తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు సంక్రాంతి పండుగ వేడుకులకు దూరంగా ఉన్నారు. ప్రతి ఏడాది, ఆయన నారా వారి పల్లెకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం, తన కుటుంబ సభ్యులతో కలిసి, అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, జగన్ కు ఛాలెంజ్ విసిరారు. ఎన్నికలకు ముందు, అమరావతి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికీ మార్చం అని చెప్పి, ప్రజలను మభ్య పెట్టి, ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారని అన్నారు. జగన్ కు సవాల్ విసిరుతున్నా అని, అమరావతి రాజధానిగా ఉండదని, జగన్ మళ్ళీ ఎన్నికలకు వెళ్లి, గెలిచి, అప్పుడు రాజధాని మార్చుకోవాలని, అలా జరిగితే తాను కూడా ప్రజల తీర్పుని అంగీకరించి, రాజకీయాలు వదిలేస్తానని చాలెంజ్ చేసారు. అంతే కాదు, ఒక వేళ, జగన్ కు ఎన్నికలకు వెళ్ళటం భయం అయితే, రాజధాని పై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

cbn 15012020 2

ఈ రోజు చంద్రబాబు ప్రసంగం. "సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పలేను-ఎందుకంటే మన అందరికి ఇది కష్టాల సంక్రాంతి. ప్రతి ఏటా నారావారి పల్లె వెళ్లే వాళ్ళం. మూడు రోజుల పాటు పండుగ చేసుకునే వాళ్ళం. ఈ సారి పండగ చేసుకోవడం లేదు. ఇది 29 గ్రామాల సమస్య కాదు- ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య. 29 గ్రామాల రైతులు త్యాగాలు చేశారు. సంక్రాంతి రోజు రైతులు, మహిళలతో ఉన్నాం. ప్రభుత్వం ఇష్టంమొచ్చినట్లు వ్యవహరిస్తోంది. జగన్ ఓ మూర్ఖుడు అని చెప్తున్నాను. శివరామకృష్ణ కమిటీ పరిశీలించి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసారు. అధైర్యపడి ప్రాణ త్యాగాలు చెయ్యొద్దు. రైతులకు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చాము. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ని చూడలేదు. కరుడు కట్టిన ఉగ్రవాది లా జగన్ వ్యవహరిస్తున్నారు. ఇది ముంపు ప్రాంతం కాదు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందిఅని, మీ మీద కోపం చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న వన్ని పర్మినేట్ బిల్డింగ్స్. రైతులు త్యాగాన్ని గుర్తించలేని స్థితిలో సీఎం వున్నారు. రాజధాని ఒకే సారి నిర్మించాలి. చట్ట ప్రకారం సీఆర్డీఏ ఏర్పాటు చేసి,నిర్మాణం మొదలు పెట్టాం. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్ళ. అమరావతిని చంపేసి ఒక కన్ను పోగొట్టాడు. పోలవరం పనులు ఆపేసి- రెండో కన్నుకుడా చంపేసాలా వున్నారు. అమరావతి కంటే ముందుగా కీయా మోటార్స్ వచ్చింది."

cbn 15012020 3

"ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే పోర్ట్స్ చాలా వున్నాయి. ఒకే ప్రాంతంపై నాకు అభిమానం కాదు- అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెదాలనేది నా కోరిక. .చాలా మంది భుములు ఇచ్చి గుండె పోటుతో మరణించారు. నాజీవితంలో ఎప్పుడు జోలె పట్టుకోలేదు. మీ కోసం జోలె పట్టుకున్నాను. ఎడ్ల పందెలకు వెళ్లే చొరవ ఉంది- రైతులు చాయిపోతే ఏమి పట్టడం లేదు. .ఎడ్ల పందేలు,కోడి పందేలు పేకాట లు ఆడుకువడంలో మంత్రులు బిజీగా వున్నారు. ఏ ఒక్క మంత్రికి రైతుల గోడు కనపడటం లేదు. మీ హక్కుల కోసం పోరాడుతున్నారు. రైతులేమన్న ఉగ్రవాదులా..? వారిపై పోలీసుకు జులుం చూపిస్తున్నారు. విదేశాల్లో వుండే ఏపీ వాసులు ఇక్కడికి వచ్చేసేలా రాజధాని నిర్మాణం చేపట్టాం. అందరూ భూములు ఇచ్చే టప్పుడు సహకరించారు. ముఖ్యమంత్రి వైఖరి వల్ల ఐదుకోట్ల ప్రజల జీవితాల్లో అంధకారం ఏర్పడింది. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే చూస్తూ ఊరుకోము. ఈ ఏడాది కష్టాల సంక్రాంతి. ఇక్కడి రైతుల పోరాట ప్రతిమ రాష్ట్రంలో అందరూ చూసి నేర్చుకోవాలి. రాష్ట్రం మొత్తం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే యోచలో ఉందని రైతులు చంద్రబాబు కు తెలిపారు. ఏక పక్షం గా ఒక చట్టాన్ని రద్దు చేయడం కుదరదు-చంద్రబాబు" అని చంద్రబాబు అన్నారు.

ఎస్వీబీసీ మాజీ చైర్మెన్ పృధ్వీ వ్యవహారం, గత పది రోజులుగా వార్తల్లో వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా పృధ్వీ రాజధాని రైతుల పై చేసిన కామెంట్స్, తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయి. రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హేళన చేస్తున్నట్టే, పృధ్వీ కూడా హేళన చేస్తూ మాట్లాడారు. అందరి లాగే ఉద్యమం చేస్తున్న రైతులని పైడ్ ఆర్టిస్ట్ లతో పోల్చారు. అయితే, ఇంకాస్త ముందుకు వెళ్లి, రైతులు బురదలో ఉండాలి, బురదలో దొరికింది తినాలి అంటూ, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో మహిళా రైతులగా చెప్పుకునేవారికి, బంగారపు గాజులు, మంచి మంచి వాచీలు, బట్టలు ఉన్నాయని, మరి వారు రైతులు ఏమిటి అంటూ, పృధ్వీ వాపోయారు. అయితే ఈ వ్యాఖ్యల పై తీవ్ర దుమారం రేగింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతో, వైసీపీ డిఫెన్స్ లో పడింది. పృధ్వీ పై చర్యలు తీసుకుంటారు అనే వార్తలు వచ్చిన టైంలో, పృధ్వీ సరస సంభాషణ బయట పడటంతో, పృధ్వీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

vk 15012020 2

ఈ నేపధ్యంలోనే, పృధ్వీ ప్రెస్ మీట్ పెట్టి, ఆ ఆడియో అంతా ప్రతిపక్షాల కుట్ర, అది మార్ఫింగ్ అంటూ చెప్పారు. తరువాత, 'ఏపీ 24/7' టీవీ చానెల్ సీఈఓ వెంకటకృష్ణ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వెంకట కృష్ణకు వైకుంఠపురంలో తొమ్మిది ఎకరాలు పొలం ఉందని, అలాగే తెలుగుదేశం నేతలు వెంకట కృష్ణకి, త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ని బహుమతిగా ఇచ్చారని పృధ్వీ ఆరోపణలు చేసారు. పృధ్వీ వ్యాఖ్యల పై స్పందించిన వెంకట కృష్ణ, తీవ్రంగా స్పందించారు. తనకు అమరావతి పరిధిలోని వైకుంఠపురంలో తొమ్మిది ఎకరాల పొలం ఉందని, పృధ్వీ చెప్తున్నారని, అసలు వైకుంఠపురం అనే గ్రామం ఎక్కడ ఉందో కూడా, నాకు తెలియదని వెంకట కృష్ణ అన్నారు. ఆ భూమి ఎక్కడ ఉందొ పృధ్వీ నిరూపించాలని కోరారు.

vk 15012020 3

ఆ భూమి ఉందని పృధ్వీ నిరూపిస్తే, దాన్ని అనాధ శరణాలయానికి దానం ఇచ్చేస్తానని సవాల్ విసిరారు. ఇక తనకు తెలుగుదేశం నేతలు, త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇచ్చారని చెప్తున్నారని, తనకు విజయవాడలో రెంట్ ఇచ్చి, ఉండే ఇల్లు ఉందని, సొంత ఇల్లు లేదని అన్నారు. ఎన్నికల నెల రోజులు ముందు నుంచి, మా ఛానెల్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేసిందని, తమ ఛానెల్ ని టిడిపి బ్యాన్ చేసిందనే విషయం, అందరికీ తెలుసని అన్నారు. తనకు త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే, అది పృధ్వీకే ఇస్తానని, ఆ ఫ్లాట్ తను సరస సల్లాపాలకు వాడుకోవచ్చని, ఒక్కో గదిలో ఒక్కొక్కరిని ఉంచుకుని పెట్టుకోవచ్చని అన్నారు. పృధ్వీ తన పై ఎందుకు, ఇలా ఆరోపణలు చేసారో, ఆయనకే తెలియాలని అన్నారు.

అమరావతి ఉద్యమంలో, కొంత మంది పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహంతో, మొత్తం పోలీస్ డిపార్టుమెంటుకే చెడ్డ పేరు వస్తుంది. ఎవరినో మెప్పు పరచటానికి, వీళ్ళు చేస్తున్న అతితో, జాతీయ స్థాయిలో పరువు పోతుంది. అమరావతిని తరలిస్తారు అని జరుగుతున్న ప్రచారం పై, ప్రభుత్వం ఆ విధంగా చేస్తున్న చర్యల పై, అటు అమరావతి రైతులతో పాటుగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా, అమరావతిని తరలించ వద్దు అంటూ, రైతులకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే చిన్న పాటి నిరనస కూడా ప్రభుత్వం తట్టుకోలేక పోతుంది. శాంతియుతంగా వారు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వాలు తట్టుకోలేక పోతున్నాయి. దీని కోసం పోలీసులను ఉపయోగించి, తోక్కేస్తున్నారు. అమరావతిలో మహిళా రైతులను, కనీసం కనకదుర్గ గుడికి కూడా వెళ్ళనియ్యకుండా ఏమి చేసరోచుసాం. అయితే వీరికి మద్దతుగా, గుంటూరులో మహిళలు ర్యాలీ చెయ్యటంతో, అది సూపర్ సక్సెస్ అయ్యింది.

venkaiah 14012020 2

అయితే ఇదే తరహాలో, విజయవాడలో కూడా మహిళలు, అమరావతి రైతులకు మద్దతుగా ర్యాలీ చేద్దామని అనుకున్నారు. అయితే పోలీసులు అడుగడుగగునా అడ్డుకున్నారు. పర్మిషన్ లేదని, ఎవరూ ర్యాలీ చెయ్యటానికి వీలు లేదని చెప్పారు. అలా చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ఎక్కువ మంది మహిళలను అరెస్ట్ చేసి, వారి వివరాలు, కులం వివరాలు కూడా అడిగి తీసుకుని, సాయంత్రం వదిలి పెట్టారు. అయితే ఇదంతా పెద్ద గందరగోళం మధ్య జరిగింది. అయితే అనూహ్యంగా, పోలీసులు మూడు రోజుల తరువాత, వందల మంది పై కేసులు నమోదు చేసారు. అంతే కాదు, వీరి వివరాలు పాస్ పోర్ట్ ఆఫీస్ కి కూడా పంపిస్తున్నామని, పాస్ పోర్ట్ రద్దు అవుతుంది అంటూ, ఒక ప్రచారానికి కొంత మంది తెర లేపారు.

venkaiah 14012020 3

దీంతో చాలా మందికి, ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, పాస్‌పోర్ట్‌ రద్దుచేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని, అదే జరిగితే ఏమి చెయ్యాలో మాకు తెలుసని, ఎవరూ భయపడద్దు అని చెప్పారు. అయితే ఈ ప్రచారం బాగా జరగటంతో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి చేరడంతో సోమవారం విశాఖ పాస్‌పోర్టు అధికారి ఎన్‌.ఎల్‌.పి.చౌదరికి ఫోన్ చేసి, అసలు జరుగుతున్న ప్రచారం ఏమిటి అంటూ ఆరా తీసారు. పాస్‌పోర్టులను రద్దు చేస్తామని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఆ అధికారి వెంకయ్యకు చెప్పారు. కేసులు ఉండి, న్యాయ విచారణలకు హాజరు కాకుండా తప్పించుకు తిరిగే వారి పాస్‌పోర్టులు మాత్రమే రద్దవుతాయని ఒక ప్రకటనలో చెప్పారు.

జగన్ మోహన్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. భారీగా సీట్లు గెలుచుకున్నారు. 151 సీట్లు గెలుచుకుని, తిరుగులేని శక్తిగా వచ్చారు. అయితే ఇదంతా మూడు నాళ్ళ ముచ్చట గానే మిగిలిపోయింది. 151 మంది ఉన్నా, రాష్ట్రానికి మాత్రం చేసింది ఏమి లేదు. గత ఏడు నెలలుగా రాష్ట్రం దిగజారి పోతుంది. ఇప్పటి వరకు ఒక్క పెట్టుబడి లేదు. ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. రాష్ట్రానికి ఆదాయం రోజు రోజుకీ దిగజారిపోతుంది. అప్పులతో నెట్టుకు వచ్చే పరిస్థితి వచ్చింది. పరిపాలన ఇలా ఉంటే, సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక లేదు, దాదాపుగా అయుదు నెలల పాటు, భవన నిర్మాణ కార్మికులు ఎలా ఇబ్బంది పడ్డారో చూసాం. తరువాత, ఒక నెల రోజుల పాటు కరెంటు కష్టాలు వచ్చాయి. ఇక రైతుల సమస్యలు అయితే చెప్పే పనే లేదు. విత్తనాలు ఇవ్వలేక ఎలా ఇబ్బంది పడ్డారో చూసాం. ఇప్పుడు సంక్రాంతి పండుగ వేళ, గిట్టు బాటు ధర లేక, పంట కొనక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వేళ, మరో సమస్య వచ్చి పడింది.

supreme 15012020 2

సమస్య వచ్చి పడింది అనే కంటే, సమస్యను కావాలనే సృష్టించారని చెప్పచ్చు. అదే మూడు రాజధానులు. 13 జిల్లాల రాష్ట్రానికి, మూడు రాజధానులు ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అప్పటి నుంచి గత 29 రోజులుగా ప్రతి రోజు ఆందోళనలు. మహిళలను కొడుతున్న తీరు అయితే, వర్ణణాతీతం. ఇలా సమస్యల సుడిగుండంలో రాష్ట్రం చుట్టుకుంది. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక ఇబ్బంది. అయితే, ఇదే సమయంలో, ప్రభుత్వానికి, హైకోర్ట్ నుంచి, స్థానిక ఎన్నికలు జరపాలి అనే ఆదేశాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ మీటింగ్ పెట్టి, 59.85 శాతం రిజర్వేషన్ ను డిసైడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఇక్కడే అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే, సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూడాలి.

supreme 15012020 3

మరి ఆ మార్గదర్శకాలు పట్టించు కోకుండా ఎందుకు ఈ ఉత్తర్వులు ఇచ్చారు ? అనే చర్చ జరిగినప్పుడు, వైసీపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందా అనే చర్చ జరిగింది. ఎవరైనా కోర్ట్ కు వెళ్తే, 59.85 శాతం రిజర్వేషన్ పై కచ్చితంగా స్టే వస్తుంది కాబట్టి, ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకుని, మరి కొంత కాలం ఎన్నికలు లేకుండా చూడాలని, ప్రభుత్వం ఎత్తుగడ. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అనుకున్నట్టే జరిగిందని అనుకోవాలి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవో పై, ఈ రోజు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50శాతం మించకుండా చూడాలంటూ బిర్రు ప్రతాప్‌రెడ్డి, బీసీ రామాంజనేయులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ఉన్న పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. ఇదంతా తేలే సరికి, ఎంత లేదు అనుకున్నా, మరో 3 నుంచి 6 నెలలు వాయిదా పడే అవకాసం ఉంది. దీంతో, ప్రజా ఆగ్రహం నుంచి ప్రస్తుతానికి, వైసీపీ ప్రభుత్వం తప్పించుకుంది.

Advertisements

Latest Articles

Most Read