వారణాసిలో నిజామాబాద్‌, తమిళనాడుకు చెందిన రైతుల ఆందోళన చేపట్టారు. తమను నామినేషన్‌ వేయకుండా ఎన్నికల కమిషన్ (ఈసీ), పోలీసులు అడ్డుకున్నారని పేర్కొంటూ వారు ఆందోళనకు దిగారు. ఈసీ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు మద్దతిచ్చిన స్థానికులను కూడా బెదిరించారని రైతులు ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర అనే డిమాండ్లతో తమ నిరసనను తెలియజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వారణాసిలో రైతులు పోటీకి సిద్ధమయ్యారు. ఐతే.. వారంతా నామినేషన్లు వేయకూడదనేదే మోదీ సర్కారు లక్ష్యం. వారణాసిలో మోదీ సేన వారికి అడుగడుగునా చుక్కలు చూపిస్తోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పసుపు రైతులను అడ్డుకుంటున్నారు.

nizambada 29042019

నామినేషన్లు వేసేందుకు వారికి ప్రతిపాదకులు లేకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఏకంగా రైతన్నలపై ఇంటెలీజెన్స్‌ బ్యూరో(ఐబీ)ని దింపింది. ఐబీ అధికారులు ఉదయం రైతులు బస చేసిన సిల్క్‌ సిటీ లాడ్జిపై దాడి చేశారు. గదుల్లో దిగినవారి అడ్రస్‌ ప్రూఫ్‌లు ఇవ్వాలని లాడ్జి యజమానిపై ఒత్తిడి తెచ్చారు. గమనించిన రైతులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేశారు.తాము అద్దెకు తీసుకున్న బస్సులో అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించగా.. ‘మీరు బస్సెక్కితే.. బస్సుతోపాటు మిమ్మల్ని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్తాం..’ అని పోలీసులు బెదిరించారు. దీంతో వారంతా పోలీసులకు చిక్కకుండా గ్రూపులుగా విడిపోయి.. ఆటోల్లో సిటీ దాటారు.

nizambada 29042019

చివరికి స్థానిక మీడియా, లాయర్ల సాయంతో అదే లాడ్జికి తిరిగి వచ్చారు. ఇన్ని రోజులు స్థానిక బీజేపీ నేతలతో బెదిరింపులకు గురిచేసినా..మాట వినడం లేదనే అక్కసుతోనే ఆదివారం ఐబీని రంగంలోకి దింపారని రైతులు ఆరోపిస్తున్నారు. మీడియా, లాయర్ల సహకారంతో సోమవారం నామినేషన్లు వేసితీరుతామని రైతులు ప్రకటించారు. ఇవాళ కూడా వారికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. నిజామాబాద్ నుంచి మొత్తం 45 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళితే కేవలం 15 మంది రైతుల నామినేషన్లను మాత్రమే అధికారులు స్వీకరించారు. మిగితా రైతుల నామినేషన్లను అధికారులు స్వీకరించలేదు. తమకు మద్దతిచ్చిన స్థానికులను బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈవీఎంలు, వీవీ ప్యాట్లలో పోలైన ఓట్లలో తేడాలు వస్తున్నాయని న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. అయితే ఈవీఎంలు, వీవీప్యాట్ మెషీన్లలో ఓట్ల మధ్య వ్యత్యాసాలపై దాఖలైన ఫిర్యాదులు తప్పని రుజువైతే దాన్ని నేరంగా పరిగణించి ఆరు నెలల శిక్ష విధిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)ల పనితీరును ప్రశ్నించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్న నిబంధనపై దాఖలైన పిటిషన్‌కు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల మధ్య వ్యత్యాసాలపై వచ్చిన ఫిర్యాదులు నిజం కాదని రుజువైతే దాన్ని నేరంగా పరిగణించరాదంటూ పిటిషనర్ కోరారు.

evm 29042019

ఎన్నికల కోడ్‌లోని నిబంధనల్లో సెక్షన్ 49 ఎంఏ ప్రకారం.. ఈవీఎం లోపాలున్నాయంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి, సదరు ఆరోపణలు తప్పని రుజవైతే ఐపీసీ సెక్షణ్ 177 కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ‘‘తప్పుడు సమాచారం ఇచ్చినందుకు’’ ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఈవీఎంలో ఓటు వేసినప్పుడు ఏదైనా తేడా జరిగినా ఫిర్యాదు చేసేందుకు ఓటరు వెనక్కి తగ్గాల్సి వస్తోందని పిటిషనర్ సునీల్ అహ్యా ధర్మాసననానికి విన్నవించారు. ఎన్నికల కోడ్‌ నిబంధనల్లోని సెక్షన్ 49ఎంఏ ప్రకారం ఈవీఎంలలో లోపాలున్నాయంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి దాన్ని నిరూపించాల్సి ఉంటుంది.

evm 29042019

ఒకవేళ ఆ వ్యక్తి చేసిన ఆరోపణలు తప్పని రుజువైతే ఐపీసీ సెక్షన్ 177 ప్రచారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ఈ నేపథ్యంలో సునీల్ అహ్యా ఈ నిబంధనను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈసీ నిబంధన కారణంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతాయని పిటీషనర్ అభిప్రాయపడ్డరు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లలో తేడా జరిగినా ఓటర్లు ఫిర్యాదు చేసేందుకు ముందుకురారన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ నిబంధన ప్రతిబంధకంగా మారుతుందని అందుకే తొలగించాలని ధర్మాసనాన్ని కోరారు.

ఏపిలో ఇప్ప‌టికే అధికారులు వ‌ర్సెస్ మంత్రులు అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ కీల‌క నియామ‌కాల‌కు గ‌వ‌ర్న‌ర్ బ్రేక్ వేసినట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఏపి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల కోడ్‌కు ముందుగా ఏపిలో స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్ల నియామ‌కానికి సంబంధించి పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌తిపాదించింది. అయితే, ఆ పేర్ల‌ను చూసి గ‌వ‌ర్న‌ర్ ఆమోదించుకుండా పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు ఇది ఏపి ప్ర‌భుత్వంలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏపి ప్ర‌భుత్వ సిఫార్సులు ఇలా.. ఏపిలో స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్ల నియామకానికి సంబంధించి ప్ర‌భుత్వం కొన్ని పేర్ల‌ను ఎంపిక చేసింది. ప్ర‌భుత్వం ఆ పేర్ల‌ను ఆమోదించాలంటూ గ‌వ‌ర్న‌ర్‌కు సిఫార్సు చేసింది.

governor 29042019

అయితే, ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన పేర్ల‌ను చూసి గ‌వ‌ర్న‌ర్ ఈ పేర్లు నేను ఆమోదించను అని చెప్పినట్టు స‌మాచారం. ప్ర‌భుత్వం సిఫార్పు చేసిన వారిలో స‌మాచార హ‌క్కు చ‌ట్టం క‌మిష‌న‌ర్‌గా విజ‌య‌వాడ‌లోని ఒక ఇండస్ట్రియలిస్టు పేరు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌తో పాట‌గా రెవిన్యూ స‌ర్వీసు నుండి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగ సంఘాల నేత‌గా ప‌ని చేసిన ఈ శ్రీరామమూర్డి పేరు ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రి పేర్ల జాబితాను రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌కు పంపించి..ఆమోద ముద్ర వేయాల‌ని అభ్య‌ర్దించింది. అయితే, ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన పేర్ల‌పైన గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం పూర్తి స్థాయి సంతృప్తిగా లేద‌ని స‌మాచారం. ఏపి స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్లుగా ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన వారికి ఆ పోస్టుల‌కు అర్హ‌త లేద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

governor 29042019

గ‌తంలో కిర‌ణ్ కుమార్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అప్పుడు సైతం న‌లుగురు పేర్ల‌తో స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ల పేర్ల‌ను ఆమోదం కోసం ఇదే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వద్ద‌కు పంపారు. అయితే, దానిని గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించారు. అర్హ‌త లేని వారి పేర్ల‌ను సిఫార్సు చేసారంటూ ఫైల్‌ను తిప్పి పంపేసారు. అయితే, పూర్తి వివ‌రాల‌తో అవే పేర్ల‌ను తిరిగి నాటి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి స్వ‌యంగా తీసుకెళ్లి వివ‌రించారు. దాంతో, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అవే పేర్ల‌ను ఆ త‌రువాత ఆమోదించారు. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం పేర్ల‌ను సిఫార్సు చేసినా ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా..గ‌వ‌ర్న‌ర్ ఇప్పుడు ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారు. ఇది ఇలా ఉంటే, సమాచార హక్కు కమిషన్ లను ఎన్నికోవాల్సిన కమిటీలో ప్రతిపక్ష నేత జగన్ కూడా ఉన్నారు. ఏపి ప్రభుత్వం జగన్ ను దాదపుగా 5 సార్లు పిలిచినా, అమరావతి మీద ద్వేషంతో జగన్ ఈ సమావేశాలకు రాలేదు. ప్రతి సారి వాయిదా వెయ్యటంతో, ఒక స్వచ్చంద సంస్థ కోర్ట్ కు వెళ్ళటంతో, ప్రతిపక్ష నేత లేకుండానే, ప్రభుత్వం సమాచార శాఖ కమిషన్ ను ఎంపిక చేసింది. అయితే, ఇప్పుడు గవర్నర్ దీనికి అడ్డుకట్ట వేసారు. ఒక పక్క సిఎస్, మరో పక్క గవర్నర్, మరో పక్క కేంద్రం, ఇంకో పక్క ప్రతిపక్షం, రాష్ట్రంలో పరిపలనే జరగకుండా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు.

రాజకీయ ఆరోపణలు రోజు రోజుకీ దిగజారుతూ ఉండటం చూస్తున్నాం. అయితే ఎమ్మల్యేలు, ఎంపీలు, మంత్రులు లాంటి వాళ్ళు ఇప్పటిదాక హద్దులు దాటుతూ మాట్లాడుతూ ఉండేవారు. కాని ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడటం, బహుసా ఇదే మొదటి సారి అయ్యి ఉంటుంది. మన దేశానికి పట్టిన 'అదృష్టం' మోడీ గారి ద్వారా ఇది మరోసారి రుజువైంది. మొన్నటికి మొన్న నేను బీసీని అని కులం పేరు చెప్పి ఓట్లు అడుక్కున్న మోడి, ఈ రోజు మరింత దిగజారి, మీ ఎమ్మల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, మీ ప్రభుత్వాన్ని లాగేస్తాం అని మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి, ఇలా పబ్లిక్ గా హార్స్ ట్రేడింగ్ చెయ్యటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంత రాజకీయ ఆరోపణలు చేసినా, మరీ ఈ విధంగా, ప్రధాని స్థాయిని దిగజారుస్తు మోడీ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

modi 29042019

మూడేళ్ళ క్రిందట జగన్ మోహన్ రెడ్డి కూడా, ఇలాగే తోడ కొట్టారు. గవర్నర్ ఇంటి ముందు నుంచుని, చంద్రబాబు నీ 21 ఎమ్మెల్యేలు నాతొ టచ్ లో ఉన్నారు, గంటలో నీ ప్రభుత్వం పడిపోతుంది అని వార్నింగ్ ఇచ్చిన మాటలు, ఇంకా ఏపి ప్రజలకు గుర్తున్నాయి. ఇప్పుడు ప్రధాని స్థాయి వ్యక్తి అయిన మోడీ కూడా, జగన్ లాంటి వాడిలా మాట్లాడటం చూస్తుంటే, ఈ దేశం ఎటు పోతుందో అని ప్రజాస్వామ్య వాదులు బాధపడే పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడిన మాటలతో ప్రజలు ఆశ్చర్యపోయారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం.. రాష్ట్రంలోని టీఎంసీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ వదిలి బీజేపీలోకి వస్తారంటూ సంచలన ప్రకటన చేశారు.

modi 29042019

గాల్‌లోని సారంపూర్‌లో ఇవాళ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... ‘‘దీదీ, మే 23న ఫలితాలు వెలువడే రోజు ప్రతిచోటా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని వదిలేస్తారు. ఇవాళ కూడా 40 మంది మీ ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు..’’అని పేర్కొన్నారు. బెంగాల్ సీఎం మమతపై ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు జరిగిన ర్యాలీల్లో మమతను ‘‘స్పీడ్ బ్రేకర్’’ అంటూ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ‘‘పశ్చిమ బెంగాల్‌లోని అభివృద్ధి ప్రాజెక్టులన్నిటీని ఆమె స్పీడ్ బ్రేకర్‌లా అడ్డుకుంటున్నారు..’’అని మోదీ వ్యాఖ్యానించారు. ఇటవల కూచ్ బెహార్‌లో జరిగిన ర్యాలీలోనూ ఆయన మమతపై విమర్శలు సంధించారు. ‘‘భారత్‌కు ఇద్దరు ప్రధానులు’’ కావాలంటున్న వారికి మమత మద్దతు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read