ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టులను తిట్టటం మన అధికార పార్టీకి ఫ్యాషన్ అయిపొయింది. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి కూడా ఇలాగే కోర్టుల పైన, జడ్జిల పైన ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయటం పరి పాటి. మరీ ముఖ్యంగా మన తెలుగు జాతికి గర్వ కారణం అయిన చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా ఎన్వీ రమణ విషయంలో, జగన్ మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఆయన పై వ్యక్తిగత కక్ష పెంచుకుని, ఆయనేదో చంద్రబాబు మనిషి అని భావించి, ఆయన్ను టార్గెట్ చేయటం అందరికీ తెలిసిందే. అమరావతి కేసులో, జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెల పేర్లు కూడా చేర్చి, చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తరువాత ఏకంగా అప్పటి చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు, ఎన్వీ రమణ పైన కంప్లెయింట్ ఇవ్వటం, ఆయన్ను చీఫ్ జస్టిస్ అవ్వకుండా చూడటం ఇవన్నీ చేసిన విషయాలు తెలిసిందే. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో, కుయిక్తులు పారలేదు. మన తెలుగు వారు అయిన జస్టిస్ ఎన్వీ రమణ, ఈ దేశానికి అత్యున్నత న్యాయ పదవిలో, చీఫ్ జస్టిస్ గా ఎంపిక అయ్యారు. అప్పటి నుంచి ఆయన పని తనం దేశం మొత్తం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే కొన్ని నిర్ణయాలు ఎన్వీ రమణ తీసుకున్నారు.

cj 24122021 2

అయితే ప్రతి సారి దేవుడు స్క్రిప్ట్ అని చెప్పే, వైసీపీ నేతలు, ఇప్పుడు ఆ దేవుడు స్క్రిప్ట్ తమకే వచ్చిందని గ్రహించి, కక్క లేక మింగ లేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, జస్టిస్ ఎన్వీ రమణ, తన సొంత గ్రామంలో, మూడు రోజులు పాటు పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఆయన పర్యటన ఉంటుంది. చీఫ్ జస్టిస్ అయిన తరువాత, సొంత గ్రామం వస్తూ ఉండటంతో, పెద్ద ఎత్తున ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం కూడా ఇప్పుడు ప్రభుత్వమే చేయాల్సిన పరిస్థతి వచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లలో అరుదైన దృశ్యం కనిపించింది. మన రాష్ట్ర ముద్దు బిడ్డ అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు వేసి, రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ జస్టిస్ కు స్వాగతం చెప్తూ, మొత్తం బ్యానర్లతో నింపేశారు. అంతే కాదు, రేపు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇచ్చే విందులో, జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గుంటున్నారు. ఏ నోటితో అయితే, తిట్టారో, ఇప్పుడు ఇలా స్వాగతం చెప్పటం దేవుడి స్క్రిప్ట్ కదా.

వారు ఒకరికి ఒకరు రాజకీయ శత్రువులు. అలాంటిది అందరూ ఒకే వేదిక పైన ఉన్నారు. కానీ అది బౌతికంగా కాడు, విర్చ్యువల్ గా. ప్రధాని మోడీ ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, చంద్రబాబు, రామోజీ, జగన్ కూడా పాల్గున్నారు. 75 ఏళ్ళ స్వాత్యంత్రం సందర్భంగా, ప్రధాని మోడీ ఆధ్యకతన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జాతీయ అమలు కమిటీ విర్చ్యువల్ గా సమావేశం అయ్యింది. ఈ కమిటీలో అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పటికే ఈ కమిటీ ఒకసారి సమావేశం అయ్యింది. నిన్న ఈ కమిటీ రెండో సమావేశం ఆన్లైన్ లో జరిగింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రులు పాల్గున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీ రావు కూడా పాల్గున్నారు. అలాగే రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా పాల్గున్నారు. ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగం వినిపించారు. అలాగే రామోజీ రావు కూడా మాట్లాడుతూ, తమ దినపత్రికలో, ప్రతి రోజు ఒక స్వాత్యంత్ర సమారాయోధుడు గురించి స్పూర్తిదాయక కధనాలు రాస్తున్న విషయం ప్రాదానికి చెప్పారు. వచ్చే ఆగష్టు 15 వరకు ఈ కధనాలు కొనసాగుతాయని, త్వరలో ఇది ఒక పుస్తకంగా వేస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలను వెబ్ సైట్లో ఉంచకుండా గెజిట్ నోటిఫికేషన్ జారి చేయడం పై దాఖలైన ప్రజా ప్రయోజనలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నిన్న విచారణ జరిగింది.. ఈ విచారణ సందర్భంగా హైకోర్ట్ ధర్మాసనం కీలక వాఖ్యలు చేసింది. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,జస్టిస్ సత్యనారాయణ మూర్తి కూడిన ధర్మాసనం ఈ వాఖ్యలు చేయండంతో పాటు అసలు జివోల జారిలో పారదర్శకత ఉండి సాఫీగా జరిగిపోతున్న ప్రక్రియను ఎందుకు దాన్ని క్లిష్టతరం చేసారని హైకోర్ట్ నిలదీసింది. దీనితో పాటు ముఖ్యంగా ఏది సిక్రెట్, ఏది టాప్ సిక్రెట్ ఏది కాన్ఫిడెన్షియల్ అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు అని కూడా ప్రశ్నించింది .పైగా సమాచార చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 8 ఈ రెండు సెక్షన్ల ల ద్వారా కూడా ప్రజలకి ప్రాదమిక హక్కులున్నాయి. ప్రభుత్వంలో జరిగే కార్యకలాపాలు అదే విదంగా ప్రభుత్వంలో జరిగే జీవోలను కూడా తెలుసుకునే ప్రాధమిక హక్కు ప్రజలకు ఉందని, ఆ ప్రాధమిక హక్కును మీరెలా కాదంటారని హైకోర్ట్ ప్రశ్నించింది. సమాచార హక్కు చట్టంలో ఉన్న వివిధ సెక్షన్ లను సంతృప్తి పరిచే విదంగా అదే విధంగా జీవోలను వెబ్ సైట్లో పెట్టే విధంగా ఒక ప్రపోజల్ ను ప్రభుత్వమే తీసుకురావాలని కుడా, తాము ఆదేశాలు ఇచ్చే వరకు కూడా వేచి చూడవద్దని కూడా హైకోర్ట్ చెప్పింది.

hc jagan 23122021 2

పైగా కొన్ని జివోలను మాత్రమే తాము వెబ్ సైట్లో ఉంచుతున్నామని, మిగతా జివో లను ఉంచటం లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పిన సమయంలో, ఏది సిక్రెట్ , ఏది టాప్ సిక్రెట్ ఏది కాన్ఫిడెన్షియల్ అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు ప్రశ్నించటంతో పాటు ,ఇప్పటి వరకు ఎన్ని జీవోలను విడుదల చేసారు, ఎన్ని గెజిట్ లో ఉంచారు, ఎన్ని కాన్ఫిడెన్షియల్ ఉంచారు అనే సమాచారాన్ని వచ్చే వాయిదా కల్లా హైకోర్ట్ కు అందించాలని చెప్పి ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. పైగా ఇలాంటి జీవోలను దాచి పెట్టటం వల్ల, ప్రభుత్వంలో జరిగే విషయాలు ప్రజలకు తెలియకుండా పోయే అవకాసం ఉందని, ఇది ప్రజలకు తెలిసేలా ప్రాదమిక హక్కులను రాజ్యాంగం ప్రసదించినపుడు, అవి అమలయ్యే చూసేలా చేసే భాద్యత ప్రభుత్వానికి ఉందని, అటువంటి అంశాలని ఉల్లంఘిచటం అనేది ప్రభుత్వానికి మంచిది కాదని సూచిచింది. తెలంగాణలో హైకోర్ట్ ఏ ఆదేశాలు ఇచ్చిందో, అవి కూడా పరిశీలించామని, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తయారు చేసి, కోర్ట్ ముందు ఉంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర హైకోర్ట్ ఆదేశించింది.

మొన్నా మధ్య జగన్ గారు తిరుపతి వరద ప్రాంతానికి వెళ్ళినప్పుడు, పీఆర్సి గురించి అడగగా, వారంలో ఇచ్చేస్తాం అన్నా అని అన్నారు. వారం కాస్త నెల రోజులు అయినా పీఆర్సి లేదు ఏమి లేదు. ఉద్యోగులతో చర్చలు అంటూనే, అదిగో ఇదిగో, అప్పుడు రండి, ఇప్పుడు రండి అంటూ కాలయాపన చేస్తూ, ఉద్యోగులతో ఆడుకుంటున్నారు. ఉద్యోగులేమో ఇంకా ఇంకా ఓర్పుగా, ప్రభుత్వం చెప్పినట్టు చేస్తూనే, బయటకు మాత్రం, గంభీరంగా ఉంటున్నారు. నిన్న మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ సచివాలయం వేదికగా జరిగింది. .ఈ సందర్భంగా కౌన్సిల్ తో సభ్యత్వం ఉన్నటువంటి అన్ని సంఘాల నుంచి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా హాజరు కావటం జరిగింది. మరోసారి ప్రభుత్వం వైపు నుంచి పాత పాటే పాడటం జరిగింది. 14.29% ఫిట్మెంట్ కు అంగీకరించాలని ప్రభుత్వం మరోసారి పతిపాదన ఉంచినప్పటికీ కూడా, దానికి అంగీకరించేది లేదని అధికారుల కమిటీ సిఫారసు ఏదైతే ఉందో, ఆ సిఫారసును తాము ఎట్టి పరిస్తితుల్లో అంగికరించేది లేదు, దానిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నట్లుగా కూడా ఉద్యోగ సంఘం నేతలు స్పష్టం నిన్న స్పష్టం చేసారు. మరో వైపు కొన్ని ఉద్యోగ సంఘాలైతే అధికారుల కమిటీ కావాలని తప్పు దోవ పట్టిస్తుందని అసహనం వ్యక్తం చేసారు.

employees 23122021 2

మీ వల్ల కాదని, కావాలంటే మమ్ముల్ని జగన్ దగ్గరకు తీసుకు వెళ్ళండి, మేము మాట్లాడి పరిస్థితి తేల్చుకుంటామని ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేసాయి. దీంతో చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ, ఒక వారంలోపు జగన్ తో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో నిన్నఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు కేవలం 15 నిమషాలు మాత్రమే జరిగిందని ఉద్యోగ సంఘాలు చెప్పారు. చీఫ్ సెక్రటరీ కూడా చాలా ఆలస్యంగా సమావేశానికి వచ్చారని కూడా చెప్పారు. అయితే 15 నిమషాల సమయంలోనే, తమకు 27 శాతం పైన ఎంత ఫిట్ మెంట్ ఇస్తున్నారో చెప్పాలని గట్టిగా డిమాండ్ చేసారు. మరో వైపు సజ్జల వ్యాఖ్యల పై కూడా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. ఒకసారి 14.29% అని ఒకసారి 27% అని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థతి గురించి ఆలోచించాలని , ఇలా చెప్పటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకసారి ఆర్ధిక మంత్రితో సమావేశం అయ్యి, మళ్ళీ చీఫ్ జస్టిస్ వద్దకు సమావేశం అని చెప్పటం ఏమిటో అర్ధం కావటం లేదని అన్నారు. మొత్తానికి ఉద్యోగులతో ప్రభుత్వం అయితే ఒక ఆట ఆడుకుంటుంది.

Advertisements

Latest Articles

Most Read