ఇటు శాసనసభ ఎన్నికల్లో టీడీపీదే గెలుపు.. అటు లోక్‌సభ సీట్లకు జరిగే ఎన్నికల్లోనూ సైకిల్‌కే ఎక్కువ సీట్లు.. అని న్యూస్‌ ఎక్స్‌ పోల్‌స్ట్రాట్‌ సర్వేలో తేలింది. ఆ సర్వే నివేదిక ప్రకారం.. శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ 2014తో(102) పోలిస్తే 10 సీట్లు కోల్పోయి 92 సీట్లు సాధించనుంది. ఆ పార్టీ ఓటు షేరు 37 శాతంగా ఉండబోతోంది. వైసీపీ 2014తో పోలిస్తే 10 సీట్లు పెంచుకుని 77 సీట్లు సాధించనుంది. ఆ పార్టీ ఓటు షేరు 35 శాతంగా ఉండబోతోంది. అంటే, టీడీపీ-వైసీపీ మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతమే!! గత ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయి మోడువారిన చెట్టులా మారిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ చిగురులు తొడిగే అవకాశం ఉందని.. 13 శాతం ఓటు షేరుతో ఆ పార్టీకి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది.

game 27032019

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో గెలిచాక చెయ్యిచ్చిన బీజేపీకి 9 శాతం ఓట్లు, ఒక సీటు వస్తాయట. న్యూస్‌ ఎక్స్‌ సర్వేలో ఎక్కడా జనసేన పేరు లేదు. అసెంబ్లీ సీట్లలో ఇతరులకు 1 సీటు అని ఇచ్చారు. మరి అది జనసేనకో.. లేక స్వతంత్రులకో చూడాలి. ఎంపీ సీట్ల విషయానికి వస్తే వాటిలో కూడా 40% ఓట్లతో.. 16 సీట్లతో టీడీపీనే ముందుంది. వైసీపీకి 37 శాతం ఓట్లు.. 9 సీట్లు రానున్నాయి. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఎంపీ సీట్లలో 6 శాతం ఓట్లు.. హోదా విషయంలో నమ్మకద్రోహం చేసిన బీజేపీకి 3 శాతం ఓట్లు మాత్రమే రానున్నాయి. రెండు పార్టీలకూ ఎంపీ సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదని సర్వేలో తేలింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉత్తమం అనే ప్రశ్నకు.. 46 శాతం మంది చంద్రబాబుకే ఓటేశారు.

game 27032019

వైసీపీ అధినేత జగన్‌కు 39 శాతం మందే మొగ్గు చూపారు. ఇతరులకు 10 శాతం మంది ఓటేయగా.. 5 శాతం మంది తమకు తెలియదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయనే ప్రశ్నకు.. టీడీపీకి అని 43% మంది సమాధానమిచ్చారు. వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని 37% మంది చెప్పగా.. కాంగ్రె్‌సకు ఎక్కువ సీట్లు వస్తాయని 6% మంది, బీజేపీకి వస్తాయని 7% మంది చెప్పారు. కాగా సీఎం చంద్రబాబు ఈ సర్వే పై స్పందించారు. న్యూస్‌ఎక్స్‌ చానెల్‌ పేర్కొన్న సీట్ల కంటే తమకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా.. సర్వేలో పేర్కొన్న దాని కంటే ఎక్కువే ఉంటుందన్నారు.

ప్రతిపక్ష వైసీపీ ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీవైపే ఉన్నారని అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వై కుంఠం ప్రభాకర్‌ చౌదరి, అనంతపురం ఎంపీ అభ్య ర్థి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించిన సందర్భంగా గురువారం వారు విలేకరులతో కూడా కలిసి మాట్లాడా రు. జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రా ష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి చూ పించారన్నారు. అందుకే ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలకు తెలిసిపోయిందన్నారు.

game 27032019

నగరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రభాకర్‌ చౌదరి, జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి కలిసి గురువారం ప్రచారం నిర్వహించారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ఎంపీ దివాకర్‌రెడ్డికి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినా ఇరువర్గాల మధ్య సఖ్యత కనిపించలేదు. జేసీ వ్యతిరేకించినా అనంతపురం అర్బన్‌ టీడీపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికే ముఖ్యమంత్రి చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి, జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి నగరంలో ఎవరికి వారు ప్రచారం కొనసాగిస్తూ వచ్చారు. తెలుగు తమ్ముళ్లలో ఇది ఒకింత ఆందోళన, ఆవేదన కలిగిస్తూ వచ్చింది.

game 27032019

అయితే ఊహించని విధంగా జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి, ప్రభాకర్‌ చౌదరి కలిసి గురువారం ప్రచారం నిర్వహించడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. నగరంలోని పాతూరులో గురువారం వీరిద్దరూ కలిసి ఒకేచోట ప్రచారం నిర్వహించారు. ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఇద్దరూ కలిసి ముందుకు సాగి మంచి మెజార్టీతో గెలుపొందాలని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్థులు కలిసి ప్రచారం చేయడం తెలుగు తమ్ముళ్లలో ఆనందోత్సాహాలు నింపాయి. పాతూరులోని మాల్దారి వీధి, అంబారువీధి, ఆసార్‌ వీధి ప్రాంతాల్లో వారు కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టి సైకిల్‌ గుర్తుకు ఓట్లేసి తమను గెలిపించాలని ఓటర్లకు వారిరువురూ విజ్ఞప్తి చేశారు.

ముస్లింలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆలూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడారు. మోదీ గెలిస్తే మైనార్టీలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. జగన్‌కి ఓటేస్తే నరేంద్రమోదీకి ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు. మళ్లీ మోదీ వస్తే దేశంలో ముస్లింలకు ఓట్లే లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు. మైనార్టీల కోసం ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ మన ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని ఆరోపించారు. నెత్తిన అప్పుపెట్టి మనల్ని తరిమేశారని విమర్శించారు. జగన్‌, కేసీఆర్‌ ఒకరికొకరు పొగుడుకుంటున్నారన్నారు. జగన్‌కు కేసీఆర్‌ని చూస్తే భయమని చెప్పారు.

game 27032019

కేసీఆర్‌, మోదీకి ఊడిగం చేయడానికి జగన్‌ సిద్ధపడ్డాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే మోదీ మళ్లీ అధికారంలోకి వస్తాడని జగన్‌ అంటున్నాడని తెలిపారు. రాష్ట్రానికి మోదీ నమ్మకద్రోహం చేశారని ఫైరయ్యారు. బీసీల కోసం ప్రత్యేకంగా బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 150 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించారు. ఇకపై ప్రతి ఏడాది డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పొదుపు ఉద్యమం నేర్పించింది తానేనన్నారు. మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. రూ.68 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. పసుపు-కుంకుమ చెక్కులు చెల్లవని వైసీపీ నేతలు నాటకాలు ఆడారని మండిపడ్డారు.

game 27032019

ఈసీ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వొద్దని చెప్పారని గుర్తుచేశారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తుంటే వైసీపీ దొంగలు అడ్డుపడ్డారని ఫైరయ్యారు. మా పొట్ట ఎందుకు కొడుతున్నారని వైసీపీని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ నెలలోనే రైతు రుణమాఫీ 4, 5వ విడతల చెక్కులు ఇస్తామని భరోసా ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ భృతిని రూ.3 వేలకు పెంచుతామన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కూడా ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రుల శక్తికి ఆకాశమే హద్దు అని అభిప్రాయపడ్డారు.

నవ్యాంధ్ర పురోగతిని, జనం సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ తీరు తేటతెల్లమైంది. ఓవైపు టీఆర్‌ఎస్‌, మరోవైపు బీజేపీతో కలిసి.. వైసీపీ నేతలు ఏపీని అష్టదిగ్బంధనం చేశారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అభివృద్ధే ప్రధాన అంశంగా టీడీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. కానీ వైసీపీ మాత్రం రహస్య వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రధానంగా ఎనిమిది దిక్కుల నుంచి ఎనిమిది కోణాల్లో రాష్ట్రంపైనా, అధికారపార్టీపైనా దాడులు చేస్తోంది. టీడీపీని నైతికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

game 27032019

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో తొలిసారి జరుగుతున్న ఎన్నికల సమయంలో తీవ్ర కలకలం రేగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీపై ముప్పేట దాడి కొనసాగుతోంది. నవ్యాంధ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యమంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. అయితే.. ప్రతిపక్ష వైసీపీ మాత్రం.. పొరుగు రాష్ట్ర అధికార పార్టీ, కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతూ రహస్య వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ.. ఎలా వీలైతే అలా.. ఏదో ఒక రూపంలో టీడీపీయే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ముందుగా రూపొందించుకున్న వ్యూహాల ప్రకారమే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకుంటున్నాయన్నది పరిస్థితులను గమనిస్తే స్పష్టమవుతోంది.

 

game 27032019

ఆంధ్రులను కించపరుస్తూ మాట్లాడే టీఆర్‌ఎస్‌, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మకద్రోహం చేసిన బీజేపీతో కలిసి.. ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కుట్రలకు తెరతీశాడని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను చూసి ప్రతి ఒక్కరూ అంచనాకు వస్తున్నారు. ఒక అధికార పార్టీమీద ఈస్థాయిలో టార్గెట్‌ చేసి మరీ పాల్పడుతున్న కుట్రల విషయం ఇప్పటికే అర్థమైపోయింది. జనంలోకి ఈ విషయాలు వెళ్లిపోయాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, అధికార తెలుగుదేశం పార్టీని అష్ట దిగ్బంధనం చేస్తున్న తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇవి ప్రధానంగా జగన్ ఆశలు పెట్టుకున్నవి.. ఐటీ దాడులు, కేంద్రం కుట్రలు, పొరుగురాష్ట్రం నుంచి ఎటాక్‌, ప్రచారంలో ఘర్షణలు, పచ్చ కండువాలతో దాడులు, సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం, కేసులతో భయపెట్టడం, కొత్తదారులు వెతకడం.

Advertisements

Latest Articles

Most Read