ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. కొత్తగా అప్పులు కూడా పుట్టని పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్ హామీ, మూడేళ్ళు అవుతున్నా నెరవేర లేదు. ఇక అభివృద్ధి అనేది ఎక్కడా అడ్డ్రెస్ లేదు. రోడ్డుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆర్ధిక కష్టాలతో, ఏపి ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉంటే, ఈ బాధ నుంచి బయట పడటానికి, ఏపి ప్రభుత్వం చేయని పనులు లేవు. పన్నులు రూపంలో బాది పడేస్తున్నారు. ఇప్పటికే ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజి పన్ను, నీటి పన్ను, ఇలా రకరకాల పన్నులు రూపంలో బాది పడేస్తున్న ప్రభుత్వం, తాజాగా కరెంటు చార్జీలు బాదేస్తుంది. ఈ నెల వస్తున్న కరెంటు బిల్లులు చూసి, లబోదిబో అంటున్నారు. అయితే కరెంటు చార్జీలు గురించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన విద్యుత్ శాఖా మంత్రి, ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో చూసి, ప్రజలు షాక్ అయ్యారు. ఆయన పెట్టిన ఫోటో, పిచ్చ వైరల్ అయ్యింది. పాజిటివ్ గా కాదు అండి, నెగటివ్ గా అయ్యింది. ఆయన ప్రైవేటు జెట్ లో విహార యాత్రకు వెళ్తూ, పెట్టిన ఫోటో చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రైవేటు జెట్ లో వెళ్తే తప్పు ఏముంది, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వెళ్తారు కదా అనుకుంటున్నారు కదా ? అక్కడే పొరపాటు.

minister 06092021 2

అయన ప్రైవేటు జెట్ లో వెళ్తుంది, ఏ పక్క రాష్ట్రానికో కాదు. ఏకంగా రష్యా వెళ్తున్నారు. ప్రైవేటు జెట్ లో రష్యా వెళ్ళటం చూసి, అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ దానికి ఆయన ఒక కాప్షన్ కూడా పెట్టారు. “Live life with no excuses, travel with no regret.” అని కాప్షన్ పెట్టారు. ఇక ఈ ఫోటో పిచ్చ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో అందరూ మంత్రిని వేసుకున్నారు. ఒక పక్క విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మీరు ఇలా ఎంజాయ్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. టిడిపి సోషల్ మీడియా అయితే, మంత్రి బాలినేని హవాలా కింగ్ అని, ఆయనకు ఏంటి అంటూ పోస్ట్ పెట్టింది. మంత్రి అఫిడవిట్ లో కారు కూడా లేదని చెప్పారని, మరి కారు కూడా లేని మంత్రికి, అయుదు కోట్ల పెట్టి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళే అవకాసం ఎలా ఉంది, ఇది హవాలా డబ్బు కాక మరి ఏమిటి అంటూ, టిడిపి ప్రశ్నించింది. మరి బాలినేని గారు, రష్యాలో దిగిన తరువాత, కానీ, లేక ఏపి వచ్చిన తరువాత కానీ, ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి మరి.

ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల విషయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది. ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్ లో చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను, హైకోర్టు కొట్టివేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా , గుంటూరు, ఈ జిల్లాల వరకు కూడా ఆంధ్రా యూనివర్సిటీ ఏరియా పరిధిగా, ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ వరకు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకి తీసుకుని వచ్చింది. ఈ పరిధిలో ఉన్న వారు ఎవరికైనా సరే, స్థానికంగా ఉన్న వారికి 85 శాతం అడ్మిషన్లు, బయట నుంచి వచ్చే వారికి 15 శాతం వర్తిస్తాయని ఏపి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లు పూర్తి అవ్వటంతో, పలు విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, ఏపి హైకోర్టుఐ ఆశ్రయించారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరంద్రా జిల్లాల నుంచి అనేక మంది వచ్చి, గుంటూరు, కృష్ణా జిల్లాలలోని రెసిదేన్షియల్ కాలేజీల్లో వచ్చి చదువుకుంటారని, ఇంటర్ అడ్మిషన్లు పూర్తయిన తరువాత, ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టాలని, గతంలో చేసిన అడ్మిషన్లు రద్దు చేయాలని, ఏపి ప్రభుత్వం, ఎటువంటి సంప్రదింపులు ఎవరితో చేయకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది అంటూ, కోర్ట్ కు తెలిపారు.

hc 06092021 2

ఏకపక్షంగా ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది అని, ఈ ఉత్తర్వులు రద్దు చేయలని హైకోర్టు ముందు వాదించారు. దీంతో హైకోర్టు పరిశీలిన జరిపి, జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు ధర్మాసనం, కొద్ది సేపటి క్రితం, తీర్పు చెప్పంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఈ ఏడాదికి గతంలో ఏ విధంగా అయితే, అడ్మిషన్లు నిర్వహించారో, అదే విధంగా అడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి, ముందుగా స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకుని, ఆ తరువాత వాటి అన్నిటినీ క్రోడీకరించి, అందరి ఆమోదయోగ్యంతోనే, ఇంటర్ లో ఆన్లైన్ అడ్మిషన్ల చేపట్టాలని, హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇది కూడా వచ్చే విద్యా ఏడాది నుంచి మాత్రమే చేయాలని హైకోర్టు సూచించింది. తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్ధులు, వీరి అందరి అభిప్రాయం తీసుకుని మాత్రమే , ముందు వెళ్ళాలని హైకోర్టు ఆదేశిస్తూ, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను, హైకోర్టు రద్దు చేసింది.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, విశాఖ ఫోకస్ గా వైసీపీ నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అక్కడ విజయసాయి రెడ్డిని ప్రత్యేకంగా నియమించటంతో, ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. అనధికార ముఖ్యమంత్రి అనే పేరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయసాయి రెడ్డికి ఉంది. విజయసాయి రెడ్డి ఒక్కడే కాదు, అక్కడ ఉన్న వైసీపీ ప్రధమ, ద్వితీయ స్థాయి నేతలు కూడా అలాగే ఉన్నారు. ఇక దీనికి తోడుగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించటం, అదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు అంటూ, వైసీపీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఇక్కడ భూకబ్జాల ఆరోపణలు అయితే చెప్పే పనే లేదు. విజయసాయి రెడ్డి పై అనేక ఆరోపణలు రావటంతో, ఆయన నాకు ఏమి సంబంధం లేదు అని చెప్పే పరిస్థితి వరకు వచ్చింది. వైసీపీ నేతల స్పీడ్ ఎక్కడి వరకు వెళ్లి అంది అంటే, అధికారుల మాటలను ధిక్కరించే వరకు వెళ్లి, వైజాగ్ లో ఇష్టారాజ్యంగా చేసేస్తున్నారు. ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ సృజనతో వైసిపీ నేతలు లడాయి పెట్టుకుంటున్నారు. ఆమె పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తమ పనులు చేయకపోవటమే కాకుండా, తమ పనులకు కూడా అడ్డు పడుతున్నారు అంటూ వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

sruajana 085092021 2

ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, విశాఖలో కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు, తమంతట తాముగా అధికారులతో సమీక్షలు జరిపే వరకు వెళ్ళింది. దీంతో సమయం వృద్ధా అవుతూ ఉండటంతో, అధికారులు ఇలాంటి సమావేశాల్లో పల్గున కూడదు అంటూ ఆమె ఆదేశాలు జారీ చేసారు. దీంతో అందరూ కలిసి ఆమె పై విజయసాయి రెడ్డికి ఫిర్యాదు చేసారు. కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రి స్థాయిలో ఉన్న వారు కూడా, జీవీఎంసీ కమిషనర్ సృజన పై అసంతృప్తిలో ఉంటూ, ఆమెను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేపించే ప్రయత్నంలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపధ్యంలోనే జీవీఎంసీ కమిషనర్ సృజన చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతుంది. ధీరులు అనే వారు ధర్మంగా ఉండాలని, వీరులుగా ఉండే వారు పని చేయాలని, ఎప్పుడైనా తలఎత్తుకుని ఉండాలని, భయపడకుండా మన పని కోసం ధైర్యంగా నిలబడి, ధర్మాన్ని కాపాడే విధంగా తనకు శక్తిని ఇచ్చిన దేవుడుకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసారు. అయితే ఈ ట్వీట్ ఆమె ఏ ఉద్దేశంతో పెట్టినా, విశాఖలో మాత్రం చర్చనీయంసం అయ్యాయి.

సిబిఐ పనితీరు పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సిబిఐ పని తీరుకు సంబంధించి, అనేక రాష్ట్రాల హైకోర్టులు, అలాగే సుప్రీం కోర్టు కూడా పలు మార్లు విమర్శలు చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు ధర్మాసనం, సిబిఐ పని తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఏకంగా సిబిఐ డైరెక్టర్ కు నోటీస్ కూడా పంపించింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అసలు సిబిఐ ఇంత వరకు చేసిన కేసులు ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేసులు ఎన్ని, అసలు మీకు సిబ్బంది పరంగా, సాంకేతికంగా, ఇతర మౌళిక సదుపాయాల పరంగా మీకు ఉన్నటు వంటి ఇబ్బందులు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాలని, దీని పై ఆరు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం, సిబిఐ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా, గతంలో సిబిఐ పై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రస్తావించింది. మద్రాస్ హైకోర్టు గతంలో సిబిఐ విచారణను తప్పు పడుతూ, సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థగ ఉండాలని, ఒత్తిడిలకు గురి కాకూడదని, ఎందుకు సిబిఐ ఇలా పని చేస్తుందో అర్ధం కావటం లేదు, పని తీరు అధ్వానంగా ఉంది అని చెప్తూ, సిబిఐని పంజరంలో ఉన్న చిలుకతో పోల్చింది.

sc 06092201 2

పంజరంలో ఉన్న చిలుకకు స్వేఛ్చ కావాలి అంటూ, స్వేఛ్చను సిబిఐ తానంతట తానే తీసుకుని, స్వతంత్రంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని, మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను కూడా ఈ రోజు సుప్రీం కోర్టు ప్రస్తావించింది. సిబిఐ పై వస్తున్న విమర్శలకు సిబిఐ సమాధానం ఇవ్వాలని, సిబిఐ ఎందుకు పని తీరు మెరుగుపరుచుకోలేక పోతుంది, సిబిఐ చేపట్టిన కేసులు ఎందుకు కోర్టులో నిలబడ లేక పోతున్నాయి. ఇప్పటి వరకు సిబిఐ చెప్పటిన కేసులు ఎన్ని, ఎన్ని నిలబడ్డాయి, ఇవన్నీ కూడా ఆరు వారాల్లో సుప్రీం కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ కు సంబందించి, ఇద్దరు న్యాయవాదులను అరెస్ట్ చేయటం, వారి పై బలవతంగా ఆరోపణలు చేసి, సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై సుప్రీం కోర్టు ఈ రోజు వ్యాఖ్యలు చేసింది. సిబిఐ పని తీరు పై వస్తున్న విమర్శలు, ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ప్రస్తవాన చేయటంతో, ఇప్పటికైనా సిబిఐ తన పని తీరు మార్చుకుని, ప్రక్షాళన చేస్తుందో లేక సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read