అమరావతిలో రైతులు గత 45 రోజులుగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరు కూడా వచ్చి, వారి బాధ ఆలకించలేదు. ఒక్క మంత్రి కాని, ఒక్క అధికారి కాని వచ్చి, వారిస్ సమస్యల గురించి వినలేదు. అలా రాక పోగా, వారిని పైడ్ ఆర్టిస్ట్ లు అని, మంత్రులే అన్నారు. అమరావతి ప్రాంతాన్ని ఎడారి అన్నారు. అమరావతి మహిళలను కూకటపల్లి ఆంటీలు అన్నారు. ఇలా అనేక రకాలుగా హేళన చేసారు. అలాగే, పోలీసులను పెట్టి, ఇబ్బందులు పెట్టారు. ఎన్ని చేసినా, ఏమి చేసినా, రైతులు మాత్రం, శాంతియుతంగానే వారి ఆందోళనలు కొనసాగించారు. ఒక్క అసెంబ్లీ ముట్టడి తప్పితే, ఎక్కడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పిలుపు ఇవ్వలేదు. ఇన్ని చేసినా, ఎంత జరిగినా, ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు. అయితే, వీరు మాత్రం గత 45 రోజులుగా, ఓపికగా, ఓర్పుగా, ప్రభుత్వం విన్నా, వినక పోయినా, వారికి ఉన్న హక్కులు ఉపయోగించుకుని, ఏ నాటికైనా, ఈ ప్రభుత్వం తమ గోడు వినకపోతుందా అనే ఆశతో ఉన్నారు.

lavu 31012020 2

అమరావతి రైతులు ఎంత మంచి వారు అంటే, ఒక పక్క వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు, మాట్లాడుతున్నా, వారి జీవితాలు తారు మారు చేసే నిర్ణయం తీసుకున్నా, తమ వద్దకు వచ్చిన వైసీపీ ఎంపీ పై ఎలాంటి పరుష పద జాలం ఉపయోగించకుండా ఉన్నారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు, నరసరావుపేట వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వచ్చారు. వారికి మద్దతు పలికారు. ఇక్కడ భూములు ఇచ్చిన ఎవరికి అన్యాయం జరగదని ఆయన అన్నారు. ప్రభుత్వ కమిటీ వచ్చి మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటుందని చెప్పారు. రైతుల కష్టాలు మాకు తెలుసని అన్నారు. కమిటీ వచ్చినప్పుడు మీ అందరి అభిప్రాయాలు చెప్పండి, అంటూ అక్కడ రైతులను ఉద్దేశించి ఎంపీ వ్యాఖ్యానించారు.

lavu 310120203

కమిటీ వచ్చినప్పుడు అభిప్రాయాలు చెప్పండి, మీరు దూరంగా ఉండవద్దు, రైతులు అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటూ అక్కడ రైతులకు, ఎంపీ చెప్పారు. అయితే, అక్కడ రైతులు ఈ మాటలు అన్నీ విని, అమరావతి ని కొనసాగిస్తూ మాతో చర్చకు రండి అని వైసీపీ ఎంపీకి తేల్చి చెప్పారు. రాజధానికి అనుకూలమా కాదా ముందు చెప్పాలి అని మందడంలో వైసీపీ మాట్లాడుతుండగా రైతుల నినాదాలు చేసారు. ఆయన మాత్రం, ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుంది, ఆప్పుడు అభిప్రాయలు చెప్పండి, అని చెప్పారు. అయితే, ఇంత ఆందోళనలో, ఉండి కూడా, గత 45 రోజులుగా తమ వద్దకు ఎవరూ రాకపోయినా, వైసీపీ ఎంపీ తమ వద్దకు వచ్చినా, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడలేదు అంటే, అక్కడ ప్రజలు ఎలాంటి వారో అర్ధం చేసుకోవచ్చు.

సీమ ద్రోహి ఎవరు? కేసీఆర్‌కు దాసోహం.. సీమకు జలద్రోహం..  ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రాంతాల మధ్య చిచ్చు.. భూమా అఖిల ప్రియ... "ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి కృష్ణా నదిలో దాదాపు 750 టీఎంసీలు నీరు సముద్రంలో కలిసిపోయింది. 8సార్లు శ్రీశైలం గేట్లు ఎత్తినా రాయలసీమకు నీటి కేటాయింపుల్లో వైఫల్యం చెందింది. సీమలో మొత్తం 11,048 చెరువుల్లో 79.33 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉంటే కేవలం 17.22 టీఎంసీల నీటిని అందించడం జగన్మోహన్‌రెడ్డి పాలనా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అనంతపురంలో 1,459 చెరువులు ఉంటే కేవలం 50 చెరువులు మాత్రమే నింపడం జగన్‌ అసమర్ధ పాలనకు నిదర్శనం. జిల్లాలో మొత్తం 11 జలాశయాల పూర్తి నిల్వ సామర్ధ్యం 37.7 టీఎంసీలు అయితే కేవలం 18.88 టీఎంసీలే నిల్వ ఉంచారంటే ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుంది. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనలో కేసీ కెనాల్‌ ద్వారా 3.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారు. కాని జగన్మోహన్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌కు భయపడి శ్రీశైలంలో 871 అడుగుల నీట మట్టం నేడున్నా నీరు వదల్లేదు. దీని వల్ల సాగు భూములకు నీటి కొరత ఏర్పడింది. పంట దెబ్బ తినే స్థితి ఏర్పడింది. శ్రీశైలంలో 854 అడుగుల వరకు నీరు విడుదల చేయవచ్చు. ఇప్పటి వరకు కేసీఆర్‌ కెనాల్‌ ద్వారా జగన్‌ ప్రభుత్వం కేవలం 2.30 లక్షల ఎకరాలకు మాత్రమే అందించడం సీమ ప్రజలకు చేస్తున్న అన్యాయం కాదా? గుండ్రేలకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3వేల కోట్లతో సాంక్షన్‌ ఇస్తే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా క్యాన్సిల్‌ చేశారు."

"గుండ్రేవుల పూర్తి అయితే కేసీకెనాల్‌ ఆయకట్టు సస్యశ్యామలం అయ్యి ఉండేది. ప్రస్తుతం రాయలసీమ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే వచ్చే వేసవి కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఇప్పటి వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్‌ పుణ్యమా అని తాగు నీరు దొరకక సీమ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటారేమో అన్న ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల పూర్తిగా దాదాపు రూ.26 వేల కోట్లు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి జలవనరుల సమీక్షలో నిర్ధారించారు. అయితే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టులకు ఖర్చు చేయలేకపోవడం, గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనులను కక్షపూరితంగా ఆపేయడం జగన్మోహన్‌రెడ్డి రాయలసీమ ద్రోహిగా నిలబెడుతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పులివెందులకు నీరందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అంతే కాకుండా రూ.700 కోట్లు గండికోట రైతులకు అందించారు. చత్రావతి రిజర్వాయర్‌ రైతులకు రూ.50 కోట్లు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమకు దాదాపు 150 టీఎంసీలు అందించారు. రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లు అన్ని కూడా నింపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది."

"జగన్మోహన్‌రెడ్డి ధౌర్జన్యానికి కియా అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాయి. కడప స్టీల్‌ ప్లాంట్‌కు టిడిపి ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించి ప్రారంభోత్సవం చేసింది. జగన్‌ ప్రభుత్వం ఈ స్టీల్‌ ఫ్యాక్టరీకి ఎందుకు మరో 2వేల కోట్లు కేటాయించలేదు. ఓర్వకల్లు విమానాశ్రయం మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం కనీసం విమానాలు నడపలేకపోయింది. మా ప్రభుత్వం సౌర, పవన, విద్యుత్‌ ప్లాంటులు నిర్మించి 13వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. ఈ ప్రభుత్వం ఈ పరిశ్రమల విద్యుత్‌ ప్యానళ్లు ద్వంసం చేసింది. పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నది. కాళహస్తి వద్ద ఎన్‌.టి.పి.సీ బెల్‌ పరిశ్రమ తరలిపోతుంటే ఆపే కృషి ఏమి చేశారు? రేణిగుంట వద్ద రిలయన్స్‌ ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ తరలిపోయే విధంగా చేశారు. ఈ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరలించడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. తమ పరిధిలో లేని హైకోర్టు తరలింపును కర్నూలుకు ఇస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలుకు రాజధాని ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నారు. ఉంటే రాజధాని అమరావతిలో ఉండాలి. తరలించదలచుకుంటే శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలుకు ఇవ్వాలి."

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, సమయం దొరికిన ప్రతిసారి, వైసీపీని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం, డీడీఆర్‌సీ నుంచి వాకౌట్‌ చేయడం పై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన స్పందన తెలియ చేసారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ లో ఎంపీగా ఉన్న తనంకు, కనీస్ ప్రోటోకాల్ ఇవ్వకుండా, స్టేజి మీద అధికారులు ఉండటంతో తాను, కలత చెందానని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్న అధికారుల కంటే, ఎంపీలుగా ఉన్న తామే ఎక్కువనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. దిశ కమిటీకి, లోక్‌సభలో సబ్‌ ఆర్డినేట్‌ లెజిస్లేటివ్‌ కమిటీకి తాను చైర్మన్‌గా ఉన్నానని, పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలిలో కూడా తనకు, సరైన స్థానం ఉంటుందని అనుకున్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనకు నిన్న జరిగిన అవమానం, తనకు కాదని, తనకు ఓట్లు వేసిన ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నానని అన్నారు.

raghu 30012020 2

ఎంపీలమైన మాకంటే, అధికారులకే ఎక్కవ ప్రోటోకాల్ ఉంది అంటే, తాను ఇక ఇలాంటి మీటింగ్లకు రానని అన్నారు. నిన్న తనకు జరిగిన అవమానం పై, జిల్లా ఇంచార్జ్ మంత్రి అయిన, మంత్రి పేర్ని నాని క్షమాపణ చెబుతారని అనుకుంటున్నానన్నారు. భవిష్యత్తులో జరగబోయే ఇలాంటి సమావేశాల్లో, తప్పులు జరగకుండా చూసుకుంటారని, ఆశిస్తున్నానాని అన్నారు. అలా కాకుండా, ఇలాగే చేస్తే కనుకు, నేను ఇక ఇలాంటి మీటింగ్లకి రానని అన్నారు. నిన్న జరిగిన డీడీఆర్‌సీ సమావేశం, జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి, హాజరైన ఎంపీలకు వేదిక పై సీటు వెయ్యలేదు. ఎంపీలకు సీటు ఎందుకు కేటాయించలేదని రఘురామ కృష్ణంరాజు అధికారులను ప్రశ్నించారు.

raghu 30012020 13

ఎంపీలకు వేదిక పై సీట్లు కేటాయించలేదని సమాధానం వచ్చింది. దీంతో కనీసం వేదిక మీద ఎంపీలకు సీటు కూడా లేకుండా ఉండటాన్ని, అవమానంగా భావించి, మనస్తాపానికి గురైన ఎంపీ రఘురామ కృష్ణంరాజు అక్కడ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఆయన బాటలోనే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ కూడా సభలో నుంచి వెళ్ళిపోయారు. మరి కొద్ది సేపటికి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ సమావేశంలో మాట్లాడారు. ఎంపీలకు గౌరవం లేదని, ప్రోటోకాల్ పాటించలేదని, కనీసం సీటు వెయ్యకపోవటం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమం చివర్లో మాట్లాడిన మంత్రి పేర్ని నానిని, నేను మూడు సార్లు దఫాలు ఎమ్మెల్యేగా ఉన్నానని, ప్రోటోకాల్‌ ప్రకారమే అన్నీ చేసామని, నిబంధనలు పాటించానన్నారు, ఒకవేళ పాటించలేదని నిరూపిస్తే క్షమాపణ చెబుతానన్నారు.

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని అఖిలపక్ష పోరాట సమితి నిర్ణయించింది. ఆందోళనలు, నిరసనలు తారాస్థాయిలో జరుగుతు న్నప్పటికీ జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించలేకపోతున్నా మన్న అభిప్రాయాలు రాజధాని రైతాంగంలో వ్యక్తమవుతున్నాయి. ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా దశలవారీ ప్రణాళిక రూపొందించారు. దానిలో భాగంగా ఈ నెల 31న అఖిలపక్ష బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్ళనుంది. తొలుత వారంతా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి పరిస్తితి వివరించాలని నిర్ణయించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు జాతీయ స్థాయిలో స్పషమైన ప్రకటన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ లభించటం కష్టమయినందున పార్లమంటు సెంట్రల్ హాల్ వద్ద నేరుగా కలవాలని భావిస్తున్నారు.

అనంతరం ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాల నాయకులను కలవాలని నిర్ణయించారు. అదే విధంగా జాతీయ మీడియా దృష్టికి అమరావతి సమస్యను తీసుకెళ్లాలని జేఏసీ నాయకులు తలపోస్తున్నారు. దానిలో భాగంగా ఢిల్లీ కేంద్రంగా పనిచేసే మీడియా సంస్థల అధినేతలను కలిసి అమరావతిలో చోటు చేసుకున్న పరిణామాలపై నివేదిక రూపంలో తెలియజేసి తమ న్యాయబద్ధమైన పోరాటానికి మద్దతు ఇచ్చేలా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి రెండవ వారంలో రెండవ దశ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. రెండవ దశలో దాదాపు వందమంది మహిళా రైతులను ఢిల్లీకి తీసుకెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. కనీసం 3 లేదా 4రోజుల పాటు ధర్నా చేపట్టాలని జేఏసీ తలపోస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగు తున్నందున అవి ముగిసిన అనంతరం ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ ధర్నాకు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీతో పాటు వామపక్ష పార్టీల అగ్రనేతలు వచ్చి సంఘీభావం తెలిపే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇక మరో పక్క, అమరావతి పరిరక్షణ సమితి గౌరవ సలహాదారుడిగా డాక్టర్ జి.వి.ఆర్.శాస్త్రి నియమితులయ్యారు. రాజధాని ఉద్యమంలో తమకు సలహాలను అందజేయాలని జేఏసీ చేసిన ప్రతిపాదనకు శాస్త్రి అంగీకారం తెలిపారు. ఇక నుంచి చేపట్టే పలు కార్యక్రమాలను ఆయన రూపకల్పన చేస్తారని జేఏసీ ప్రకటించింది. శాస్త్రి న్యూఢిల్లీ ఐఐటీ నుంచి పీహెచ్ డీ పొందారు. ప్రస్తుతం ఆయన సీఐడీసీ (కోస్టల్ ఇండియా డెవలప్ మెంట్ కౌన్సిల్) చైర్మన్ గా వ్యవహ రిస్తున్నారు. ఈయనకు బీజేపీ అధిష్టానంతో, దగ్గర సంబంధాలు ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read