వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావదం ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టించింది. ఎన్నికలకు షెడ్యూల్ కూడ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాజకీయగా తమకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గాను టీడీపీ కూడ వైసీపీపై వ్యూహత్మకంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన టీఆర్ఎస్తో జగన్ జత కడుతున్నారంటూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమౌతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వేలు పెట్టినందుకు గాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ గిఫ్ట్ తీసుకొనేందుకు తాను సిద్దంగా కూడ ఉన్నానని బాబు కూడ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కేసీఆర్ టచ్‌లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే చలా కాలంగా టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న వైఎస్ జగన్‌తో హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. జగన్ తో కేసీఆర్ కూడ త్వరలోనే సమావేశం కానున్నారు. ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్తో వైసీపీ జతకట్టడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. ఇదే విషయాన్ని ప్రజల్లో ప్రచార అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమైంది. ఏపీ ప్రజలకు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలను టీడీపీ నేతలు ఎత్తిచూపుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 2017లో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడ టీడీపీ విడుదల చేసింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ కుమ్మక్కైందని కూడ టీడీపీ ఆరోపణలు చేసింది. పోలవరం ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకొనేందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ సభ్యులు అడ్డుకొన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకుండా టీఆర్ఎస్ అడ్డుపడుతున్నా ఈ విషయాలపై వైసీపీ ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని టీడీపీ ప్రస్తావిస్తోంది. విద్యుత్ ఉద్యోగుల విభజన, ఏపీ రాష్ట్రం ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఉపయోగించుకొని డబ్బులివ్వమని తెలంగాణ చేతులు ఎత్తేసిందని మంత్రి దేవినేని ఉమ మహేశ్వర్ రావు గుర్తు చేశారు. కేటీఆర్ తో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని జగన్ ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అయితే తెలుగుదేశం దూకుడు చూసి, జగన్ మోహన్ రెడ్డి రాత్రికి రాత్రి ప్లాన్ మార్చారని తెలుస్తుంది. ఇంతే దూకుడుగా, చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పై చేసిన విమర్శలతో ప్రచారం చెయ్యాలని, చంద్రబాబు చేసింది కరెక్ట్ అయినప్పుడు, మనం చేసిందీ కరెక్ట్ అనే అభిప్రాయం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు చెప్పారు. అయితే చంద్రబాబు, కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ విమర్శలే చేసుకునే వారు, కాని కేసీఆర్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, తన రాజకీయ పునాది, ఆంధ్రా ప్రాంతం పై, రాష్ట్రం పై ద్వేషంతో, హేళనతోనే చేస్తాడు, ఇది ఆంధ్రా ప్రజలకు బాగా గుర్తుంది. జగన్, ఈ లాజిక్ మర్చిపోయారు.