అమరావతి... దుర్గమ్మ ఆశీస్సులు.. కృష్ణమ్మ పరవళ్లతో..అద్భుతమైన అమరావతిని నిర్మించుకుంటున్న మనం, అమరావతిలో వేసిన తొలి అడుగు, వెలగపూడిలోని సచివాలయం.. ఈ సచివాలయం, ప్రతి ఆంధ్రుడి దేవాలయం.... అమరావతి ఆంధ్రుల రాజధాని అని ప్రకటించిన దగ్గర నుంచి, మొదలైన పాజిటివ్ వైబ్రేషన్స్, 5 కోట్ల మంది ఆంధ్రులని ముందుకు నడిపిస్తుంది… “అమరావతి”, అంటే మరణం లేనిది…క్షీణించడం, జీర్ణించడం, బాధపడటం అనేవి మచ్చుక కూడా కనిపించని ప్రాంతంగా అమరావతి విలసిల్లుతుంది. బాల్యం, కౌమారం, యవ్వనం మాత్రమే అమరత్వంలో ఉంటుంది, మరణించడం అనేదే ఉండదు... అందువల్ల ఎల్లప్పుడూ అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంటుంది. శాతవాహనుల రాజధానిగా ఘనచరిత్ర వహించిన ఈ ప్రాంతానికి, మళ్లీ పూర్వ వైభవం తీసుకురావటానికి చంద్రబాబు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..
హైదరాబాద్ లో ఏపి ఉద్యోగులని, ప్రతి రోజు తెలంగాణా ఉద్యోగులు అడ్డుకుంటున్నారని, వారి ఆత్మగౌరవం దెబ్బ తిన కూడదని, మన గడ్డ నుంచే మన పాలన సాగాలని, 180 రోజుల్లోనే అమరావతిలో కట్టిన ఇంద్ర భవనాలు, వెలగపూడిలో కట్టిన సచివాలయం... కానీ అనూహ్యంగా, ఈ ఆధునిక అమరావతి సృష్టికర్త ఎన్నికల సమరంలో ఓడిపోయారు... మరి ఆయన ఓడిపోతే, అమరావతి గెలిచిందని చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ? భ్రమరావతి అని ప్రతి రోజు విమర్శించిన వారు, ఈ రోజు అది భ్రమరావతి కాదు, అమరావతి అని చెప్పటం "అమరావతి విజయం" కాదా ? ఎక్కడైతే భూకంపాలు వస్తాయని బెదిరించారో, ఏదైతే బురద నేల అన్నారో, ఏ బిల్డింగ్ లను అయితే తాత్కాలికం అని హేళన చేసారో, ఎక్కడైతే ఒక్క ఇటుక కూడా పడలేదు అన్నారో, అమరావతి నిర్మాణం ఆగిపోవాలి అని ప్రతి రోజు కేసులు పెట్టిన వారు, అక్కడికే వచ్చి వారు కూర్చున్నారు. అమరావతిని కూడా ఒక ఎన్నికల ఎజెండాగా తీసుకుని, వేరే ప్రాంతాల్లో, అమరావతి పై ఎలా ద్వేషం నింపారో చూసాం. మొన్నటికి మొన్న, వైయస్. షర్మిలా గారు పాదయాత్ర లో ప్రజలతో మాట్లాడుతూ..... అమరావతి అంట.... మనరాజధాని అంట.... దాని మోహం మీరు ఎప్పుడైనా చూశారా..... ఎక్కడైనా మీకు కనపడిందా..... ..అని ప్రచారం చేశారు..!!
ఇప్పుడు, చంద్రబాబు సృష్టించిన చోట, చంద్రబాబు కూర్చున్న చోట, ఏ భవనాల మీద అయితే ప్రతి రోజు విషం చిమ్మారో, అక్కడే చంద్రబాబు స్థానంలో వాళ్ళు కూర్చుంటున్నారు అంటే... చంద్రబాబు ఓడినా, అమరావతి గెలిచింది అనే కదా అర్ధం. భ్రమరావతి అని చెప్పిన నోళ్లె, అమరావతి అని చెప్పటం చూస్తుంటే, నిజంగా అమరావతి అంటే మరణం లేనిదే అని అర్ధమవుతుంది. మన తరంలో ఒక మహానగర నిర్మాణం జరగటం, అది చూసే భాగ్యం దక్కటం మన అదృష్టం. ఆ నిర్మాణ ప్రక్రియకు పురుడు పోసిన వ్యక్తి, ఎన్నికల సమరంలో ఓడిపోయినా, అమరావతి గెలుస్తుంది అనే నమ్మకంతో ముందుకు పోవటమే. కొత్తగా బాధ్యతలు తీసుకున్న జగన్ గారు, అమరావతి పై, మీ భ్రమలు ఇప్పటికే తొలగి ఉంటాయి. చంద్రబాబు ఎక్కడైతే ఆపారో, మీరు అక్కడ నుంచి ముందుకు తీసుకు వెళ్ళండి. ఆయన ప్రణాళికలు నచ్చకపోతే, మీరు కొత్త ప్రణాళికలతో రండి. అమరావతిని మాత్రం నెంబర్ వన్ డెష్టినేషన్ చెయ్యండి చాలు. కాని చంద్రబాబు మీద కోపంతో, అమరావతిని ఎగతాళి చెయ్యకండి. మీ మందికి, మీ కర పత్రికకు, ఇకనైనా అమరావతిని భ్రమరావతి అని పిలవద్దు అని చెప్పండి... జై ఆంధ్రప్రదేశ్... జై అమరావతి...