ఏపీ కొత్త క్యాబినెట్ లో ఎవరెవరు ఉంటారన్న దానిపై ఈ సాయంత్రం స్పష్టత వచ్చింది. సీఎం జగన్ తన మంత్రివర్గం జాబితాను గవర్నర్ నరసింహన్ కు సమర్పించడంతో మంత్రి పదవులు దక్కించుకున్నది వీళ్లేనంటూ మీడియాలో ప్రసారమైంది. అయితే, వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన రోజా పేరు మంత్రివర్గంలో లేకపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవాళ వైసీపీ శాసనసభాపక్ష భేటీ ముగిసిన తర్వాత రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి వస్తుందని 100 శాతం నమ్ముతున్నట్టు తెలిపారు. ఏ మంత్రి పదవి ఇచ్చినా న్యాయం చెయ్యడం, జగన్ కు మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యాలని చెప్పారు. కానీ, క్యాబినెట్ మంత్రుల జాబితాలో రోజా పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, మంత్రివర్గ కూర్పు సమయంలో జగన్ ఇదే విషయమై రోజాతో రెండుసార్లు చర్చించి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ కూర్పు చేశామని, అందుకే మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నామని జగన్ తెలిపినట్టు సమాచారం.

అంతేగాకుండా, పార్టీలో ఇన్నాళ్లపాటు రోజా చేసిన సేవలను ప్రస్తావించిన జగన్ ఆమెను విజయవాడలోనే అందుబాటులో ఉండాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రోజాకు మరో కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్ తిరుమల వచ్చినప్పుడు రోజా ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెన్నంటే ఉన్నారు. తద్వారా మంత్రి పదవి రేసులో తాను ముందున్నానని సంకేతాలు పంపారు. అనూహ్యంగా ఆమె పేరు లేకుండానే జగన్ తన క్యాబినెట్ ను ప్రకటించారు. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలకు గానూ వైకాపా 151 స్థానాలు దక్కించుకుంది. అందులో 14 మంది మహిళలు ఉన్నారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు అనే పేరు వినిపించగానే ప్రముఖంగా రోజా పేరే అందరి నోటా నానింది. అటువైపు పార్టీ తరఫున బలంగా వాణి వినిపించే మహిళా నేతగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. అయినా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం గమనార్హం. అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా సరే.. తాజాగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురిలో సుచరిత మినహా మిగిలిన ఇద్దరూ రోజాలానే రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందడం గమనార్హం.

మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. అందులో మొదటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపించాయి. మరో మంత్రి పదవి విషయంలో రోజాకు, భూమన కరుణాకర్‌రెడ్డికి మధ్య పోటీ ఉందని అందరూ అనుకున్నారంతా. వస్తే వీరిద్దరిలో ఎవరికో ఒకరికి పదవి వస్తుందని ఊహించినప్పటికీ.. అనూహ్యంగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామికి చోటు దక్కడం గమనార్హం. మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన జగన్‌.. మరో రెండున్నరేళ్ల తర్వాతే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని ఇదివరకే స్పష్టం చేశారు. ఆ జట్టుతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నారన్నమాట. దీని ప్రకారం చూస్తే రోజాకు మంత్రివర్గంలో అవకాశం దక్కాలంటే మరో రెండున్నరేళ్ల ఎదురుచూడాల్సిందేనా? లేదా మంత్రి పదవి బదులు ఇంకేదైనా పదవి ఇస్తారో చూడాలి!! జగన్, రోజాని విజయవాడలోనే అందుబాటులోనే ఉండాలి అని చెప్పటంతో, రోజా వర్గీయాల్లో ఆసక్తి నెలకొంది.

జగన్ కేబినెట్‌లో మొత్తం 25 మందితో మంత్రి వర్గం కొలువుతీరనుంది. మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు ఈ డిప్యూటీ సీఎం పదవులు కేటాయించారు. తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై తెలుగు దేశం పార్టీ స్పందించింది. తన కేబినెట్‌లోకి ఎవర్ని తీసుకోవాలో నిర్ణయించుకునే విశేషాధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్‌ అన్నారు. అర్హులైన వారిని మంత్రులుగా నియమించే అధికారం సీఎంకు ఉంటుందని ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని తాము భావిస్తున్నామన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని పునరుద్ఘాటించారు.

tdp 07062019

డిప్యూటీ సీఎంలలో మొదటిగా వినిపిస్తున్నపేరు రాజన్న దొర. ఇయన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సాలూరు నియోజవర్గం. సీనియారిటీ, సామాజిక వర్గం, వరుసగా ఆయన విజయాలు సొంతం చేసుకోవడం.. ఇవన్నీ రాజన్న దొరకు కలిసి వచ్చాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్‌తోనే ఉన్నారు. రెండో డిప్యూటీ సీఎంగా ఆళ్ల నాని ఎంపికయ్యారు. కాపు వర్గానికి చెందిన వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా నుంచి కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు. ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన పార్టీకి వీర విధేయుడు. వైఎస్ కుంటుంబంతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో నానికి మంచి పట్టుంది.

tdp 07062019

మూడో డిప్యూటీ సీఎంగా పార్థసారధి ఎంపికయ్యారు. ఈయన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సామాజిక సమతుల్యంలో భాగంగా ఈయనకు డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కింది. పార్థసారథి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్ హయాంలో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు. ఆయనకు రాజకీయ అనుభవం ఉంది. మంచి వాక్చాతుర్యం ఈయన సొంతం. ఇవన్నీ పార్థసారథికి కలిసొచ్చాయి. పెనమలూరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగో డిప్యూటీ సీఎంగా మేకతోటి సుచరిత ఎంపికయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావం నుంచి కొనసాగుతున్నారు. జగన్ కుటుంబానికి సుచరిత విధేయురాలు. ఎస్సీ విభాగంలో ఆమెకు డిప్యూటీ సీఎం పదవి వరించింది. ఐదో డిప్యూటీ సీఎంగా అంజాద్ భాషా ఎంపిక అయ్యారు. సొంత జిల్లా మైనారిటీ నేత అయిన భాషను జగన్ ఎంపిక చేశారు. కడప నుంచి ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు. మైనారిటీ వర్గానికి చెందిన నేత కావడంతో ఆ వర్గానికి కూడా పెద్ద పీట వేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. వైఎస్ కుటుంబానికి భాషా కొన్నేళ్లుగా వీర విధేయుడు. శనివారం ఉదయం జరగనున్న మంత్రుల ప్రమాణస్వీకారానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.

కర్నాటక సియం కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతున్న ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ‘‘అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా’’ రావచ్చుననీ.. జేడీఎస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆయన చెబుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. మాండ్యకు చెందిన ఓ జేడీఎస్ కార్యకర్త తొలుత సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేసుకున్నట్టు చెబుతున్నారు. ‘‘మనం ఇప్పుడే మొదలు పెట్టాలి. తర్వాత చేద్దామంటే కుదరదు. వచ్చే నెల నుంచే మనం సిద్ధంకావాలి. ఎన్నికలు ఎప్పుడొస్తాయో మనకు తెలియదు. వచ్చే ఏడాది, వచ్చే రెండేళ్లు లేదా మరో మూడేళ్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి...’’ అని నిఖిల్ పేర్కొన్నారు. కర్నాటక సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునని భావిస్తున్న నేపథ్యంలో కుమారస్వామి తనయుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

kumarswamy 07062019 2

అయితే ఈ వీడియోలో నిజమెంత అన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. కర్నాటక జేడీఎస్ చీఫ్ ఏహెచ్ విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేసిన కొద్దిరోజులకే ఈ వీడియో బయటికి రావడం గమనార్హం. కాగా ప్రస్తుతం జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ప్రమాదమేమీ లేదనీ.. తన తండ్రి పూర్తికాలం పాటు సీఎం పదవిలో ఉంటారని నిఖిల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి పోటీచేసిన నిఖిల్... బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సుమలత అంబరీష్‌పై ఓడిపోయిన సంగతి తెలిసిందే. కర్నాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 25 కైవసం చేసుకోగా... కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కేవలం చెరో స్థానాన్ని మాత్రమే దక్కించుకున్నాయి.

 

ఈ రోజు ప్రకటించిన జగన్ మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రోజాకు కచ్చితంగా మంత్రి పదవి దొరకుతుందని ఆమె అనుచరులు గట్టిగానే ప్రచారం చేస్తూ వస్తున్నారు. కేవలం ప్రచారం మాత్రమే కాదు... ఏకంగా మహిళా కోటాలో హోంమంత్రి పదవే దక్కనుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. కేబినెట్ కూర్పు జరిగే చివరి నిమిషాల వరకు కూడా రోజా ఈసారి కచ్చితంగా మంత్రి అవుతారని అందరూ నమ్ముతూ వచ్చారు.కానీ చివరి నిమిషంలో కేబినెట్ కూర్పులో ఆమె పేరు కనిపించక పోవడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. మరోవైపు శనివారం ఉదయం వరకూ ఏవైనా అనూహ్య పరిణామాలు సంభవించి తమ తమ నేతలకు బెర్తులు లభించే అవకాశాలున్నాయని కార్యకర్తలు, అనుచరులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

jagan 07062019

జగన్ కేబినెట్ లిస్టు... స్పీకర్‌గా సీనియర్ నేత తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎంపికయ్యారు. ఇక మంత్రి వర్గ సహచరులుగా బొత్స, ఆళ్ల నాని, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్‌,కొడాలి నాని, బాలరాజు, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్‌పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కన్నబాబు, పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్‌, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, విశ్వరూప్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, మోపిదేవి వెంకటరమణకు చోటు దక్కింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గత కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేసిన జగన్‌ ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులకు అవకాశం కల్పిస్తూ మంత్రివర్గాన్ని కూర్చారు. 25 మందితో కూడిన జాబితాను రూపొందించి గవర్నర్‌కు అందజేశారు.

jagan 07062019

పార్టీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలూ మంత్రి పదవులకు అర్హులే అయినప్పటికీ కొంతమందికి మాత్రమే అవకాశం ఉందని, రెండున్నరేళ్ల తర్వాత దాదాపు 20 మందిని మార్చి వారి స్థానంలో కొత్తవారికి మంత్రులుగా అవకాశం ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తున్నట్టు జగన్‌ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 11.49గంటలకు వెలగపూడిలోని సచివాయలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సభాపతిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం పేరును ఖరారు చేశారు. ఉపసభాపతి విషయంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రాజన్న దొర పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ అనూహ్యంగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో అధికారికంగా 25 మంది సభ్యుల పేర్లు వెల్లడయ్యే అవకాశం కనబడుతోంది.

Advertisements

Latest Articles

Most Read