సివిల్ సప్లై మంత్రికి పేరుకు మాత్రమే పదవి కట్టబెట్టారు. కానీ ఆయన పనిమాత్రం సొంత సామాజికవర్గాన్ని తిడుతూ, జరిగే వాటిని పక్కదారి పట్టించేందుకు అనధికార పదవిని కట్టబెట్టారు. సివిల్ సప్లైకి సంబంధించి కొడాలి నాని ఏనాడూ మాట్లాడలేదు. ఈ శాఖలో విపరీతంగా కుంభకోణాలు చేస్తూ వేలాది కోట్లు వెనకేసుకుంటూ, రాష్ట్రంలో జరిగే అనేక అంశాలను పక్కదారి పట్టించేందుకు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలు చూస్తే బూతుల మంత్రికి వేల కోట్లు సంపాదన వచ్చే పదవి ఇచ్చాము, నీవళ్ల ఏమీ కావడం లేదు, నీ పదవి తీసే సమయం వచ్చిందన్న సంకేతాలు ఇచ్చారు. దీనికి నిదర్శనం సివిల్ సప్లై గురించి ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలే. సివిల్ సప్లై శాఖ నిద్రపోతోందా.? సివిల్ సప్లై శాఖలో విపరీతంగా అవినీతి జరుగుతోంది, బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని, తన నియోజకవర్గంలో వారంలో రెండు మూడు లారీలు బియ్యం అక్రమంగా వెళ్తున్నాయని ఆర్కే అన్నారు. కుంభకోణాలకు దారి తీస్తున్నట్లు ఆళ్ల మాట్లాడారు. కొడాలి నానికి శాఖ అప్పగించినప్పటి నుండి జరిగే అవినీతిపై మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారంటే కావాల్సినంత పర్ఫార్మెన్స్ బూతుల మంత్రి ఇవ్వలేక పోతున్నారు. బూతుల్ని ప్రజలు తిప్పి కొడుతున్నారని శాఖను తీసే వేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఆళ్ల ఒక్కో నియోజకవర్గానికి 3 లారీల చొప్పున అవినీతి బియ్యం పోతున్నాయన్నారు. 175 నియోజకవర్గాల్లో వారానికి 3 లారీల చొప్పున 525 లారీలు, నెలకు 2,100 లారీల అక్రమంగా బియ్యం తరలించ బడుతున్నాయి. ఇది ఆళ్ల లెక్కల ప్రకారమే చెప్తున్నాం. ఇది సాధారణంగా జరిగే అవినీతి. ఒక్కో లారీకి రూ.6-రూ.10 లక్షలకు అమ్ముతున్నారు. నెల్లూరులో కూడా బియ్యం అక్రమ రవాణాపై కథనాలు వచ్చాయి. పాత్ర దారైన కోదండరామి రెడ్డి సంచుల్లో నింపడానికి చేసిన వ్యక్తే ఇదంతా చేశారు. రూ.4 వేల కోట్ల రూపాయల బియ్యం పట్టుబడ్డాయి. అంతా సక్రమం అయితే అక్రమం ఎక్కడ. పక్క దేశాలకు బియ్యం తరలిపోతున్నాయి. దళితుల మీద దా-డు-లు జరిగినప్పుడు పక్కదారి పట్టించేందుకే కొడాలిన నాని బయటకు వస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మొత్తం బియ్యాన్ని పేదలకు అందించాలి. అంతక ముందు డీలర్లు సంచుల్లో పోసి లెక్క ప్రకారం బియ్యం అందించేదవారు.

కానీ వీళ్లు వాహన సిస్టం తీసుకొచ్చారు. వాహనాల ద్వారా ఇంటింటికీ పంచుతామని చెప్పారు. ఇంటింటికీ వాహనాలు వెళ్లడం లేదు..ఎక్కడో ఓ మూలన వాహనాలు ఆగితే వాటి దగ్గరకెళ్లి జనం బియ్యం తెచ్చుకోవాలి. మరి ఈ వాహనాలు ఎందుకు ప్రవేశపెట్టారు. వినియోగదారుల సౌకర్యార్థం వాహనాలు తెచ్చామని చెప్తున్నారు. 50 కేజీల బియ్యం బస్తా నుండి 5 కేజీలు నొక్కేస్తున్నారు. ఈ వాహనాలే అక్రమ బియ్యం రవాణా తరలించేందుకు ఉపయోగ పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి వెహికల్ కు నంబర్ వుంటుంది..కానీ జగన్ రెడ్డి ఇచ్చిన బియ్యం వాహనాలకు నంబర్లు లేవు. డీలర్ల నుండి నంబర్లు లేని వాహనాల్లో ఎక్కించి అక్రమ రవాణా చేసే ప్రాంతానికి తరలిస్తారు. గతంలో రైసు మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శ్రీరంగనాథరాజు, మంత్రి కొడాలి నాని ఇదంతా చేస్తున్నారు. అక్రమాలు, రౌడీ యిజం చేసేవాళ్లకు మంత్రి పదవులు ఇస్తున్నారు. ద్వారంపూడి భాస్కర్ రెడ్డి కూడా ఇందులో ఉన్నారు. ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని కొడాలి నానితో సామాజిక వర్గాన్ని తిట్టిస్తూ శ్రీరంగనాథరాజు నుండి ద్వారంపూడి వద్దకు వస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం 89 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 59లక్షల కార్డులకు బియ్యం ఇస్తోంది. ప్రతి కేజీలో అవినీతి జరుగుతోంది. వేల కోట్ల రూపాయల పేదల సొమ్మును బొక్కుతున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన బియ్యం పంపిణీ వ్యవస్థలో అక్రమాలు చేస్తున్నారు. వారంలో నియోజకవర్గం నండి 6-7 లారీల బియ్యం వెళ్తోంది. కొడాలి నానిని పదవి నుండి తప్పించాలి. పేదల బియ్యంతో వేల కోట్ల రూపాయల అవినీతి జరగుతోంది. ఇసుక, మైనింగ్, లిక్కర్ లో వేల కోట్లు దోచుకుంటున్నారు. సిట్టింగ్ జడ్జితో రేషన్ బియ్యంపై విచారణ చేయించాలి. కొడాలి నాని, ద్వారంపూడి భాస్కరరెడ్డి, శ్రీరంగనాథరాజు పై చర్యలు తీసుకోవాలి.

కేంద్ర ఎన్నికల సంఘం గత బుధవారం నాడు, ఏఏ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఉన్నాయో, ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి, డీజీపీలు, అదే విధంగా చీఫ్ సెక్రటరీలు, హోం శాఖా, ఇతర ఉన్నతాధికారులతో, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లు, వీరి అందరితో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేసి, ఉప ఎన్నికల పై అభిప్రాయం అడిగింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటు వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది, పరిస్థితి ఎన్నికలకు అనువుగా ఉన్నాయా లేదా, ఎన్నికలు జరపవచ్చా లేదా అనే అంశం పై, రాష్ట్రాల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు తెలుసుకుంది. అయితే అనేక రాష్ట్రాలు ఉప ఎన్నికలకు సై అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పగా, కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మాత్రం ఇప్పుడే ఉప ఎన్నికలు వద్దు అని చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా బద్వేల్ లో ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, తెలంగాణాలో హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరగా, తమకు పండుగలు ఉన్నాయని, వినాయక చవితి, దసరా పండుగలు ఉన్నాయని, దీపావళి పండుగ ఉందని, పండుగుల సీజన్ ఉండటంతో, అలాగే ప్రస్తుతం వర్షాలు బాగా పడుతూ ఉండటం, అక్కడక్కాడా వరదలు ఉండటంతో, ఎన్నికలు వద్దు అని కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పారు.

election 04092021 2

నిజానికి వినాయక చవతి, దసరా, దీపావళి అనే పండుగలు అన్ని రాష్ట్రలలో చేసుకుంటారు. వినాయక చవతి, దీపావళి మన కంటే పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువ చేసుకుంటారు. దసరా కూడా పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా చేసుకుంటారు. మరి వాళ్లకు లేని ఇబ్బంది, మనకు ఎందుకు వచ్చిందో అర్ధం కావటం లేదు. ఎన్నికలు అంటే, మనం భయపడుతున్నామా ఏమిటి అనే అభిప్రాయం కలుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఘోరంగా ఉంది, రోడ్డులు కానీ, అప్పులు కానీ, పెన్షన్లు ఎత్తివేయటం కానీ, కరెంటు చార్జీలు కానీ, ఇలా అనేక అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇది ఒక సాకుగా చెప్పి, తప్పించుకున్నారా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా, తెలంగాణా, ఏపిలో ఎన్నికలు లేకుండా ఉప ఎన్నికల షడ్యుల్ విడుదల చేసింది. బెంగాల్‍లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఎన్నిక జరగనుంది. బెంగాల్‍లో భవానీపూర్, శంషేర్‍గంజ్, జంగీపూర్, ఒడిశాలోని పిప్లీ నియోజవర్గాల్లో ఉప ఎన్నిక జరగనుంది.

ఈ మధ్య వైసీపీ పార్టీకి అసలు టైం కలిసి రావటం లేదు. ఒక పక్క ప్రజల్లో అధికార వైసీపీ పార్టీ పై అసహనం పెరిగిపోతుంటే, మరో పక్క వైసీపీ నేతలు రోజుకి ఒక దాంట్లో దొరికి పోతున్నారు. అవినీతి ఆరోపణల్లో దొరికినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు కానీ, రికార్డింగ్ వాయిస్ లలో దొరికితే మాత్రం, వారు ఏమి చేయలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఆడియో లీక్లు బయట పడ్డాయి. వీటి పై ఇప్పటికే వైసీపీ నేతలకు పెద్ద తల నొప్పిగా మారింది. అయితే ఇప్పుడు మరో వైసిపీ నాయకుడు పేకాట ఆడుతూ దొరికిపోయాడు. సినీ నటుడు, వైసీపీ నేత కూడా అయిన కృష్ణుడు ఈ రోజు పేకాట ఆడుతూ దొరికిపోయాడు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎందుకు దొరుకుతారు, హైదరాబాద్ లో పట్టుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒక పార్క్ విల్లాలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావటంతో మియాపూర్ పోలీసులు రైడ్ చేసారు. దీంతో అక్కడ వైసీపీ నేత, సినీ ఆర్టిస్ట్ కృష్ణుడు ఉండటంతో, అతన్ని అరెస్ట్ చేసారు. అలాగే నిర్వాహకుడు పెద్ది రాజుతో పాటుగా, మొత్తం ఎనిమిది మందికి పోలీసులు ఆర్రేస్ట్ చేసారు.

krishnudu 04092021 2

వీరి అందరి పైన పోలీసులు కేసు నమోదు చేసారు. అందరినీ అరెస్ట్ చేసారు. గుట్టు చప్పుడు కాకుండా, వీరి పేకాట ఆడుతున్న సమయంలో, అక్కడ ఉన్న స్థానికలు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి పోలీసులు వారి అందరినీ అరెస్ట్ చేసారు. మియాపూర్ పోలీసుల టీం చేసిన ఈ రైడ్స్ లో మొత్తం ఎనిమిది మంది దొరికారు. వారి దగ్గర ఉన్న నగదు, ఫోన్లు , ఇతర సామగ్రిని కూడా పోలీసుల సీజ్ చేసారు. కృష్ణుడుతో పాటుగా, మరో ఏడు మందిని అరెస్ట్ చేసారు. వారిని రిమాండ్ కి పంపించే అవకాశం. దీని పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది సంఘటన నిన్న రాత్రి జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు వైసిపీ పార్టీలో, జగన్ సమక్షంలో చేరిన కృష్ణుడు, తరువాత ఎన్నికల్లో ప్రచారం కూడా చేసారు. వైసీపీ గెలవాలని తిరిగారు. అయితే ఇప్పటికే ఇలాగే తిరిగిన ఒక సినీ నటుడు పృధ్వీ అడ్డంగా తిరుమలలోనే దొరికితే, ఇప్పుడు మరో సినీ నటుడు, వైసీపీకి చెందిన కృష్ణుడు, ఇప్పుడు పేకాటలో దొరికారు. కొడాలి నాని గారు గతంలో చెప్పినట్టు, ఫైన్ కట్టి బయటకు వచ్చేస్తారా అని టిడిపి ప్రశ్నిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఏమి మాట్లాడతారో అంతా సస్పెన్స్ గా ఉంటుంది. ఒక శాఖ గురించి మాట్లాడాల్సిన మంత్రి, ఇంకో శాఖ గురించి చెప్తారు. మంత్రులు మాట్లాడాల్సింది సలహాదారులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా పోలీసులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, ప్రతికపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేయటం కొత్త సంస్కృతి. నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ గారు, ప్రెస్ మీట్ పెట్టి, మా దగ్గర ఒక యాప్ ఉంది, అందులో ఎవరి పేరు కొట్టినా, వారి పైన ఎన్ని కేసులు ఉన్నాయో వచ్చేస్తాయి అని చెప్పారు. ఇక్కడ వరకు బాగనే ఉంది. అయితే దీనికి ఉదాహరణగా, చింతమనేనిని ప్రస్తావించారు. చింతమనేని పేరు కొట్టాలని చెప్పి, ఆయన పై 84 కేసులు ఉన్నాయి అంటూ, అందరి ముందు షేం చేసే ప్రయత్నం చేసారు. ఆయన వనజాక్షిని కొట్టారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేసులు అంటే గుర్తుకు వచ్చే వాళ్ళ పేర్లు కాకుండా, చింతమనేని పేరు చెప్పటం, ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడటం పై అందరూ ఆశ్చర్య పోయారు. అయితే చింతమనేని డీజీపీ వ్యాఖ్యలకు ఈ రోజు మీడియా సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చారు. డీజీపీ తన పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. తాను ఏమి మ-ర్డ-ర్లు చేయలేదని , అవినీతి కేసులు, ఫోర్జరీ కేసులు, ఇలాంటి కేసులు ఒక్కటీ తన పైన లేదనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

dgp 04092021 2

ప్రజల కోసం పోరాటం చేసే విషయంలో అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా చెప్తున్నారని, ఇలాంటి అక్రమ కేసులు 84 కాదు 800 కేసులు పెట్టుకోవచ్చని చింతమనేని అన్నారు. తన పేరుని కొట్టి చూపిస్తున్న డీజీపీ గారు, 6093 అనే నంబర్ ని కొట్టి ఉంటే, అక్రమ ఆస్తుల కేసులో ఉన్న వారి కేసులు లిస్టు ఒక పెద్దది వచ్చేదని, అది మంచి ఉదాహరణగా ఉండేదని చింతమనేని అన్నారు. మాట్లాడితే వనజాక్షి కేసు గురించి చెప్తారని, వనజాక్షి ని నేను కొ-ట్టి-న-ట్టు ఎక్కడైనా ఆమె ఫిర్యాదు చేసిందా అని అడిగారు ? ఆమె ఇచ్చిన కంప్లైంట్ లో తన పై డ్వాక్రా మహిళలు దా-డి చేసినట్టు ఉందని, ఇప్పటికీ ఆ కేసు తప్పు అయితే, డీజీపీ కేసు రీ ఓపెన్ చేసి, ఏమైనా చేసుకోవచ్చు అంటూ చాలెంజ్ చేసారు. బయటకు వస్తే కేసు, మాట్లాడితే కేసు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, ఎవరి ఆనందం కోసం, నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ డీజీపీని ప్రశ్నించారు. మొన్న నర్సీపట్నం అడువుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి తిప్పారని, అదే చివరి రోజు అనుకున్నా అని, ఈ మొత్తం అంశాల పై కోర్టుకు వెళ్తున్నానని చింతమనేని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read