వైఎస్ వి-వే-క కుమార్తె డాక్టర్ సునీత, రెండు రోజుల క్రితం హైకోర్ట్ లో వేసిన పిటీషన్ సంచలంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే, ఆవిడ డీజీపీ సవంగ్ కు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబరు 21న ఆమె డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాసారు. నా తండ్రి హ-త్య కేసు విచారణ, గత కొంత కాలంగా కొనసాగుతూనే ఉంది కాని, ఇప్పటి వరకు ఎవరు చంపారో తేల్చలేకపోయారు అని ఆమె లేఖలో రాసారు. తను, తన భర్త, విచారణలో భాగంగా, పోలీసులకు పూర్తీ సహకారం అందిస్తున్నామని అన్నారు. అయితే ఇంత వరకు ఎవరు చంపారో తెలియకపోవటంతో, తనకు, తన భర్తకు ప్రాణ హాని ఉందని భావిస్తున్నామని అన్నారు. తన తండ్రినే హ-త్య చేసిన వారికి, తమను టార్గెట్ చెయ్యటం పెద్ద విషయం కాదని ఆమె అన్నారు. తనకు, తన భర్తకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమయంలో, సాయుధ రక్షణ కల్పించే విషయం పరిశీలించాలని కోరారు. ఇప్పటికే, ఈ కేసులో శ్రీనివాసరెడ్డి మరణించిన నేపధ్యంలో, పరమేశ్వరరెడ్డి, ఎర్రగంగిరెడ్డి, వాచ్‌మన్‌ రంగయ్యల ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ఆమె అన్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ ఈ విషయం పై, జగన్ ను టార్గెట్ చేసింది. హైకోర్టులో ఎందుకు రిట్‌పిటిషన్‌వేశానా... ముఖ్యమంత్రితో ఎందుకు పెట్టుకున్నా నా...అని దివంగత వై.ఎస్‌.వి-కే-కా కుమార్తె సునీత భయపడేలా ఆమె అన్నయిన జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వి-వే-కా-హ-త్య కేసు విచారణపై, చెల్లి పిటిషన్‌వేసినా సీబీఐ విచారణపై జగన్మోహన్‌రెడ్డి ఎందుకు స్పందించడంలేదని, ఈ అంశంపై ఆయనెందుకు తాత్సారం చేస్తున్నాడని వర్ల ప్రశ్నించారు. తన అన్నపై నమ్మకంలేకనే ఆమె కోర్టుని ఆశ్రయించిందని, జగన్‌ ఎవరిని కాపాడటానికి సీబీఐ ప్రకటనపై వెనకడుగువేస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. జగన్‌ స్పష్టత ఇవ్వకుంటే , హ-త్య కేసు ముద్దాయిలను జగన్‌ కాపాడాలని చూస్తున్నాడని భావించాల్సి వస్తుందని, రాష్ట్రప్రజలంతా ముఖ్యమంత్రి నిర్ణయంపై చాలా ఉత్సుకతతో ఉన్నారన్నారు.

తనను ఇంప్లీడ్‌చేస్తూ చెల్లికోర్టుకి వెళ్లడంతో జగన్‌ ఆమె పై కక్షపెంచుకున్నాడేమోననే అనుమానం లుగుతోందని వర్ల సందేహం వెలిబుచ్చారు. అర్థంతరంగా హైదరాబాద్‌ లోని సునీత ఇంటిచుట్టూ భారీసంఖ్యలో పోలీసుల్ని ఎందుకు మోహరించాల్సి వచ్చిం దన్నారు. తనపేరుని ఆమె బదనాం చేసిందని, తనను అవమానించిందనే జగన పోలీసుల్ని పంపాడా అని రామయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో ఎందుకు పెట్టుకున్నానా అని, ఆమెకై ఆమే భయపడి, తన పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేయాలన్న ఆలోచనలో జగన్‌ ఉన్నట్లున్నాడన్నారు. అక్కడున్న పోలీసులు తెలంగాణ వారా... లేక ఆంధ్రావారా అని రామయ్య ప్రశ్నించారు. తనకు ఎదురొస్తే, చెల్లి అయినా, మరొకరైనా వదలననే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని జగన్‌ ఆలోచిస్తున్నట్లు గా ఉందన్నారు. ఇప్పటికైనా జగన్‌ వి-వే-కా-హ-త్య కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు తక్షణమే ప్రకటన చేయాలన్నారు.

సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా అందరికీ సుపరిచితం అయిన లక్ష్మీనారయాణ, జనసేన పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ కు రాజీనామా లేఖను కూడా పంపించారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని నిర్ణయాల వల్ల, తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గతంలో అనేక సార్లు, తాను ఇంకా సినిమాల్లో నటించను అని, 25 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ పోరాటం చెయ్యటం కోసం, ప్రజల కోసమే ఈ జీవితం అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే పాయింట్ పై ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తున్నారు. ఆయన రాజీనామా లేఖలో ఇదే అంశం ప్రస్తావించారు. గతంలో పవన్ కళ్యాణ్, తాను ఇంకా సినిమాల్లోకి వెళ్ళను అని చెప్పారని, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వెళ్తున్నారని, ఈ నిలకడ లేమి తనంతో, ఆయన విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. పింక్ అనే హిందీ సినిమాను పవన కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

jd 30012020 2

దీనికి సంబంధించి, ప్రీ షూట్ కూడా జరిగింది. అదే విధంగా, ఎన్నికలు అయిన ఏడు నెలలకే , పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవటం పైకూడా, చాలా మంది పార్టీ శ్రేణులు, అభ్యంతరం చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బీజేపీ అన్యాయం చేసింది అంటూ, పాచిపోయిన లడ్డులు అంటూ, మీటింగ్లు పెట్టిన పవన్ కళ్యాణ్, కేవలం ఏడు నెలల్లోనే ఎలా బీజేపీతో కలుస్తారు అంటూ ప్రశ్నలు వచ్చాయి. అలాగే, అమరావతి పై పోరాటం అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న హడావిడి, తీరా చూస్తూ, గ్రౌండ్ లెవెల్ లో ఏమి చెయ్యక పోవటం, బీజేపీతో కలిసి అమరావతి పోరాటం అని చెప్పటం, ఇవన్నీ జనసేనలోని ఒక వర్గం ప్రజలకు నచ్చటం లేదు. ఇవి ఇలా ఉండగా, ఇప్పుడు పవన్ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారని తెలిసి, ఇప్పుడు మాజీ జేడీ పార్టీకి రాజీనామా చేసారు.

jd 30012020 3

ఇది పూర్తీ లేఖ ..."శ్రీ పవన్ కళ్యా ణ్ అధ్యక్షులు, జనసేన పార్టీ. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. కావున, నేను జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్త కి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరియు పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికీ మరియు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు."

ఫిబ్రవరి ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, పార్టీల మధ్య సమన్వయం కోసం, అలాగే పార్లమెంట్ లో ఏ అంశాలు ప్రస్తావించాలి అనే అంశం పై, ఈ రోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, అన్ని పార్టీల నేతలు పాల్గున్నారు. వారి వారి సమస్యల గురించి ప్రస్తావిస్తూ, ఈ విషయాల పై, పార్లమెంట్ లో చర్చించాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చే సరికి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, గల్లా జయదేవ్, అలాగే శ్రీకాకుళం ఎంపీ రాం మోహన్ నాయుడు పాల్గున్నారు. అలాగే వైసీపీ నుంచి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీ మిథున్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గున్నారు. అయితే ఈ సందర్భంలో, తెలుగుదేశం పార్టీ నేతలను మాట్లాడమని కోరగా, వారు రాష్ట్రంలో జరుగుతున్న వాటి పై స్పందించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ, ఎక్కడా లేని విధానాన్ని తీసుకువచ్చి, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టారని పేర్కొన్నారు.

అమరావతి రాజధాని అని కేంద్రానికి చెప్పి, ప్రధాని మోడీ స్వయంగా వచ్చి శంకుస్థాపన కూడా చేసారని, అలాగే కేంద్రం 1500 కోట్లు కూడా రాజధాని నిర్మాణానికి ఇచ్చిందని గుర్తు చేసారు. అమరావతిలో జరుగుతున్న వివిధ పనులు గురించి వివరించారు. రాజధాని అంశంతో పాటుగా, తనకు అడ్డుగా ఉందని, ఏకంగా శాసనమండలినే జగన్ రద్దు చేసారని, రాజధాని మార్పు అంశం, అలాగే శాసనమండలి రద్దు అంశం కూడా, పార్లమెంట్ లో చర్చించాలని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, కేంద్రాన్ని కోరారు. అలాగే అమరావతిలో ఉన్న పరిస్థితి, గత 45 రోజులుగా, లక్ష మందికి పైగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటం, పోలీసులు అకారణంగా వచ్చి శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం పై చేస్తున్న దాడులు గురించి కూడా ప్రస్తావించారు.

ఈ సమయంలో, వైసీపీ పార్టీ నేతలు, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కలుగచేసుకుని, రాజధాని మార్పు అంశం అయినా, లేక శాసనమండలి అయినా, అవన్నీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అని, వీటిని పార్లమెంట్ లో చర్చించాల్సిన పని లేదని అన్నారు. అయితే టిడిపి ఎంపీలు మాట్లాడుతూ, అమరావతిని ఎంపిక చేసిన విషయంలో, కేంద్ర సహకారమే తీసుకుని చేసామని, అందుకే ఇప్పుడు కేంద్రం దృష్టికి తీసుకు వస్తున్నామని అన్నారు. ఈ సందర్భంలో, ఇరు పార్టీల నేతలు మాట మాట పెరగటంతో, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కల్పించుకుని, ఇద్దరినీ ఆపారు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలకు క్లాస్ పీకారు. టిడిపి ఎంపీలు చేపుంటే, మీరు ఎందుకు అడ్డు పడుతున్నారు, ఆ విషయం చర్చించాలో, వద్దో నిర్ణయం తీసుకునేది మేము, ఇక్కడ ప్రస్తావన మాత్రమే చేసారు, వారిని చెప్పనియ్యండి, చర్చలు జరగకుండానే గొడవ చేస్తారు ఎందుకు అని వైసీపీ నేతలకు క్లాస్ పీకారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మాధ్యమంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం పై, పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలోని చాలా మంది పిల్లలను వారి మాతృభాషలో నేర్చుకోవడాన్ని కోల్పోతుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును విద్యా మాధ్యమంగా మార్చడానికి ఆంధ్ర ప్రభుత్వం గత వారం ఒక చట్టాన్ని ఆమోదించింది, అదే సమయంలో విద్యార్థులు తెలుగు లేదా ఉర్దూను అదనపు భాషగా నేర్చుకోవాలని ఆదేశించారు. రాబోయే జూన్ నుండి విద్యా సంవత్సరంతో ప్రారంభించి, 1 వ తరగతి నుండి అన్ని సబ్జెక్టులకు బోధనా మాధ్యమంగా ఇంగ్లీషు దశలవారీగా ప్రవేశపెడుతుంది. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ తన అభిప్రాయాన్ని చెప్తూ, బలవంతంగా రుద్దటం కరెక్ట్ కాదని, పిల్లలకు, తల్లిదండ్రులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఆప్షన్స్ ఇవ్వాలని కోరింది. అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.

karnataka 30012020 2

అయితే ఈ ఇంగ్లీష్ మీడియం పై, కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్, జగన్ కు లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ లో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టటం వలన, కన్నడ భాష కనుమరుగవుతుందని సురేష్ కుమార్ లేఖలో రాసారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు వంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటున్న కన్నిడిగులకు, ఇప్పటి వరకు కన్నడలో బోధన చేస్తున్నారు. ఇప్పుడు ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, తమ విద్యార్థులు ఇబ్బందులు పడతారంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. కన్నడ భాషను తప్పనిసరి బోధనా మాధ్యమంగా, మారచాలని, అలాగే సంబంధిత పాఠశాలల్లో కన్నడ భోధన కొనసాగించడానికి చర్యలు చేపట్టాలని ఆయన ఏపి ప్రభుత్వాన్ని కోరారు.

karnataka 30012020 3

ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో కన్నడ నేర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఐసిఎస్‌ఇ సిలబస్ ఉన్న పాఠశాలల్లో, కన్నడను తప్పనిసరి రెండవ భాషగా మార్చింది అక్కడి ప్రభుత్వం. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, కర్ణాటకలో స్థిరపడిన వారు, దీంతో ఇబ్బంది పడ్డారు. అయినా సరే, ఇక్కడ ఉండే వారు కన్నడ నేర్చుకోవలసిందే అని, అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చెయ్యటంతో, సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా ఉండే కన్నడిగులు ఇబ్బంది పడతారని, అందుకే ఇప్పటికే ఉన్న కన్నడ మీడియం కొనసాగించాలని ఆయన ఉత్తరం రాసారు. మరి జగన్ దీని పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read