ఏపి ప్రభుత్వం, ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి వైఖరితో, కేంద్రంలోని మంత్రులు అనేక సందర్భాల్లో, ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. విద్యుత పీపీఏల విషయంలో, పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో, ఉపాధి హామీ నిధులు విడుదల చెయ్యకుండా చేసిన విషయంలో, ఇలా అనేక సందర్భాల్లో, కేంద్ర మంత్రులు, జగన్ వైఖరిని తప్పు పట్టారు. ఇప్పుడు తాజగా మరో వివాదం చెలరేగటంతో, మరో కేంద్ర మంత్రి ఏపి ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఉన్న, వెంకటాచలంలో ఉన్న, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని, కేంద్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయడం పై వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, తన అసహనాన్ని తెలియ చేస్తూ, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ అనేది, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సంబంధించినది అనే విషయం అందరికీ తెలిసిందే. పోయిన నెల, అంటే జనవరి 20, 21 తేదీల్లో ఇక్కడ ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభం అయ్యింది.

venkaiah 030202020 2

సహజంగా, ఉపరాష్ట్రపతి వచ్చి, ఇలాంటి పెద్ద కార్యక్రమం చేస్తే, ముఖ్యమంత్రి హాజరవుతారు. కాని, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి రాలేదు. అయితే అసలు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, జగన్ మోహన్ రెడ్డికి పోయిన నెల ఒకటవ తారీఖున లేఖ రాసారు. అయితే, తనకు ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, తాను ఈ కార్యక్రమానికి రాలేను అంటూ జగన్ సమాధానం ఇచ్చారు. ఇలా చెప్తూనే, తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం, అక్కడ పెట్టటం పై తన అభ్యంతరం తెలియ చేస్తూ, జనవరి 17న, మంత్రికి తిరిగి జవాబు ఇచ్చారు. అక్కడ ఎలా ఏర్పాటు చేస్తారు, నేను అడిగితే, ప్రభుత్వ భూమి ఇచ్చే వాడిని కదా ని చెప్పినట్టు సమాచారం.

venkaiah 030202020 3

అయితే జగన్ లేఖ పై, కేంద్రం మంత్రి అదే స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసారు. నేను మీకు జనవరి 1న లేఖ రాస్తే, మీరు జనవరి 17న స్పందిస్తూ, అభ్యంతరం చెప్పటం, సరైంది కాదు అని అన్నారు. మీరు వెంటనే స్పందించి ఉంటే, తగిన నిర్ణయం తీసుకునే వాళ్ళం అని అన్నారు. అక్కడ ఉచితంగా అద్దె లేకుండా వసతి లభించటం వల్లే, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ప్రారంభిస్తున్నామని, దీంట్లో మరో ఆలోచన లేదని అన్నారు. మీకు అంత ప్రేమ ఉంటే, మీరు మందే ఎందుకు భూమి ఇవ్వలేదు, ముందే భూమి ఇచ్చి ఉంటే, అక్కడే మొదలు పెట్టే వాళ్ళం కదా అని ఘాటుగా ప్రశ్నించారు. రెండేళ్ళ పాటు, ఉపరాష్ట్రపతి తన ట్రస్ట్‌ భవనంలో, అద్దె లేకుండా నిర్వహణ చేసుకోమన్నారని, దానికి దురుద్దేశాలు ఆపాదించడం సరైంది కాదని మానవ వనరుల శాఖ అధికారులు అంటున్నారు. ఉపరాష్ట్రపతి పైనే ఇలా చెయ్యటం వెనుక, రాజకీయ కారణాలు ఉన్నాయని, అంటున్నారు.

అమరావతి ఉద్యమం పై, అతి పెద్ద కుట్ర జరుగుతుంది. అమరావతిలో అసలు ఉద్యమమే లేదని, అక్కడ రైతులు ఎవరూ ఉద్యమాలు చెయ్యటం లేదని, ఇది 5 కోట్ల మంది సమస్య మాదని, ఇది కేవలం 5 వేల మంది సమస్య అని, చాలా పరిమితమైన సమస్య అని, అది కూడా ఈ 5 వేల మంది రియల్ ఎస్టేట్ చేసుకునే వారు చేస్తున్న ఉద్యమం అంటూ, ఢిల్లీ స్థాయిలో కుట్ర చేస్తున్నారు. ఒక పక్క 47 రోజులుగా అమరావతిలోని 29 గ్రామాల రైతులతో పాటు, వివిధ జిల్లాల్లో కూడా అమరావతికి మద్దతుగా ఉద్యమం నడుస్తుంది. విదేశాల్లో కూడా, ఉన్న తెలుగు వారు, అమరావతికి మద్దతుగా ఉద్యమాలు చేస్తున్నారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయం పై, పార్లమెంట్ లో పోరాటానికి సిద్ధం అవుతుంది. పార్లమెంట్ వేదికగా, గత 50 రోజలుగా అమరావతిలో జరుగుతున్న ఉద్యమం, ప్రభుత్వ వైఖరి, జగన్ తుగ్లక్ నిర్ణయాల పై, ఈ దేశానికీ తెలిసేలా చెప్తాం అని తెలుగుదేశం పార్టీ అంటుంది. అలాగే, రైతుల పై పోలీసులు చేసిన దాడులు పై, హైకోర్ట్ లో కేసు నడుస్తుంది.

reliance 02022020 2

హైకోర్ట్ కూడా ప్రభుత్వం, పోలీసుల పై తీవ్రంగా స్పందించింది. ఇక మరో పక్క, మహిళల పై ప్రవర్తించిన తీరుకి నిరసనగా, జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం వద్ద కూడా, రైతుల పై ప్రభుత్వం చేసిన దాడులు విషయాల పై కంప్లైంట్ ఉంది. ఇక జాతీయ పత్రికల్లో కూడా, అమరావతి విషయం పై, తుగ్లక్ నిర్ణయం అంటూ కధనాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో, పార్లమెంట్ వేదికగా ఈ విషయం పై చర్చింటానికి, టిడిపి సిద్ధమైన నేపధ్యంలో, వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. ఢిల్లీ వేదికగా, కేంద్రంలో ఉన్న పెద్దలకు, ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. అసలు అమరావతిలో ఉద్యమమే జరగటం లేదని, అది కేవలం 2-3 గ్రామాల పరిమిత ఉద్యమం అని రిపోర్ట్ ఇచ్చినట్టు, ఒక ప్రముఖ టీవీ కధనం ప్రసారం చేసింది.

reliance 02022020 3

దీని కోసం, వారు గత మూడు రోజులుగా జరిగిన సంఘటనలు, వాటి ఫోటోలు, వీడియోలు కూడా, కేంద్రానికి ఇచ్చారు. విశాఖపట్నం ప్రజలు, అమరావతిని వ్యతిరేకిస్తూ, విశాఖ టిడిపి ఆఫీస్ పై దాడి చేసారని చెప్పారు. కాని, అది చేసింది వైసీపీ అని అందరికీ తెలిసిందే. అలాగే రాయలసీమ ప్రజలు, అమరావతిని వ్యతిరేకిస్తున్నారని, చివరకు నందమూరి బాలకృష్ణను కూడా అడ్డుకున్నారని చెప్పి, ఆ ఫోటోలు, వీడియోలు కూడా ఇచ్చారు. అది కూడా చేసింది, వైసీపీనే. అలాగే తెనాలిలో, అమరావతి పై శిబిరం పై, అక్కడి ప్రజలు దాడి చేసారని చెప్పినట్టు సమాచారం. ఇది కూడా చేసింది వైసీపీనే. ఇలా ఇలాంటి సంఘటనలు అన్నీ ప్రజలు చేస్తున్నారని, చెప్పే ప్రయత్నం చేస్తూ, ఫోటోలు, వీడియో ఆ రిపోర్ట్ లో ఇచ్చారని తెలుస్తుంది. అంటే, 47 రోజులుగా ఎక్కడా ఆందోళనలు లేని అమరావతి ఉద్యమంలో, గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనలు, తరువాత ఈ రిపోర్ట్ ఇచ్చినట్టు వస్తున్న వార్తలు చూస్తుంటే, అమరావతి ఉద్యమం పై ఏ స్థాయి కుట్రలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి, కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి. ఇప్పటికే అమరావతి పరిరక్షణ సమితి కూడా ఢిల్లీ వెళ్లి, ఉద్యమం గురించి, కేంద్ర పెద్దలకు వివరిస్తుంది.

గతంలో అభివృద్ధి రాజకీయాలు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇప్పుడు వ్యక్తిగత కక్ష రాజకీయాలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి సొంత ఊరు అయిన పులివెందులలో సభ పెట్టారు. అది అక్కడ వారిని రెచ్చగొట్టటానికి కాదు. ఆ ప్రాంతం 40 ఏళ్ళ కల సాకారం చేస్తూ, పులివెందులకు నీళ్ళు ఇచ్చి, అక్కడ రైతులను మెప్పించి, తాము చేసిన పని చెప్పుకుంటూ, అక్కడ సభ పెట్టారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ కూడా, విపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారా వారి పల్లె, సొంత ఊరిలో, సభ పెట్టారు. కాని, ఇక్కడ అభివృద్ధి కాదు, ప్రజలను ప్రాంతాల పేరుతొ రెచ్చగొట్టటానికి. అమరావతి రాజధానిగా ఉండటానికి వీలు లేదు, మూడు రాజధానులు కావలి అంటూ, వైసీపీ, ఏకంగా చంద్రబాబు సొంత ఊరిలోనే సభ పెట్టారు. అయితే చంద్రబాబు సొంత ఊరిలో, ఇలాంటి నీచ రాజకీయం చేస్తున్న వైసీపీ పై, తెలుగుదేశం పార్టీ మండి పడింది. దీంతో ప్రశాంతంగా ఉండే గ్రామలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

kallam 02022020 2

అయితే, పోలీసుల సహకారంతో, వైసీపీ చంద్రబాబు సొంత గ్రామంలో నారావారిపల్లె వద్ద, ఎట్టకేలకు సభ పెట్టరు. ఈ సభ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. మంత్రులు, ఉప ముఖ్యమంత్రిని చెవిరెడ్డి రప్పించారు. అంతే కాకుండా, జాతీయ మీడియాని కూడా రప్పించారు. చాలా మంది ప్రజలు వస్తారని ఊహించగా, ప్రజలు షాక్ ఇచ్చారు. 10 వేల మందితో ప్రారంభం అయిన సభ, అరగంటలోనే, 500 మంది కూడా లేకుండా సభా ప్రాంగణం ఉంది. ప్రజలు షాక్ ఇవ్వటంతో, వైసీపీ క్లుప్తంగా ప్రసంగించాలి అంటూ, వక్తలకు చెప్పారు. ఇలా జరగటం పై వైసీపీ షాక్ తింది. జాతీయ మీడియాని పిలిపించటంతో, వారి ముందు పరువు పోయిందని, వాపోతున్నారు. ప్రజలను మెప్పించే ప్రసంగాలు చెయ్యకుండా, రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యటమే ఇందుకు కారణం అని అంటున్నారు.

kallam 02022020 3

ఇది ఇలా ఉంటే, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం రెడ్డి ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో చంద్రబాబుముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం పై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తన స్వలాభం కోసమే అమరావతిని నిర్ణయించారని అన్నారు. ఇక అందరి వైసీపీ నాయకులు లాగే, అమరావతి రైతుల పై, అజయ్ కల్లం రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. "అమరావతిలో ఉండేవారే రైతులా? ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రైతులు కాదా? ఒక్క రాజధానితో 20 గ్రామాల రైతులే బాగుపడాలా? కర్నూలు, విశాఖపట్నం రైతులు బాగుపడకూడదా?. భూములు పోయాయనే అమరావతి పేరుతో కొందరు ఏడుస్తున్నారు. సుప్రీం కోర్ట్ జడ్జిలకు కూడా అమరావతిలో బినామీ భూములు ఉన్నాయి’’ అంటూ రైతుల పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో లేని సమస్యను సృష్టించి, దాని చుట్టూ ప్రజలను, తిప్పుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడో సెటిల్ అయిన రాజధాని విషయాన్ని పట్టుకుని, దాన్ని కదిపి, అన్ని ప్రాంతాల ప్రజలను గందరగోళంలో పడేసారు. రాజధాని సమస్య జటిలం అవ్వటంతో, ఒక తప్పుకు, పది తప్పులు అన్నట్టు, చివరకు తమకు అడ్డుగా ఉన్న మండలిని కూడా రద్దు చేస్తూ తీర్మానం చేసారు. ఇలా అనేక విధాలుగా, ఏపి ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తుంది.అయితే, ఈ విషయం పై, 47 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు ఢిల్లీ వెళ్లారు. అక్కడ అందరినీ కలుస్తూ తమకు జరిగిన అన్యాయం పై మోర పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసారు అమరావతి రైతులు. తాము తీవ్రంగా నష్ట పోతున్నామని, తమను ఆదుకోవాలని కోరారు. దీని పై స్పందించిన కిషన్ రెడ్డి, శాసనమండలి రద్దు కాని, 3 రాజధానుల అంశంపై కాని, ఇప్పటి వరకు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి ఆఫిషయల్ గా ఏమి చెప్పలేదని చెప్పారు.

kishan 02022020 2

కిషన్ రెడ్డి ఏమన్నారంటే... "రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నం వద్దకు మార్చేస్తుందని, దీని కారణంగా, మాకు అనేక రకాలుగా నష్టం జరిగే అవకాశం ఉంది. మేము రాజధాని కోసం భూములు ఇచ్చాం, మా భూములు త్యాగం చేసాం. ఈ రోజు, రాజధాని లేదని చెప్పటంతో, మేము మా కుటుంబ సభ్యులు, ఎంతో అన్యాయానికి గురి అవుతున్నాము, బాధ పడుతున్నాము అని చెప్పి, అమరావతి పరిరక్షణ సమితి రైతులు, అనేక విషయాలు చెప్పటం జరిగింది. ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అఫిషయల్ గా కేంద్ర ప్రభుత్వానికి, మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో, కేంద్రానికి ఏ రకమైన సమాచారం ఇవ్వలేదు. అలాగే ప్రభుత్వాన్ని పక్కన పెడితే, పార్టీగా బీజేపీ రాష్ట్ర శాఖ ఒక తీర్మానం చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిలోనే ఉండాలి అంటూ, అభిప్రాయాన్ని వ్యక్తం చేసి, తీర్మానం చేసాం. కాబట్టి ఈ విషయం పైన, కేంద్ర ప్రభుత్వం తరుపున, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు వివరాలు ఇస్తేనే స్పందించే అవకాసం ఉంటుంది. "

kishan 02022020 3

"నేను కూడా వ్యక్తిగతంగా ప్రధాని మంత్రి గారితోటి, హోం మంత్రి గారితోటి, బీజేపీ జాతీయ అధ్యక్షుల వారితోటి, మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వంతో, ఏ రకంగా చర్చించాలో ఆలోచిస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ అంశం అయినప్పటికీ కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నప్పటికీ కూడా , వేలాది మంది రైతులు, వేల ఎకరాలు భూములు ఇచ్చారు కాబట్టి, రైతుల యొక్క మనోభావాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టిలో పెట్టుకోవాలి, స్వయంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయం పై ఆలోచించాలి. అధికార వికేంద్రీకరణ చెయ్యాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయి. రాజధానిని ముక్కలు చేసినంత మాత్రాన, అధికార వికేంద్రీకరణ జరగదు. అధికార వికేంద్రీకరణ జరగాలి అనేది మా విధానం. కాని పరిపాలన రాజధానిగా కాదు. ఢిల్లీని ముక్కలు చేసి, వేరే చోట్ల పెట్టలేం కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఈ నిర్ణయాన్ని మళ్ళీ ఆలోచిస్తే మంచిది అని నా అభిప్రాయం" అని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisements

Latest Articles

Most Read