ఫొని’ తీవ్ర పెను తుపానుగా మారుతున్న నేపథ్యంలో నాలుగు ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల నియమావళి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ తుపాను ప్రభావం అధికంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో హై అలర్ట్‌ ఉందని.. తక్షణ చర్యలు తీసుకొనేందుకు కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని చంద్రబాబు కోరారు. అలాగైతే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేతలు యుద్ధప్రాతిపదికన స్పందించేందుకు వీలు కలుగుతుందని సీఎం లేఖలో తెలిపారు.

game 27032019

ఫని తుఫాన్ నేపథ్యంలో నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి గురించి, రాష్ట్ర సీఈసీని విలేకరులు ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం నుంచి తమకెలాంటి ప్రతిపాదనలు రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది షాక్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి తమకెలాంటి ప్రతిపాదనలు వచ్చినా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తాని చెప్పారు. ఎన్నికల కోడ్ మినహాయింపు వంటి కీలక నిర్ణయాలు ఈసీనే తీసుకుంటుందని.. ఈసీ ఆదేశాలే తాము అమలుచేస్తామని చెప్పారు. ఇక తుఫాన్ ప్రభావం వల్ల స్ట్రాంగ్ రూముల్లోని ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం వంటి తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కలెక్టర్లను ముందస్తు చర్యల కోసం అప్రమత్తం చేసినట్టు తెలిపారు.

game 27032019

ఏపీలోని ఆ నాలుగు జిల్లాలతో పాటు ఒడిశా, కొంతమేర పశ్చిమ బెంగాల్ మీద ఫణి తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉంది. అది తీవ్ర తుఫాన్‌గా మారుతుందని, తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, వాతావరణ శాఖతో పాటు ఆర్టీజీఎస్ అధికారులు కూడా తెలిపారు. దీంతో అధికారులకు సరైన మార్గనిర్దేశం చేయడానికి అనువుగా కోడ్‌‌కు రిలాక్సేషన్ ఇవ్వాలని కోరారు. మరోవైపు తుఫాన్ కారణంగా టీడీపీ సమీక్షలను రెండు రోజులు వాయిదా వేసింది.

‘యాభై శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలనే డిమాండుతో రాజకీయ పార్టీలతో కలిసి త్వరలోనే దేశ రాజధానిలో ధర్నా చేస్తాం’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘స్వచ్ఛంద సంస్థలూ మాకు సహకరించేందుకు ముందుకొస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం తేవడానికి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామంటున్నాయి. కొవ్వొత్తుల ర్యాలీలూ చేస్తామంటున్నాయి’ అని వివరించారు. వీవీప్యాట్‌లపై దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరికీ లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు దానిని గాడిన పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఏపీలో తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రజలు ఓటేశారని చెబుతుంటే జాతీయ స్థాయిలో నాయకులూ ఆశ్చర్యపోయారని సీఎం వివరించారు.

game 27032019

. ‘మన పోరాటమంతా ఎన్నికల సంఘంపైనే.. ఇక్కడుండే అధికారులపై కాదు..’అని తెలిపారు. ఎన్నికల విధులను నిర్వహించే అధికారులను మినహాయిస్తే ఆ బాధ్యతలు లేని వారు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. గడచిన ఐదేళ్లలో అధికారులు బాగా సహకరించారని చంద్రబాబు ప్రశంసించారు. ఇప్పుడు వారిని కూడా కులం, మతం పేరుతో, వ్యక్తిగత ఎజెండాతో విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘అభివృద్ధిలో కులం, మతం చూడలేదు. మత సామరస్యాన్ని కాపాడా. వృద్ధులకు పింఛను, యువతకు నిరుద్యోగ భృతి.. రైతులకు అన్నదాతా సుఖీభవ, రుణమాఫీ నాలుగో విడత నిధులు, మహిళలకు పసుపు కుంకుమ పథకాలు అమలు చేశాం.. ఇన్ని చేసినా ఎన్నికల్లో ఇచ్చే రూ.వెయ్యి, రూ.2వేలకు ఆశపడుతున్నారంటే బాధేస్తోంది. రూ.2వేలు, రూ.500 నోట్లు లేకపోతే ఈ సమస్య వచ్చేది కాదు. దీనికి మొదటి ముద్దాయి నరేంద్ర మోదీయే’ అని చంద్రబాబు విమర్శించారు.

game 27032019

‘ఆయన ఎన్నికల కమిషన్‌ను దుర్వినియోగం చేశారు. మనకున్న వ్యవస్థ కారణంగా తట్టుకోగలిగాం.. దాడులు జరిగిన తర్వాతా మన కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేశారు’ అని కితాబిచ్చారు. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై సామాజిక మాధ్యమాలు ఏకి పారేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల వారీగా ఏరియా సమన్వయకర్తలు, నేతలతో సమీక్షలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే కార్యకర్తల కోసం రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో పార్టీకి యంత్రాంగమే శాశ్వతం. పనులు చేయడానికి ప్రభుత్వ అధికారులూ ఉండాలి. రెండు వ్యవస్థల అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

వైసిపి ఎంపి విజ‌య సాయిరెడ్డి టిడిపి నేత‌లను వీడ‌టం లేదు. ఎన్నిక‌ల వేళ వ‌రుస‌గా టిడిపి ల‌క్ష్యంగా ఎన్నిక‌ల సంఘానికి వ‌రుస ఫిర్యాదులు చేసిన సాయిరెడ్డి..ఇక‌, టిడిపి నేత‌లను ఇప్ప‌టికీ వద‌ల‌టం లేదు. కొంత కాలం క్రితం సీయం ర‌మేష్‌..విజ‌య సాయిరెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్దం సాగింది. ఆ స‌మ‌యంలో సాయిరెడ్డి కేంద్రానికి సీయం ర‌మేష్ కంపెనీల పైన ఫిర్యాదులు చేసారు. దీని పైన కేంద్రం స్పందించి విచార‌ణ‌కు ఆదేశించింది. సీయం ర‌మేష్‌ను సారా వ్యాపారి అంటూ సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం ర‌మేష్ సైతం తీవ్రంగానే స్పందించారు. ఇక‌, ఎన్నిక‌ల వేళ సాయిరెడ్డి టిడిపితో పాటుగా ఆపార్టీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌నంటూ ప‌లువురి పైన ఫిర్యాదులు చేసారు.

game 27032019

ఫ‌లితంగా ఎన్నిక‌ల సంఘం వారి పైన చ‌ర్య‌లు తీసుకుంది. దీనిని టిడిపి నేత‌లు త‌ప్పు బ‌ట్టారు. ఇక‌, సీఎం ర‌మేష్ కంపెనీల పైనా సాయిరెడ్డి కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసారు. ఆయ‌న‌కు చెందిన కంపెనీల్లో అవినీతి జ‌రిగింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. మ‌రి కొంత మంది టిడిపి నేత‌ల మీద ఆయ‌న ఫిర్యాదులు చేస్తున్నారు. విజ‌యసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు పైన కేంద్రం స్పందించింది. రిత్విక్‌ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్‌లో నిర్మించిన కోటేశ్వర్‌ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని లేఖలో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి లేఖను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం కోటేశ్వర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నిర్ణయించుకుంది.

game 27032019

ఈ మేరకు పూర్తి స్థాయి విచారణ చేయాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. సాయిరెడ్డి ఫిర్యాదు మేర‌కు ఎన్నిక‌ల సంఘం స్పందించి చ‌ర్య‌లు తీసుకున్న స‌మ‌యంలో టిడిపి నేత‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు నేరుగా పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన సీఎం ర‌మేష్ సంస్థ‌ల పైన సాయిరెడ్డి ఫిర్యాదు మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించ‌టం పైన ర‌మేష్‌తో పాటుగా పార్టీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఎన్నికల ముందు దాదపుగా మూడు రోజుల పాటు రమేష్ ను టార్గెట్ చేస్తూ ఐటి దాడులు జరిగాయి. రూపాయి కూడా ప్రూవ్ చెయ్యకుండా ఐటి వెళ్ళిపోవటంతో, అప్పుడే వాళ్ళ డొల్ల తనం బయట పడిన సంగతి తెలిసిందే.

టీటీడీ వివాదంలో రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ వివాదంలో సీఎస్ తనకు చెప్పకుండానే కమిటీ వేశారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులే సొంతంగా కమిటీలు ఎలా వేస్తారని సీఎం ప్రశ్నించారు. కమిటీ వేసి రాటిఫికేషన్ కోసం తనకు పంపారని, రాటిఫికేషన్ చేయడానికే తాను ఉన్నానా? అంటూ నిప్పులు చెరిగారు. టీటీడీ విషయంలో తప్పు చేయని ఈవోను సీఎస్ ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు. టీటీడీ బంగారం తరలింపులో లోపాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కొద్ది రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే.

game 27032019

బంగారం తరలింపు వ్యవహరంలో టీటీడీ అధికారులు, బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన అబిప్రాయపడ్డారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బంగారం తరలింపు వ్యవహారంలో టీటీడీకి ఎన్నికల సంఘం క్లీన్‌చీట్ ఇచ్చింది. ఈ విషయంలో పంజాబ్ నేషలన్ బ్యాంక్ తప్పు లేదని ఈసీ తేల్చింది. ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యానే బంగారాన్ని సీజ్ చేశామని తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కిందిస్థాయి సిబ్బంది బంగారాన్ని సీజ్ చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు రోజు కావడంతో బంగారాన్ని సీజ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, ఐటీ శాఖ అధికారులతో తనిఖీలు నిర్వహించామన్నారు. అన్ని పత్రాలు సరిచూసుకుని బంగారాన్ని విడుదల చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

game 27032019

శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మాదిరిగానే టీటీడీని వివాదస్పదం చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి ఆరోపించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘శ్రీవారి బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం ఎప్పటి నుంచో ఉంది. టీటీడీని కూడా సీఎస్‌ ద్వారా మోదీ తన చేతిలోకి తీసుకున్నారు. సీఎస్‌ ద్వారా పాలన సాగిస్తున్న వాళ్లు.. స్వామి వారి నగలు పోయాయని చేస్తున్న ఆరోపణలకు వాళ్లే సమాధానం చెప్పాలి. చంద్రబాబు పాలనలోనే తిరుమల అభివృద్ధి జరిగింది. ఎప్పుడూ ఎటువంటి ఆభరణాలూ చోరీ కాలేదు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు వజ్రాలు పోయాయి. తాళిబొట్ల కుంభకోణం జరిగింది. శ్రీవేంకటేశ్వరుడికి ఏడు కొండలు కాదు.. రెండు కొండలేనని జీవో తెచ్చారు’ అని ధ్వజమెత్తారు.

Advertisements

Latest Articles

Most Read