అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం, 27వ రోజుకు చేరుకుంది. వీరి పోరాటానికి, రోజు రోజుకీ మద్దతు పెరుగుతుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల వారి నుంచి వీరికి మద్దతు వస్తుంది. ఇప్పటికే అమరావతి జేఏసీ చేస్తున్న ర్యాలీలు, సూపర్ హిట్ అవుతున్నాయి. చివరకు రాయలసీమలో కూడా, అమరావతి కోసం చేస్తున్న ర్యాలీలు సూపర్ హిట్ అవుతున్నాయి. వారం రోజులు క్రిందట గుంటూరులో మహిళలు అందరూ, అమరావతికి మద్దతుగా ర్యాలీలు చేసారు. ఈ ర్యాలీ పెద్ద సెన్సేషన్ అయ్యింది. దాదపుగా 5 వేల మంది మహిళలు పాల్గున్నారు. ఇదే స్పూర్తితో మూడు రోజులు క్రిందట, విజయవాడలో కూడా మహిళా ర్యాలీ చెయ్యాలని, విజయవాడ మహిళలు అందరూ అనుకున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేస్తామని, పోలీసులని పర్మిషన్ అడిగారు. అయితే గుంటూరులో వచ్చిన స్పందన చూసి ప్రభుత్వం భయపడిందో ఏమో కాని, విజయవాడ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే బందర్ రోడ్డు కాకుండా, వేరే రోడ్డులో చేస్తామని పర్మిషన్ అడిగారు.

vijayawada 13012020 2

పోలీసులు దానికి కూడా ఒప్పుకోలేదని జేఏసీ సభ్యులు చెప్పారు. దీంతో విజయవాడ మహిళలు పోలీసులు నిర్బంధాలు ఉన్నా సరే, మహిళా ర్యాలీ చేసి తీరు తామని, అమరావతికి మా మద్దతు తెలుపుతామని, రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, తాము ముందుకు వెళ్తామని, ఆ రోజు రోడ్డు పైకి వచ్చారు. మహిళలు రోడ్డు పైకి రాగానే, పోలీసులు అరెస్ట్ లు చేసేసారు. ఎంత మంది రోడ్డు ఎక్కితే అంత మందిని అరెస్ట్ చేసారు. మహిళలు పోలీసులు వ్యూహాన్ని చేధించి, PWD గ్రౌండ్స్ నుంచి ర్యాలీ చేసారు. కొంత మంది బెంజ్ సర్కిల్ నుంచి చేసారు. ఇలా పోలీసులకు చెమటలు పట్టించి, అమరావతికి మద్దతు తెలిపారు. అయితే, పొలీసులు మహిళలను ప్రివెంటివ్ అరెస్ట్ అని అరెస్ట్ చేసి, వారి వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. చివరకు కులం కూడా అడిగారు.

vijayawada 13012020 3

కొంత మందిని సాయంత్రం 6 గంటలకు వదిలితే, మరి కొంత మందిని, 9 గంటలకు వదిలారు. అయితే, ఇప్పుడు ఈ మహిళలు అందరికీ షాక్ ఇచ్చారు విజయవాడ పోలీసులు. ఈ ర్యాలీలో పాల్గున్న వందల మంది పై, పోలీసులు కేసు నమోదు చేసారు. సెక్షన్ 353, 143, 147, 188, 290, సెక్షన్ 32 కింద కేసులు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా, మహిళలపై నమోదైన కేసులపై పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి పోలీసులు నివేదిక పంపించారు. పాసుపోర్టులు రద్దు అవుతాయని పోలీసులు బెదిరిస్తున్నారని మహిళలు అంటున్నారు. చాలా మంది యువత ఉన్నారని, విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని, వారి భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసులు నమోదు చేశారని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని మహిళలు చెబుతున్నారు.

వెంకన్నతో పెట్టుకుంటే, క్యారమ్స్ చల్లా చెదురు అయిపోతాయని, మరోసారి రుజువైంది. వెంకన్న సేవలో ఉంటూ, కొండ పై అసాంఘిక కార్యక్రమాలు, అవినీతికి పాల్పడటమే కాకుండా, వెంకన్న సేవలో ఉంటూ, అమరావతి రైతులని కించపరుస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు వెంకన్నే చూసుకున్నాడు. నిన్న పృధ్వీ మాట్లాడుతూ, పోసాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నేను పైడ్ ఆర్టిస్ట్ లు అన్న దానికి కట్టుబడి ఉన్నాను అంటూ, మరోసారి వ్యాఖ్యలు చేసారు. దీంతో, వెంకన్న 24 గంటల్లోనే ఆక్షన్ చూపించాడు. నిన్న రాత్రి పృధ్వీ రాసలీల ఆడియో బయట పడింది. అన్ని టీవీ చానల్స్ లో అది వచ్చింది. ఒక మహిళా ఉద్యోగితో, పృధ్వీ సాగించిన రాసాలీల ఆడియో బహిర్గతం అయ్యింది. అందులో పృధ్వీ ఇదంతా, పద్మావతీ గెస్ట్ హౌస్ నుంచే చేస్తున్నట్టు అర్ధమవుతుంది. దీంతో పృధ్వీ పరువు పోయింది. పృధ్వీ ఇలాంటి వాడు అని తెలిసినా, ఎస్వీబీసీ చైర్మన్ గా, జగన్ ఎందుకు నియమించారు అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.

prudhvi 12012020 2

తిరుమలను బ్రస్టు పట్టించే ఆలోచనతోనే ఇలా చేసారని విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు వైసీపీ పై ఒత్తిడి పెరిగింది. ఒక పక్క, రాజధాని రైతుల పై పృధ్వీ చేసిన వ్యాఖ్యలతో, వైసీపీ పరువు గంగలో కలిసింది. ఒక పక్క మంత్రులు, స్పీకర్ కూడా అమరావతి రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అంటుంటే, పృధ్వీని సాకుగా చూపి, పృధ్వీ పై చర్యలకు వైసీపీ సిద్ధం అయ్యి, ప్రజలను తమ వైపు తిప్పుకుందాం అనుకున్న టైంలోనే, ఈ ఆడియో బయట పడటంతో, వైసీపీకి పృధ్వీని వదిలించుకోవటం ఇంకా ఈజీ అయ్యింది. పృధ్వీని ఎస్వీబీసీ చైర్మన్ గా తొలగిస్తూ, టీటీడీ నిర్ణయం తీసుకుంది. పృధ్వీ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని, టిటిడి చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడి ప్రతిష్టకు ఎవరు భంగం కలిగించినా ఊరుకోమని చెప్పారు.

prudhvi 12012020 3

పృధ్వీ నివేదిక పై విజిలెన్స్ నివేదిక వచ్చిందని, ఆయన నియమించిన 36 మందిని కూడా తొలగించామని వైవి చెప్పారు. పృధ్వీని రాజీనామా చెయ్యమని కోరినట్టు తెలుస్తుంది. ఆయన గౌరవప్రదంగా రాజీనామా చెయ్యకపోతే, మరో గంటలో టిటిడి ఆయన్ను తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది. అయితే పృధ్వీ ఇలా వెకిలి చేష్టలు చెయ్యటం మొదటి సారి కాదు. ఎన్నికల ప్రచారంలో కాని, అంతకు ముందు కాని, ఎంతో వెకిలిగా చంద్రబాబు పై, ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో వైసీపీ అధిష్టానం కూడా, ఈ వెకిలి చేష్టలను ప్రోత్సహించింది. అందుకు ప్రతిఫలంగానే అధికారంలోకి రాగానే, ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలాంటి వారికి, ఈ పదవా అంటూ అప్పట్లోనే వ్యతిరేకత వచ్చినా, పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజల్లో బాగా వ్యతిరేకత రావటంతో, తొలగించిన తప్పని పరిస్థితిలో, వైసీపీ వదిలించుకుంది.

రాష్ట్రంలో గత 26 రోజులుగా జరుగుతున్న పనులు, దానికి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై, చంద్రబాబు ఫైర్ అయ్యారు. గత రెండు రోజులుగా, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, మరీ ముఖ్యంగా మహిళల పై వ్యవహరిస్తున్న తీరు పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కూడా, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ "రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల ప్రదర్శనలకు, ర్యాలీలకు అనుమతిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి 1-4-4, పోలీస్‌ యాక్ట్‌ 30ని వర్తింపజేయడం లేదు. కానీ.. జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానులు వద్దు.. అమరావతే రాజధానిగా కావాలి అంటూ ప్రజలు శాంతియుతంగా రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు నిరసన తెలపడాన్ని కఠిన నిర్బంధ చర్యలతో అడ్డుకుంటున్నారు. దుర్గమ్మకు మొక్కు తీర్చుకోవడానికి పొంగళ్లు తీసుకెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేయడం ప్రజా హక్కులను కాలరాయడం కాదా.?"

dgp 12012020 2

" శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను బూటు కాళ్లతో తన్నడం, బాదడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా.? దీర్ఘ కాలం 1-4-4 సెక్షన్‌ అమలు చేయడం చట్ట విరుద్దమని సుప్రీం కోర్టు చెప్పినా.. అమరావతి పరిధిలో సుదీర్ఘ కాలం అమలు చేయడం దుర్మార్గం కాదా.? మహిళలపై పోలీసులు దౌర్జ-న్యం చేస్తూ.. గాయాలపాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చేరేలా చేస్తున్నారు. శాంతియుత నిరస-నలకు అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారు.? ఈ రకంగా వివ-క్షా పూరితంగా పోలీసులు వ్యవహరించడానికి డీజీపీ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టబద్ద చర్యలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇకనైనా చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డీజీపీగారు వ్యవహరించాలి." అంటూ చంద్రబాబు అన్నారు.

dgp 12012020 3

ఇక తరువాత చంద్రబాబు, గుంటూరులో ని పార్టీ ఆఫీస్ నుంచి, జేఏసీ ర్యాలీలో పాల్గునటానికి వెళ్తున్న సమయంలో, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీర పై కూడా చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనతో పాటు వాచ్చే వారిని, ఎందుకు ఆపుతున్నారు అంటూ ఏసీపీ పై చంద్రబాబు ఆగహ్రం వ్యక్తం చేసారు. ఎక్కడా హింస లేకుండా, ప్రభుత్వానికి నిరసన తెలియ చేస్తుంటే, ఈ గోల ఏంటి అంటూ, పోలీసులని నిలదీసారు. స్టూడెంట్స్ వచ్చి ఉద్యమంలో పాల్గుంటే, కేసులు పెడతాం, చదువుకు ఇబ్బంది అంటూ బెదిరిస్తున్నారని, చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రం శాశ్వతం అని, నువ్వు, నేను ఇక్కడ పోయే వాళ్ళం అని, ఇలాంటి రాష్ట్రం కోసం, పోరాడటంలో తప్పు లేదని అన్నారు. మీరు కూడా సహకరించాలని, మహా అయితే వేరే చోట పోస్టింగ్ ఇస్తారని, అంతకు మించి వీళ్ళు ఏమి చేస్తారు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.

ఇది వరకు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఎలా చేసారు, ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ ఎలా వాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ గవర్నన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగిస్తున్నారు, ఆక్వా రంగం ఎలా దూసుకు వెళ్తుంది, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఎలా ఆదర్శం, ఇలా అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి వివిధ రాష్ట్రాలు మన వైపు చూసేవి. సాక్షాత్తు భారత రాష్ట్రపతి, రియల్ టైం గవర్నెన్స్, అన్ని రాష్ట్రాలు అమలు చెయ్యాలి అని, రాష్ట్రాలకు చెప్పారు అంటే, అది ఏపి పరిస్థితి. కాని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జోక్ అయిపొయింది. 5 గురు డిప్యూటీ సియంలు పెట్టినప్పుడు, దేశమంతా ఇదేమిటి అంటూ నవ్వారు, తరువాత రంగులు చూసి నవ్వారు, తరువాత విద్యుత్ పీపీఏలతో, దేశం నష్ట పోతుందని అందరూ చెప్పారు. ఇప్పుడు మూడు రాజధానులు చూసి నవ్వుకుంటున్నారు. అందరికంటే, ఎక్కువగా నవ్వుతుంది, మన పక్క రాష్ట్రం తెలంగాణా. ఏ తెలంగాణా సియం కేసీఆర్, మనల్ని థర్డ్ గ్రేడ్ రాష్ట్రం అన్నారో, ఆయన ముందే మనం నవ్వుల పాలు అవుతున్నాం.

amarvati 120120120 2

మన రాష్ట్రంలో గత ఏడు నెలలుగా ఉన్న పరిస్థితి చూసి, కొత్త పెట్టుబడులు రావటం లేదు. ఉన్న పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. ఇదే పక్క రాష్ట్రం అయిన, తెలంగాణాకు కలిసి వస్తుంది. కొన్ని రోజుల క్రితం, తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఒక రియల్టర్ సమ్మిట్ లో స్పందిచారు. దేశం అంతా, రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ లో ఉంటే, హైదరాబాద్ లో చాలా స్పీడ్ గా ఉంది అని, దీనికి పక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా కారణం కదా అంటూ, నవ్వుతూ హరీష్ రావు చెప్పారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా అమరావతి పై మాట్లాడారు. అమరావతిలో పరిస్థితి తెలుసు అని, ఒక తెలంగాణా రాష్ట్ర పౌరుడిగా ఎంతో సంతోషిస్తున్నా అని, కాని ఒక దేశ పౌరుడిగా బాధ పడుతున్నా అని ఆన్నారు.

amarvati 120120120 3

తెలంగాణా పౌరుడిగా ఎందుకు సంతోషం అంటే, అక్కడ మొత్తం రాష్ట్రం కుప్ప కూలింది, దీంతో హైదరాబాద్ వైపు అందరూ చూస్తున్నారు, ఆదాయం పెరిగింది, అయితే ఒక దేశ పౌరిడిగా ఎందుకు బాధ అంటే, మన పక్క రాష్ట్రం, మొన్నటి వరకు కష్టపడుతూ ముందుకు వెళ్తున్న సమయంలో, ఇప్పుడు గందరగోళం వచ్చి, మొత్తం నాశనం అయ్యింది అనే బాధ అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తనకు ఇక్కడ ఎన్నికల్లో సహకరించిన, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం, జగన్ అక్కడ గందరగోళం సృష్టించారని, రేవంత్ అన్నారు. అయినా పక్క రాష్ట్రం గురించి ఇంతకంటే ఎక్కువ మనకు ఎందుకు, మనకే చాలా సమస్యలు ఉన్నాయి అంటూ రేవంత్ ముగించారు. మొత్తానికి, మన రాష్ట్రంలో పరిస్థితి, తెలంగాణాకు కలిసి వచ్చిందని, అక్కడ ప్రతిపక్షం, పాలక పక్షం కూడా అంగీకరించింది. ఇది మన రాష్ట్ర పరిస్థితి.

Advertisements

Latest Articles

Most Read