రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు... అన్ని వైపుల నుంచి మనల్ను ఇబ్బంది పెట్టే పనులు చేసారు... తొమ్మిదో, పదో షెడ్యూల్‌ లో ని ఆస్తుల విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు... కేంద్రం అసలు పట్టించుకోలేదు.. ఎదో ఒక కమిటీ వేసి ఊరుకుంది... అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, వదలకుండా ఆ కమిటీతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది... ఇవన్నీ తెలంగాణాలో ఉన్న ఆస్తులు కాబట్టి, జగన్ కాని, పవన్ కాని, కెసిఆర్ ను అడిగే ధైర్యం లేదు... అయితే 4 ఏళ్ళ తరువాత ఒక కీలకమైన, విలువైన ఆస్తిని, ఏపి సొంతం చేసుకుంది... అదే ఆంధ్రప్రదేశ్‌ హెవీ మిషనరీ అండ్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌... కొండపల్లిలో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్‌ఎంఈఎల్‌ ఆస్తులు ఇప్పుడు ఏపికి వచ్చాయి...

aphmel 21052018 2

1994 నుంచి సింగరేణి అనుబంధ సంస్థగా ఉంటూ వస్తున్న ఏపీహెచ్‌ఎంఈఎల్‌ ను ఇటీవలే ఏపీ పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి కేటాయిస్తూ షీలాబిడే కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం లభించింది. దీంతో సింగరేణితో ఈ సంస్థకు ఉన్న 24 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాంతం ప్రాతిపదికన సింగరేణిలో 51 శాతం వాటాను తెలంగాణకు కేటాయించారు. ఈ లెక్కన సింగరేణిలో తెలంగాణకి 51శాతం, కేంద్రానికి 49శాతం వాటా ఉంది. సింగరేణికి అనుబంధగా ఉన్న ఏపీహెచ్‌ఎంఈఎల్‌ ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలంటూ ఏపి ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. పునర్విభజన చట్టం ప్రకారం ఈ సంస్థ ప్రాంతం ప్రాతిపదికన ఏపీకే దక్కాలనే డిమాండ్‌ పెరిగింది.

aphmel 21052018 3

ఏపీహెచ్‌ఎంఈఎల్‌ సంస్థకు కొండపల్లిలో 206 ఎకరాల స్థలంతోపాటు విజయవాడ బెంజ్‌సర్కిల్‌ సమీపంలోని ఆటోనగర్‌ వద్ద ఖరీదైన ఐదెకరాల భూమి ఉంది. ఏపీ రాజధాని అమరావతి నుంచి కొండపల్లికి కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపట్టడానికి సన్నాహాలు జరుగుతుండటంతో ఆప్మెల్‌ భూములు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేయనున్నాయి. ప్రస్తుతం కొండపల్లి వద్ద ఎకరా భూమి విలువ రూ.10 కోట్లు, ఆటోనగర్‌లో ఎకరాకు రూ.25 నుంచి రూ.30 కోట్లకుపైగా ధర పలుకుతుందని అంచనా... అయితే, తొమ్మిదో, షెడ్యూల్‌ లో పెట్టిన ఒక్క సంస్థ మాత్రమే మనకు వచ్చింది... ఇంకా అనేక సంస్థల్లో మనాకు వాటా ఉంది.. దాదాపు 40 వేల కోట్లు విలువ అని అంచనా.. ఎలాగు ప్రతిపక్షాలు, కేంద్రం ఇవి పట్టించుకోదు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇవి కూడా సాధించాలి, అవసరం అయితే కోర్ట్ కు కూడా వెళ్లి, మన ఆస్తులు మనం సాధించుకోవాలి...

ఆడి కారు, బంగళా, కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఇవన్నీ వంశపారంపర్యంగా వారి కుటుంబం వేరే ఉద్యోగ, వ్యాపారాలు వంటి వృత్తులు ఏవీ లేకుండా, కేవలం స్వామి వారికి సేవ చేస్తేనే వచ్చేసిన ఆస్తులా ఇవి ? ఇవి రమణ దీక్షితుల పై తిరుమల అర్చుకులు సంధిస్తున్న ప్రశ్నలు... ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి అర్చకులతో పాటు అధికారులను, చివరకు సీఎంను కూడా బ్లాక్‌మెయిల్‌ చేసే స్థితికి చేరారన్నారని విమర్శించారు. రమణ దీక్షితులు పై ఉన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. విధులకు సరిగా హాజరుకాని ఆయన ఇద్దరి కుమారులకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రిటైరవుతానని తెలిసే ఆలయంలో అపచారం జరుగుతోందని, ఆభరణాలు పోయాయని, వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేశారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

tirumala 21052018 2

‘వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేనాటికి రమణదీక్షితులే ఆగమసలహాదారుడిగా ఉన్నారు. ఆయన సంతకంతోనే ఆ ప్రక్రియ జరిగింది. వెయ్యికాళ్ల మండపానికి ఆలయంతో సంబంధం లేదని ఆయన స్వయంగా దేవస్థానానికి అంగీకారం తెలిపాకే కూల్చివేత జరిగింది’ అని తెలిపారు. 2001లో రెండు పోటులకు సంప్రోక్షణ చేసిన సమయంలో వేరే ప్రాంతంలో ప్రసాదాల తయారీకి రమణదీక్షితులే అంగీకరించారన్నారు. వీటికి సంబంధించి ఆ లెటర్లు బయట పెట్టారు. బ్రాహ్మణుల్లో విభేదాలు సృష్టిస్తున్నారు. రమణదీక్షితులు కొడుకులే బ్రాహ్మణులైనట్లు.. మిగిలినవారు మిరాశీ కుటుంబానికి చెందినవారు కాదనేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఆలయాన్ని పురావస్తు విభాగానికి ఇవ్వమనేందుకు రమణదీక్షితులు ఎవరని నిలదీశారు. పాతికేళ్లుగా ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయని, ఒకవేళ తప్పు జరిగి ఉంటే ఆయనే బాధ్యుడని స్పష్టం చేశారు.

tirumala 21052018 3

తామంతా పూజా కైంకర్యాలు నెరవేరుస్తుంటే రమణదీక్షితులు సెంటుకొట్టుకుని.. ఆడి కారులో వచ్చి పువ్వులతో ఆలయ ప్రవేశం చేసేవారని.. పువ్వులను తోమాల సేవలోనే సమర్పించాలన్నారు. అర్చకుడిగా ఉంటూ ఆడి కారులో రావడం ఏమిటని ప్రశ్నించారు. కైంకర్యాల్లో లోపం, అపచారం లేవని సంభావన అర్చకుడు ఖాద్రిపతి నరసింహాచార్యులు కూడా తెలిపారు. వజ్రం 2001లో పోతే 2018 వరకు రమణదీక్షితులు ఎందుకు బయటపెట్టలేదు? తిరువాభరణ రిజిస్టరులో కూడా వజ్రమని రికార్డు చేయలేదు. అసలది వజ్రం కాదు. కెంపు మాత్రమే. అయినా 2001లో గరుడసేవలో రమణదీక్షితులే వాహనంలో ఉన్నారు. ఆ సమయంలో కెంపు పగిలింది. పగిలిన ముక్కలను అప్పుడే సేకరించారు’ అని వెల్లడించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఆగమ సలహాదారుల అంగీకారంతో పోటులో మరమ్మతులు చేశారని ప్రధాన అర్చకుడు శేషాచల దీక్షితులు తెలిపారు. 32 మంది సంభావన అర్చకుల సర్వీసును క్రమబద్ధీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్చకస్వాములు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో శాంతి బధ్రతలకు విఘాతం కలిగించటానికి, ప్రజల్లో ఆందోళన కలిగించటానికి, ఒక అనిశ్చితి పరిస్థితి నెలకొల్పటానికి, గత కొన్ని రోజులుగా, కొన్ని పక్షాలు చెయ్యని పని లేదు... ముఖ్యంగా సోషల్ మీడియా, వాట్స్ అప్, ఉపయోగించుకుని, పల్లెల్లో ఉన్న వారకి కూడా విష ప్రచారం ఎక్కించేస్తున్నారు... తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి, పల్లెల్లో ఉన్న వారికి, ఈ సైకో గ్యాంగ్, భయంకరమైన ప్రచారం చేస్తుంది... పార్ధీ గ్యాంగ్‌ కదలికలు ఉన్నాయని అసత్య ప్రచారాలు సోషల్‌ మీడియాలో ప్రచారం చూసి, ప్రజానీకం భయ భ్రాంతులకు గురి అవుతున్నారు... మొన్న చిత్తూరు జిల్లా, నిన్న ప్రకాశం, నేను కృష్ణా జిల్లా, ఎక్కడ చుసినా పల్లెల్లో ఇదే ఆందోళన.. ప్రజానీకం భయ భ్రాంతులకు గురై వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా రోడ్లు వెంట యువకులు కాపలా కాస్తున్నారు.

vadantulu 21052018 2

అనుమానంగా తెలుగు భాష రాని వ్యక్తులు కనబడితే చితక బాదుతున్నారు. అదే క్రమంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళేవారు తిరుగుతున్నారని అపోహలతో అట్టడుకి పోతుంది. పిల్లలను ఎత్తుకెళ్ళి, అవయవాయలు కోసేసి, అమ్ముకుంటున్నారు అని, కొన్ని ఫోటోలు కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు... గ్రామాలలో ఎస్సైలు తమ సిబ్బందితో పల్లె నిద్ర చేసి గ్రామస్తులకు అసత్య ప్రచారాలపై అవగాహన కల్పిస్తు న్నారు. అన్ని గ్రామాల్లో పోలీసులు అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయడంతో పాటు పల్లెనిద్ర కార్యక్రమాన్ని పూర్తి చేసేందకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగి ప్రశాంతంగా నిద్రపోవడం ప్రారంభించారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల అనేక మంది అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

vadantulu 21052018 3

ఆయా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎస్సై తమ సిబ్బంది గ్రామాలకు వెళ్ళి గ్రామంలో ఉన్న యువకులు, పెద్దలు, మహిళలను సమావేశ పరిచి వదంతులు నమ్మవద్దని చెబుతున్నారు. అంతే కాకుండా ఆ రాత్రంతా ఆ గ్రామంలో పోలీసులు నిద్రపోవడంతో గ్రామస్తుల్లో ఆత్మ స్థయిర్యం పెరిగింది. సోషల్‌ మీడి యాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని, అలాంటి విషయాలు ప్రచారం చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని వివరిస్తున్నారు. మూడురోజులుగా పోలీసులు చేస్తున్న యత్నాలు ప్రజల్లో నమ్మకాన్ని కల్గిస్తున్నాయి. వారం రోజులుగా కంటిమీద కునుకు లేని పల్లెలు ప్రశాంత వాతావరణంలోకి చేరుకున్నాయి.

విభజన హామీలు, పోలవరం, నిధులు, ఇవే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కక్ష సాధింపులో ఇప్పుడు మరో విషయం కూడా చేరింది... అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రిగా ఉన్న సమయంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, దుబాయ్ కు అంతర్జాతీయ సర్వీసుల కోసం కసరత్తు చేసి, ఎయిర్ ఇండియా సర్వీసు నడిపేందుకు సూత్ర ప్రాయంగా అంగీకరించారు. దీని కోసమే కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ కేంద్రాలు కూడా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో నెలకొల్పారు.. పోలీసు వైపు నుంచి కూడా అవసరమైన బధ్రత కూడా సమకూర్చారు.. అన్నీ రెడీ అయ్యాక ఇప్పుడు ఎయిర్‌ఇండియా విముఖత చూపటం ఎయిర్‌పోర్టు అధికారులతో పాటు, కృష్ణాజిల్లా యంత్రాంగాన్ని సైతం నివ్వెరపరుస్తోంది! ఆఖరి నిమిషంలో ఎయిర్‌ఇండియా హ్యాండ్‌ ఇవ్వటంతో తర్జన భర్జనలు పడుతున్నారు...

gannavaram 21052018 2

ఎయిర్‌ ఇండియా తీరుపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మధుసూదనరావు కృష్ణాజిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సర్వీసు విషయంలో తలెత్తిన సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళాలని నిర్ణయించారు. అశోక్‌ గజపతిరాజు రాజీనామాతో కేంద్రంలో మన తరఫున కృషిచేసే పెద్దదిక్కు లేకుండా పోయారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయ సర్వీసులు నడవటానికి వేగంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత కూడా స్పందన లేకపోగా.. ఎయిర్‌ ఇండియా చావు కబురు చల్లగా చెప్పింది.

gannavaram 21052018 3

అంతర్జాతీయ సర్వీసు నడిపే విషయంలో ఎయిర్‌ ఇండియా అనుసరించిన తీరు తీవ్ర విమర్శల పాలౌతోంది. విజయవాడ నుంచి దుబాయికి సర్వీసును నడపలేమనడానికి చెబుతున్న కారణాలు చూసి అధికారులు కూడా నివ్వరపోయారు. భద్రతాపరమైన కారణాల వల్ల హాపింగ్‌ ఫ్టైట్స్‌ విదేశాలు వెళ్లడానికి కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ అనుమతించటం లేదన్నది ఒక అంశంగా చెబుతోంది. ముంబై రూట్‌లో నడిపే విమాన సర్వీసునే విజయవాడ నుంచి దుబాయికి అక్కడి నుంచి షార్జాకు తిరిగి విజయవాడ, ముంబైలకు నడుపు తుంది. ఇది కూడా హాపింగ్‌ ఫ్లెట్‌ కాబట్టి.. అనుమతి కష్టమన్న ఒక వాదన తీసుకువస్తోంది. మరోవైపు ఇండియా, అరబ్‌ ఎమిరేట్స్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా సీట్ల సర్దుబాటు విదేశీ సంస్థలకు అనుకూలంగా ఉండటం వల్ల దుబాయికి సర్వీసును నడపలేమని ఎయిర్‌ ఇండియా చెప్పడం విమర్శలకు తావిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read