సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నేత యశ్వంత్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ గుజరాత్‌ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు 2002లో గోద్రా అల్లర్లు చెల రేగిన విషయం తెలిసిందే. భోపాల్‌లో యశ్వంత్‌ సిన్హా మాట్లాడుతూ.. గోద్రా అల్లర్ల తరువాత బీజేపీలో జరి గిన పరిణామాలు గురించి ప్రస్తావించారు. నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వెనక్కి తగ్గకపోయి ఉంటే మోడీ కథ అప్పుడే ముగిసేదని యశ్వంత్‌ సిన్హా వ్యాఖ్యానించారు. దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల కేసులో నాటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీతో రాజీ నామా చేయించాలని వాజ్‌పేయి భావించారని గుర్తు చేశారు. మోడీ గనుక రాజీనామాను తిరస్కరిస్తే ఏకం గా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయానికి వాజ్‌పే యి వచ్చినట్టు సిన్హా తెలిపారు.

adwani 12052019

అయితే మోడీకి అప్పటి కేంద్ర హోంమంత్రి అద్వానీ రూపంలో పెద్ద అండ దొరి కిందని అన్నారు. మోడీని పదవి నుంచి తప్పిస్తే తాను కేంద్ర మం త్రి పదవికి రాజీనామా చేస్తానని అద్వానీ బెదిరించడంతో వాజ్‌పే యి వెనక్కి తగ్గారని సిన్హా చెప్పు కొచ్చారు. ఆ రోజు కనుక వాజ్‌పేయి వెనక్కి తగ్గకుం టే మోడీ కథ అప్పుడే ముగిసుండెెదని యశ్వం త్‌ సిన్హా తెలిపారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను దుర్వినియోగానికి పాల్పడ్డారని మోడీ చేస్తున్న ఆరొపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో నౌకా దళ మాజీ అధికారులు వివ రణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ప్రధాన మంత్రి స్థా యికి తగదని హితవు పలికారు.

adwani 12052019

లోక్‌ సభ ఎన్నికలు ప్రధాని మోడీ ప్రభు త్వ పనితీరుకు మాత్రమే జరుగు తున్నాయని అన్నారు. కానీ దేశ చరిత్రకు కాదని యశ్వంత్‌ పేర్కొ న్నారు. పాకిస్తాన్‌ సమస్యను ఎన్నికల్లో ప్రస్తావించడం దురదృ ష్టకరమని, పాక్‌ ఏమైనా మన దేశం లో అంత ర్భాగమా..? అని ప్రశ్నించారు. పాకిస్థాన్‌ గురించి మాట్లాడుతున్నారు కానీ చైనా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎందు కంటే చైనా వీటిని పట్టించుకోదని అన్నారు. మోడీ తన ఎన్నికల ప్రచారంలో మాటిమాటికీ పాకి స్తాన్‌ గురించి ప్రస్తావిస్తున్నారని, పాక్‌తో మనకు పోటీయా..? అని ప్రశ్నించారు.

నిరుపేద గిరిజనుడి కిడ్నీ కుంభకోణానికి సంబంధించి నెల్లూరు జిల్లాలోని సింహపురి ఆస్పత్రి యాజమాన్యంపై వెంటనే తగు చర్య తీసుకోకుండా ఉండటం వెనుక, పెద్ద స్కెచ్ ఉన్నట్టు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ రాజకీయ వత్తిడులకు లొంగకుండా నిజాయతీగా 420, 384 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. తాజాగా, ఎస్‌సి.,ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదైంది.అయితే ఆ ఆసుపత్రి యజమాని, జగన్ పార్టీలో, నెంబర్ 2 గా ఉన్న సోదరుడికి కాబోయే వియ్యంకుడు అని, అందుకే చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒత్తిడి చేసి, కేసు ముందుకు కదలకుండా చేసినట్టు సమాచారం. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టుబట్టడం, స్థానిక మీడియా వరుసగా కధనాలు ప్రచురిస్తూ ఉండడంతో ప్రస్తుతానికి కేసులు నమోదైనా, జగన్ పార్టీలో ఉన్న నెంబర్ 2, సోదరుడి ఇంట్లో జూన్ 6న వివాహం జరిగే వరకు ఎటువంటి చర్య ఉండబోదని పై స్థాయి అధికారులు భరోసా ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.

simhadri 12052019 1

బ్రెయిన్‌డెడ్ అయిన ఏకొల్లు శ్రీనివాసులు అనే వ్యక్తి కుటుంబ సభ్యులను బలవంతంగా ఒప్పించి అవయవాలు కాజేశారన్న ఆరోపణలు జరువుకావడంతో వైద్యశాల యాజమాన్యంతో పాటు ముగ్గురు వైద్యులపై కూడా నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ కేసుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ను కూడా జతచేశారు. దీనిపై సమీక్షించేందుకు రాష్ట్ర అట్రాసిటీ కమిషన్ నెల్లూరుకు రానుంది. ఈ లోపు నిందితులను అదుపులోకి తీసుకోవాలా లేదా అని పోలీసు ఉన్నతాధికారుల సమాలోచనలు చేస్తున్నారు. దీంతో పాటు కేసులో బాధ్యులుగా పేర్కొన్న ఐదుగురి వైద్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఉపక్రమిస్తున్నారు. ఈ ఐదుగురి వైద్యుల లైసెన్సులు రద్దు చేయాలని ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నివేదిక పంపగా కౌన్సిల్ వారికి నోటీసులు పంపినట్లు తెలిసింది.

simhadri 12052019 1

అందులో భాగంగానే ఎంసీఐ ఈనెల 13వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని తాఖీదులో పేర్కొన్నట్లు సమాచారం. ఎంసీఐ ఇచ్చిన నోటీసుపై స్టే కోసం వారు హైకోర్టును ఆశ్రయించిన నేపధ్యంలో ఈ పరిస్థితుల్లో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వీరితో పాటు అరెస్టులు జరక్కుండా వైద్యశాల యాజమాన్యం ముందు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తున్నది. అయితే ఇదే సయంలో పలు గిరిజన సంఘాలు మానవ హక్కుల కమిషన్‌ను కలసి పరిస్థితి వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయమై పలు ప్రజా సంఘాలు ఓ అభిప్రాయానికి వచ్చేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సంఘటన జరిగి ఎన్నిరోజులైనా బాధ్యులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలపైనే ప్రపంచ దేశాల చూపు ఉంది. మోడీ హవా కూడా ఆ విధం గానే కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ ‘టైమ్‌’ మ్యాగజైన్‌ భారత ఎన్నికలపై ప్రత్యేకంగా అంతర్జాతీయ ఎడిషన్‌ను ప్రచురించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోను కవర్‌ పేజీపై ముద్రించింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ పక్కనే ఓ వివాదాస్పద శీర్షికను ప్రచురించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ (భారత దేశాన్ని విభజించేవాడు) అని రాసిన హెడ్‌లైన్‌ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మే 20, 2019న విడుదల అయ్యే ఈ మ్యాగజైన్‌ ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమ యంలో వివాదాలు సృష్టించేదిగా ఉంది. యూరప్‌, ఆసియా, మధ్య ప్రాశ్చ్యం, దక్షిణ పసిఫిక్‌ అంతర్జా తీయ ఎడిషన్‌లలో మోడీ కవర్‌ స్టోరీ ప్రచురించింది. ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ కథనాన్ని అతిష్‌ తసీర్‌ రాశాడు. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం మరో ఐదేళ్లు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా..? అన్న హెడ్‌లైన్‌తో ఈ ఆర్టికల్‌ను రాశారు.

time 12052019

నెహ్రూ, మోడీకి మధ్య వ్యత్యాసం గురించి కూడా ఈ ఆర్టికల్‌లో ఉంది. మోడీ హయాంలో హిం దు-ముస్లిం సంబంధాలు, మోడీని తిట్టడం ద్వారా హిందూ అనుకూలమైన వ్యక్తులుగా నిరూపించుకోవడం వంటి ఆధారంగా ఆ వ్యాసం రాసినట్టు తెలుస్తున్నది. మోడీ ప్రభు త్వ హయాంలో వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, క్రిస్టియన్లు అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. 2014 ఎన్నికల సందర్భంగా ఆర్థికపరమైన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని, మోడీ ప్రధాని అయ్యాక ఆర్థికంగా ఎలాంటి అద్భుతాలు జరగలేదని తసీర్‌ అభిప్రాయపడ్డాడు. భారత దేశంలో నేషనలిజం అనే అంశం పెరిగిందే తప్పా, ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పుకొచ్చారు. మాజీ ప్రధాని నెహ్రు లౌకికవాదాన్ని, మోడీ హయాంలో ప్రబలుతున్న సామాజిక ‘ఉద్రిక్తత’తో పోల్చుతూ తసీర్‌ కథనం సాగింది. బీజేపీ హిందుత్వ రాజకీయాలే భారత ఓటర్లు నిలువునా చీలడానికి కారణమని తసీర్‌ పేర్కొన్నా డు. 2014 ఎన్నికల తరు వాత స్వతంత్ర భార త రాష్ట్రాల ప్రాథమిక సిద్ధాంతాలు, దాని సమరయోధులు, మైనార్టీ స్థానం సహా దేశంలో అనేక వ్యవస్థల మధ్య తీవ్ర అపనమ్మ కాలు ఏర్పడ్డాయంటూ చెప్పుకొచ్చారు.

time 12052019

భారత ప్రధాన లక్ష్యాలు అయిన లౌకికవాదం, ఉదారవాదం, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి వాటిని చాలా మంది అతిపెద్ద కుట్రలో భాగంగా చూస్తున్నారని టైమ్‌ కథనం పేర్కొంది. గుజరాత్‌ అల్లర్లపై మౌనం దాల్చిన కారణంగా మోడీ అల్లరి మూకలకు స్నేహి తుడిగా మారారంటూ తసీర్‌ విమర్శించారు. గోహత్యలపైనా మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని కూడా టైమ్‌ ప్రశ్నించింది. మోడీ ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘటనల గురించి కూడా ప్రస్తావిం చారు తసీర్‌. మూకదాడులు, యోగీ ఆదిత్య నాథ్‌ను యూపీ సీఎంగా నియమించడ ం, సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ను భోపాల్‌ నుంచి బరిలో దించడం వం టి ఎన్నో అంశా లను ప్రస్తా వించడం జరిగింది. వీ టితో పాటు కాంగ్రెస్‌ గురించి కూడా కథ నంలో తసీర్‌ చర్చి ంచారు. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీ యాలు మిన హా ఇంకేమీ చేయట్లేద ని ఆయన దుయ్యబ ట్టారు. తాజాగా రా హుల్‌ గాంధీకి తోడుగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా రాజకీయా ల్లోకి వచ్చారని తసీర్‌ చెప్పుకొ చ్చారు. ప్రియాంక వచ్చినా పెద్ద మార్పు కనబడటం లేదని పేర్కొన్నారు. ఇంతటి బలహీన ప్రతిపక్షం ఉండటం కూడా మోడీ ప్రభుత్వానికి బాగా కలిసివస్తుందని తసీర్‌ పేర్కొన్నారు. మోడీ చిత్రం టైమ్‌ మ్యాగ జైన్‌ కవర్‌ ఫొటోగా రావ డం ఇదే తొలి సారి కాదు. అదేవిధంగా మోడీ గురించి తీవ్రంగా దూషిస్తూ రాయడం కూడా మొదటి సారికాదు. 2012లో మోడీని వివాదాస్పదమైన, ఆశాభా వం కలిగిన, తెలివైన రా జకీయనాయకుడిగా టైమ్‌ మ్యాగజైన్‌ ఓ ఆర్టికల్‌ను కూడా ముద్రించింది. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీక రించి ఏడాది పూర్త యిన సం దర్భంగా కూడా టైమ్‌ మ్యాగ జైన్‌ మోడీ కవర్‌ ఫొ టోతో ప్రత్యేక ఎడిషన్‌ను ప్రచు రించింది. గుజరాత్‌ అల్లర్ల గురించి కూడా తసీర్‌ తన వ్యాసంలో గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ద్వివేది ఇవాళ్టి నుంచి సెలవులపై వెళ్లనున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ నెల 15 వరకు ద్వివేది సెలవుల్లో ఉండనున్నారు. తిరిగి ఈ నెల 16న విధులకు హాజరుకానున్నారు. అయితే ఈయన ఈ నాలుగు రోజులు సెలవు పై వెళ్ళటం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈనెల 14న నిర్వహించే కేబినెట్‌ సమావేశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందో ఇవ్వదో తెలియని టైంలో, ఈయన సెలవు పై వెళ్ళటం చూస్తుంటే, ఎదో జరుగుతుంది అని అంటున్నారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం కనుక అనుమతి ఇవ్వకపోతే, తన పై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, ఇప్పటికే తన పై ఆరోపణలు చేస్తున్న అధికార పక్షం మరింత కఠినంగా విమర్శలు చేస్తారని, అందుకే ఆయన సెలవు పై వెళ్ళారానే ప్రచారం జరుగుతుంది.

dwivedi 12052019

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు మరో 48 గంటల్లో తెరపడనుంది. సోమవారం దీని పై కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందో ఇవ్వదో తెలిసిపోతుంది. ఈ నేపధ్యంలో ద్వివేది సెలవు పై వెళ్ళటం పై, అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీఎస్‌ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశ అజెండాలోని అంశాలపై స్క్రీనింగ్‌ కమిటీ నివేదికను శుక్రవారం మధ్యాహ్నం నాటికి సిద్ధం చేశారు. ‘కమిటీ సభ్యులు రూపొందించిన నివేదిక’ను మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ ఉన్నతాధికారులు అందజేశారు. ఆ వెంటనే సీఈఓ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కేబినెట్‌ అంశాలపై పంపిన నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనున్నది.

dwivedi 12052019

సీఈసీ నిర్ణయం వెలువడేందుకు కనీసం 48 గంటల వ్యవధి కావలసి ఉంటుందని ద్వివేది వెల్లడించారు. సీఈసీ నుండి ఆదివారం సాయంత్రానికి లేదా, సోమవారం సాయంత్రానికి సమాధానం వచ్చే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. స్క్రీనింగ్‌ కమిటీ నివేదికలో ఏయే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు పూర్తయిన తరువాత ఫలితాల కోసం 41 రోజుల వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడంతోనే ఇటువంటి అసందర్భమైన అంశాలు తెరమీదికి వస్తున్నాయని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అంటున్నారు. ఇటు ప్రభుత్వం, అటు కేంద్రంతో పాటు ఎలక్షన్ కమిషన్ మధ్యన నలిగిపోతున్నామని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read