ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా వివాదం కడప జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కోటేశ్వరరావుకు చుట్టుకుంది. ఆయనను ఎన్నికలకు సంబంధం లేని విధులకు బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల వేళ దేశంలో పలువురు నేతల బయోగ్రఫీ చిత్రాలు రూపొందాయి. ఇందులో భాగంగా రాంగోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని రూపొందించారు. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు వర్మ చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా రూపొందించారని టీడీపీ శ్రేణులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అలాగే మోదీ బయోగ్రఫీపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు బయోగ్రఫీ చిత్రాలను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే మే 1న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను రాంగోపాల్‌వర్మ విడుదల చేశారు.

lakshmis 15052019

కడపలోని రహత్‌ థియేటర్‌, రైల్వేకోడూరులోని ఏఎస్‌ఆర్‌, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్‌లలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలైంది. అక్కడ సినిమాను ప్రదర్శించారు. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి వెళ్లింది. ఎన్నికల నియమావళి ప్రకారం లక్ష్మీ్‌స ఎన్టీఆర్‌ సినిమాను అడ్డుకోవడంలో జేసీ విఫలమయ్యారని ఆయనకు ఎన్నికలకు సంబంధంలేని పోస్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ద్వివేది సిఫారసును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడంతో జాయింట్‌ కలెక్టర్‌ను ఎన్నికలకు సంబంధం లేని బాధ్యతను అప్పజెప్పనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 19వ తేదీ వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా రాష్ట్రంలో విడుదల చేయకూడదని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సర్వేలంటే అందరి కంటే ముందు గుర్తొచ్చేది మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో లగడపాటి సర్వేలకు విశేష ఆదరణ ఉండేది. బెట్టింగ్ రాయుళ్లు లగడపాటి సర్వేను ఆధారంగా చేసుకుని వందల కోట్లు బెట్టింగ్ పెట్టేవారు. ఎన్నికల ఫలితాల కాలజ్ఞానిగా లగడపాటిని చాలామంది విశ్వసించేవారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో లగడపాటి అంచనాలు బొక్కబోర్లాపడటంతో ఆయన సర్వే పట్ల విశ్వసనీయత తగ్గింది. అయినప్పటికీ.. ఏపీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సర్వే ఏం చెప్పబోతోందన్న ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు, ఇటు సామాన్య జనంలోనూ నెలకొంది.

lagadapati 15052019

అయితే.. ఫలితాలు వెల్లడించే రోజు సమీపిస్తున్న కొద్దీ పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఓటేసిన ప్రజల్లో కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరో 9 రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐలు కూడా ఫలితాలపై అత్యంత ఆసక్తి కనబరుస్తుండటం విశేషం. ఊర్లలో ఉన్న తమవారికి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న లగడపాటికి సరికొత్త అనుభవం ఎదురైందట. గతంలో పలుమార్లు అమెరికా వెళ్లినప్పటికీ ఇప్పుడు దక్కినంత ఘన స్వాగతం లగడపాటికి ఎన్నడూ దక్కలేదట. ఈ వింత అనుభవం చూసి, లగడపాటికి కూడా షాక్ అయ్యారు. లగడపాటికి ఆతిథ్యం ఇచ్చేందుకు తెలుగు ఎన్‌ఆర్ఐలు పోటీ పడుతున్నారట. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగడపాటి సర్వేలో ఏపీ ఫలితం గురించి ఏం తేలిందనే విషయం తెలుసుకునేందుకు ఎన్‌ఆర్‌ఐలు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారట.

lagadapati 15052019

లగడపాటిని కలిసిన తెలుగు ఎన్‌ఆర్ఐలు అడుగుతున్న తొలి ప్రశ్న.. ఏపీ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందనేనట. ఈ ప్రశ్నకు లగడపాటి సమాధానం చెప్పకపోయినప్పటికీ.. ఎన్‌ఆర్‌ఐలకు లీకులిస్తున్నారట. అభివృద్ధి, సంక్షేమంకు మద్దతుగానే ఏపీ ప్రజలు ఓటు వేశారని ఆయన సమాధానమిచ్చారట. కొన్ని చోట్ల టీడీపీ, మరికొన్ని చోట్ల వైసీపీ హవా సాగుతుందని చెప్పారట. జనసేనకు ఎవరూ ఊహించని విధంగా ఓట్లు పడతాయని లగడపాటి వ్యాఖ్యానించారట. ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించే మే 19నే తన సర్వే ఫలితాలను కూడా వెల్లడిస్తానని లగడపాటి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎన్‌ఆర్‌ఐలు మూడు ప్రధాన వర్గాలుగా విడిపోయి మూడు ప్రధాన పార్టీలకు మద్దతుగా నిలిచారని, వారి పార్టీల ప్రభావం ఎలా ఉందనే విషయం తెలుసుకోవాలని ఆసక్తి కనబర్చారని లగడపాటి చెప్పారు.

టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినీనటులతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా డ్రగ్స్‌ బారిన పడుతున్నారని ఎక్సైజ్‌ అధికారుల దర్యాప్తులో తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అప్పట్లో ఎక్సైజ్‌ శాఖ సిట్‌ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పలువురు సినీ ప్రముఖులను విచారించారు. కానీ, ఆ తర్వాత ఈ కేసు మరుగున పడింది. దీంతో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు. ఆయనకు అందిన సమాచారం ప్రకారం..

sit 14052019 1

డ్రగ్స్‌ కేసులో ఇప్పటి వరకు నాలుగు ఛార్జిషీట్ల దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కేసులు నమోదు చేశామని, సినీనటులు, దర్శకులు సహా 62 మందిని విచారించినట్లు తెలిపారు. పలువురు సినీ హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నటులతో పాటు పలువురు ప్రముఖుల నుండి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన సిట్ అధికారులు వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్‌లో చేర్చలేదని అధికారులు వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 12 కేసులను నమోదు చేసిన సిట్‌ అధికారులు సెలబ్రిటీలకు మాత్రం క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు వెల్లడైంది. అధికారులు దాఖలు చేసిన నాలుగు ఛార్జిషీట్లలో ఒకటి దక్షిణాఫ్రికా పౌరుడు రఫెల్‌ అలెక్స్‌ విక్టర్‌పై ఉంది. ముంబయి నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ తరలిస్తున్నాడని అలెక్స్‌ విక్టర్‌ను ఆగస్టు 2017లో అరెస్టు చేశారు.

sit 14052019 1

మొత్తానికి చూస్తే.. ఈ డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని సిట్ తూతూ మంత్రంగానే చార్జిషీట్ల వేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను నమోదు చేసింది. అయితే దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రెటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసిన నాల్గింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు. క్లీన్‌చిట్ ఇచ్చిన వారిలో ప్రముఖులు వీరే.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, శ్యామ్ కే. నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్, హీరో నవదీప్, నవపాద ధర్మారావ్(చిన్నా), నటి ఛార్మీ కౌర్, నటి ముమైత్ ఖాన్, హీరో రవితేజ, శ్రీనివాస్ (రవితేజ కారు డ్రైవర్), యంగ్ హీరో తనీష్, హీరో నందుతో పాటు పలువురు ప్రముఖులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా చేపట్టిన భారీ రోడ్ షో సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ‘అమిత్ షా గో బ్యాక్’ అంటూ స్లోగన్స్ చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సమయంలో అమిత్‌ షా కాన్వాయ్‌పైకి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కర్రలు, రాళ్లు విసిరారంటూ భాజపా కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు నిప్పు అంటించారు. భాజపా కార్యకర్తల రెచ్చిపోయి ఘర్షణలు చెలరేగేలా చెయ్యటంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. భద్రతా సిబ్బంది సాయంతో ఈ దాడుల నుంచి అమిత్ షా సురక్షితంగా తప్పించుకున్నారు.

kolkata 14052019 1

బీజేపీ కార్యకర్తల దాడిలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రతిమ ధ్వంసమైంది. అమిత్‌ షా ర్యాలీ కోల్‌కతా విశ్వవిద్యాలయం వద్దకు చేరుకోగానే ఈ ఘర్షణలు చెలరేగాయి. కాలేజీ హాస్టల్‌ ను టార్గెట్ చేస్తూ ఆ భవనం ముందు భాజపా కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. హాస్టల్ గేట్లను మూసివేసి, హాస్టల్ బయట ఉన్న సైకిల్స్, మోటార్‌బైక్స్‌ను బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. దీంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. హాస్టల్ బయట ఉన్న చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. టీఎంసీ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయని అమిత్ షా చెప్పారు. మమత ప్రభుత్వం రోడ్ షోను అడ్డుకోవాలని చూసిందని విమర్శించారు.

kolkata 14052019 1

అమిత్ షా విమర్శల పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. అమిత్ షాను గుండా అని అభివర్ణించిన ఆమె.. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రతిమను ధ్వంసం చేసినందుకు నిరసనగా.. గురువారం ర్యాలీ చేపడతానని తెలిపారు. జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి గూండాల్ని రప్పించి అమిత్ షా గొడవలు సృష్టించారని ఆమె విమర్శించారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరిన నేపథ్యంలో తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ- బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు ఇస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సౌత్‌ 24 పరగణాల్లో అమిత్‌ షా ప్రచారం నిర్వహించారు.

Advertisements

Latest Articles

Most Read