డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మీరొక ఐపీఎస్ ఆఫీసర్, వైసీపీ ప్రతినిధి కాదని గ్రహించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆదివారం ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు మహిళల్ని, టీఎన్ఎస్ఎఫ్ సభ్యుల్ని, తెలుగు యువకుల్ని హౌస్ అరెస్టులు చేసి, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదిన గుంటూరులో బీటెక్ చదువుతున్న రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద అతి కి-రా-త-కం-గా చం-ప-డం, నారా లోకేశ్ ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఆ రోజు నారా లోకేశ్ తో పాటు 33 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేశ్ విలేఖరులతో మాట్లాడుతూ రమ్యను చం-పి-న-వా-రి-ని 21 రోజుల్లో శిక్ష విధించాలని,. లేని పక్షంలో దిశ చట్టం గురించి మీరెటువంటి వివరణ ఇస్తారో ఇవ్వాలని అన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. నిందితులకు శిక్ష పడాలి, రమ్యకు, రమ్య కుటుంబానికి న్యాయం జరగాలని శాంతీయుతంగా క్యాండిల్ ర్యాలీ చేసి దిశ పోలీసు స్టేషన్ కు రెప్రజంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఇబ్బందుల పాలు చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, డమ్మి హోం మినిష్టర్ సుచరిత, పోలీసుల వల్ల ఇబ్బందుల పాలయ్యాం. పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటనకు కదలిపోయి, అటువంటి సంఘటనలు ఏపీలో జరగకూడదని ఏపీ దిశ చట్టం విప్లవాత్మకం, మహిళలపై దా-డి చేయాలనే ఆలోచన రాగానే వెన్నులో వణుకు పుట్టాలనే ఉద్దేశంతో ఈ చట్టం తెస్తున్నాం అని డిసెంబర్ 13వ తేదిన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో నిందితులకు ఉ-రి శిక్ష వేస్తామని ఇచ్చిన ఊదరగొట్టే ఉపన్యాసాలిప్పుడేమయ్యాయి? దిశ చట్టం ద్వారా రాష్ట్రంలో ముగ్గురికి ఉ-రి శిక్ష విధించాము, 500 మందికి పైగా శిక్షలు విధించాము అని డమ్మీ హోం మినిష్టర్ తెలిపారు. రెండు నెలలు గడిచాక అంటే ఆగస్టు 24వ తేదిన దిశ చట్టం కాలేదు, దిశ చట్టం స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది అని సాక్షాత్తు హోం మినిష్టర్ చెప్పారు. ఒకే హోం మనిష్టరు రెండు రకాలుగా దిశ చట్టం గురించి మాట్లాడారు. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ దిశ అనేది చట్టం కాదు, ఇదొక కార్యక్రమం మాత్రమే.. కేంద్రం కొర్రీల వల్ల చట్టంగా మారేందుకు సమయం పడుతుందని డీజీపీ అనడంలో అర్థంలేదు. చేతకాని పరిపాలనతో ఆడవారి మాన ప్రాణాలకు ఖరీదు కడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులపై ఏమైనా విచారణ చేపట్టారా?

అని విలేఖరులు గౌతమ్ సవాంగ్ ను అడిగితే సమాధానం లేదు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, వైసీపీకి ప్రతినిధి కాదని గ్రహించాలి. సీఎం ఇంటినుంచి కూతవేటు దూరంలో ఉన్న సీతానగరం వద్ద గ్యాంగ్ రే-ప్ జరిగితే నిందితులకు శిక్షలు లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఫోర్త్ లైన్ యాప్ ని రంగులు, పేరు మార్చి దిశ యాప్ అని పేరు పెట్టి దివాళా కోరుతనానికి శ్రీకారం చుట్టారు. రే-ప్ లు, హ-త్య-లు, వంచనకు గురవుతున్న ఆడవారికి న్యాయం లభించడం లేదని నిక్కచ్చిగా చెప్పొచ్చు. దిశ చట్టాన్ని టీడీపీ అపహాస్యం చేయడంలేదు, వ్యంగంగా మాట్లాడటంలేదు. ప్రభుత్వ పరంగా మహిళలను రక్షించాల్సిన అవసరముంది. దాని గురించి మాట్లాడటం మానేసి మేం అపహాస్యం చేస్తున్నామని మాట్లాడమేంటి? దిశ చట్టమే కానప్పుడు దిశ పోలీసు స్టేషన్లను ఎందుకు ఏర్పాటు చేశారు?. ప్రజా ధనాన్ని అనవసరంగా ఖర్చు చేసి దిశ పోలీసు స్టేషన్లను, ఆ స్టేషన్లలో డిఎస్పీలను ఎందుకు బఫూన్లుగా తీర్చిదిద్దుతున్నారో చెప్పాలి. దిశ చట్టం స్ఫూర్తి అని మాట్లాడటంలో అర్థంలేదు. ఈ చట్టం అమలుకు సినారియా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. పాపులేషన్ ప్రకారం పది లక్షల మందికి యాభై మంది న్యాయమూర్తులుండాలి. యావరేజ్ న తీసుకుంటే రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందికి పదమూడు మంది న్యయమూర్తులు మాత్రమే ఉన్నారు. ఈలెక్క ప్రకారం రాష్ట్రంలో దిశ చట్టం అమలుకు ఆస్కారం లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించి 176 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. రెండున్నర సంవత్సరాలైనా భర్తీ చేయలేదు. ఫోరన్సిక్ ల్యాబ్ లు ఎక్కువగా లేకపోతే అ-త్యా-చా-రా-లు జరిగితే 7 రోజుల్లో చార్జిషీట్ ఎలా వేస్తారు? తగిన న్యాయమూర్తులు లేకపోతే, తగినన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేకపోతే ఎలా కుదురుతుంది? దానిపై పేపర్ వర్క్ కూడా జరగలేదు. ఇవన్నీ పూర్తికాకుండా 21 రోజుల్లో ఎలా న్యాయం జరుగుతుందో చెప్పాలి. దీనికంతటికి సీయం చేతకానితనమో, డీజీపీ చేతకానితనమో, సలహామండలి చేతకానితనమో, హోం మనిష్టర్ చేతకానితనమో సమాధానం చెప్పాలి. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నారు. కల్తీ మద్యంతో, దేశంలో ఏ రాష్ట్రంలో లేని బ్రాండ్లను తెచ్చి జనం ప్రాణాలు తీస్తున్నారు. మద్యం ధరలు పెంచి ప్రజల్ని లూటీ చేస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధమని దశలవారీగా మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెస్తున్నారు. సొంత కంపెనీల నుంచి పిచ్చి మందును తయారుచేసి రూ.25 వేల కోట్లు దోపిడీకి రాచబాట వేస్తున్నారు. మద్యపాన నిషేధ హామీలో మహిళల్ని వంచించారు.

పెన్షన్ల కోతల విషయంలో వృద్ధులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఫైర్ అయ్యింది. టీడీపీ శాసన సభ్యులు బెందాళం అశోక్ , ఈ విషయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ, "అర్హులైన వయోవృద్ధులకు పెన్షన్ దూరం చేయడమే రెండేళ్లలో జగన్ రెడ్డి సాధించిన ప్రగతి. కుంటి సాకులు చెప్తూ వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వడానికి చేతకాక జగన్ రెడ్డి చేతులెత్తేశారు. రాష్ట్రలో ఈ నెల 3 లక్షల పెన్షన్లను తొలగించారు. వచ్చే నెల మరో 4 లక్షల పెన్షన్లు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవసరాల రిత్యా పక్క రాష్ట్రాలకు వెళ్లిన వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం దుర్మార్గం. వివిధ అవసరాల రిత్యా పక్క ప్రాంతాలకు వెళ్లడం సహజం. పక్క రాష్ట్రాలకు చెందిన వారిని సలహాదారులగా తీసుకొచ్చి లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నప్పుడు ఏపీకి చెందిన వారు అత్యవసర పనుల కోసం వెళ్లిన వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వరు.? పక్కరాష్ట్రాల్లో ఉన్నవారిని ఎన్నికలప్పుడు బస్సుల్లో తీసుకొచ్చి ఓట్లేయించినప్పుడు తెలియదా.? 28 నెలలుగా గుర్తురాని అనర్హత ఇప్పుడే గుర్తొచ్చిందా.? పెన్షన్ రాదన్న ఆవేదనతో 12 మంది మృతి చెందారు. ఇవి ప్రభుత్వ హ-త్య-లు-గానే భావించాలి.

jagan 05092021 2

జీవిత షర్మాంకంలో ఉన్న వృద్ధులను ప్రభుత్వం వేధిస్తోంది. మందులు, ఆరోగ్య అవసరాలకు ఉపయోగించుకునే పెన్షన్ ను తీసేయడం జగన్ రెడ్డికే చెల్లింది. మందులకు డబ్బులు లేక ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధుల, వితంతువుల ఉసురు కొట్టుకుపోతారు. చంద్రబాబు అందించిన రూ.5ల అన్నం తిని కుటుంబాలను నడుపుకున్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా లేకుండా చేశారు. పెంచుకుంటూ పోతానని చెప్పి.. అర్హుల తొలగింపును పెంచుకుంటూ పోతున్నారు. ఏడాదికి ఒకసారి పెంచుతానన్న పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కో పెన్షన్ దారుడు రూ.3,250 నష్ట పోయారు. పెన్షన్ల మీద ఆధారపడే వారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. మీ మోసకారి సంక్షేమానికి రాష్ట్ర ప్రజలు బలైపోయారు. గాలి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని నయవంచనకు గురి చేస్తున్నారు. తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఆందోళనలు నిర్వహించి మీ చేతకాని తనాన్ని నడివీధుల్లో ఎండగడతాం.

సింహాచలం దేవస్థానంలో అపచారం జరిగింది. విజయసాయి రెడ్డి సింహాచలం దేవస్థానికి వెళ్ళగా, ఆయనకు పూర్ణకుంభ స్వాగతం లభించటం వివాదాస్పదమైంది. నిబంధనలకు, ఆచారానికి వ్యతిరేకంగా ఉన్న ఈ చర్యలు చూసి అందరూ షాక్ అయ్యారు. చైర్మెన్ గా తిరిగి ఎంపిక అయిన అశోక్ గజపతి రాజు గారు, మొదటి సారి సింహాచలం దేవస్థానానికి వస్తే, క-రో-నా సాకుగా చూపి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం ఇవ్వకుండా చేసారు. స్వయంగా మంత్రి వెల్లంపల్లి ఈ విషయం చెప్పారని, అందుకే ఇవ్వలేదని దేవస్థానం వర్గాలు చెప్పాయి కూడా. అలాంటిది విజయసాయి రెడ్డికి, ఇప్పుడు పూర్ణకుంభ స్వాగతం లభించటం పై ధార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఆలయంలో సంప్రోక్షణ కూడా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పూర్ణకుంభ స్వాగతం పలికిన వారు, దీనికి బాధ్యులైన వారిని, అధికారుల పైన, ఈవో పైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ లు వినిపిస్తున్నాయి. అలాగే అక్కడ విజయసాయి చేసిన రాజకీయ ఆరోపణల పై కూడా విమర్శలు వస్తున్నాయి.

simhachalam 04092021 2

విశాఖలో వైసీపీ నేతలు చేస్తున్న భూకబ్జాల నుంచి దృష్టి మళ్లించటం కోసమే, సింహాచలం దైవ దర్శనానికి వెళ్లి మరీ, విజయసాయి రెడ్డి, అశోక్ గజపతి రాజు పై విమర్శలు చేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ విషయం పై ఈ రోజు టిడిపి విమర్శలు కూడా చేసింది. హిందూ సంప్రదాయలను, ఆలయాల పవిత్రతను విజయసాయి రెడ్డి దెబ్బ తీసే ప్రయత్నం చేసారని టిడిపి ఆరోపిస్తుంది. ఆలయంలో కొన్ని నిబంధనలు ఉంటాయాని, ఎవరికి పూర్ణకుంభ స్వాగతం పలకాలో, ఎవరికి ఇవ్వకూడదో, ఆలయ అధికారులకు తేలియదా అంటూ, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. స్వయంగా నోటీస్ బోర్డు లో, ఎవరికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వాలో స్పష్టంగా ఉందని, అధికారులకు ఇది ఎందుకు కనిపించ లేదని వాపోతున్నారు. అధికారులతో పాటుగా, అసమర్ధ దేవాదాయ మంత్రి ఉండటం, రాష్ట్ర దౌర్భాగ్యం అంటూ, శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించ లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ తో, ఆయన విమర్శల పాలు అయ్యారు. ముఖ్యంగా టిడిపి నేతలు, అలాగే సోషల్ మీడియాలో గౌతం సవాంగ్ పై విమర్శల వెల్లువ నడిచింది. అలాగే చింతమనేని ప్రభాకార్, ఎప్పుడూ లేనిది ప్రెస్ మీట్ పెట్టి మరీ, గౌతం సవాంగ్ పై విరుచుకు పడ్డారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన గౌతం సవాంగ్, రాష్ట్రంలో శాంతి భద్రతలు, దిశ చట్టం, ఇలా అనేక అంశాల పై మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన చాలా వ్యాఖ్యలు విమర్శలకు దారి తీసాయి. ముఖ్యంగా ఆయన మాటిమాటికి ప్రతిపక్ష పార్టీలు అని చెప్పటం అందరినీ ఆశ్చర్య పరిచింది. పోలీసులకు, ప్రతిపక్ష పార్టీలు అంటూ ఉంటాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు చట్టం, న్యాయం అనేవి మాత్రమే ఉంటాయి కానీ, అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి ఉండవని, అసలు పోలీసులకు ప్రతిపక్షం అని సంబోధించటమే తప్పు అని అంటున్నారు. అలాగే పోలీసుల దగ్గర కొత్త సాఫ్ట్వేర్ ఉందని చెప్తూ, ఏ వ్యక్తి పైన అయిన కేసులు ఉంటే మాకు తెలిసిపోతుంది అంటూ, టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని గురించి ప్రస్తావిస్తూ, ఆయనను ఉదాహరణగా చెప్పారు. దీని పైన కూడా అయన పై విమర్శలు వచ్చాయి. చెప్పేది జగన్ పై ఉన్న 30 కేసులు గురించి చెప్పవచ్చు కదా ని ఎదురు దాడి చేసారు.

avanti 040920212

ఇక మరో విషయంలో కూడా డీజీపీ విమర్శల పాలు అయ్యారు. నెల్లూరులో ఎంపిడీవో పై అధికార పార్టీ కోటంరెడ్డి చేసిన దా-డి, అలాగే వైరల్ అయిన అంబటి ఆడియో పై, ఆ మహిళ బయటకు వచ్చి ఫిర్యాదు చేయటం, అలాగే వైరల్ అయిన అవంతి ఆడియో పైన, అవంతి వచ్చి ఫిర్యాదు చేయటం పైన, మీ విచారణ ఎంత వరకు వచ్చింది, ఈ మూడు కేసులు గురించి చెప్పండి అని విలేఖరులు అడగగా, వీటి పైన నేను వెంటనే సమాధానం చెప్పలేనని అన్నారు. ఎవరో ఏదో వాయిస్ తో చేసారు, అది కర్రెక్టా కాదా అనేది, నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్తూ, రమ్య కేసు గురించి చెప్తానని, ఈ కేసులో ప్రతిపక్షం రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడింది అంటూ, అసలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అలాగే సీతానగరం ఘటనకు సంబంధించి, ఇప్పటికీ చార్జ్ షీట్ ఎందుకు వేయలేదని, ఎందుకు రెండో నిందితుడని పట్టుకోలేదు అని అడగగా, దానికి కూడా సమాధానం దాట వేసారు. కేవలం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయటం కోసమే, డీజీపీ ప్రెస్ మీట్ పెట్టారు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisements

Latest Articles

Most Read