మన రాష్ట్రంలో ప్రజలు గతంలోకి వెళ్లి చూసుకుంటే, ప్రతిపక్షంలో ఉన్న యువ నేతలు యాత్రలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్ళిన సందర్భంలో, ప్రజలు కష్టాలు చెప్పి, ఏమైనా సహాయం చేయమంటే, నుదుటున ముద్దు పెట్టి, నెత్తిన చేయి పెట్టి, రెండేళ్ళలో నేనే ముఖ్యమంత్రి అవుతాను, అప్పుడు నీ సమస్య తీరుస్తాను అంటూ అక్కడ నుంచి జారుకున్న సీన్లు చాలా చూసాం. అయితే అందరూ అలా ఉండరు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శైలి భిన్నం. కష్టం అని ఎవరైనా వచ్చి చెప్పినా, ఎక్కడైనా వార్త చూసినా వెంటనే లోకేష్ స్పందించే వారు. తనకు తోచిన సాయం చేసే వారు. నెల రోజులు క్రితం కర్నూల్ పర్యటనలో, ఒక మైనారిటీ వ్యక్తి తనకు ఉన్న కష్టం చెప్పుకోగా, వెంటనే పాతిక వేలు తీసి చేతిలో పెట్టారు. ఇక కార్యకర్తలకు సేవ చేసే విషయం అయితే, రోజుకి ఎన్నో సంఘటనలు ఉంటాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక సంఘటన చూసి లోకేష్ చలించిపోయి సహాయం చేసారు. నారా లోకేష్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే విషయం అందరికీ తెలిసిందే. తన రాజకీయ దిన చర్యల పై, అలాగే అధికార పక్షం చేసే అన్యాయాల పై సోషల్ మీడియా వేదికగా లోకేష్ ఆక్టివ్ గా ఉంటూ ఘాటుగా స్పందిస్తూ ఉంటారు,

ln 03092021 2

తాజాగా ఒక జర్నలిస్ట్, ఒక పోస్ట్ చేసారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం పడుతున్న బాధులు ఇవి. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరికీ కళ్ళు లేవు. పుట్టిన పిల్లలు వారి కళ్ళు అయ్యారు. అయితే అందరి పిల్లలు లాగా స్కూల్ కు వెళ్ళాల్సిన ఆ పిల్లలు జీవనం కోసం ఆటో నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ చిన్న పిల్లలు ఆటో నడుపుతూ, జీవనం సాగిస్తున్నారని ఒక జాతీయ మీడియా విలేఖరి ఒక స్టొరీ పోస్ట్ చేయగా, దానికి లోకేష్ స్పందించారు. ఆ బాలుడిని బ్యాగ్ తీసుకుని పుస్తాకాలు సద్దుకోమనండి, అతన్ని నేను చదివాస్తానని అన్నారు. అంతే కాదు ఆ కుటుంబానికి తక్షణ సాయంగా 50 వేలు ఇస్తామాని అన్నారు. ఆటో కోసం తీసుకున్న అప్పు 2 ల‌క్ష‌ల వ‌ర‌కూ తాము సాయం చేస్తామని అన్నారు. తల్లిదండ్రులు ఇష్టం మేరకు, ఏ స్కూల్ లో కావాలి అంటే ఆ స్కూల్ లో చదివిస్తానని లోకేష్ అన్నారు. చదువు ఖర్చు మొత్తం తానె భరిస్తానని లోకేష్ తెలిపారు. లోకేష్ చేసిన ట్వీట్ కి సోషల్ మీడియా మొత్తం, పార్టీలకు అతీతంగా మెచ్చుకుంటున్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్న వారు ఇలా స్పందిస్తారని, అధికారం కోసం చూడరని వాపోతున్నారు.

కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారిగా పని చేస్తున్న కె.ప్రభాకరరావుపై హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఆయన పై సుమోటోగా తీసుకుని, కోర్టు ధిక్కరణ చర్యలను చేపట్టాలని హైకోర్టు రిజిస్టార్ ని, హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి కె.ప్రభాకరరావు పాటించకుండా, ధిక్కరించటం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు ఆదేశాలు ఇస్తూ జి.సింగవరం పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ ని, ప్రభాకర్ రావు రద్దు చేసారు. అయితే దీని పై కోర్టుకు వెళ్ళగా, కోర్టు కె.ప్రభాకరరావు ఇచ్చిన ఆదేశాలు కొట్టివేసింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న గ్రామ సచివాలయ నిర్మాణం పై కూడా హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, ఆ నిర్మాణం నిలిపివేయాలని, అలాగే సర్పంచ్ పై ఎలాంటి ఒత్తిడి తేవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు చెప్పినా సరే, సర్పంచ్ చెక్ పవర్ రిలీజ్ చేయకపోవటంతో, హైకోర్టుకు వచ్చి విషయం చెప్పాడు సర్పంచ్. దీంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం ఆదేశాలు పట్టించిన కారణంగా, పంచాయతీ అధికారి పై చర్యలు తీసుకోవాలి అంటూ హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, సుమోటో కేసుగా నమోదు చేసి, అధికారి పై కోర్టు ధిక్కరణ చర్యలు మొదలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలకు వరుస ఘటనలతో ప్రతి రోజు టెన్షన్ గా మారింది. ఇప్పటికే జగన మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇతర మంత్రులు కేసుల్లో ఇరుక్కుని, రేపో మాపో అనే ప్రచారం జరుగుతుంటే, ఇప్పుడు కొత్త కేసులు తెర మీదకు వచ్చి వైసిపీ పార్టీని మరింత టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ పై ప్రాధమిక దర్యాప్తు జరిపి, కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి అంటూ సుప్రీం కోర్టు ఆదేశించటం సంచలనానికి తెర లేపింది. ఇందులో సిబిఐ ఎందుకు వచ్చిందా అనే ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి పైనే కాకుండా, అయన భార్య విజయలక్ష్మి పైన కూడా విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే మంత్రి ఆదిమూలపు సురేశ్ రాజకీయాల్లోకి రాకముందు ఐఆర్ఎస్ అధికారి. ఆయన భార్య కూడా ఐఆర్ఎస్ అధికారే. మంత్రి సురేష్ రాజకీయాల్లోకి 2009లో వచ్చారు. అంతకు ముందు ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ గా పని చేసే వారు. అయితే ఐఆర్ఎస్ ఆఫీసర్ల పై ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది సిబిఐ. ఐఆర్ఎస్ ఆఫీసర్ల పై అవినీతి ఆరోపణలు రావటంతో, 2016 సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న ఐఆర్ఎస్ ఆఫీసర్ల పై సిబిఐ అధికారులు రైడ్స్ చేసారు.

sc 03092021 2

ఈ సోదాల్లో మంత్రి సురేష్, ఆయన భార్య కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టారని సిబిఐ గుర్తించింది. ఇద్దరి పైన 2017లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మంత్రిగారి భార్య ఏ1గా ఉండగా, మంత్రి ఏ2గా ఆన్నారు. అప్పటికే సురేష్ ఉద్యోగ విరమణ చేసినా, ఆయన ప్రోద్భలంతోనే , ఆయన భార్య ఆదాయానికి మించిన ఆస్తులు వెనకేసరని సిబిఐ అభియోగం. అయితే తమ పై కనీసం ప్రాధమికంగా విచారణ కూడా చేయకుండా, సిబిఐ తమ పై చార్జ్ షీట్ దాఖలు చేసింది అంటూ, మంత్రి సురేష్ ఆయన భార్య, హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మంత్రి దంపతుల వాదనతో ఏకీభావించి, ఆయన పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ కొట్టేసింది. అయితే దీని పై సిబిఐ, సుప్రీం కోర్టుకు వెళ్లి అపీల్ చేసింది. దీని పైన నిన్న సుప్రీం కోర్టులో జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేసింది. అధికారుల ముందు కేసులు నమోదు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూనే, ప్రాధమిక దర్యాప్తు జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సిబిఐని ఆదేశించింది. దీంతో ఇప్పుడు మళ్ళీ మంత్రి దంపతుల పై సిబిఐ విచారణ చేయనుంది.

ఈ రోజు హైకోర్టులో జగనన్న విద్యా దీవెన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కొన్ని కాలేజీలు, ఈ విద్యా దీవెన నిధుల పై పిటీషన్ వేసాయి. దీని పై ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటీషన్ పై గతంలోనే విచారణ జరగగా, ఈ రోజు ఈ పిటీషన్ కు సంబంధించిన తీర్పు కాపీలు బయటకు వచ్చాయి. ఈ పిటీషన్ లో ప్రధానంగా ఉన్న అంశం ఏమిటి అంటే, కాలేజీలకు చాలా మంది ఫీజులు కట్టటం లేదని, ప్రభుత్వం ఆ ఫీజులను కాలేజీలకు ఇవ్వకుండా, విద్యార్ధుల తల్లి ఎకౌంటులో వేస్తుందని, అక్కడ తల్లి నుంచి కాలేజీలకు కట్టుకోవలని చెప్పగా, చాలా మంది ఫీజులు కట్టటం లేదని, కాలేజీలు దీని పై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో లాగా నేరుగా తమకే ప్రభుత్వం ఆ ఫీజు డబ్బులు ఇవ్వాలి అంటూ, పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. దీని పై విచారణ చేసిన హైకోర్టు, కాలేజీల ఎకౌంటులోనే ఫీజు జమ చేయాలి అంటూ, తీర్పుని ఇచ్చింది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం విద్యార్ధులకు విడుదల చేసిన ఈ ఫీజులు, కాలేజీలకు చేరటం లేదు అంటూ, కృష్ణదేవరాయ విద్యాసంస్థల తరపున హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసి, తమ వాదనలు వినిపించారు. దీంతో పిటీషనర్ వాదనతో హైకోర్టు ఏకీభావించింది.

hc 03092021 2

ఇక ఈ పిటీషన్ పై ప్రభుత్వం తరుపున కూడా వాదనలు వినిపిస్తూ, తాము తల్లులకు ఇస్తున్నాం అని, వారు కట్టక పొతే తాము ఏమి చేయలేం అని, ఆ విషయంలో తాము కలుగ చేసుకోలేం అని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు. రెండు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం, ప్రభుత్వం కూడా తాము ఏమి చేయలేం అని చేతులు ఎత్తేయటంతో, ఫీజులు కట్టకుండా కుదరదు అని, ఆ ఫీజులు అన్నీ ప్రభుత్వం నేరుగా, కాలేజీల ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. నేరుగా కళాశాలల ఖాతాల్లో డబ్బు జమ చేయాలి అంటూ తీర్పుని ఇచ్చింది. ఈ ఆర్డర్ కి సంబంధించిన కాపీ, ఈ రోజు బయటకు వచ్చింది. దీంతో ఇన్నాళ్ళు కాలేజీలకు ఫీజులు కట్టకుండా, నేరుగా తల్లుల ఖాతాలో వేసి, దీన్ని కూడా ఓటు బ్యాంకు పధకంగా చూపించుకోవాలని చూసిన ప్రభుత్వానికి షాక్ తగిలింది అనే చెప్పాలి. అసలు నేరుగా కాలేజీలకు ఇన్నాళ్ళు ప్రభుత్వాలు వేస్తుంటే, దాన్ని తల్లులు ఖాతాలో వేయటం, ఇదేదో కొత్త పధకంగా బిల్డ్ అప్ ఇవ్వటం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read