అంతా అనుకున్నట్టే జరుగుతుంది. అంతా భయపడినట్టే, ఒక విష సంస్కృతీ రాజ్యమేలటానికి సిద్ధం అవుతుంది. గ్రామా వాలంటీర్ల వ్యవస్థ అంటూ, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అంటూ చెప్పిన జగన్ ప్రభుత్వం, గ్రామా వాలంటీర్ల అందరినీ, వైసీపీ కార్యకర్తలతో నింపేసింది. వారికి ఎదురు డబ్బులు ఇచ్చి, అఫీషియల్ గా, పార్టీ ప్రమోషన్ కోసం, ఎన్నికల సమయంలో పోల్ మ్యానేజ్మెంట్ కోసం వాడుకునే ఎత్తుగడ దీని వెనుక కనిపిస్తుంది. అయితే పైకి మాత్రం, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అంతా ఎంతో నిజాయతీగా నేలకోపుతున్నాం అని చెప్తున్నారు. దీనికి ఒక పరీక్ష కూడా పెట్టారు. కేవలం పరీక్షలో బాగా రాసిన వారు మాత్రమే, గ్రామ వాలంటీర్గా అవకాసం ఇస్తాం అని ప్రభుత్వం అంటుంది. అయితే, తాజాగా నారా లోకేష్ విడుదల చేసిన ఒక సీక్రెట్ వీడియోలో, విజయసాయి రెడ్డి మాటలు వింటే, ఎంత ప్లాన్ చేసారో అర్ధం అవుతుంది.

vsreddy 12082019 2

నిన్న వైసీపీ సోషల్ మీడియా సమావేశం జరిగింది. పోయిన ఎన్నికల్లో బాగా పని చేసిన వారిని అభినందిస్తూ, ఇప్పుడు ఏమి చెయ్యాలో దిశానిర్దేశం చేసారు. ఈ సమావేశానికి విజయసాయి రెడ్డి వచ్చారు. అయితే కొంత మంది సోషల్ మీడియా కార్యకర్తలు, మాకు గుర్తింపు లేదు అంటూ నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంలో మాట్లాడిన విజయసాయి రెడ్డి, గుర్తింపు లేదు అని ఎందుకు అనుకుంటున్నారు, మిమ్మల్ని అన్ని విధాలుగా చూస్తున్నాం. ఉదాహరణకు, 4 లక్షల గ్రామ వాలంటీర్లు అందరూ మన వాళ్ళనే నియమించాం. అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేం కానీ మనం అనుకున్నది విజయవంతంగా పూర్తి చేసాం. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలన్నీ మన వాళ్ళకే ఇచ్చుకోవడంలో విజయం సాధించాం అని వైకాపా సోషల్ మీడియా మీట్లో చెబుతూ అడ్డంగా దొరికిపోయారు విజయసాయి రెడ్డి.

vsreddy 12082019 3

ఈ సీక్రెట్ వీడియోని లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఇది అతి పెద్ద స్కాంగా, అతి పెద్ద క్విడ్ ప్రోకోగా అభివర్ణించారు. ఇది లోకేష్ ట్వీట్... "YS Jagan Mohan Reddy గారు స్కామ్ స్టార్ అని మరోసారి ఆధారాలతో రుజువైంది. గ్రామ వాలంటీర్ల స్కామ్ తో 12వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకం అని జగన్ గారు ఆస్కార్ రేంజిలో నటిస్తుంటే, కడుపులో దాచుకోలేక వైకాపా స్కామ్ ని దొంగలెక్కల వీరుడు బయటకి కక్కేశారు. వాలంటీర్ల నియామకంలో కులం, మతం చూడలేదు వైకాపా కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూసాం అని స్వయంగా ప్రకటిస్తున్నారు. నాలుగు లక్షల మంది వైకాపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి వారి పొట్ట కొట్టే భారీ కుట్రే వైకాపా వాలంటీర్ల స్కీం." https://www.facebook.com/naralokesh/videos/400753420566355/

ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి గారు, మద్య నిషేధం అంటుంటే, ఏకంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తాగి, గొడవలు చేసి, చంపేసే స్థాయి దాకా వెళ్లి, ఆ మత్తులో జగన్ మోహన్ రెడ్డిని తిట్టే స్థాయికి వచ్చారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దూకుడు గురించి అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే, ఒక విలేఖరిని తిట్టిన ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ప్రెస్ మీట్ లో ప్లే చేసి చూపించారు అంటే, ఎంత భయంకరంగా తిట్టారో అర్ధమవుతుంది. అసెంబ్లీలో కూడా చంద్రబాబుని వేలు చూపిస్తూ, ఖబడ్దార్, ఖబడ్దార్ అంటూ బెదిరించటం కూడా చూసాం. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత మంది గోల చేసినా, పత్రికల్లో, ఛానెల్స్ లో ఇది సరైన పద్దతి కాదని తిట్టినా, ఈయన మాత్రం తగ్గటం లేదు.

kotamreddy 12082019 2

ఇలాంటి ప్రవర్తన తప్పు అంటూ, తన పై వార్తలు రాసిన ఒక పత్రికాధినేత ఇంటికి వెళ్లి కొట్టిన సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఇంటిలోకి వచ్చి, తన పై దాడిచేసి కొట్టారని నెల్లూరులో ఉండే జమీన్‌ రైతు అనే వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌ చెప్పారు. కోటమరెడ్డి, అతని అనుచరులు, ఆయన ఇంటి పై దాడి చేసిన తరువాత, ఆయన మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి, ఎలా వచ్చి దాడి చేసింది మీడియాకు వివరింకాహారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మాగుంట లేవుట్‌లో ఉన్న తన ఇంటికి కోటంరెడ్డి వచ్చారని చెప్పారు. ఆయన ఫుల్ గా మందుతాగి ఉన్నారని, డోలేంద్ర మీడియాకు తెలిపారు. అయన చాలా ఆవేశంతో ఇంట్లోకి వచ్చారని తెలిపారు.

kotamreddy 12082019 3

కోటంరెడ్డి వస్తున్న సమయంలోనే, ఆయన సొంత ఊరికి చెందిన డాక్టర్ వసుంధర, నాతో మాట్లాడి ఇంటి బయటకు వస్తుంటే, ఆమెను కూడా చేయి పట్టుకుని ఆవేశంలో మా ఇంట్లోకి తీసుకువచ్చారని డోలేంద్ర చెప్పారు. ఇక ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి బూతులు మొదలు పెట్టారని అన్నారు. నేను నా పత్రికలో, కోటంరెడ్డి చేస్తున్న దౌర్జన్యాలు రాసానని, దాని కోసం, నన్ను చంపటానికి వచ్చారని అన్నారు. ఏరా నేను అరాచక శక్తిని అంటూ, అర పేజి వార్తా రాసావు, ఇప్పుడు నిన్ను ఇక్కడే చంపేస్తున్నా, మూడు పేజీలు వార్తా రాసుకో అంటూ బెదిరించి, కొట్టాడని అన్నారు. అతని అనుచరులు కూడా కొట్టారని అన్నారు. నేను అధికార పార్టీ ఎమ్మేల్యేను, నన్ను ఎవరూ ఏమి పీకలేరు, ఎస్పీకి చెప్పుకుంటావో, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, నేను జగన్ మాట కూడా వినను, జగన్ కూడా నన్ను ఏమి పీకలేడు అంటూ మద్యం మత్తులో జగన్ పైనే తిట్టారని, డోలేంద్ర చెప్పారు. దీని పై పోలీస్ కేసు పెట్టినట్టు చెప్పారు.

రాజకీయ నాయకులు చాలా మందిని చూస్తూ ఉంటాం, నువ్వు తప్పు చేస్తున్నావ్ అని ఎవరైనా అంటే, నువ్వు వేరే పార్టీ వాడివి, నువ్వు వేరే కులం వాడివి, నువ్వు వేరే రాష్ట్రం వాడివి అంటూ సమాధానం చెప్తారు కాని, విమర్శలు మాత్రం తీసుకోరు. ఇందులో మొదటి వరసులో ఉంటారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరైనా ఏమైనా మాట్లాడితే చాలు, కేసీఆర్ కు ఉన్న బలమైన ఆయుధం బయటకు తీస్తారు. ఒకటి , నువ్వు ఆంధ్రోడి తొత్తువి అంటారు. రెండోది, నువ్వు చంద్రబాబు తోత్తివి అంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కూడా, ఇవే భావోద్వేగాలు రెచ్చగొట్టి, కేసీఆర్ గెలిచారు. తన పాలన పై ఎంత వ్యతిరేకత ఉన్నా, చివర్లో జై తెలంగాణ అంటూ, చంద్రబాబుని నాలుగు తిట్టులు తిట్టి, ప్రజల్లో భావోద్వేగం రేపటంలో సక్సెస్ అయ్యారు.

jp 11082019 2

అయితే, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇక్కడ తన స్నేహితుడు జగన్ మోహన్ రెడ్డి రావటంతో, ఆంధ్రా వాళ్ళను రాజకీయం కోసం వాడుకోవటం మానేసినట్టే కనిపించారు. కాని, మళ్ళీ లోపల ఉన్న కేసీఆర్, మరోసారి బయటకు వచ్చారు. తెలంగాణాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై, మేధావులు అందరూ పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కోసం అయ్యే కరెంటు ఖర్చు, ప్రాజెక్ట్ డిజైన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. అయినా కేసీఆర్ మాత్రం, ఇది ఈ దేశంలోనే ఎవరు చెయ్యలేని గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు. మొన్న వరదలకు, తోడిన నీళ్ళు అన్నీ, రివర్స్ లో మళ్ళీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయం పై జయప్రకాశ్ నారాయణ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కాళేశ్వరం పై మాట్లడారు. దీనికి సంబంధించి స్పందించిన కేసీఆర్, మళ్ళీ పాత బానీలోకి వెళ్ళిపోయారు.

jp 11082019 3

జయప్రకాశ్ నారాయణకు ఏమి తెలుసు ? అతను తెలంగాణా ద్రోహి, తెలంగాణా రాష్ట్రం పై విషం కక్కుతూ ఉండే, ఆంధ్రోడు అంటూ, మళ్ళీ విమర్శలు మొదలు పెట్టారు. అయితే దీని పై అమెరికా పర్యటనలో ఉన్న జయప్రకాశ్ నారాయణ అదే రీతిలో స్పందించారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, ఇలాంటి లాజిక్లు తప్ప, వేరేవి చర్చకు రాకూడదు. ఎవరైనా మనకు చెప్తే, వాళ్ళు చెప్పే విషయం నిజమా కాదా అనేది చూడాలి. ప్రజా సంక్షేమానికి ఎలా ఉపయోగం అనేది ఆలోచించాలి, కాని ఎదుటి వాడు చెప్పే దానికి, మన దగ్గర సమాధానం లేక, వాదన లోపిస్తుందో, అప్పుడు ఎదురు దాడి చేస్తారు. సమాధానం చెప్ప లేక, కోపం తెచ్చుకోవడమో, ఉద్వేగాలు రెచ్చగొట్టి, నీ కులం ఇది, నీ మతం ఇది, నీ ప్రాంతం ఇది అనే అంశాలు తెరమీదకు తెస్తారని కేసీఆర్ కు చురకలు అంటించారు జయప్రకాష్ నారయణ.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చెప్పిన మాట, పొదుపు. అది ఎక్కడ నుంచి మొదలు పెట్టారు అంటే, నేను కేవలం రూపాయి జీతం మాత్రమే తీసుకుంటాను అంటూ మొదలు పెట్టారు. తరువాత, నేను చంద్రబాబు లాగా హిమాలయ వాటర్ తాగను, కేవలం కిన్లేనే తాగుతాను అని చెప్పారు. నిజానికి చంద్రబాబు తన సొంత డబ్బులతో హిమాలయ వాటర్ తెచ్చుకునే వారు. సరే ఇది పక్కన పెడదాం. తరువాత జగన్ మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేవాలం 23 లక్షలే అయ్యింది అంటూ ప్రచారం చేసారు. నిజానికి, ఆ 23 లక్షలు అడ్వాన్స్ అని జీఓలో ఉంది. తరువాత ఎంత ఇచ్చారో, ఆ దేవుడికే తెలియాలి. అయితే ఇవన్నీ ప్రచారం చేస్తూ, నేను పొదుపు చేస్తాను, చంద్రబాబు దుబారా చేశారు అనే ప్రచారం బాగా చేసారు.

sajjala 11082019 2

అయితే వాస్తవంలో మాత్రం, జగన్ గారి పొదుపు ఎక్కడా కనిపించటం లేదు. తన కాన్వాయ్ కోసం దాదపుగా 5 నుంచి 8 కోట్లు ఖర్చు చేసారు. జగన్ మోహన్ రెడ్డి వాడే కారు విలువే కోటికి పైగా ఉంటుంది. మరి ఇది పొదుపు ఎలా అవుతుంది ? తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం జేరెసులాం వెళ్లారు, నా సొంత ఖర్చులు అని చెప్పి, సెక్యూరిటీ ఖర్చుల పేరుతొ 23 లక్షలు తీసుకున్నారు. ఇది పొదుపు అంటారా ? సరే సియం సెక్యూరిటీ అనుకుందాం. మరి ప్రభుత్వంలో ఉన్న చీఫ్ విప్ ల కోసం, వారికి అద్దె నిమిత్తం అని చెప్పి, ఒక్కొక్కరికి లక్ష రూపాయిలు నెలకు అద్దె ఇస్తున్నారు. నిజానికి విజయవాడ, గుంటూరులో ఎంత పెద్ద ఇల్లు అయినా, 30 వేలకు మించి అద్దె ఉండదు. దీనికి ఎలా సమాధానం చెప్తారు ? ఇక తాజాగా విడుదల అయిన జీఓ చూస్తూ, మైండ్ పోతుంది.

sajjala 11082019 3

సాక్షి టీవీలో పని చేసే వారిని, ప్రభుత్వంలోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా, జగన్ బంధువు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉండేవారు. ఇప్పుడు ఆయనకు, ప్రభుత్వంలో, ప్రజాసంబంధాల సలహాదారుడిగా నియమించారు. అయితే ఆయన కోసం విడుదల చేసిన జీఓలో, ఆయన జీతం కేవలం 14 వేలు మాత్రమే ఉంది. కాని ఆయనకు ఇచ్చే అలవెన్స్ లు అన్నీ కలుపుకుంటే, దాదపుగా నెలకు 2 లక్షలు పైగా అవుతుంది. ఇక ఆయనకు సిబ్బందిని ఇచ్చారు, వారి జీతాలు కూడా కలుపుకుంటే, నెలకు 10లక్షలు దాటిపోతుంది. ఇక మరొక సాక్షి ఉద్యోగిని, కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవీడీ క్రిష్ణమోహన్ ని నియమించారు. ఈయన సాక్షిలో బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసేవారు. ఈయనకు కూడా ఇలాగే, జీతం తక్కువ, అలవెన్స్ లు పేరుతో దోపిడీ. మళ్ళీ వీరికి కారు కొనుక్కోమని 10 లక్షలు ఇచ్చారు. కాఫీ కప్పులు కొనుక్కోమని, 1.50 ఇచ్చారు. మరి ఇంత చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి గారు, పొదుపు అంటే ఎలా ? నిజానికి ఈ సలహాదారులు పోస్ట్ లు జగన్ గారు వద్దు అనుకోవచ్చు, వీటి వల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు. చూద్దాం, ఇంకా ఎంత మంది సలహాదారులు వస్తారో, వారికి ఎంత జీతాలు, మనం కట్టే పన్నుల నుంచి ఇవ్వాలో.

Advertisements

Latest Articles

Most Read