రాజధాని అమరావతి పరిరక్షణకు బౌద్దులు రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత రాజధాని అమరావతికి సమీపంలోనే బౌద్ధ క్షేత్రం ఉంది. ఈ నేపధ్యంలోనే ఎంతో చారిత్రాత్మకమైన ఈ ప్రాంతం నుంచి తరలిపోకుండా చూడాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త దలైలామా సహకారం కోరాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే అమరావతి బుద్ధ విహార కేంద్ర కార్యదర్శి సుధాకర్ మేడసాని, దలైలామా అపాయింట్మెంట్ కోరుతూ తాజాగా లేఖ రాశారు. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ కేంద్రం అమరావతి నుంచి రాజధాని విశాఖపట్నంకు తరలించడం పై పూర్తి వివరాలతో ఒక విజ్ఞాపన పత్రం స్వయంగా అందజేయాలని నిర్ణయించినట్లు సుధాకర్ దలైలామాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అమరావతికి ఆశీర్వచనాలు కావాల్సిందిగా దలైలామాను ఆ లేఖలో అభ్యర్థించారు. దలైలామా నుంచి అనుమతి రాగానే హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు వెళ్లి అమరావతిపై స్వయంగా వినతిపత్రం ఇవ్వనున్నట్లు సుధాకర్ ఆ లేఖలో పేర్కొన్నారు.

అమరావతి ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అమరావతికి దలైలామా ప్రశంసలు కూడా ఉన్నాయి. "అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించటం స్వాగతించదగిన పరిణామం. అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ చారిత్రక నగరం రానున్న రోజుల్లో ఎంతో మార్పు చెందుతుంది. శాంతి వెల్లివిరిసిన చోటే ఆర్థిక ప్రగతి ఉంటుంది" అని దలైలామా 2017వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో రాజధాని అమరావతిని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు 2006వ సంవత్సరం జనవరి 9వ తేదీన అమరావతిలో జరిగిన కాలచక్ర మహాసభలకు హాజరయ్యారు. ఈ విధంగా అమరావతితో దలైలామాకు ఎంతో అనుబంధం ఏర్పడిందని బౌద్ధుల నమ్మకంగా ఉంది.

ఈ నేపధ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన అమరావతి పేరుతో నిర్మితమైన రాజధాని తరలిపోకుండా నిలువరించటంలో దలైలామా ఆశీస్సులు కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది. దలైలామా కనుక ఈ విషయం మీద శ్రద్ధ పెడితే, అటు కేంద్రానికి కూడా ఒత్తిడి పెరిగే అవకాసం ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో, స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చెయ్యటం, అలాగే ఆయన కూడా ఇది శాంతికి నిర్వచనమైన బౌద్ధ నేల అంటూ చెప్పటం కూడా మనందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో, అమరావతిని నిర్వీర్యం చెయ్యాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో, ఇప్పుడు దలైలామా సహాయం కోరాలని, అమరావతి బుద్ధ విహార కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో, పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

శాసన మండలి రద్దు చేస్తూ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానంపై నాయకులెవరూ బహిరంగ ప్రకటనలు ఇవ్వవద్దని బీజేపీ అధిష్టానం జారీచేసినట్లు సమాచారం. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఫిబ్రవరి రెండవ వారంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం పై చర్చించి పార్లమెంటులో ఏ విధమైన వైఖరి తీసుకోవాలనే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. శాసనమండలి రదుపై ఇప్పటికే రాష్ట్రంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కన్నా లక్ష్మీనారాయణ సైతం దీనిపై ఆచితూచి స్పందించారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ కోర్ట్ కమిటీ నిర్ణయం వెలువడే వరకు మౌనం పాటించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సోము వీర్రాజు, మాధవ్ లు ఇరువురూ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే కన్నా లక్ష్మీనారాయణనే కొనసాగించటం మంచిదన్న అభిప్రాయంలో అధి ష్టానం ఉన్నట్లు ఆ పార్టీలో సంభాషణలు జరుగుతు న్నాయి.

శాసనమండలి రద్దు తీర్మానం రాజధాని అమరావతి అంశంతో ముడిపడి ఉన్నందున పార్టీ వైఖరి ఏ విధంగా ఉండాలన్న విషయమై లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో 'కోర్' కమిటీలో చర్చ జరిగినప్పటికీ శాసనసభ రదు తీర్మానం త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశం లేదని బీజేపీ ప్రముఖుడు ఒకరు చెప్పారు. ఏదిఏమైనా రాష్ట్ర శాసనమండలి భవితవ్యం పూర్తిగా బిజెపి వైఖరి పైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక రెండవ రాజధాని అంశం రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్న విధంగా దేశానికి రెండవ రాజధాని అంశాన్ని తెరమీదకు తీసుకువస్తే బాగుంటుందని రాష్ట్ర బీజేపీ శాఖ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. దేశ స్వరూప స్వభావాల దృష్యా దేశానికి మరో రాజధాని అవసరం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గతంలో అభిప్రాయపడ్డారు. గత 7 దశాబ్దాలుగా అంబేద్కర్ సూచనపై కనీసం చర్చ సైతం జరగలేదని, ఈ తరుణంలో దానిపై ఒక నిర్ణయం తీసుకుంటే బాబాసాహెబ్ సిద్ధాంతాలను గౌరవించినట్టవుతుందని బీజేపీ వర్గాల భావనగా ఉంది.

ఒకవేళ ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చిన పక్షంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన అమరావతి పేరునే ముందుకు పరిశీలించాలని రాష్ట్ర నాయకులు సూచించే అవకాశం ఉంది. గతంలో రెండవ రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు హైదరాబాద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే హైదరాబాద్ కంటే అమరావతి ఉత్తమంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సాంప్రదాయాలకు పెద్దపీట వేసే బీజేపీలో అమరావతి అందుకు అనువుగా ఉంటుందనేది వారి వాదన. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీకి నష్టం వాటిల్లుతున్నం దున దానిని దక్షిణాదిన భర్తీ చేసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం యోచిస్తుంది. ఎన్నో అనుకూలతలు ఉన్న అమరావతిని కేంద్ర స్థానంగా చేసుకుంటే సరిహదునే ఉన్న తెలంగాణా, కర్నాటక, తమిళ నాడు, ఒడిస్సా రాష్ట్రాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందనేది వారి భావన. ఈ అంశంపై సైతం కోర్ కమిటీలతో చర్చించే అవకాశముందని పార్టీ ప్రముఖులు చెబుతున్నారు.

జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలి ప్రతిపక్ష, స్వపక్షసభ్యులతోపాటు, ఆయన కుటుంబస భ్యులకు కూడా అర్థంకావడంలేదని, వి-వే-కా-నం-ద-రె-డ్డి హ-త్య జరిగినప్పుడు కుటుంబబంధాలకు విలువనిచ్చే మనిషిగా, భావోద్వేగంతో స్పందించిన జగన్‌, ఇప్పుడెందుకు ఆ హ-త్య-తో తనకేమీ సంబంధంలేనట్లుగా వ్యవహరిస్తున్నాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు. బుధవారం ఆయన మంగళ గిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వి-వే-కా చ-ని-పో-యి-న-ప్పు-డు సీబీఐ విచారణకు డిమాండ్‌చేసిన జగన్‌, అధికారంలోకి వచ్చాక దానిగురించి ఎందుకు వదిలేశాడన్నారు. వి-వే-కా కుమార్తె సునీత తనతండ్రి హ-త్య-కే-సు పై తాజాగా హైకోర్టుని ఆశ్రయించారని, ఆమె తనపిటిషన్‌ (3945-2019)లో జగన్‌ వ్యవహార శైలిపై, ఏపీపోలీసుల పాత్రపై పలు సందేహాలు వెలిబుచ్చారని వర్ల తెలిపారు. గతంలో ఏపీపోలీసుల పనితీరుని తప్పుపట్టిన వ్యక్తి నేడు అదేపోలీసులతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడని కూడా ఆమె అభిప్రాయపడిందన్నారు. కేసు విచారణచేస్తున పోలీసుల దర్యాప్తుని రాష్ట్రప్రభుత్వం ప్రభావితం చేస్తోందని, ఏపీ సర్కారుప్రమేయం లేకుండా కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించాలని సునీత తన పిటిషన్లో కోరారన్నారు. కేసువిచారణలో జగన్‌ప్రమేయాన్ని సునీత ఇష్టపడటంలేదన్న అభిప్రాయం ఆమెపిటిషన్లో స్పష్టమైందన్నారు.

సునీత పిటిషన్‌తో ఆందోళనకు గురైన జగన్‌, ఆఘమేఘాలపై హైదరాబాద్‌కు పయనమయ్యాడని, తనఅక్క (సునీత)ను కలిసి ఆమెవేసిన పిటిషన్‌ ఉపసంహరిం పచేసేందుకే ఆయన వెళ్లాడన్న అనుమానం ప్రజలందరిలోనూ ఉందన్నా రు. ఎవరిని కాపాడటానికి, ఎవరిని కేసునుంచి తప్పించడానికి జగన్‌, సునీతతో చర్చించడానికి వెళ్లాడనే అనుమానం రాష్ట్రవాసుల బుర్రలను తొలుస్తోందని వర్ల చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వి-వే-కా-హ-త్య కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని, రాష్ట్రపోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని చెబుతూ, కేసువిచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌చేస్తూ 22-03-2019న కోర్టులో జగన్మోహన్‌రెడ్డి పిటిషన్‌ వేశాడన్నారు. (హ-త్య-కే-సు-కు సంబంధించి పలుసందర్భాల్లో జగన్‌మాట్లాడిన వీడియోను విలేకరుల ఎదుట ప్రదర్శించారు) తరువాత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రయ్యాక వి-వే-కా హ-త్య- కేసు పై జగన్‌ స్పందిస్తాడని పార్టీవారితోపాటు, కుటుంబసభ్యులందరూ ఎదురుచూశారని, వారందరికీ నిరాశే మిగిలిందన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చి 8నెలలు గడిచినా కూడా ముఖ్యమంత్రి జగన్‌ వి-వే-కా-కే-సు విచారణను పట్టించుకోలేద న్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసువిచారణకు సిట్‌ను నియమించా రని, జగన్‌వచ్చాక మరోరెండు సిట్‌ బృందాలను నియమించారని, ఆయాబృందాల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కూడా ఇప్పటివరకు బయటకురాలేదన్నారు.

సునీత తాజాగా వేసిన పిటిషన్లో పలువురి అనుమానితుల పేర్లను వెల్లడించారని, కేసునిసీబీఐకి అప్పగిస్తే, ఎవరిని అరెస్ట్‌ చేస్తారని జగన్‌ భయపడుతున్నాడన్నారు. వి-వే-కా-హ-త్య-కే-సు-లో ఎవరు అరెస్టయితే జగన్‌కు ముప్పు ఉందో ఆయనే స్పష్టంచేయాలన్నారు. తమ్ముడు జగన్‌చేసిన మోసం అక్కకు (సునీతకు) ఇప్పుడు తెలిసొచ్చిందని, అందుకే ఆమెను హైకోర్టుని ఆశ్రయించిందని వర్ల తెలిపారు. వి-వే-కా-హ-త్య-కే-సు గురించి ప్రశ్నించినవారం దరికీ నోటీసులు ఇస్తామంటున్నారని, కోర్టుకి వెళ్లిన సునీతకు, వాస్తవాలు మాట్లాడిన తనకు కూడా నోటీసులు ఇస్తారా అని వర్ల నిలదీశారు. వి-వే-కా-హ-త్యకేసేమీ జగన్‌ కుటుంబసమస్యకాదని, అసలేం జరిగిందో తెలుసుకోవాలన్న అభిప్రాయం ప్రజలందరి లోనూ ఉందన్నారు. రాజులసొమ్ము రాళ్లపాలైనట్లుగా, జగన్‌ప్రభుత్వం ప్రజలసొమ్ముని రంగులపాలు చేసిందని, విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామయ్య అభిప్రాయపడ్డారు. గతంలోకోర్టుకు వెళితే రోజుకి రూ.60లక్షలు అవుతాయన్న జగన్‌, సునీతను కలవడానికి హైదరాబాద్‌కు వెళ్లడంద్వారా రూ.కోటి20లక్షల ప్రజల సొమ్ముని వృథాచేశాడన్నారు. జగన్‌ ఇప్పటికైనా కేసువిచారణ చేపట్టాలని, సీబీఐకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఆయనలా చేయకుంటే, ఆయనపై పడినమచ్చ అలానే ఉండిపోతుందన్నారు. విశాఖవాల్తేర్‌ క్లబ్‌ను కాజేయడానికి ఇప్పటికే విజయసాయి తనప్రయత్నాలు ప్రారంభించాడన్నారు.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో తయారైన నివేదికపై గుడ్డిగా సంతకా లు చేసిన జీ.ఎన్‌.రావు ఆయన కమిటీలోని సభ్యులు, టీడీపీప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు పొందిన విశాఖ నగరాన్ని ఎందుకూ పనికిరాని నగరంగా తమ నివేదికలో పేర్కొన్నారని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వ రరావు మండిపడ్డారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జీ.ఎన్‌.రావు కమిటీ నివేదికను సాకుగాచూపుతూ, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌కేపిటల్‌ పెడతామని చెబుతున్న జగన్‌ప్రభుత్వం, విశాఖనగరానికి తుపాన్లముప్పు ఎక్కువని, అక్కడ కాలుష్యంఅధికమని, ఆ నగరం నివాసానికి అనుకూలం కాదని జీ.ఎన్‌.రావుకమిటీ ఇచ్చిన నివేదికపై ఏం సమాధానం చెబుతుందని బొం డా ప్రశ్నించారు. ప్రభుత్వచర్యలను, జీ.ఎన్‌.రావు నివేదికను చూస్తుంటే, ఆయనిచ్చిన నివేదికకు తలాతోకలేదని, ఆయన తీసేసిన తహసీల్దార్‌లాంటివాడని అర్థమవుతోందన్నా రు. జీ.ఎన్‌.రావు, బోస్టన్‌కమిటీ నివేదికలు అంత విశ్వసనీయత కలిగినవే అయితే, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్‌ప్రభుత్వం ఎందుకు సంకోచిందని ఉమా ప్రశ్నించా రు. జీఎన్‌.రావు కమిటీ నివేదికకు, కమిటీలోని సభ్యులు చెబుతున్న అంశాలకు, బయట మాట్లాడుతున్న తీరుకి ఎక్కడా పొంతనఉండటం లేదన్నారు.

గతేడాది అక్టోబర్‌ 13న జీ.ఎన్‌.రావు కమిటీవేస్తే, 6రోజుల్లో 13 జిల్లాలను చుట్టేశారని, అంతిమంగా వైసీపీతయారు చేసిన దానిపై బృందసభ్యులు సంతకాలు చేశారన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ 13జిల్లాల్లో పూర్తిస్థాయిలో పర్యటించి, ఏప్రాంతంలో రాజధాని పెడితే మంచిదనే దానిపై సవివరమైన నివేదికను ఇవ్వడంజరిగిందన్నారు. అమరావతిపై ఆదినుంచి కక్షతో ఉన్న జగన్మోహన్‌రెడ్డి, ఎవరినీ సంప్రదించకుండా మొక్కుబడిగా కమిటీలువేసి, ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందన్నారు. విశాఖనగరాన్ని గడచిన 5ఏళ్లలో అంతర్జాతీయ నగరంగా మార్చడానికి చంద్రబాబు శ్రమించారని, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సు ఏదిజరిగినా అక్కడే నిర్వహించేవారన్నారు. అలానే పదిసార్లు తిరిగి విశాఖకు లులూగ్రూప్‌ని తీసుకొచ్చారని, 70వేలకోట్ల పెట్టుబడిపెట్టే ఆదానీడేటాసెంటర్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఇతర ఫార్మా పరిశ్రమల్ని ఏర్పాటుచేశారని ఉమా పేర్కొన్నారు. సాగరనగరాన్ని హుద్‌హుద్‌ కబళించినప్పుడు, వారంరోజులు అక్కడే ఉండి నగరం బాగుపడేవరకు, అన్నిశాఖల అధికారులతో కలిసి రేయింబవళ్లు పనిచేశారన్నారు.

అలాంటి విశాఖ నగరం నివాసానికి అనుకూలం కాదని, అదికోస్టల్‌జోన్‌ ఏరియాలో ఉందని, అక్కడున్న పోర్టు, ఉక్కుపరిశ్రమ, నేవీజలాంతర్గాముల కారణంగా కాలుష్యం ఎక్కువని, సముద్రజలాలు ముంచుకొస్తున్నకారణంగా తాగునీరు ఉప్పునీటిగా మారుతుందని, జీ.ఎన్‌.రావుకమిటీ తననివేదికలో చెప్పడం జరిగిందని చెప్పడం దుర్మార్గం కాదా అని బొండా నిలదీశారు. ఒకవైపు కమిటీలపేరుతో ఇలాంటి నివేదికలు ఇస్తూ, మరోవైపు ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్‌కేపిటల్‌ పేరుతో ఎందుకు నాటకాలు ఆడుతున్నా రని ఆయన ప్రశ్నించారు. నివేదికలోని తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, విశాఖలో కాకుండా కాస్తదూరంగా విశాఖమెట్రోపాలిటన్‌ రీజియన్‌దాటి దూరంగా రాజధాని పెట్టవచ్చని సూచిస్తున్నారని, అలాపెట్టేట్టయితే మిలీనియంటవర్స్‌ని ఎందుకు ఎంపిక చేసుకున్నా రని, దీన్నిబట్టే జీ.ఎన్‌.రావుకమిటీకి ఉన్న అవగాహనేమిటో అర్థంచేసుకోవచ్చ న్నారు. అటు విశాఖవాసుల్ని, ఇటురాష్ట్రప్రజల్ని మోసం చేయడానికే ప్రభుత్వం ఇలానాటకాలు ఆడుతోందని, విశాఖపై ఆ విధంగా దుష్ప్రచారంచేస్తే, భవిష్యత్‌లో ఎవరైనా అక్కడ పెట్టుబడులు పెడతారా అని ఉమా వాపోయారు. అమరావతిని చంపేయాలన్న తహతహ తప్ప, రాజధాని తరలింపులో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధిలేదన్నారు.

9నెలల్లో విశాఖకేంద్రంగా 30వేల ఎకరాలుకొట్టేశారని, వాటి విలువ పెంచుకోవడానికి తనబంధువుల కంపెనీ అరబిందోఫార్మాకింద ఉన్న భూములు అమ్ముకోవడానికి, వాల్తేర్‌క్లబ్‌ని మింగేయడానికి, దసపల్లాభూముల్ని భోంచేయడానికే ప్రభుత్వం విశాఖ జపం చేస్తోందని బొండా పేర్కొన్నారు. విజయమ్మ విశాఖలో పోటీచేసినప్పుడు, ఆ నగరమంతా గడగడలాడిపోయిందని, పంచెకట్టు బ్యాచ్‌చేసిన అరాచకం అంతాఇంతా కాదన్నారు. ఎగ్జిక్యూటివ్‌కేపిటల్‌ పేరుతో ప్రభుత్వం అక్కడ స్పెక్యులేషన్‌ మొదలెట్టి, భూములవిలువను పెంచుతోందన్నారు. రియల్‌ఎస్టేట్‌ముసుగులో రాజధానిని తరలించే కుట్రకు జగన్‌సర్కారు తెరలేపిందని, అందుకు బూచిగా జీ.ఎన్‌.రావు, బోస్టన్‌కమిటీలను, బ్రెయిన్‌లెస్‌ హైపవర్‌కమిటీలను చూపిందన్నారు. విశాఖనగరాన్ని కించపరుస్తూ జీ.ఎన్‌.రావు కమిటీనివేదికఇస్తే, దాన్ని మంత్రులు, అధికారులు ఉన్న హైపవర్‌కమిటీ ఏం పరిశీలించిందన్నారు. కర్నూల్లో హైకోర్టు పెడతామని జగన్‌సర్కారు చెబుతుంటే, జీ.ఎన్‌.రావుకమిటీలో మాత్రం హైకోర్టు ఏర్పాటనేది, సుప్రీంకోర్టు అంతిమనిర్ణయమని పేజీనెం-76లో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.

కర్నూలు ప్రజలని మోసగించడానికే ఇలా చెబుతున్నారని, కర్నూల్లో, అమరావతిలో పెట్టడానికి అవేమైనా భారతిసిమెంట్‌ కంపెనీ బ్రాంచ్‌లా అని బొండా ఎద్దేవాచేశారు. ఏకమిటీ రిపోర్టు బయటకురాదన్న ఉద్దేశంతో, వాటినిదాచేసి, ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళుతోందన్నారు. రైతులు కోర్టుకువెళ్లబట్టే, కమిటీల నివేదికలు బయటకు వచ్చాయని, దాంతో జగన్‌సర్కారు బండారం బయటపడిందన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌పై హైకోర్టు చాలాస్పష్టమైన ఆదేశాలిచ్చిందని, తాముచెప్పేవరకు ఏవిభాగా న్ని తరలించినా లారీకెత్తిన సామాన్లబాడుగతో సహా అధికారులనుంచి వసూలుచేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. తుపాన్లువస్తే, వెంటనే పోతాయని, వరదలొస్తే ఎప్పటికీపోవని చెబుతున్న బిత్తరసత్తి (మంత్రిబొత్స) ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదని, అసలు ఆయనకు తుపాన్ల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసునాఅని ఉమా మండిపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read