అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో మోదీ ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు సిద్ధమయింది. హిందీ బెల్ట్ ఐన మూడు రాష్ట్రాల్లో, బలం ఉంది అనుకున్న చోట, ఎక్కువుగా ఎంపీ సీట్లు వచ్చి, విజయం సునాయాసంగా అవుతుంది అనుకున్న చోట, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది బీజేపీ. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ, ఇటు పార్టీ పరంగా, అటు ప్రభుత్వ పరంగా కూడా తీసుకోవాల్సిన నష్ట నివారణ చర్యల పై, సమాలోచనలు జరుగుతుంది. ఇందులో భాగంగా, దేశ బద్రత కోసం వినియోగించాల్సిన వ్యవస్థని, రాజేకాయం కోసం వాడుతున్నారు. అధికారంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ చేసే పనే ఇదైనా, మేము ఇలాంటివి చెయ్యం అని చెప్పే బీజేపీ, ఇలా వ్యవస్థలని తన రాజకీయం కోసం వినియోగిస్తుంది.

intelligence 29122018

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి సాక్షాత్తూ ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) సేవలను ఉపయోగించుకోనుంది. దేశవ్యాప్తంగా ఓటర్ల మనోభావాలు తెలుసుకొని జనవరిలోగా నివేదిక సమర్పించాలని ఐబీని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదేశించింది. దేశాన్ని అయిదు జోన్లు...దక్షిణ, ఉత్తర, తూర్పు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాలుగా విభజించి సమాచారాన్ని సేకరించాలని సూచించింది. 2019 ఎన్నికల్లో ప్రజలకు నచ్చే పార్టీ ఏదన్నది ప్రధాన ప్రశ్నగా ఉంటుంది. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ గురించి, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురించి, అలాగే కూటముల గురించి కూడా ప్రజల అభిప్రాయలు తీసుకుంటుంది.

intelligence 29122018

మోదీ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏది? పరిష్కార మార్గం ఏమిటి? ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారన్నవి ఇతర ప్రశ్నలుగా ఉంటాయి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనా ఐబీ నివేదికలు ఇచ్చింది. రాజస్థాన్‌లో ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో రైతులు, నిరుద్యోగ యువత ఆగ్రహంతో ఉన్నారని పేర్కొంది. అయితే ఈ సమస్యల కారణంగానే ప్రభుత్వాలు పడిపోతాయని ఐబీ స్పష్టంగా చెప్పలేదని, బీజేపీ పై దేశ వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత కూడా, ఈ అంశాలకు తోడయ్యి, బీజేపీ బలంగా ఉన్న చోట ఓడిపోవాల్సి వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఐబి, ఏ నివేదిక ఇస్తుంది ? ఈ మూడు నాలుగు నెలల్లో, బీజేపీ తన పంధా మార్చుకునే అవకాసం ఎంత వరకు ఉంటుంది అనేది చూడాలి.

మాది ధనిక రాష్ట్రం, మాకు ఆంధ్రప్రదేశ్ తో పోలిక ఏంటి అంటూ డాంబికాలు పోయిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, మన ఆంధ్రప్రదేశ్ కరెంటు వాడుకుని, మనకి బాకీ ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు... మానకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, బిల్డ్ అప్ ఇస్తూ, బయట తిరుగుతూ, ఫోజులు కొడుతున్న సంగతి తెలిసిందే... దేశంలోనే రిచ్ స్టేట్ అని డబ్బా కొట్టుకుంటూ, మన సొమ్ము ఇప్పటికీ లాక్కుని బ్రతుకుతున్న తెలంగాణా సంస్థ పై దూకుడుగా ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా దూకుడుగా ఉండాలి అనుకున్నారో, చంద్రబాబు ఈ మధ్య అలాగే ఉంటున్నారు..

kcr 29122018 2

విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ఇంకా ఏపీకి రూ.5,000 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కరెంట్ అన్నది ఫ్రీగా రాదని, ఆ బాకీని తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోతే న్యాయపరంగా వెళతామని బాబు హెచ్చరించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన ప్రజావేదికలో భాగంగా ‘విద్యుత్-మౌలిక రంగాల్లో అభివృద్ధి’పై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణా విద్యుత్ బకాయల పై స్పందించారు. ఇప్పటికే ఈ విషయం పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా ఏపి ప్రభుత్వం కేసు వేసింది.

kcr 29122018 3

తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)ల నుంచి రూ.5732.40 కోట్లు బకాయి రాబట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్పత్తి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ జెన్‌కో) , ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు వేసింది. నోటీసులిచ్చినా తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు స్పందించలేదని.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ల దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో ఏపీ జెన్‌కో వేర్వేరుగా రెండు దరఖాస్తులు దాఖలు చేసింది. అయితే అక్కడ కేసు నడుస్తూ ఉండగానే, ఇప్పుడు చంద్రబాబు, కోర్ట్ కి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం చోద్యం చూస్తుంది.

రాజధాని అమరావతి నిర్మాణం ప్రపంచానికే తలమానికం కానుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తోందని సందర్శకులు కొనియాడారు. రాజధాని అమరావతి సందర్శనకు ఏపీ సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది. శుక్రవారం కర్నూలు జిల్లా సంజామల మండలం, విజయనగరం జిల్లా కురుపాం మండలం, చిత్తూరు జిల్లా శాంతిపురం, రామకుప్పం మండలం, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలాల నుంచి ప్రజలు బస్సుల్లో అమరావతి సందర్శనకు తరలి వచ్చారు. వారు తొలుత రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయునిపాలెం సందర్శించారు

kurnool 29122018 2

అనంతరం సీడ్‌యాక్సెస్‌ రహదారి మీదుగా మందడం వెళ్లి అక్కడ పేదలకు ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న భవనాలు తిలకించారు. ఆపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలు, తాత్కాలిక హైకోర్టును సందర్శించారు. తదుపరి తాత్కాలిక సచివాలయ భవనాలు, విట్‌(ఏపీ)విశ్వవిద్యాలయం చూశారు. ఆ తర్వాత విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ఏపీ సీఆర్‌డీఏ ఓఎస్‌డీ అన్నే సుధీర్‌బాబు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అయితే అమరావతిలో ఇంత పని జరుగుతుందనే విషయం తెలియదని, వార్తల్లో ఇవన్నీ చూపించటం లేదని, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ లు, ఇక్కడే జరిగే పనులు చూస్తుంటే చంద్రబాబు చెప్పే మాటలు నిజమే అనే నమ్ముతున్నామని అన్నారు.

kurnool 29122018 3

మా ఊరికి వెళ్లి, అందరినీ అమరావతి చూసి రమ్మని చెప్తామని అంటున్నారు. కొన్ని పార్టీలు అసలు అక్కడ ఏమి లేవు, భ్రమరావతి, గ్రాఫిక్స్ అంటుంటే, చంద్రబాబు ప్రజలను అక్కడకు తీసుకువెళ్ళి అక్కడ జరుగుతుంది చూపిస్తున్నారని అంటున్నారు. పోలవరం యాత్ర లాగే, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు చూపించంటానికి, అద్భుతమైన రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చెయ్యటానికి, అమరావతి యాత్ర కూడా మొదలు పెట్టారు. ఈనెల 27 నుండి, ప్రతిరోజు ఒక మండలం చొప్పున, అన్ని జిల్లాల నుంచి, అమరావతి సందర్శన యాత్రకు ఉచిత బస్సులు పెట్టారు. ముఖ్యంగా, సీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు, అమరావతిలో భాగస్వామ్యం చేస్తూ, వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఏపి అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కూడా.. అలాంటి ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే, మిగిలిన వారు ఇబ్బంది పెడుతున్నారు..... పోలవరం విషయంలో, కేంద్రం ఇబ్బంది పెట్టిన సంగతి చూశాం... అమరావతి విషయంలో, కొంత మంది అదృశ్య శక్తులు ఆపటానికి చూస్తున్నారు... అమరావతిని అడ్డుకోవటమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న కొంత మంది, రాజధాని నిర్మాణం కోసం లోన్ ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, లోన్ ఇవ్వద్దు అంటూ, లేఖలు రాసిన సంగతి తెలిసిందే.. ఈ విషయం పై పలు మార్లు వాళ్ళు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడటం, మరోసారి ఎవరో ఒకరు లేఖలు రాయటం, మళ్ళీ వాళ్ళు రావటం, నిబంధనలు అడ్డుగా పెట్టి వైసీపీ ఇలా రెచ్చిపోతుంది.

amaravati 29122018 1

అయితే ఈ అభ్యంతరాల పై చివరి సారిగా, అక్టోబర్ నెలలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు, వచ్చి క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వెళ్లారు. రుణం అందజేయాలని భావిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలనూ మరింత కూలంకషంగా పరిశీలించి వెళ్లారు. సీఆర్డీయే రుణం కోరిన ప్రాజెక్టుల వల్ల ప్రభావితులవబోయే వివిధ వర్గాలకు కల్పిస్తున్న పునరావాస, సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనా మార్గాలతోపాటు ఆయా ప్రాజెక్టుల పరిసరాల్లోని పర్యావరణంపై అవి చూపబోయే ప్రభావం వంటి అంశాలను పరిశీలించారు. ఈ పర్యటన తరువాత, తాజాగా వరల్డ్ బ్యాంక్, అమరావతికి రుణం ఇవ్వటానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఈ విషయం పై ఇప్పటికే సీఆర్డీఏ అధికారులకు సమాచారం వచ్చింది.

amaravati 29122018 1

మరి కొన్ని ఫార్మాలిటీలు పూర్తీ చేసి, అక్కడ క్రిస్మస్ సెలవలు అవ్వగానే, ఈ విషయం పై అధికారిక ప్రకటన విడుదల కానుందని తెలుస్తుంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం రాకుండా, దొంగ ఈ-మెయిల్స్ పంపి, మా వివరాలు బయటకు చెప్పద్దు అన్న సైకో బ్యాచ్ కి ఇది చేదు వార్త... కుట్రలు అన్నీ విఫలం అయ్యాయి. రాజధాని వ్యతిరేక శక్తులు ఎవడైనా సరే !! గుర్తు పెట్టుకోండి, అమరావతి లో ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూసే రాజధాని కట్టుకుంటాం !! ఇది ఐదు కొట్ల మంది ఆంద్రుల కల !! ఎవడో ఒకడు వచ్చి దానికి అడ్డం పడాలంటే ఆగేది కాదు, దాన్ని ఆపే శక్తి ప్రపంచంలో ఎవ్వడికీ లేదు. ప్రపంచం మొత్తం ఎదురుతిరిగినా అక్కడ రాజధాని వస్తుంది. వచ్చి తీరుతుంది. అడ్దంకులు సృష్టించేవారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. ఆంధ్రుల పదఘట్టనల కింద మీలాంటి వాళ్లు నలిగిపోతారు. గుర్తు పెట్టుకోండి, అది ప్రజల రాజధాని, ప్రజల కోసం ప్రజలు తమ భూములు ఇచ్చి మరీ నిర్మించుకుంటున్న ప్రజా రాజధాని, అక్కడ ప్రతి మట్టి రేణువులో ఆంధ్రుల సంకల్పం ఉంది . అక్కడ పెట్టే ప్రతి ఇటుక లో ఆంధ్రుల భవిష్యత్తు ఉంది. మా భవిష్యత్తు కోసం మేము కట్టుకుంటున్న మా రాజధాని.

Advertisements

Latest Articles

Most Read