖర్మకి, మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం, ఎక్కడ ఉందో తెలియదు...

jagan 05022018 2

కేంద్రం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అంటూ, మిత్రపక్షం అయినా సరే, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పై విమర్శలు చేస్తూ, వారు చేస్తున్న పనులను బహిరంగంగా ఎండగడుతుంది... పార్లమెంట్ లో ఆందోళన చేస్తుంది.. కాని, వీరి కంటే , దూకుడుగా ఉండాల్సిన జగన్ పార్టీ మాత్రం, అడ్రస్ లేదు... వారి ఎంపీలు ఎక్కడ ఉన్నారో తెలీదు... ఇప్పటి వరకు, ఒక్కరు కూడా మన రాష్ట్రానికి, కేంద్రం అన్యాయం చేస్తుంది అని చెప్పలేదు.... పాదయాత్ర అంటూ ప్రజల్లోనే ఉంటున్న జగన్, అన్ని విషయాలు చెప్తున్నాడు కాని, బడ్జెట్ పై మాత్రం మాట మాట్లాడటం లేదు...

jagan 05022018 3

ఇదే విషయం పై, జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....కేంద్ర బడ్జెట్‌ను అధికార పార్టీ నేతలతో పాటు అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..జగన్ మాత్రం తన వైఖరి చెప్పకపోవడం బాధాకరమంటూ విమర్శలు వస్తున్నాయి... సీపీఐ బంద్‌కు పిలుపు ఇస్తే మాత్రం..మద్దతు ఇస్తున్నారన్నారు. బంద్‌కు పిలుపు ఇవ్వాల్సిన వారే మద్దతు ఇస్తున్నారంటే..వైసీపీ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతుంది... జగన్ లీడర్ కాదని, ఫాలోవర్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.... కేసుల మాఫీ గురించి ఆలోచించాలా? ప్రజలు గురించి ఆలోచించాలో జగన్ తేల్చుకోలేకపోతున్నారని ప్రజలు అంటున్నారు...

మొన్నటిదాకా అమరావతి అంటే నేషనల్ మీడియాకు పెద్దగా తెలియదు... హైదరాబాద్ మీడియానే, మన అమరావతి గుర్తించనప్పుడు, నేషనల్ మీడియా ఎలా గుర్తిస్తుంది అనుకుంటున్నారా... ఏమి చేస్తాం... మన రాష్ట్రంలో జరిగే విషయాలు, అసలు నేషనల్ మీడియాలో కనిపించవు... ఏదన్నా నెగటివ్ న్యూస్ ఉంటే మాత్రం, హైదరాబాద్ నుంచి ఊహించుకుంటూ రిపోర్ట్ చేస్తారు... మన ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని రాష్ట్రపతి పొగిడినా, నీతీ అయోగ్ మెచ్చుకున్నా, మన రాష్ట్రం గురించి నేషనల్ మీడియాలో అసలు వార్త అనేదే రాదు.. అలాంటిది, మొన్న ఆదివారం జరిగిన ఎంపీల సమావేశం కవర్ చెయ్యటానికి, నేషనల్ మీడియా మొత్తం అమరావతిలో వాలిపోయింది...

amaravati 06022018 2

ఇక్కడ నుంచి, లైవ్ కవరేజ్ లో, దేశం అంతా వెళ్ళాయి... లైవ్ ఫ్రం అమరావతి అని, లైవ్ ఫ్రం ఆంధ్రాస్ న్యూ కాపిటల్ అని, ఇలా నేషనల్ మీడియా కవర్ చేసింది... ఇది చుసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం, చంద్రబాబు పుణ్యమా అని, మన రాష్ట్రాన్ని, మన రాజధానిని ఇప్పటికైనా గుర్తించారు అని సంతోష పడ్డారు... ఇంతటితో అయిపోలేదు... అమరావతి వచ్చిన నేషనల్ చానల్స్ సీనియర్ ఎడిటర్లు, డైరెక్టర్లు అమరావతిని చూసి ఆశ్చర్యపోయారు... తమ అనుభూతులని ట్విట్టర్ లో పంచుకున్నారు...

amaravati 06022018 3

ఇండియా టుడే ఎడిటర్ ట్వీట్ చేస్తూ, మొదటిసారి అమరావతి వచ్చాను, చంద్రబాబు అధ్యక్షతన ఎంపీల సమావేశం జరుగుతుంది... నేను ఒక అద్భుతమైన లొకేషన్ లో ఉన్నారు, అమరావతిలో ఉన్నాను, రివర్ ఫ్రంట్ లొకేషన్ లో ఉన్నాను అంటూ ట్వీట్ చేసారు... అలాగే, ఎన్డీటీవీ ఎడిటర్ ట్వీట్ చేస్తూ, వెలగపూడి సచివాలయం టెంపరరీ అయినా, ఎంతో క్లాస్ గా, ప్రోగ్రీసివ్ గా, ఎకో ఫ్రెండ్లీ సైకిల్స్ తో, ప్రాంగణం మొత్తం స్మార్ట్ గా ఉంది... సచివాలయం లోపల రోడ్లు, పరిసరాలు ఎంతో క్లీన్ గా ఉన్నాయి, ఎంతో విశాలంగా, క్లీన్ అండ్ గ్రీన్ గా ప్రాంగణం ఉంది, మోడరన్ గా ఉంది, సచివాలయం క్యాంటీన్ కూడా ఎంతో బాగుంది అంటూ ట్వీట్ చేసారు... ఇలా ఏనాడైనా, మన హైదరాబాద్ మీడియా మన అమరావతి గురించి రాసిందా... అందుకే అంటారు, మన విజయాలే మాట్లాడాలి అని...

Advertisements

Latest Articles

Most Read