అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఈ రోజు పోలీసులు చుక్కలు చూపించారు. పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ జేసీ పై కేసు నమోదు అయ్యింది. దీంతో ఆయాన ముందస్తు కేసుల కోసం, అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే జేసీ దివాకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వకుండా, పోలీసులు దాదాపుగా 7 గంటల పాటు ఆయన్ను స్టేషన్ లోనే ఉంచారు. దీంతో ఆయనకు బెయిల్ ఇవ్వరేమో అని, ఆయన్ను అరెస్ట్ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. దీంతో ఒక్కసారిగా అనంతపురంలో వాతావరణం వేడెక్కింది. పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందుకు చేరుకున్నారు. ఒక కార్యకర్త ఒంటి పై పెట్రోల్ పోసుకోవటంతో, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో, పోలీసులు లాఠీ చార్జ్ చేసి, కార్యకర్తలను చెదర గొట్టారు. అయితే అక్కడ ఉన్న మీడియా పై కూడా పోలీసులు చిందులు తొక్కారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మీడియాకు చెప్పటంతో, మీడియాకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

jc 04012020 2

మరో పక్క టీడీపీ నేతలు పార్థసారథి, రఘునాథరెడ్డి, ఈరన్న, పోలీస్ స్టేషన్ ముందే చాలా సేపు నుంచున్నారు. వారిని లోపలకు పంపలేదు. ఇది ఇలా ఉంటే, 7 గంటలు దాటిన తరువాత జేసీకి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసారు. తరువాత జేసీ మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు 15 ఏళ్ళు చేసాడు, రాజశేఖర్ రెడ్డి 6 ఏళ్ళు చేసాడు కాని, ఎప్పుడూ ఇలా ప్రత్యర్ధులను వేధించలేదని, ఇతడు మాత్రం హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ఈ సంస్కృతీ ఇలాగే కొనసాగితే, డబ్బులు ఇచ్చి ఎన్నికలకు వెళ్తున్నట్టు, ఇది కూడా దేశం అంతా పాకుతుందని, అందుకే వెంటనే ప్రధాని మోడి రంగంలోకి దిగి, అవసరం అయితే, జగన్ ను బర్తరఫ్‌ చేయాలంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు.

jc 04012020 3

కోర్టు బెయిల్‌తో పీఎస్‌కు వెళ్తే, 7 గంటలు లోపల పెట్టుకున్నారని, బీపీ, షుగర్ ఉందని చెప్పినా పోలీసులు వదల్లేదని, మందులు లేకుండా, భోజనం లేకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు. పోలీసు అధికారులపై రిమోట్ శక్తి బాగా పని చేస్తోందని, కాని ప్రతి ఆక్షన్ కు, రియాక్షన్ ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. నేనే బెయిల్ ఆర్డర్ తీసుకుని స్టేషన్ కు వెళ్లానని, అది చూసి పంపేయవచ్చని, కాని, ఇలా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇలాగే ఇంకా ఇంకా ఇబ్బందులు పెడతారని, అందరూ మానసికంగా సిద్ధం కావలని అన్నారు. తనని ఇబ్బంది పెడుతున్నారని, తెలుసుకుని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయుకలు, వచ్చి తనకు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మేల్యే జలీల్ ఖాన్, చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు. పోయిన సారి ఎన్నికల్లో, తన కూతురుకు టికెట్ ఇప్పించారు జలీల్ ఖాన్. అయితే, ఆమె ఓడిపోవటంతో, కొన్నాళ్ళు ఆక్టివ్ గా లేరు. ఆయితే ఆయన పార్టీ మారిపోతున్నారు అంటూ, హడావిడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిన జలీల్ ఖాన్, ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పై, తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అమరావతి విషయంలో, జగన్ మోహన్ రెడ్డి, బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. కళ్ళు ఉన్నవాడు, కడుపుకి అన్నం తింటున్న వాళ్ళు ఎవరైనా, ఇప్పటికే ఉన్న రాజధాని మారుస్తా అంటూ పరుష పదజాలంతో విరుచుకు పడ్డారు. ఎక్కడైనా పరిపాలన అంతా ఒకే దగ్గర నుంచి జరుగుతుందని, జగన్ కు ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టటానికి, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యటానికి వీలు లేదని అన్నారు.

jaleel 04012020 2

అమరావతి కోసం, 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను ఏమి చేద్దామని అనుకుంటున్నారని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి, తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని, తన పతనానికి తానే నాంది పలికారని అన్నారు. అమరావతిలో రైతులు, ఎప్పుడు బయటకు రాని మహిళలు పోరాడుతున్నారని, వారికి అన్ని జిల్లాల రైతులు, మహిళలు అండగా నిలవాలని అన్నారు. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములుతో పాటుగా, అక్కడ అధికంగా ఉన్న క్రిస్టియన్ సంస్థల భూముల పై జగన్ కన్ను పడిందని ఆరోపించారు. అమరావతి మీద రిఫరెండెంకు వెళ్ళాలని, మీ ఎమ్మేల్యేని ఇక్కడ రాజీనామా చెయ్యమనండి, నేను పోటీలో ఉంటా, ఎవరు గెలుస్తారో, ప్రజలు ఎవరి వైపు ఉంటారో, అమరావతి వైపు ఉంటారో లేదో తెలుస్తుందని చాలెంజ్ చేసారు.

jaleel 04012020 3

ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ, ఇప్పుడు ప్రజల నెత్తిన టోపీ పెడుతున్నారని అన్నారు. హై పవర్ కమిటీ అంటే మేధావులు, నిపుణులు ఉంటారు అనుకుంటే, గొర్రెల మందలా మీ మనుషులే ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బోస్టన్ కమిటీ ఒక బోగస్ కమిటీ అని, వారికి అసలు కనీస అవగాహన కూడా మన రాష్ట్రం పై లేదని అన్నారు. మహిళలు, రైతులని ఏడిపిస్తే, దేవుడు చూస్తూ ఊరుకోడని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అంటే ఉద్యోగులు భయపడుతున్నారని, అందుకే వారికి విశాఖ వెళ్ళటం ఇబ్బంది అయినా, ఏమి మాట్లాడటం లేదని అన్నారు. ఇంత తిట్లు తిట్టిన జలీల్ ఖాన్, అమరావతిని ఇక్కడ నుంచి మార్చవద్దని, అమరావతి మార్చకుండా ఉంటే జగన్ కి పాదాభివందనం చేస్తా, నెత్తిన నీరు చల్లు కుంటా నంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.

వై-ఎస్-వివే-క కేసు ఇప్పుడు హైకోర్ట్ లో ఉంది. గతంలో జగన ప్రతిపక్షంలో ఉండగా, ఈ కేసును సిబిఐకు ఇవ్వాలని, గొడవ గొడవ చేసారు. చంద్రబాబు ప్రభుత్వం పై నమ్మకం లేదని, సిబిఐ అయితేనే ఇలాంటి కేసులు తేల్చగలదని, వారు అయితేనే దోషులు ఎవరో బయట పడతారు అంటూ జగన్ గతంలో హడావిడి చేసారు. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ, చంద్రబాబుని ఛాలెంజ్ చేసారు. అయితే అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, ఇది తమ పరిధిలోని అంశం కాదని, కేంద్రాన్ని అడగాలి అంటూ చంద్రబాబు అప్పట్లో కోరారు. అయినా సరే, అది చంద్రబాబే చేపించారు అంటూ, సొంత పత్రికలో కధనాలు కూడా రాసారు. చంద్రబాబు కత్తి పట్టుకుని వస్తున్నట్టు, కధనాలు చూపిస్తూ, మొత్తం చంద్రబాబు మీదకు నెట్టే ప్రయత్నం చేసారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా, ఎవరైనా అలాగే రాద్ధాంతం చేస్తారు, కాని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, గతంలో తాము చెప్పిన మాటలకు కట్టుబడి ఉండకుండా, కాలయాపన చేస్తున్నారు.

viveka 04012020 2

గత ఏడు నెలల నుంచి ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. గతంలోనే మీరు కోరారు కదా, ఇప్పుడు ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటి అంటూ అడుగుతున్నా, ప్రభుత్వం మాత్రం, ఏ మాత్రం స్పందించటం లేదు. గతంలో చంద్రబాబు వేసిన సిట్ కాకుండా, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక సిట్ వేసారు. అదే తెలుస్తుంది అని చెప్పారు. అయితే, ఈ విషయంలో తమను అకారణంగా ఇరికిస్తున్నారని, ఏదో కుట్ర చేస్తున్నారని, ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అని కోరుతూ, మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్‌ రవి, హైకోర్ట్ లో వేరు వేరు కేసులు వేసారు. ఈ కేసుని సిబిఐ చేతే దర్యాప్తు చేపించాలని కోరారు. అప్పుడే సరైన న్యాయం బయటకు వస్తుందని పిటీషన్ వేసారు.

viveka 04012020 3

ఈ పిటీషన్ పై నిన్న హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంలో అప్పట్లో మీరు సిబిఐ ఎంక్వయిరీ కోరారు కదా, ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నారు, సిబిఐకి ఇవ్వండి అంటూ, వస్తున్న ఆరోపణలకు, ప్రభుత్వ తరుపు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం స్పందిస్తూ, గతంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, అందుకే అప్పుడు సిబిఐ ఎంక్వయిరీ అడిగామని, ఇప్పుడు అలాంటివి ఏమి అవసరం లేదని, సిట్ దర్యాప్తు బాగా జరుగుతుంది అంటూ, కోర్ట్ కు చెప్పారు. అయితే ఆదినారయణ రెడ్డి తరుపు లాయర్ స్పందిస్తూ, సిట్ దర్యాప్తు పై పలు అనుమానాలు ఉన్నాయని, అమాయకులని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని, ప్రభుత్వ, డీజీపీ నియంత్రణ లేని సంస్థలతో , ఈ కేసు దర్యాప్తు చెయ్యాలని కోరారు. ఇరు పక్షాల వాదనల విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 8కి వాయిదా వేశారు.

ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ రోజు బోస్టన్ కమిటీ రిపోర్ట్ పై మీడియాతో మాట్లాడారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాల్సి ఉన్నా, బోస్టన్ రిపోర్ట్ రావటంతో, దాని పై విశ్లేషించి మాట్లాడటానికి, ఆగిపోయానని, నిన్న రాత్రి అంతా దీని పై స్టడీ చేసామని చెప్పారు. అయితే ఐఏఎస్ విజయ్ కుమార్ మాత్రం, నిన్న బోస్టన్ రిపోర్ట్ రాగానే, అరగంటలో ప్రెస్ మీట్ పెట్టి, ఇంత పెద్ద రిపోర్ట్ పై బ్రీఫింగ్ ఇచ్చారని చెప్పారు. మాట్లాడితే బోస్టన్ వాళ్ళు మాట్లాడాలని, అలాంటిది విజయ్ కుమార్ మాట్లాడాడు, అరగంటలోనే రిపోర్ట్ అంతా చూసేసి, ప్రెస్ ముందు బ్రీఫింగ్ ఇచ్చాడా ? 14 ఏళ్ళు సియంగా చేసిన నాకే, ఇది స్టడీ చెయ్యటానికి, రాత్రంతా పట్టిందని చంద్రబాబు అన్నారు. ఇక్కడే బోస్టన్ కమిటీ ఒక బోగస్ కమిటీ అని అర్ధమవుతుందని, వీళ్ళు తయారు చేసి, వీళ్ళే చదివారని అన్నారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారు అంటే, " బోస్టన్ కమిటి రిపోర్టుకు తల ఉందా,తోక ఉందా...? ఎప్పుడేశారు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ను..? ఏ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇచ్చారు దానికి..? విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి స్నేహితుడి కంపెనీ ఇది. ఇంతకుముందు ఇలాగే తప్పుడు రిపోర్ట్ లు ఇచ్చినవాళ్లు జైలుకు వెళ్లారు. మీకు కమిటీ వేసే అధికారం ఎక్కడ ఉంది..? డిస్ట్రిబ్యూటెడ్ కేపిటల్ కు రిపోర్ట్ ఇవ్వమని అధికారం ఎక్కడ ఉంది..? "

"నాలుగు అంశాల ప్రాతిపదికన శివరామకృష్ణన్ కమిటి రిపోర్ట్ ఇచ్చింది. భూములు, కనెక్టివిటి, రిస్క్ ప్రాతిపదికన ఇచ్చారు. 4,728మంది అభిప్రాయాలు చెబితే 2,191మంది విజయవాడ-గుంటూరుకు మొగ్గు చూపారు. విశాఖకు 500మంది అనుకూలంగా చెప్పారు. శివరామకృష్ణన్ కమిటి ఇక్కడే అని చెప్పింది. అప్పటి ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకుంది. గ్రీన్ ఫీల్డ్ సిటి డెవలప్ మెంట్ పై బోస్టన్ చెప్పిందంతా తప్పే. 32 పైగా గ్రీన్ ఫీల్డ్ సిటిలు నిర్మిస్తే 2 తప్ప (చైనాలో షెంజెన్, ఇండియాలో నవీ ముంబై) అన్నీ విఫలం అయ్యాయి. మొనార్టో(ఆస్ట్రేలియా): అడిలైడ్ కు 160కిమీ దూరం. నీలాంటి తిక్కలాడే అక్కడ నుంచి ప్రభుత్వం మార్చడం వల్ల అది విఫలం అయ్యింది. బ్లా సిటి ప్రాజెక్ట్(ఓమన్): 2007లో పిపిపి కింద ప్రారంభించింది అది.. షేక్ జయిద్ సిటి(ఈజిప్ట్): గ్రేటర్ కైరో కు అది శాటిలైట్ సిటి. కింగ్ సిటి(ఘనా): మైనింగ్ ప్రాంతంలో అర్బన్ ఎకానమి కోసం పెట్టింది అది. ఇన్నో పోలిస్(రష్యా): టెక్నాలజి కంపెనీలకు ఒక హబ్ గా దానిని తెచ్చారు. దానిని ఫెయిల్ అయ్యింది అంటారు. కిలాంబ(లువాండా): అది సింపుల్ గా అర్బన్ మునిసిపాలిటి-పిపిపి కింద కట్టాలని మొదలెట్టారు. ఎకోట్లాంటిక్(నైజీరియా): సముద్రాన్ని రిక్లయిన్ చేసి అక్కడ ఒక టెక్నాలజి హబ్ చైనీస్ పార్టనర్ షిప్ లో చేద్దామని అనుకున్నారు. అదొక హబ్ మాత్రమే. పెరిగే జనాభా అవసరాలకు తగ్గట్లుగా పెద్దపెద్ద నగరాల శివార్లలో అభివృద్ది చేసిన హబ్ లు, అర్బన్ టౌన్ షిప్ లను గ్రీన్ సిటిలుగా చూపించి అవన్నీ ఫెయిల్ అయ్యాయని చెప్పడాన్ని బట్టే ఈ బిసిజి రిపోర్ట్ చిత్తశుద్ది ఎంతో తెలుస్తోంది."

"ఇప్పటికే రాజధానులున్న దేశాలకు,రాజధాని లేని మన రాష్టానికి పోలికేంటి. రిపోర్ట్ లో పేర్కొన్న 3 దేశాలకు సంబంధించి రాజధానులు ఏవైతే చెప్పారో అవన్నీ ఆల్రడీ ఆ దేశాలకు ఎగ్జిస్టెన్స్ కేపిటళ్లు ఉన్నాయి. మనం మాట్లాడేది రాజధాని లేని రాష్ట్రం గురించి. డొడోమా(టాంజానియా): దారుసలామ్ రాజధాని ఉండగా, సెంట్రల్లీ లొకేటెడ్ గా డొడోమా నగరాన్ని అభివృద్ది చేశారు. జనాభా అంత రాలేదని అనడం పూర్తి గా తప్పు.. పిపిపిలో దానిని అభివృద్ది చేస్తోంది 2,500ఎకరాల్లోనే..అందులో కూడా 7లక్షల జనాభా వచ్చింది. అది వీళ్లు తక్కువగా అంటున్నారు. (మన రాజధాని 34వేల ఎకరాలు...) జయవర్దన్ పురె కొట్టే(శ్రీలంక): శ్రీలంకకు ఆల్రడీ కేపిటల్ ఉంది. చారిత్రకంగా లంక రాజుల భవనాలు, బుద్దిస్ట్ మాన్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి చారిత్రక అంశాల ప్రాతిపదికన కేపిటల్ గా దానిని నోటిఫై చేశారే తప్ప ‘‘అది ఇంకా మున్సిపాలిటీనే. పుత్రజయ(మలేసియా): ఆల్రడీ ఉన్న కేపిటల్ డెవలప్ మెంట్ లో ఉండగా ఇంకొకటి టేకప్ చేశారు. ఇవన్నీ రాజధానులు ఉన్న దేశాలు. మనది రాజధాని లేని రాష్ట్రం. దానికీ దీనికీ పొంతనలేదు."

"అభివృద్ది చెందిన నగరాలతో పోల్చకుండా..సైబరాబాద్ తో, నవీ ముంబైతో పోల్చకుండా విఫలమైన నగరాలు అంటూ అబద్దాల ప్రచారం ఎందుకని చేస్తారు..? 5కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. డబ్బులు వస్తాయని ఏది చెబితే అది రాసిస్తారా..? అదేనా ఒక కన్సల్టెన్సీ చేయాల్సిన పని..? ఏ ఉదాహరణలు మీరు ప్రస్తావిస్తారు..? అభివృద్ది నమూనాలను ఉదాహరణగా తీసుకుంటారా..? విఫల ప్రయోగాలను ఆదర్శంగా తీసుకుంటారా..? రెండవ ప్రపంచ యుద్దం ముందు దేశాల గురించి చెబుతారా..? గతంలో రూ. 2.25లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని అంటారు. మీరు ఈ 5నెలల్లో రూ. 32,250కోట్ల అప్పులు చేశారు. మీకు అప్పులు ఇచ్చేవాళ్లు కూడా లేరు. ఆదాయం ఉంటే ఎవరైనా అప్పులిస్తారు. మీరు ఆ ఆదాయాన్నే లేకుండా చేశారు. అమరావతిపై రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టింది మీకు గుర్తు లేదా.. రైతులకు ఇచ్చిన ఒప్పందం మీకు కనబడలేదా..? మీరేమైనా కబోధులా..? దానిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా..? అది చెప్పాల్సిన బాధ్యత కమిటికి లేదా..? 7నెలల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదా..? అంటే వాళ్లేం అడుగుతారో అదే రాసిస్తారా...? అమరావతికి రూ లక్షా 10వేల కోట్లు అవుతుందని ఎవరు చెప్పారు..? 7నెలల నుంచి మేము ఎలా రన్ చేశాం.? అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు,రాజ్ భవన్, డిజిపి ఆఫీస్, విద్యుత్ కార్యాలయం అన్నీ ఇక్కడే సిధ్దం చేశాం కదా..? ఇంకో చోటకు వెళ్తే పెట్టుబడులు అవసరం లేదా..? ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు సమానదూరంలో అమరావతి ఉంది. గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణలో భూములిచ్చిన రైతులకు ఇక్కడ ప్లాట్లు ఇచ్చాం. ఇప్పుడిలా తరలిస్తే వాళ్లకేం న్యాయం చేస్తారు..?
అమరావతిలో తొలిదశ అభివృద్దికి 55,343కోట్లతో ప్రణాళిక ఇచ్చాం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అభివృద్ది చేయాలని చూస్తే అన్నీ నాశనం చేశారు. "

"ఎందుకు విజయసాయి రెడ్డి విశాఖలోనే మకాం వేశారు.? విజయసాయి రెడ్డిని విశాఖ ఇన్ చార్జ్ గా ఎందుకు వేశారు..? నిజాయితీగా చేసే అధికారులను ఎందుకు మార్చారు..? విశాఖ గయాలి భూములపై వైసిపి నేతలంతా కన్నేశారు. బెదిరించి గత 7నెలలుగా ఆ భూములన్నీ లాక్కున్నారు. బోస్టన్ గ్రూప్ రిపోర్ట్ ఒక చెత్తకాగితం. ఈ నివేదికలో అన్నీ అసత్యాలే, తప్పుల తడకలే.. ఒక వ్యక్తి ఉన్మాదం వల్ల మనం జీవితాంతం బాధ పడాలా..? సామాన్యులకు ఇంత శిక్ష విధిస్తారా..? ఎమర్జెన్సీ అసెంబ్లీ పేరెప్పుడైనా విన్నారా..? రాజ్ భవన్ కు ఇంకేం పేరు పెడతారో..? ఇకనైనా రాజధానిపై ఈ ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలి. ఎన్టీఆర్ మాండలిక వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రజల చెంతకు చేర్చారు. ప్రజల వద్దకే పాలనను టిడిపి చేరువ చేసింది. దానిని మళ్లీ అంతా రివర్స్ చేస్తున్నారు. పరిపాలనతో వికేంద్రీకరణ కాదు. అభివృద్దితో వికేంద్రీకరణ చేయండి. అందులో మీ సత్తా చూపించండి. ముఖ్యమంత్రి వితండ వాదానికి ప్రజలే బుద్ది చెప్పాలి. మన యువతరం ఆశల పందిరి అమరావతి. ఎక్కడికి పోతారు ఉద్యోగాల కోసం మన యువత..? విద్యార్ధులకు ఫీజులు ఎందుకు చెల్లించరు..? స్కాలర్ షిప్ లు ఎందుకు ఇవ్వరు..? అది మీ చేతగాని తనం కాదా..? ఆదాయాలకు గండికొట్టారు. ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని ముంచేశారు.

Advertisements

Latest Articles

Most Read