వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో బెర్త్‌ ఆశించిన వైకాపా ఎమ్మెల్యేలు శనివారం రాజధాని అమరావతిలో జరిగిన మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్స వానికి మొహం చాటేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ యాంశంగా మారింది. ప్రధానంగా సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులే అధికంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 30 మందికి పైగా శాసనసభ్యులు గైర్హాజరు అయినట్లు అంచనా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యులు గైర్హాజరు కావడంపై నిఘా వర్గాలు ముందుగా పసిగట్టలేకపోయాయనే వార్తలు వినవస్తున్నాయి. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు అయిన అసంతృప్త నేతలను వైకాపా అధిష్టానం బుజ్జగించే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కేబినెట్‌లో బెర్త్‌ ఆశించి భంగపడ్డ నేతలతో మాట్లాడే కార్యక్రమం మొదలైనట్లు సమాచారం. జిల్లాల వారీగా అసంతృప్త నేతలతో చర్చించి వారి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకుంటున్నట్లు వినికిడి.

27 days

మంత్రి పదవులను ఆశించి భంగపడ్డ వారికి కేబినెట్‌ ర్యాంకు పదవులు కట్టబెట్టి సంతృప్తి పరచాలని నిర్ణయించినట్లు సమాచారం. కొందరు అసంతృప్తి నేతలను గుర్తించిన అధిష్టానం దిద్దుబాటు చర్యల్లో భాగంగా శ్రీకాంత్‌ రెడ్డి చీఫ్‌ విప్‌ పదవితో పాటు మరో నలుగురికి ప్రభుత్వ విప్‌ పదవులను కట్టబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన వారికి కూడా కేబినెట్‌ హోదా గల పదవులు త్వరలోనే కట్టబెట్టనున్నట్లు సమాచారం. మొత్తం మీద మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే మంత్రి పదవులు ఆశించి భంగపడిన భూమన కరుణాకరరెడ్డి, అనంత వెంక ట్రామిరెడ్డి, అంబటి రాంబాబు, సామినేని ఉదయ భాను, ఆర్‌కే రోజా, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మర్రి రాజశేఖర్‌ వంటి సీనియర్లను నామినేటెడ్‌ పదవుల్లో కూర్చబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలంతా విజయవాడలో హోటళ్లు, అద్దె గృహాలలో అనుచరులతో మకాం వేశారు. సాయంత్రానికల్లా తమకు పిలుపు వస్తుందని ఎదురుచూశారు. అయితే వారి ఆశలను నిరాశలుగా మారుస్తూ పిలుపురాకపోవడంతో అసంతృప్తి చెందిన నేతలు కొందరు విజయవాడ నుంచి వెనుతిరగగా మరికొందరు విజయవాడలోనే ఉండి మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవానికి మొహం చాటేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

27 days

ప్రమాణస్వీకారానికి గైర్హాజరు అయిన వారిని వాకబు చేయగా కొందరు తమ వ్యక్తిగత కారణాల వలన హాజరు కాలేకపోయామని సమాధానమిచ్చారు. మరికొందరు అందుబాటులోకి రాకుండా ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేశారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి అధికారపక్ష శాసనసభ్యులు డుమ్మా కొట్టడాన్ని నిఘా వర్గాలు పసిగట్టలేకపోయారనే వార్తలు వినవస్తున్నాయి. సమర్ధుడైన ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ స్టీఫెన్‌ రవీంద్రకు ఈ విషయం సవాలుగా మారింది. సాధారణంగా ఇలాంటి సమయంలో అధికార, ప్రతిపక్షాల శాసనసభ్యుల కదలికలపై నిఘా వర్గాల నిఘా ఉంటుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పార్టీ, ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తుంటారు. నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి పార్టీ, ప్రభుత్వ పెద్దలు అప్రమత్తులై సమస్యను చక్కదిద్దడం పరిపాటి. అయితే ఇక్కడ నిఘా వర్గాల సమాచార లోపంతో అసంతృప్తుల గైర్హాజరును ముందుగానే పసిగట్టలేకపోయారనే వార్తలు వినవస్తున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి ఈ సమాచారం ముందుగా తెలిస్తే అప్రమత్తులై రంగంలోకి దిగి సమస్యను చక్కదిద్దే అవకాశం ఉండేదని భావిస్తున్నారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా, 29 సార్లు మోడీ చుట్టూ తిరిగారు. విభజన చట్టంలో ఉన్న హామీలు అన్నీ నెరవేర్చలాని, అడుగుతూనే ఉన్నారు. చివరి సంవత్సరంన్నర కాలంలో పోరాటాలు కూడా చేసారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మాత్రం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెడలు వంచి సాధిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కూడా. మొదటి ప్రెస్ మీట్ లో సర్, ప్లీజ్ సర్ ప్లీజ్ అనే మాటలు విన్నాం. నిన్న తిరుమలలో మెడలు వంచకుండా, నడుము వంచటం చూసాం. రాష్ట్రానికి ఏమేమి రావాలో, జగన్ మోడీకి విన్నవించారు. అయితే అప్పట్లో 29 సార్లు చంద్రబాబు ఏదైతే అడిగారో, ఇప్పుడు జగన్ కూడా అదే మోడీని అడిగారు. మరి అప్పట్లో చంద్రబాబు పై చేసిన విమర్శలు సంగతి ఏంటి . మరి ఆ నాటి విమర్శలు ఇప్పుడు గుర్తుకు లేదా ?

27 days

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఈవిధంగా ఉందంటూ సీఎం ప్రధాని మోడీకి ఓ వినతిపత్రం ఇస్తామని అనుకున్నప్పటికీ అయితే ఆ వివరాలను లెక్కల రూపంలో ప్రధాని పర్యటనలో క్షుణ్ణంగా వివరించినట్లు సమాచారం. ఏపిీకి రూ. 74,169 కోట్లు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జగన్మోహన్‌రెడ్డి తన మాటల్లో విన్నవించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద ఏపికి రూ. 18,969 కోట్లు రావాల్సి వుందని, వాటిని విడుదల చేయాలని జగన్‌ ప్రధానిని ప్రత్యేకంగా కోరారు. 2014-15 ఆర్ధిక సంవత్సరంలోని 10 నెలల రెవెన్యూ లోటు రూ. 16,078 కోట్లు కాగా కేంద్రం నుంచి ఇప్పటివరకు రూ. 3979 కోట్లు వచ్చాయి. వేస్‌ అండ్‌ మీన్స్‌ సందిగ్ధత వల్ల రూ. 6,870 కోట్ల ఖర్చును ఆ ఆర్ధిక సంవత్సర రెవెన్యూ లోటులో చూపలేక పోయారు. ఇవి రెండూ కలిపితే రెవెన్యూలోటు రూ. 22,948 కోట్లకు చేరుకుంటుంది. 2014-15 ఆర్ధిక సంవత్సర రెవెన్యూ లోటులో రూ. 16,078 కోట్లలో రూ. 4,117 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇందులో రూ. 3979 కోట్లు ఇవ్వగా, ఇంకా 138.39 కోట్లు రావాల్సి ఉంది.

27 days

వేస్‌ అండ్‌ మీన్స్‌ సందిగ్ధత వల్ల రెవెన్యూ లోటులో చేర్చని రూ. 6870 కోట్లలో పిఆర్సి ఎరియర్స్‌ రూ. 3,920 కోట్లు, బిల్లులు రూ. 2,950 కోట్లు రాబడి నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రెవెన్యూ లోటు రూ. 22,948 కోట్లలో ఇప్పటివరకు రూ. 3979 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఇంకా రూ. 18,969 కోట్లు రావాల్సి ఉంది. విభజన చట్టంలోని పన్నులకు సంబంధించిన సెక్షన్‌ 50, సెక్షన్‌ 51లను సవరిస్తే ఏపికి అధనంగా రూ. 3,820 కోట్లు వస్తాయని, ఈసెక్షన్‌ను సవరించి ఏపికి న్యాయం చేయాలని ఏపిలోని 7 వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ. 350 కోట్లు ఇస్తున్నారు. గత ఐదేళ్లలో మూడేళ్లు ఈ నిధులు సక్రమంగానే ఇచ్చారు. నాలుగో ఏడాది రూ. 350 కోట్లను ఏపిీ ఖాతాలో వేసి వెనక్కు తీసుకున్నారు. ఐదో ఏడాది అసలు నిధులే ఇవ్వలేదు. నాలుగో ఏడాది వెనక్కి తీసుకున్న నిధులను విడుదల చేయాలని నీతి అయోగ్‌ కూడా కోరినప్పటికీ కేంద్రం ఇప్పటివరకు ఆ నిధులు విడుదల చేయక పోవడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడంతో జగన్‌ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికోసం ఆ నిధులను వాటిని తక్షణమే విడుదల చేయాలని ప్రధానిని తిరుపతి తిరుమల పర్యటనలో అభ్యర్ధించారు. అలాగే రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా బుందేల్‌ ఖండ్‌ ప్యాకేజి ఇవ్వాలని, ఇందుకు గాను రూ. 23,300 కోట్లు విడుదల చేయాలని ఏపి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రధాని మోడీని కోరారు.

ఏపి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో కార్యాలయ కేటాయింపు ఉంటుందా... ఇప్పటికే సరైన వసతిలేక ఇద్దరి ఉప ముఖ్యమంత్రులకు ఓకే చాంబర్‌ను కేటాయిచంగా ఇప్పుడు అయిదుగురు ఉప ఉపముఖ్యమంత్రులు ఆతర్వాత ప్రతిపక్ష నేతకు కేటాయించాలి.దీంతో అధికారులు వారికి చాంబర్‌ల కేటాయింపులపై అసెంబ్లీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈనేల 12 ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కార్యాలయాల కేటాయింపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.ముఖ్యంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్‌తో పాటు అయిదుగురు ఉపముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరియు, మంత్రులు ఇతర చీఫ్ విప్‌లు, విప్‌లకు చాంబర్లు కేటాయించాల్సి ఉంటుంది. బుధవారం నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు గాను ఇప్పటి వరకు ఒక్క జగన్ మోహన్ రెడ్డి చాంబర్‌ను మాత్రమే అధికారులు సిద్దం చేశారు.

27 days

కాగా అసెంబ్లీలో అయిదుగురు డిప్యూటి సీఎంలకు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మరిము మంత్రులకు మరో అయిదుగురు విప్‌లకు, చాంబర్లు కేటాయించాల్సి ఉంది. అయితే అక్కడ సరైన స్థలం లేకపోవడంతో చాంబర్ల కేటాయింపుపై తర్జనభర్జనలు పడుతున్నారు. కాగా గత అసెంబ్లీలో సరైన స్థలం లేకపోవడంతో ..ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు ఒకే చాంబర్ కేటాయించారు. కాగా ఇప్పుడు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండడం ఐదుగురు విప్‌లు ఉండడంతో అధికారులు కొంత సంధిగ్థంలో పడ్డారు.ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్‌కు చాంబర్‌ను సిద్దం చేసిన అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కేటాయించాల్సిన చాంబర్‌ను మాత్రం ఏర్పాటు చేయలేదు. కాగా మరో మూడు రోజులే ఉండడంతో చాంబర్ల కేటాయింపులు మాత్రం ఇద్దరి ఒక చాంబర్‌ను కేటాయించే అవకాశాలు ఉన్నాయి.కాగా మంత్రులకు అసెంబ్లీ మొదటి అంతస్థులో కేటాయించనున్నారు.

ఎమ్మెల్యేగా ఓడిపోయాడు.. అయినా ఆయ‌న మంత్రి అయ్యాడు. అందుకు కార‌ణం మ‌రెవ‌రో కాదు.. సాక్షాత్తూ త‌న త‌ల్లి చెప్పింద‌న్న ఒకే ఒక్క కార‌ణంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. త‌మ‌తోపాటు ఆయ‌న కూడా ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించారని, అందుకు స‌ముచిత ప్రాధాన్యం ఇవ్వాల‌ని త‌ల్లి చెప్ప‌డంతో జ‌గ‌న్ చ‌లించిపోయి.. ఆయ‌న‌కు మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు. అలా మంత్రి అయిన వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు, ఆయనే మాజీ మంత్రి, దివంగత వైయస్ ప్రియ శిశ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌. జ‌గ‌న్ కేబినెట్‌లో అంద‌రూ ఎన్నిక‌ల్లో గెలిచి వ‌చ్చిన వారే. మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఎమ్మెల్యేగా గెల‌వ‌క‌పోయినా మంత్రిగా అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో రేప‌ల్లె నియోజ‌కవ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి మోపిదేవి ఓడిపోయారు.

27 days

ఇక్క‌డ తెదేపా అభ్య‌ర్థి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. అయితే.. మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌పై వైఎస్ కుటుంబానికి ఎన‌లేని అభిమానం. జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజశేఖ‌రెడ్డి క్యాబినెట్‌లో కూడా ఈయ‌న మంత్రిగా ప‌దువులు అనుభ‌వించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. రోశ‌య్య‌, కిర‌ణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో కూడా ఈయ‌న మంత్రిగా ఉన్నారు. అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ జైలుకు వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న‌తోపాటు మోపిదేవి కూడా జైలుకు వెళ్లారు. దాదాపు రెండేళ్ల‌పాటు జ‌గ‌న్ కంటే ఎక్కువ రోజుల‌పాటు జైల్లో ఉన్నారు. దీంతో ఆ స‌మ‌యంలో త‌న‌తోపాటు ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించిన మోపిదేవికి మంచి చేయాల‌ని జ‌గ‌న్ భావించారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ కూడా ఓ స‌ల‌హా ఇచ్చార‌ట‌.

27 days

మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఒక్క‌డే జ‌గ‌న్‌తోపాటుఅప్ప‌ట్లో జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని గుర్తించి.. ఆయ‌న తాజాగా ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిగా అవ‌కాశం ఇవ్వాల‌ని సూచించార‌ట‌. త‌ల్లి సూచ‌న‌.. జ‌గ‌న్‌కు ఉన్న అభిమానం దృష్ట్యా మోపిదేవికి మంత్రిగా అవ‌కాశం ద‌క్కింది. త్వ‌ర‌లో మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి మంత్రిగా కొన‌సాగించేందుకు జ‌గ‌న్ భావిస్తున్నారు. అలా జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ సూచ‌న‌తో మోపిదేవికి ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిగా అవ‌కాశం ద‌క్కింది. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం వెలగపూడిలోని సచివాలయం వేదికగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 25 మందితో గవర్నర్ నరసింహన్ శనివారం ప్రమాణస్వీకారం చేయించారు. ఘనంగా జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్, నూతనంగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ధర్మాన కృష్ణ ప్రసాద్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలత్తూరు నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, అంజాద్ బాషా, మాలగుండ్ల శంకర్ నారాయణ ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read