ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి అన్ని అనుమతులూ ఉన్నాయని, అవన్నీ చూసిన తరువాతే చంద్రబాబు ఆ ఇంట్లోకి వెళ్ళారని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తెలుగుదేశం పార్టీ నేతలు ఆధారాలుతో సహా బయటపెట్టారు. మీడియాతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్ని వివరాలు చెప్పారు. "2015 తర్వాత సీఆర్డీఎ కొత్త చట్టం తెచ్చింది. 2015 కంటే ముందు పాత చట్టాలు ఉన్నాయి. చంద్రబాబు ఉంటున్న భవనం 2011కు ముందు కట్టారు . అప్పుడు సీఆర్డీఎ అనేది లేదు. గ్రామ పంచాయతీ దగ్గర అనుమతులు తీసుకుని కట్టారు. ఆరోజే ఈ భవన యాజమాని, వన్ ప్లస్ వన్ గా ఈ బిల్డింగ్ కట్టుకున్నారు. ఆనాడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొంటే సరిపోతుంది అనేది, వీళ్ళు గుర్తుంచు కోవాలి. ఇన్ని వివరాలు ఇచ్చినా, ఈ ప్రభుత్వం పెద్దలకు ఇదంతా తెలిసినా వినరు, ఎందుకంటె, వీరికి చంద్రబాబు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ధ్యేయం ఉంది."

"అందుకే ఈ విషయాలు అన్నీ ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకుని , ప్రజలకే చెప్తున్నాం. ఈ భవనం కట్టడానికి, 2011 లో, అప్పటి పంచాయతీ తీర్మానం తీసుకుని, రివర్ కన్వర్జేషన్ యాక్టు ప్రకారం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని, అన్ని అనుమతులు వచ్చిన తరువాతే ఈ భవన యజమాని, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోడానికి, ఒక భవనం కట్టుకోడానికి అనుమతి తీసుకున్నారు. ఇది వ్యవసాయ భూమి కావటంతో, ఇకక్డ భవనం కట్టాలంటే కన్వర్షన్ చేసుకోవాలి. అందుకని వ్యవసాయ భూమిని, వాణిజ్య భూమిగా మార్చే కన్వర్షన్ కోసం, సుమారు రూ. 18లక్షలు నాలా పన్ను కట్టారు. ఇన్ని వాస్తవాలు ఉంటే చంద్రబాబునాయుడు అనుమతి లేని భవనంలో ఉంటున్నారని,ప్రచారం చేస్తున్నారు." అని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. పంచాయతీ తీర్మానం, నాలా పన్ను రసీదు , రివర్ కన్జర్వేషన్ యాక్టు నో అబ్జషణ్ సర్టిఫికేట్ లను మీడియాకు అందజేశారు.

ప్రజా వేదిక కూల్చివేత పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, ప్రభుత్వం ఇప్పుడు ద్రుష్టి మరలచటానికి, కరకట్ట పై ఉన్న వివధ కట్టడాల వారికి నోటీసులు ఇస్తుంది. ప్రజల వినతులు వినటానికి, ప్రజా వేదికను ప్రతిపక్ష హోదాలో ఉన్న తనకు ఇవ్వమని చంద్రబాబు అడగటంతో, ప్రభుత్వం దానికి సమాధానం చెప్పలేక, అది అక్రమ కట్టడం కూల్చేస్తున్నాం అంటూ అనుకున్నదే ఆలస్యం, కూల్చిపడేసింది. ఇప్పుడు పక్కనే ఉన్న చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేసి చంద్రబాబు పై కక్ష సాధింపు ధోరణితో వెళ్ళాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు కరకట్టపై పై చంద్రబాబు ఇంటికి వెళ్ళిన అధికారులు, ఇది అక్రమ కట్టడం దీన్ని వారం రోజుల్లో ఖాళీ చెయ్యండి అంటూ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇంటికి మాత్రమే వెళ్తే కక్ష సాధింపు అనుకుంటారని, మిగతా కట్టడాలు ఉన్న వారి ఇళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.  అయితే నోటీసులు ఇవ్వటానికి వెళ్తున్న సీఆర్డీఏ అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో, ఎలాగు వచ్చాం కాబట్టి నోటీస్ అంటించి వెళ్తున్నారు.
 

కరకట్ట పై నోటీసులు ఇవ్వటానికి, ఏ ఇంటికి వెళ్లినా, తమ కట్టడాలకు అనుమతులు ఉన్నాయంటూ, వారి ఇంటి గేట్ల ముందు బోర్డులు పెట్టుకున్నారు. ఆ బోర్డులు చూసిన అధికారులు అవాక్కయి, ఏమి చెయ్యాలో అర్ధం కాక, తెచ్చిన నోటీసులను అంటించి వెళ్తున్నారు. అయితే అసలు వీరికి అనుమతులు ఎప్పుడు వచ్చయి, ఎలా వచ్చాయి, ఎవరు వీరికి అనుమతి ఇచ్చారు, ఏ ప్రభుత్వ హయాంలో అనుమతి ఇచ్చారు అన్న ప్రశ్నల కోసం, ఇప్పుడు అధికారులు పాత ఫైళ్లను తిరగేస్తున్నారు. సీఆర్డీఏ ఏర్పడక ముందే, వీటిలో కొన్నిటికి విజయవాడ వుడా నుంచి, కొన్ని పంచాయతీ నుంచి అనుమతులు ఇచ్చి ఉంటారని, భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, చందబాబు ఇంటిని మాత్రం వదలటం లేదు. ఆయన్ను ఎలా అయినా ఇంటి నుంచి గెంటటానికి, నోటీసులు ఒక్కటే కాదు, ఆయన ఇంటిని కొలతలు తీసుకోవాలని, ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా మరింత ఒత్తిడి చంద్రబాబు పై పడుతుందని భావిస్తున్నారు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని సర్వేయర్లతో కొలతలు తీయించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.

 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఈ నెల రోజులల్లో 140 రాజకీయ దాడులు జరిగాయి. 7 గురు చనిపోయారు. అయితే వైసీపీ ఆగడాలు తెలుగుదేశం పార్టీ వరకే ఆగలేదు. ఏకంగా జర్నలిస్ట్ లను బెదిరిస్తూ, చంపేస్తాం అంటూ లొంగదీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా, రాష్ట్రంలో హోం మంత్రి గారు మాత్రం, మేము అందరికీ కాపలా ఉండలేము, ఘటన జరిగిన తరువాత వస్తే న్యాయం చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. హోం మంత్రే ఇలా మాట్లాడటం చూస్తుంటే, ఇలాంటి రౌడీ మూకలకు లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. ఈ రోజు తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే, ఒక జర్నలిస్ట్ ను బెదిరిస్తున్నారు. ఇదే విషయం ఆడియోతో సహా తెలుగుదేశం మాజీ మంత్రి నారా లోకేష్, ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతతం రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది అని, దానికి ఇదే ఉదాహరణ అంటూ,  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును బెదిరిస్తున్న ఆడియో పోస్ట్ చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదని, ఇక సామాన్యుల సంగతి ఏంటో ఊహించుకోవాలని పేర్కొన్నారు.

ఈ బెదిరిపులకు సంబంధించి ఆడియో క్లిప్ ను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఆడియోను కుటుంబ సభ్యులతో కలిసి విన వద్దు, ఇందులో అసభ్య పదజాలం ఉన్నయాని లోకేష్ ట్విట్టర్ లో పెర్కున్నారు. నడిరోడ్డుపై నరికేస్తా అంటూ బూతులతో విరుచుకు పడ్డారు కోటం రెడ్డి. అయితే ఈ విషయం పై , కోమటి రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు ఈ ఆడియో నాది కాదు అని వాదిస్తారో, లేక అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్తారో వేచి చూడాలి. మరో పక్క, ఆ విలేఖరి కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు మీడియాకు తెలిపే అవకాశం ఉంది. అయితే ఇలా ఒక అధికార పార్టీ ఎమ్మల్యే నరికేస్తా, పొడిచేస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ, మేకలను చంపినట్టు, నడి రోడ్డు పై జరుగుతున్న మర్డర్లు చూసి ప్రజలు భయపడుతుంటే, ఇప్పుడు ఏకంగా ఎమ్మల్యేలే ఇలా చెయ్యటం, హోం మంత్రి ఏమో ఘటన జరిగిన తరువాత కంప్లైంట్ ఇవ్వండి, అందరికీ కాపలా ఉండలేం అని చెప్పటం చూస్తుంటే, ఈ రాష్ట్రం ఎటు పోతుందో అర్ధమవుతుంది.

అధికారంలోకి వచ్చిన తరువాత, రోజు రోజుకీ వైసీపీ నేతల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఒక పక్క రాజకీయ దాడులు, హత్యలు, బెదిరింపులు, ఇలా ఒక్కటేమిటి, వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. ఈ రోజు ఏకంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బూతు పురాణం విన్నాం. ఏకంగా జర్నలిస్ట్ లనే, నడి రోడ్డు మీద నరికేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి దాడులు ఒక పక్క జరుగుతుంటే, దందాలకు కూడా అడ్డు లేకుండా పోతుంది. మొన్నటి వరకు నిర్వహిస్తున్న  క్వారీలు కూడా బెదిరించి లాక్కుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చింది మాకు ఇచ్చేసి వెళ్ళిపొండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎవరైనా అడ్డు చెప్తే, తమదైన శైలి రుచి చూపించి మరీ లొంగదీసుకుంటున్నారు. తాజాగా ఈ రోజు  కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఇదే రకమైన దందా చేసారు వైసీపీ నాయకులు. ఇబ్రహింపట్నం క్వారీల వద్ద ఈ రోజు స్థానికంగా ఉండే వైసీపీ నేతలు హల్‌చల్‌ చేసి, అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసారు.

అందిన వివరాలు ప్రకరం, ఇబ్రహీంపట్నంలో చాలా కాలంగా క్వారీ పనులు జరుగుతున్నాయి. వీటి పై ఎప్పటి నుంచో స్థానిక వైసీపీ నేతలు కన్ను వేసారు. ప్రభుత్వం మారటంతో, అక్రమ క్వారీ అని, ఆపేయాలని కొద్ది రోజులుగా వేదిస్తున్నారు. అంతా సక్రమంగానే చేస్తున్నాం అని, క్వారీ పనులు ఆపకపోవడంతో అక్కడ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మాటే వినరా అంటూ, క్వారీ గేటు దగ్గర పెద్ద పెద్ద బండరాళ్లు పెట్టి క్వారీల నుంచి లారీలు, రాకపోకలు సాగించకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ ఆధిపత్యం తట్టుకోలేక, వారితో తలపడలేక క్వారీ యజమానులు చేసేదిలేక పనులను ఆపేశారు. బండరాళ్లను ఎందుకు అడ్డు పెడుతున్నారు అని వైసీపీ నేతలను ప్రశ్నించగా, వచ్చి ఎమ్మెల్యేనుకలవాలని చెప్పారని క్వారీ యజమానులు అంటున్నార. అయితే ఈ ఘటన పై మరో కొత్త వాదన కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో క్వారీ యజమానులు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని, అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇలా చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

Advertisements

Latest Articles

Most Read