ఈ రోజు శుక్రవారం కావటంతో, ప్రతి వారం లాగే, ఈ వారం కూడా, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు విచారణ జరిగింది. అయితే గత శుక్రవారం విచారణ సందర్భంగా, ఈ శుక్రవారం, జగన్ మోహన్ రెడ్డి, కచ్చితంగా సిబిఐ కోర్ట్ కు హాజరు అవ్వాలి అంటూ, సిబిఐ కోర్ట్ స్పష్టం చేసింది. అయితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, కోర్ట్ కు వెళ్లక పోవటంతో, ఏమి జరుగుతుందా, జగన్ కు కోర్ట్ నోటీసులు ఇస్తుందా, లేక పొతే, ఏదైనా అనూహ్య నిర్ణయం జరుగుతుందా అని అందరూ అనుకున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి, తరుపు న్యాయవాది ఈ రోజు కూడా అబ్సెంట్ పిటీషన్ వెయ్యటంతో, కోర్ట్ దానికి అంగీకరించింది. తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ మోహన్ రెడ్డి హైకోర్ట్ లో కేసు వెయ్యటంతో, ఈ విషయం కూడా, సిబిఐ కోర్ట్ ద్రుష్టికి తెచ్చారు. హైకోర్ట్ లో పిటీషన్ ఉండటంతో, జగన్ ఈ సారి విచారణకు రాకపోయినా, సిబిఐ కోర్ట్ ఏమి అనలేదు. అయితే, సిబిఐ కోర్ట్ లో, ఏమి జరుగుతుందా అని అనుకున్న ప్రజలకు, అనూహ్యంగా ఇంకో వార్త ఆశ్చర్యానికి గురి చేసింది.

jagan 32102020 2

అక్రమఆస్తుల కేసు విచారణలో, వారం వారం కోర్ట్ కు రాకుండా, తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలి అని కోరుతూ, జగన్ మోహన్ రెడ్డి హైకోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సిబిఐ కోర్ట్ తన పిటీషన్ ని తిరస్కరించటంతో, జగన్ హైకోర్ట్ లో ఈ పిటీషన్ వేసారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని అని, ఎన్నో పనులు ఉంటాయని, అందుకే తాను విచారణకు హాజరు కాలేనని, తన తరుపున సహ నిందితుడు వస్తారని, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ వేసి కూడా వారం దాటిపోయింది. అయితే, ఇప్పుడు ఏమైందో ఏమో కాని, ఈ రోజు అనూహ్యంగా ఆగమేఘాల పై, తాను హైకోర్ట్ లో వేసిన పిటీషన్ ను జగన్ మోహన్ రెడ్డి వెనక్కు తీసుకున్నారు. జగన్ తరుపు న్యాయవాది, హైకోర్ట్ లో వేసిన ఈ పిటీషన్ ను వెనక్కు తీసుకున్నారు.

jagan 32102020 3

అయితే బయటకు ఏమి జరిగిందో చెప్పలేదు కాని, పిటీషన్ లో ఏదో తప్పులు ఉన్నాయని, ఆ తప్పులు సరి దిద్ది త్వరలోనే మరో పిటీషన్ వేస్తామని, లీకులు ఇచ్చారు. దాదాపుగా వారం తరువాత, తప్పులను గుర్తించటం, అది కూడా ఒక వాయిదా పడిన తరువాత, ఇలా పిటీషన్ వెనక్కు తీసుకోవటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న, వ్యక్తీ పిటీషన్ లో తప్పులు ఉండటం ఏమిటా అని అనుకుంటున్నారు. అయితే, దీని వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈ రోజు విచారణ తప్పించుకోవటానికి, ఇలా చేసారా అని కొంత మంది వాపోతున్నారు. మరో పక్క, ఈ రోజు హైకోర్ట్ లో, ఈడీ విచారణకు కూడా తాను వారం వారం హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని, జగన్ హై కోర్ట్ లో పిటీషన్ వేసారు.

ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు హయంలో, జాస్తి కృష్ణ కిషోర్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ గా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవటంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రానికి అనేక కంపెనీ వచ్చాయి అంటే, కృష్ణ కిషోర్ కూడా ఒక కారణంగా చెప్ప వచ్చు. అయితే, ప్రభుత్వం మారగానే, కృష్ణ కిషోర్ పై, ఇప్పటి ప్రభుత్వం ఒక వైఖరితో ముందుకు వెళ్ళింది. ప్రభుత్వ తీరు నచ్చక, తన మాతృ సంస్థకు వెళ్ళిపోతానని, కేంద్ర సర్వీస్లకు వెళ్ళటానికి తనను రిలీవ్ చెయ్యాలని, కృష్ణ కిషోర్ ప్రభుత్వాన్ని అడగగా, ఏపి ప్రభుత్వం అనూహ్యంగా, కృష్ణ కిషోర్ కి జర్క్ ఇచ్చింది. ఆయన అవినీతి చేసారని, అందుకే ఆయన పై ఎంక్వయిరీ చేస్తున్నామని, ఆయన్ను రిలీవ్ చెయ్యటం కుదరదు అని చెప్పింది. ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అయితే, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కృష్ణ కిషోర్, క్యాట్ వద్ద ఫిర్యాదు చేసారు. క్యాట్ కూడా ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది.

cs 31012020 2

ఒక అధికారి పై, ప్రభుత్వం ఇలా కక్ష కట్టటం ఏమిటి అని ప్రశ్నించింది. అయితే, ఈ కేసు వాయిదా పడటంతో, ఈ రోజు మరోసారి ఈ కేసు పై, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్) లో వాదనలు జరిగాయి. ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు, జీతం బకాయలు చెల్లింపులో ఎందుకు లేట్ అయ్యింది అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అయితే, చీఫ్ సెక్రటరీని పిలిపిస్తామంటూ, ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. దీంతో, ఏపి ప్రభుత్వం, ఈ రోజు హుటాహుటిన, ఆయనకు ఇవ్వాల్సిన బకాయలను విడుదల చేసింది. అయినా సరే, ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు జీతం ఇవ్వటంలో లేట్ అయ్యిందో, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరి వివరణ ఇవ్వాలి అంటూ క్యాట్ కోరింది.

cs 31012020 3

క్యాట్ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, సభ్యుడు సుధాకర్‌తో కూడిన బెంచ్‌ ఇవాళ విచారణ చేస్తూ, ఈ రోజు, ఈ ఆదేశాలు ఇచ్చింది. రెండు వారాల్లోగా, కృష్ణ కిషోర్ కు, వేతన బకాయిలు ఇవ్వాలి అంటూ, డిసెంబర్ 24న, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటి వరకు స్పందించలేదు అంటూ, కృష్ణ కిశోర్‌ తరఫు న్యాయవాది క్యాట్‌కు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న క్యాట్ ప్రభుత్వం పై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, ఇలా అయితే చీఫ్ సెక్రెటరిని పిలిపించి వివరణ అడుగుతాం అని చెప్పి, మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణ సందర్భంగా, ప్రభుత్వం తరుపున న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ, తాము వేతనాలు ఇప్పుడే చెల్లించాం అని చెప్పారు. అయినా సరే, ట్రిబ్యునల్ తమకు ఎందుకు లేట్ అయ్యిందో వివరణ ఇవ్వాలని, సీఎస్‌ను ఆదేశించింది. తమకు కొంచెం టైం కావాలని ప్రభుత్వం కోరటంతో, కేసును ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.

రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనావిధానాల్లో విఫలమైన వైసీపీప్రభుత్వం, చివరికి పేదలకు మెరుగైన వైద్యసేవలందించడంలో కూడా ఘోరాతిఘోరంగా విఫలమైం దని, దానికి పెద్దఉదాహరణ ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఘటనేనని టీడీపీనేత, ఎమ్మెల్సీ పీ.అశోక్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏలూరుప్రభుత్వాసుపత్రి శవాగారం లోని మృతదేహం కళ్లను ఎలుకలు పీక్కుతినడం చూస్తుంటే, వైసీపీప్రభుత్వం ఆసుపత్రుల నిర్వహణను ఎంతచిత్తశుద్ధితో అమలుచేస్తోందో అర్థమవుతోందన్నారు. గతంలో చంద్రబాబుప్రభుత్వంలో పేదలఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని దోమలపైయుద్ధం కార్యక్రమాన్ని ప్రకటిస్తే, అసెంబ్లీసాక్షిగా అవహేళనలు చేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జరిగినఘటనపై ఏం సమాధానం చెబుతాడని అశోక్‌బాబు ప్రశ్నించారు. టీడీపీప్రభుత్వం ప్రజారోగ్యం కోసం విరివిగా నిధులుకేటాయించి, పారిశుధ్యనిర్వహణ, పెస్ట్‌కంట్రోల్‌ వంటిచర్యలను సమర్థవంతంగా నిర్వహించిం దన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, దోమలనివారణకు నిధులు కేటాయించి చర్యలు తీసుకున్న టీడీపీప్రభుత్వాన్ని అపహాస్యం చేసిన వైసీపీ, నేడు అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందన్నారు.

చంద్రబాబు హాయాంలో జరిగినఘటనలు, ఆసుపత్రులనిర్వహణకు తీసుకున్నచర్యలను తప్పుపట్టిన వైసీపీమంత్రులు, ఏలూరు ఆసుపత్రి ఘటనకు బాధ్యతవహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్‌చేశారు. వైద్యరంగానికి అరకొరగా నిధులిస్తూ, ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించిన జగన్‌సర్కారు, పేదలకు మెరుగైన వైద్యమందకుం డా మోకాలడ్డిందన్నారు. ప్రైవేటుఆసుపత్రులు ఆరోగ్యశ్రీరోగులకు మెరుగైన సేవలందిం చాలంటే, వాటికి సకాలంలో నిధులు అందాలని, ఇన్సూరెన్స్‌కంపెనీలు నిధులవిషయం లో కోతలుపెడుతుండటంతో, ప్రైవేటు యాజమాన్యాలు రోగులను నిర్లక్ష్యం చేస్తున్నాయ న్నారు. గతంలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్టార్‌హెల్త్‌ ఇన్సూరెన్స్‌కి అప్పగించడంవల్ల మెరుగైన వైద్యసేవలందక పేదలు నానాఇబ్బందులు పడిన విషయాన్ని జగన్‌సర్కారు గుర్తించాలని అశోక్‌బాబు సూచించారు.

చమురు, మద్యం, ఇసుకధరలుపెంచిన జగన్‌సర్కారు పేదలు, మధ్యతరగతివారికి చుక్కలుచూపుతోందని, వైద్యరంగంలోకూడా ఆయావర్గాలకు అన్యాయం జరిగేలా అరకొరగా నిధులు కేటాయిస్తోందన్నారు. మార్చి 2019 నాటికి పెండింగ్‌లో ఉన్న 9వేల ఆరోగ్యశ్రీ దరఖాస్తులకు తక్షణమే నిధులు కేటాయించాలన్నారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వైసీపీప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా టీడీపీతరుపున పోరాటంచేస్తామని అశోక్‌బాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం ఆమోదించిన సీఎమ్‌ఆర్‌ఎఫ్‌ నిధుల్ని కూడా నిలిపివేశారన్నారు. ప్రజారో గ్యంకోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తప్పుపట్టి, ఆయన్ని తూలనాడిన మంత్రులు, ముఖ్యమంత్రి ఏలూరులో జరిగిన ఘటనకు బాధ్యతవహిస్తూ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. మండలినిరద్దుచేసినా సభ్యులుగా తాము అమరావతి పోరాటాన్ని ఆపేదిలేదని, ప్రభుత్వం మండలిరద్దుతో పరిధిదాటిన నేపథ్యం లో, తాముకూడా తమపరిధులుదాటి రాజధాని కోసం పోరాటం చేస్తామని అశోక్‌బాబు స్పష్టంచేశారు.

అధర్మం ఎన్నికుట్రలు, కుతంత్రాలుచేసినా అంతిమవిజయం ధర్మానిదేనని, రాజధాని అమరావతిని విచ్ఛిన్నంచేసి, తమపబ్బం గడుపుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి, వైసీపీప్రభుత్వ అనైతికచర్యలకు, ఆకృత్యాలకు పవిత్రమైన పదవిలోఉన్న వై.వీ.సుబ్బా రెడ్డిలాంటి వాళ్లు భాగస్వాములుకావడం సిగ్గుచేటని టీడీపీనేత, రాష్ట్రబ్రాహ్మణకార్పొరేషన్‌ మాజీఛైర్మన్‌ వేమూరిఆనంద్‌సూర్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచప్రఖ్యాతిపొందిన తిరుమ ల తిరుపతి క్షేత్రం ఛైర్మన్‌గా ఉండాల్సిన వ్యక్తికి, శాసనమండలిలో గ్యాలరీలో ఏంపని అని వేమూరి ప్రశ్నించారు. స్వామివారి పాదాలచెంత సేవకుడిగా ఉండాల్సిన వై.వీ. అసెంబ్లీ కారిడార్లలో, మండలి గ్యాలరీల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. సుబ్బారెడ్డి దైవ సేవకుడా..లేక రాజకీయ దళారీనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వం వింతపోకడలకు పోతుంటే, ధార్మికసంస్థకు అధిపతిగా ఉండాల్సిన వ్యక్తి మద్ధతుగా నిలవడం దుర్మార్గమని ఆనంద్‌సూర్య ఆగ్రహం వ్యక్తంచేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను కాపాడటం మానేసి, విజయవాడలో, విశాఖపట్నంలో భూముల క్ర యవిక్రయాల్లో, దందాల్లో దళారీగా వ్యవహరిస్తూ, కమీషన్లు తీసుకునేపనిలో సుబ్బారెడ్డి ఉన్నాడన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా ఉండి, విశాఖలోని స్వరూపానందేంద్రపీఠంలో ఉంటూ, భూదందాలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలే చేయాలని సుబ్బారెడ్డి భావిస్తే, ఆయన తక్షణమే టీటీడీఛైర్మన్‌ పదవికి రాజీనామాచేయాలని ఆనంద్‌సూర్య డిమాండ్‌చేశారు.

అర్చకుల సంక్షేమనిధి నిధులైన రూ.234కోట్లను వారి సంక్షేమానికి వినియోగించకుం డా వైసీపీప్రభుత్వం వాటిని దారిమళ్లించిందన్నారు. పేదబ్రాహ్మణులకు పింఛన్లు కూడా అందడంలేదని, బ్రాహ్మణకార్పొరేషన్‌ఛైర్మన్‌గా ఉన్న మల్లాది విష్ణు తక్షణమే ఈ అంశంపై జోక్యం చేసుకోవాలన్నారు. అర్చకులకు ఇస్తామన్న కనీసవేతనాన్ని కూడా వెంటనే అందించాలన్నారు. అర్చకులకు న్యాయంచేస్తామన్న ఉపసభాపతి కోన రఘుపతి ఆ సమస్యపై స్పందించాలని వేమూరి సూచించారు. పక్కరాష్ట్రంలో కూర్చొని ట్విట్టర్‌వేదికగా స్పందిస్తున్న ఐ.వై.ఆర్‌.కృష్ణారావు బాధను తాము అర్థంచేసుకున్నామని, అక్కడుంటూ, ఏపీలోని హిందువులు, బ్రాహ్మణులు, అమరావతి గురించి మాట్లాడుతున్న ఐ.వై.ఆర్‌, ఇప్పటికైనా తనరెండునాల్కలధోరణి విధానాన్ని మానుకోవాలన్నారు. ఆయనకు ఆంధ్రప్రజలపై, అమరావతిపై అంతప్రేమే ఉంటే, తక్షణమే ఈగడ్డపైకి వచ్చి, హిందువులు, పీఠాధిపతులుచేసే యజ్ఞయాగాదుల్లో పాల్గొని, రాజధానికి తనవంతు సంఘీభావాన్ని ప్రకటించాలని వేమూరి సూచించారు. రాష్ట్రప్రభుత్వం హిందువులకు, అర్చకులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న పదవుల్లో ఉన్న మల్లాదివిష్ణు, కోనరఘుపతి, పదవికోసం పాకులాడుతున్న ఐ.వై.ఆర్‌లు ఎందుకు మాట్లాడటంలేదన్నారు. వారికి ఏమాత్రం బ్రాహ్మణుల, అర్చకులసంక్షేమంపై చిత్తశుద్ధి ఉన్నా, ఆయావర్గాల సమస్యలపై, రాష్ట్రభవిష్యత్‌పై పాలకులతో చర్చించి, తమంతుగా పుట్టినగడ్డకు న్యాయం చేయాలని, అవసరమైతే తమపదవులకు రాజీనామా చేసేనాసరే రాజధానికోసం పోరాడాలని ఆనంద్‌సూర్య డిమాండ్‌చేశారు. బీజేపీనేతలు కూడా రాజకీయాలు పక్కనపెట్టి మూకుమ్మడిగా రాజధానికోసం పోరాడలన్నారు.

ఏపీ సహా ఇతరరాష్ట్రాల్లో ఉన్న హథీరాంజీమఠం భూముల్ని కొట్టేయడంకోసం రాష్ట్రప్రభుత్వం మఠానికిచెందిన మహంత్‌అర్జున్‌దాస్‌ను సస్పెండ్‌చేసి, భూములపర్యవేక్ష ణ బాధ్యతను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగించిందని, వేమూరి ఆనంద్‌సూర్య ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డి పర్యవేక్షణలోనే హథీరాంజీమఠం భూములకబ్జా వ్యవహారం సాగుతోందన్నారు. మంగళవారం నుంచి అర్జున్‌దాస్‌ కనిపించడంలేదని, ఆయన గదిని సీజ్‌చేయించారని, వేలకోట్ల విలువైన 2వేలఎకరాల భూముల్ని కాజేయా లన్న కుట్రతో, ప్రభుత్వాధికారుల సాయంతో సుబ్బారెడ్డి తతంగాన్ని నడిపిస్తున్నాడని వేమూరి స్పష్టం చేశారు. అలానే భీమిలిలోని స్వరూపానందేంద్రస్వామి ఆశ్రమంలో మకాం వేసిన వై.వీ.సుబ్బారెడ్డి, 67ఎకరాల దేవాదాయశాఖభూమిని, ఏవిధమైన టెండర్లు పిలవకుండా లీజుపద్ధతిలో కాజేయడానికి యత్నాలు చేస్తున్నారన్నారు. పోర్టుట్రస్ట్‌కార్మికులకోసం దాతలు ఇచ్చినభూముల్ని కొట్టేయడానికి ప్రభుత్వం ఒకపథకం ప్రకారం వ్యవహరిస్తోందన్నారు. టీటీడీ ఛైర్మన్‌ పదవిని అడ్డుపెట్టుకొని దేవాదాయ భూముల్ని కొట్టేస్తున్నారని, వాటితోపాటు ఇతరభూములస్వాహాకు కూడా ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. హథీరాంజీమఠం, పోర్టుట్రస్ట్‌ భూములపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

Advertisements

Latest Articles

Most Read