రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కోసం ఎన్నికల సంఘానికి వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం వైకాపా సానుభూతిపరులు పెట్టినవేనని సిట్‌ దర్యాప్తులో తేలింది. ఓట్లను తొలగించాలని కోరుతూ ఇతరుల పేరిట, వారి పేరిట దురుద్దేశపూరితంగా దరఖాస్తు చేసిన ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ స్థానిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీటిపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి..దరఖాస్తుదారులెవరో తేల్చారు. మొత్తం 376 కేసుల్లో 2,288 మందిని గుర్తించగా..వారిలో 80 శాతం మంది వైకాపా సానుభూతిపరులు, కార్య కర్తలు కాగా, 20 శాతం మంది తెదేపా సానుభూతిపరులు, ఇతరులు ఉన్నారని వెల్లడైంది.

form7 269032019

ఫారం-7లపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన పోలీసు అధికారులకు 85 శాతం మంది దరఖాస్తుదారులు దురుద్దేశ పూరితంగానే పెట్టారని తేల్చారు. వీరిలో కొంతమంది మంచం నుంచి కదలలేని వ్యక్తులు, మృతులు, అసలు ఉనికిలో లేని వారి పేర్లతో..ఓట్లు తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ఎప్పటినుంచో ఒకే చిరునామాలో నివసిస్తున్న వ్యక్తుల పేర్లను తొలగించాలని ఎక్కువ దరఖాస్తులు పెట్టినట్లు తేల్చారు. మోసపూరితంగా దరఖాస్తులు పెట్టిన వారిని స్థానిక పోలీసుస్టేషన్లకు పిలిచి విచారిస్తున్నారు. ఆ దరఖాస్తులు వారే పెట్టారా? లేదా వారి పేరిట ఇతరులు ఎవరైనా పెట్టారా? వారే పెడితే.. ఎందుకు తప్పుడు సమాచారంతో పెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? తదితర అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారిచ్చే వివరణ ఆధారంగా సిట్‌ తదుపరి చర్యలు చేపట్టనుంది.

form7 269032019

ఓట్ల తొలగింపు కోసం జనవరి 11 తర్వాత ఎన్నికల సంఘానికి 12.50 లక్షల ఫారం-7 దరఖాస్తులు అందాయి. వీటిలో దాదాపు 9.50 లక్షల దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలో.. కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే అందాయి. తొలుత ఎన్నికల సంఘం బూత్‌స్థాయి అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించగా...ఎక్కువ శాతం మంది అర్హుల ఓట్లను తొలగించాలని దరఖాస్తులు పెట్టినట్లు తేలింది. మొత్తం పరిశీలన తర్వాత కేవలం 1,41,823 మంది ఓటర్లనే జాబితాలో నుంచి తొలగించేందుకు అర్హమైనవిగా గుర్తించి ఆమేరకు తొలగించారు. మిగతా దరఖాస్తులన్నీ నకిలీవేనని తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అర్హుల ఓట్ల తొలగింపునకు కుట్ర జరిగినట్లు సిట్‌ అనుమానిస్తోంది. క్షేత్ర పరిశీలనలో కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పరిశీలించినప్పుడు ఆ దిశగా వారికి కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ప్రతిచోటా వేల సంఖ్యల్లో ఓట్లు తొలగించాలని దరఖాస్తులు అందగా...అందులో 95 శాతానికి పైగా అర్హుల పేర్లే ఉన్నాయి. అర్హుల పేర్లను జాబితా నుంచి గల్లంతు చేయించాలనే దురుద్దేశంతోనే ఇలా దరఖాస్తులు పెట్టినట్లు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మూలగుంటపాడులో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోసాని, చిన్నికృష్ణ వంటి సినీ ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. "నిన్న పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. వైసీపీతో పొత్తుపెట్టుకోమంటూ తనపై ఒత్తిడి తెచ్చారని పవన్ తెలిపారు. ఆయనపైనే కాదు, ఇంకొందరిపైనా ఒత్తిళ్లు వస్తున్నాయి. కొందరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. మీరు అక్కడే బతకండి, మాకేమీ బాధలేదు. మీరు అక్కడ బతకడం కోసం మాపై ఆరోపణలు చేయొద్దు, మమ్మల్ని వేధించొద్దు. మా బతుకుల్లో చిచ్చుపెట్టొద్దని వేడుకుంటున్నా. ఎంతోమంది విదేశాల్లో ఉన్నారు, మాకేం బాధలేదు. వారికి ఏదైనా సమస్య వస్తే ఆదుకుంటాం. కానీ కేసీఆర్ కు భయపడి, మీరొచ్చి ఇక్కడ అడ్డుపుల్లలు వేస్తూ మా బతుకుల్లో చిచ్చు పెడితేమాత్రం తన, మన చూసుకునేది లేదు" అంటూ చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు

posani 26032019

"రాష్ట్రం అభివృద్ది జరుగుతున్న తీరు చూసి భరించలేక జగన్ తో కలిసి కుట్రలు పన్నుతున్నారు. మరో పదేళ్లలో తెలంగాణ కంటే మించిపోతామని భయపడిపోయి పిరికితనంతో మనపై దాడులు చేస్తున్నారు, పోలవరం వద్దనడానికి కేసీఆర్ ఎవరు? పోలవరం మన హక్కు" అంటూ మండిపడ్డారు. "ఈ గడ్డపై పుట్టిన ఏ వ్యక్తి అయినా, ఈ గడ్డ గాలి పీల్చిన ఏ వ్యక్తయినా, ఈ గడ్డపై నీళ్లు తాగిన ఏ వ్యక్తయినా, ఈ ప్రాంతాభివృద్ధి కోసమే ఆలోచించాలి. అలా కాకుండా లోటస్ పాండ్ లో కూర్చుని కేసీఆర్ కు కాల్మొక్తా నీ బాంచన్ అంటే వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నా. ఆంధ్రా వాళ్ల పెత్తనం వద్దని అన్న పెద్దమనిషి మాపై ఎందుకు పెత్తనం చేయాలి?" అంటూ నిప్పులు చెరిగారు.

posani 26032019

పోలవరం వద్దనడానికి కేసీఆర్‌ ఎవరు? అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్‌ పెత్తనాన్ని మీరు ఒప్పుకుంటారా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ ఏపీకి అన్యాయం చేస్తున్నారు. మీ రక్తం ఉడుకుతుందా లేదా?.. కేసీఆర్‌పై కోపం ఉందా లేదా?. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్‌..దేనికైనా సిద్ధమే. రాజధాని కోసం ఒక్క పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. కేసీఆర్‌ కనీసం 20 ఎకరాలు కూడా తీసుకోలేకపోయారు. రాజకీయాలు ఎంతగా కంపు కొడుతున్నాయంటే భర్త ఒక పార్టీ..భార్య మరో పార్టీలో ఉన్నారు. ముసుగు రాజకీయాలు వద్దు. ఇక్కడ ఫ్యాన్‌.. హైదరాబాద్‌లో స్విచ్..కరెంట్‌ ఢిల్లీలోఉంది. ఈ గడ్డపై పుట్టిన వాళ్లు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించాలి. జగన్‌ లోటస్‌పాండ్‌లో కూర్చొని బాంచన్‌ కాల్మొక్తా అంటున్నారు. ఎవరీ కేసీఆర్‌.. తెలంగాణ పెత్తనం మనకు కావాలా?. మనకు రోషం..ప్రతిష్ట..ఆత్మగౌరవం లేవా?. తెలంగాణలో ఉన్న ఐక్యమత్యం.. మన దగ్గర లేదా?.’’ అని అన్నారు.

నిన్న కేఏ పాల్ నామినేషన్ చెల్లదు అంటూ, వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రోజు మాత్రం, అందరికీ షాక్ ఇస్తూ ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. కేఏ పాల్‌ నరసాపురం పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు నిన్న ఆయన ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్‌ అధికారి నిరాకరించిన విషయం తెలిసిందే. మంగళవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) చేపట్టారు. పత్రాలు అన్నీ సరిగా ఉన్నందున నర్సాపురం లోక్‌సభతో పాటు అసెంబ్లీ స్థానానికి పాల్‌ వేసిన నామినేషన్‌కు అధికారులు ఆమోదం తెలిపారు.

paul 26032019

అయితే తన నామినేషన్‌ను తిరస్కరించేలా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కుట్ర పన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. జగన్‌కి ఓటేస్తే అవినీతిని సమర్థించినట్లేనని ఆయన అన్నారు. పవన్‌కు ఓటేస్తే గ్లాసు పగిలిపోయినట్లేనని, అసలు ఆయనకు ప్రజాసేవ చేసే ఉద్దేశ్యమే లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనను గెలిపిస్తే ఏడాదిలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని అమెరికాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. సోమవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియడంతో మంగళవారం నుంచి పరిశీలన మొదలైంది. మార్చి 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నామినేషన్ల చివరి తేదీ నాటికి ఏపీలో మొత్తం 3245 నామినేషన్లు అసెంబ్లీకి, 472 నామినేషన్లు లోక్‌సభకు దాఖలయ్యాయి. వీటిల్లో అధికారులు ఎన్నింటికి ఆమోద ముద్ర వేస్తారన్నది చూడాలి.

‘మీరంతా సైకిల్ గుర్తుకు ఓటేయండి.. మీరంతా చంద్రబాబును గెలిపించాలి..’ అని ఆయన అనగానే.. అంతా అవాక్కయ్యారు. ఇదేంటా.. ఆయన ఇలా అంటున్నారేంటా..? అని కార్యకర్తలంతా ఖంగుతిన్నారు.. దీంట్లో తప్పేముందని అనుకుంటున్నారా..? ఇదే వ్యాఖ్యలను టీడీపీ అభ్యర్థి చెబితే తప్పు లేదు కానీ.. ఓ వైసీసీ అభ్యర్థి చెబితే.. కొంపకొల్లేరయినట్లే.. ఆదివారం ప్రచారపర్వంలో ఇదే జరిగింది. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో మైలవరం నియోజక వర్గం నుంచి రాష్ట్ర మంత్రి ఉమాకు పోటీగా నిలిచిన వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ వైసీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రచారాన్ని ఉధృతం చేశారు.

vasantah 26032019

ఈ క్రమంలోనే సోమవారం జి.కొండూరు మండలం కవులూరులో నవరత్నాలు, గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ‘సైకిల్‌ గుర్తుకు, చంద్రబాబుకు ఓటు వేయండి’ అంటూ ప్రజలను అభ్యర్థించడంతో అక్కడ పార్టీ నాయకులంతా అవాక్కయ్యారు. అక్కడున్న వైసీపీ నేతలు నిర్ఘాంత పోయారు. చాటుగా గమనించిన టీడీపీ మద్దతుదారులు చప్పట్లు కొట్టారు. దీంతో నాలుక కర్చుకొని కేపీ తప్పయింది. వైసీపీకి, ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి అని మాట మార్చారు. ఈపరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇది ఇలా ఉంటే, రెండు రోజుల క్రిందట నగిరిలో రోజాని, అక్కడ ప్రజలు నిలదీసిన సంగతి తెలిసిందే.

 

vasantah 26032019

ఇక మరో పక్క, ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైకాపా ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అనటంతో వేదికపై ఉన్న వారందరూ ఖంగుతిన్నారు. విశాఖ మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో ఎన్నికల సందర్భంగా ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకిల్‌ గుర్తుకు ఓటెయాలని పేర్కొన్నారు. వేదిక మీద ఉన్న వారు అప్రమత్తం చేయటంతో ఆయన వెంటనే సర్దుకొని ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేయాలని సరిదిద్దుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read