మళ్లీ ఇసుక గగనమైంది..అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు ర్యాంపులు మూతపడ్డాయి. ఇంటికే ఇసుక సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏకంగా డీసిల్టేషన్ ర్యాంపులను సైతం దాదాపు నెల రోజులకు పైగా మూసివేసింది. దీంతో ఇటు ర్యాంపుల్లో ఇసుక లభించడం లేదు. అటు స్టాక్ పాయింట్ల లోనూ ఇసుక కానరావడం లేదు. మొత్తానికి ఇంటికే ఇసుక సరఫరా చేస్తామనే ప్రభుత్వ నినాదం కాస్తా కార్యరూపం దాల్చలేదు. ఏపి ఎండీసీ మాత్రం ప్రస్తుతం అఖండ గోదావరి నది కుడి గట్టు వైపు ఇసుక విక్రయాలు జోరుగా సాగిస్తోంది. ఎడమ గట్టు వైపు మాత్రం ఇసుక లభిం చడం లేదు. కావాలనే ఈ విధంగా చేయడం వల్ల మరింత ప్రియంగా ఇసుక వ్యాపారం సాగవచ్చని, ఈ విధానంలో అయితే తక్కువ కాలంలో ఎక్కువ ప్రలోభం పొందవచ్చని ఏపీ ఎండిసి ఈ కృత్రిమ కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరో పణలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుండగా అధికారుల లెక్కలకు, క్షేత్రసా యిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. డీసిల్టేషన్ పాయింట్లు 6, 22 ఓపెన్ శాండ్ రీచ్ లు, 29 పట్టా భూముల్లో కలిపి 57 ర్యాంపుల్లోనే ఇసుక లభిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.

వీటి ద్వారా 30 లక్షల 85వేల 324 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్టు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఈ ఇసుకను ఏపీ ఎండీసీ విక్రయాలు సాగించాల్సి ఉంది. ఆరు డీసిల్టేషన్ ర్యాంపుల్లో ఇసుక కార్యకలా పాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్న ప్పటికీ ఆయా ర్యాంపులకు తాళాలు వేసి ఉన్నాయి. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపో యాయి. ర్యాంపు నుంచి ఇసుక బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాస్తవానికి డీసిల్టేషన్ ర్యాంపుల నుంచి ఇసుకను స్టాక్ పాయింట్లలోకి చేర్చి అక్కడ నుంచి ఇంటికే నేరుగా ఇసుకను చేర్చే విధంగా డిసిల్టేషన్ ర్యాంపుల్లో ఇసుక వెలికితీత నిలుపుదల చేశారు. ఇందుకు సంబంధించి ట్రాన్స్పర్టు లారీల ఛార్జీలు ఎంత చెల్లించాలనే విషయం కూడా ఇంకా తేలలేదు. గత నెల రోజులకు పైగా రూ. లక్షలకు పైగా ఖర్చు చేసి సిద్ధం చేసిన స్టాక్ పాయింట్లు నిరుపయోగంగా ఉన్నాయి. వేయింగ్ మిషన్లు కూడా అక్కడ ఖాళీగా ఉన్నాయి. దీనితో పాటు 17 ఓపెన్ ర్యాంపులు, 18 బోట్ల ద్వారా ఇసుక తీసే ర్యాంపులు, 8 పట్టా భూముల్లో ఇసుక తీసే ప్రాంతాలు వెరసి 31 చోట్ల ఇసుక లభిస్తున్నట్టుగా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

ట్రాక్టర్లతో డోర్ డెలివరీ 1282 ఎంటిలు, ఆరు చక్రాల లారీలతో 1840 ఎంటీలు, 10 చక్రాల లారీలతో 2772 ఎంటీలు రవాణా జరిగినట్టు అధికారులు నివేదిస్తు న్నారు. జనవరి 5వ తేదీ వరకు విశాఖకు, స్థానిక అవసరాలకు మొత్తం 11లక్షల 76వేల 518 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఏపీ ఎండీసీ వంగలపూడి, పులిదిండి, జొన్నాడ, కాటవరం స్టాక్ పాయింట్లు పెట్టినట్టుగా చెప్పినప్పటికీ అవేవీ కన్పించడం లేదు. పట్టా భూముల్లో ఇసుక తీసుకు నేందుకు అనుమతి కావాల్సిందిగా ఎడమ గట్టు వైపు మొత్తం 81 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఐదు తిరస్కరించారు. మిగిలినవి పరిశీ లనలో ఉన్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 253 ట్రాక్టర్లకు, 184 ఆరు చక్రాల లారీలకు, 82 10 చక్రాల లారీలకు జీపీఎస్ అనుసంధానం చేసినట్టుగా చెబుతు న్నారు. కానీ సక్రమ విధానంలో వీటిని నిర్వహించడం లేదని క్షేత్ర స్థాయిలో తెలుస్తోంది. ఏదేమైనప్పటి ఇసుక డోర్ డెలివరీ చేస్తామని చెప్పి రాజమహేంద్రవరంలోని డీ సిల్టేషన్ ర్యాంపులను మూసివేసి నెల రోజులు కావస్తున్నా ఇంకా ఏపీ ఎండీసీ అధికారులు చర్యలు తీసుకోలేదు. రూ. లక్షలు ఖర్చు చేసిన స్టాక్ పాయింట్లలో వేయింగ్ మిషన్లకు పని లేక నిరుపయోగం పడి ఉన్నాయి.

పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసుల ఆమోదం మూలంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల వాటాను 41 శాతంగా నిర్ధారించడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా, దక్షిణాది రాష్ట్రాల వాటాలు తగ్గిపోయాయి. గత సంవ త్సరం అంటే 2019-20 వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.305 శాతం ఉండగా పదిహేనవ ఆర్థిక సంఘం సిఫారసుల ఆమోదం మూలంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోకసభలో ప్రతిపాదిచిన 2020-21 వార్షిక బడ్జెట్ లో ఇది 4.111 శాతానికి పడిపో యింది. గత బడ్జెట్ లో ఏ.పికి 4.305 శాతం వాటా కింద 28,242.39 రూపాయలు లభిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ లో 4.111 వాటా కింద 32,287.68 కోట్లు లభించాయి.ఇదే విధంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వాటా కూడా తగ్గిపోయింది. 2019-20 వార్షిక బడ్జెట్ లో తెలంగాణకు 2.487 శాతం కింద 15,987.59 కోట్ల రూపాయలు లభిస్తే ఈ సంవ త్సరం బడ్జెట్లో 2.188 శాతం వాటా కింద 16,728.58 కోట్లు లభించటం గమనార్హం. కేంద్ర బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల వాటా శాతం తగ్గినా నిధుల కేటాయింపులో పెరుగుదల ఉన్నది.

commission 02022020 2

గత సంవత్సరం లభించినంత వాటా లభిస్తే రెండు రాష్ట్రాల మొత్తం కేటాయింపులు మరింత పెరిగేవి. ఆంధ్రా వాదా కేంద్ర బడ్జెట్ లో ఏపీ వాటా 4.111 శాతం కింద మొత్తం 32,287.68 కోట్లు లభించాయి. కార్పొరేషన్ పన్నుల రూపంలో 9,916.22 కోట్లు, ఆదాయం పన్ను వాటా కింద 9,220.81 కోట్లు, ఆస్తిపన్ను కింద 38 వేలు, కేంద్ర జీఎనీ కింద 9,757.50 కోట్లు, కస్టమ్స్ పన్ను రూపంలో 2012.13 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నుల రూపంలో 1814.66 కోట్లు, సేవా పన్నుల వాటా నుండి 17.19 కోట్ల రూపా యలు లభించాయి. తెలంగాణ వాదా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వాటా.. 2.138 శాతం కింద మొత్తం 16,726.58 కోట్ల రూపాయలు లభించాయి. కార్పొరేషన్ పన్నుల రూపంలో 5,145.05 కోట్లు, ఆదాయం పన్ను వాటా కింద 4,788.97 కోట్లు, ఆస్తిపన్ను వాటాగా 17 వేలు, కేంద్ర జి.ఎస్.టి పన్నుల నుంచి 5,062.70 కోట్లు, కస్టమ్స్ పన్నుల రూపంలో 1044 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నుల కింద 682.11 కోట్లు, సేవా పన్నుల కింద 8.92 లక్షలు లభించాయి.

commission 02022020 3

అయితే 15వ ఆర్ధిక సంఘం పై, చంద్రబాబు ఆనాడే ప్రతిఘటించారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఢిల్లీ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని చెప్పారు. 15 ఆర్ధిక సంఘం సిఫార్సుల తో దక్షిణాది రాష్ట్రాలు దెబ్బ తింటాయి అని చెప్పారు. కేరళ, కర్ణాటక తప్ప, తెలంగాణ, తమిళనాడు వినలేదు. తెలంగాణ అయితే, చంద్రబాబుని ఈ విషయంలో విమర్శించింది కూడా. తెలంగాణనే ఎక్కువ నష్టపొయిద్దీ అని లెక్కలేసి మరీ చెప్పినా, మాకేమీ నష్టం రాదు అని .. తెలంగాణ ప్రబుత్వం, చంద్రబాబు పోరాటానికి కలిసి రాలేదు. చంద్రబాబు చెప్పినట్టే ఆంధ్రకంటే తెలంగాణనే ఎక్కువ నష్టపోయింది. తెలంగాణ 2,383 కోట్లు నష్టపోతే, ఆంధ్ర 1521 కోట్లు నష్టపోయింది. అయితే ఇప్పుడు ‪ఇప్పుడు కేసీఆర్ మాత్రం, 15వ ఆర్దికసంఘంపేరుతో తెలంగాణకు అన్యాయం చేశారంటున్నారు. నాడు చంద్రబాబు చెప్తే, ఆయన్ను విమర్శించి, ఇప్పుడు మాత్రం లబోదిబో అంటున్నారు.

ఎవరు చెప్పినా వినని ఆంధ్రప్రదేశం ప్రభుత్వం, మూడు రాజధానుల దిశగా ముందడుగులు వేస్తుంది. మూడు రాజధానులు అమలు చేయాలని నిర్ణయానికి కట్టుబడి తదనుగుణంగా కార్యచరణ చేపట్టింది. ఇటీవలే మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని విస్తరించింది. ఈ క్రమంలో న్యాయ రాజధానిగా కర్నూలును సంసిద్ధం చేస్తుంది. శాసన రాజధాని అమరావతిలో,పరిపాలనా రాజధాని విశాఖపట్టణంలో, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా, అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా, పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చేయడం ద్వారా రాష్ట్రమంతటా సమతుల్యంగా అభివృద్ధి జరుగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. అదే విషయాన్ని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జగన్ స్పష్టం చేసారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఓటింగ్ లో ఆమోదించ బడిన ఈ బిల్లును శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించారు. రాజకీయంగా సంచలనం సృ ష్టించిన ఈ పరిణామాన్ని జగన్ తీవ్రం గానే తీసుకుంది.

kurnool 0202020 2

తన నిర్ణయానికే ఎదురు తిరగరాని, దాంతో ఈ క్రమంలో శాసనసభ ఏకంగా మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ బిల్లు కేంద్రం పరిశీలనలో ఉంది. మరో పక్క ఈ మూడు రాజధానుల పై రైతులు హైకోర్టులో ఫిర్యాదు చేసారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాజధానిలో కార్యాలయాలను వేటిని తరలించవద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే ఆ ఖర్చుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుం దని భావించారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను వెలగపూడి సచివాలయం నుంచి కర్నూలుకు తరలించాలని, రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చెయ్యటం సంచలనంగా మారింది. ఇకపై ఆ రెండు కార్యాలయాలు కర్నూలు నుంచి పనిచేస్తాయి. ఈ రెండు కార్యాలయాలు మరో వారం రోజులలోపు తమ కార్యాలయాల కార్యనిర్వహణను కర్నూ లు నుంచి మొదలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

kurnool 0202020 3

శుక్రవారం అర్ధరాత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ ఉత్తర్వులను ఇచ్చారు. ఈ రెండు విభాగాల అధికా రులు ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారంటున్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు దిశలో భాగంగా ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుందంటున్నారు. ఇందుకు న్యాయవరంగా ఎటువంటి కోర్టు దిక్కారణ వంటి అంశాలు తలెత్తకుండా న్యా యనిపుణుల సలహాలను తీసుకుని ఈ చర్యను చేపట్టినట్లు చెబుతున్నారు. అయితే ఒక పక్క కోర్ట్ స్పష్టంగా, ఏ ఒక్క కార్యాలయం తరలించవద్దు అని ప్రభుత్వానికి చెప్పి, ఖర్చులు మీ నుంచే వసూలు చేస్తాం అని చెప్పినా, ప్రభుత్వం మాత్రం కోర్ట్ ని కూడా పట్టించుకోవటం లేదు అనే వాదన వినిపిస్తుంది. మరి కోర్ట్, ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్రం పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. విభజన అంశా లేవీ బడ్జెట్ లో ప్రస్తావనకు రాలేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం నిర్మాణం, కడపలో ఉక్కు కర్మాగారం, భోగాపురంలో అంతర్జా తీయ విమానాశ్రయం, విజయవాడ, విశాఖపట్నంలో మెట్రోరై ళ్లతో పాటు జాతీయ సంస్థలనేకం మంజూరు కావాల్సి ఉంది. వీటితోపాటు రూ. 10వేల 200 కోట్ల రెవెన్యూ లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా కేంద్రమే అమలు చేయాలి. వీటిలో ఏదీ మచ్చుకైనా బడ్జెట్ లో చోటుచేసుకోక పోవటం రాష్ట్ర ప్రజల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రత్యేక హోదా అంశం ఎన్నికల్లో హామీకి, ప్రచారానికి మాత్రమే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హోదా అమలుపై గతంలో, జగన్ మోహన్ రెడ్డి పెద్దఎత్తున ఉద్యమాలు కూడా చ్జేసరి. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రా నికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ప్రచారం చేసారు. చంద్రబాబు వల్ల కాలేదని, తాను కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని, గెలిపించాలని కోరారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ నుంచి వైదొలగటంతో రాష్ట్రానికి విభజన హామీలు అమలుకాలేదని, తాము అధికా రంలోకి వస్తే హోదాతో పాటు అన్ని సాధిస్తామని వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజ లకు భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి వీటి పై పెద్దగా శ్రద్ధ పెట్టింది లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించారు. అయితే రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. జగన్ మోహన్ రెడ్డి కాని, ఢిల్లీలో లాబయింగ్ చేసే విజయసాయి రెడ్డి కాని, 22 ఎంపీలు కాని, రాష్ట్రానికి నిధులు తేవటంలో, ప్రాజెక్టులు తేవటంలో ఘోరంగా విఫలం అయ్యారు. 22 మంది ఉన్నా, బలంగా కేంద్రం ముందు వాదించలేక పోయారు.

గతంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం హయాంలో రాజధాని నిర్మాణానికి రూ. 2500 కోట్లు మంజూరు చేసింది. ఎయిమ్స్ లాంటి కొన్ని జాతీయ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. రాజధానికి కేటాయించిన రూ. 2500 కోట్ల నిధుల్లో వెయ్యి కోట్లు విజయవాడ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీకి కేటాయించినట్లు చెపుతున్నారు. దీంతో రాజధాని నిర్మాణానికి గత ఐదేళ్ల కాలంలో కేవలం రూ. 15 వందల కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 7 జిల్లాలకు రూ. 50 కోట్ల చొప్పున ప్రకటించిన వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ నిధులు కూడా రాష్ట్రానికి అందటం లేదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతామని వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. పార్లమెంట్ లో 20మందికి పైగా సభ్యులు ఉంటే ఏదైనా సాధించగల మని ధీమాగా చెప్పింది. మూడు నెలల ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిసేందుకు మూడు సార్లు ప్రయత్నించినా జగన్ కు అపాయింట్మెంట్ దొరకలేదు. బడ్జెట్ లో అయినా రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశించారు. అదీ నెరవేరలేదు. దీనికితోడు ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటంతో తాజా కేంద్ర బడ్జెట్లో అసలు రాజధాని ఊసే లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఇక పోలవరం సంగతి ఆ దేవుడికే తెలియాలి. మొత్తానికి 22 మంది + జగన్ + విజయసాయి రెడ్డి, కేంద్రం నుంచి సాధించింది సున్నా అనే చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read