రాజధానిరైతులు, మహిళలపై జరిగిన దాడిని సుమోటోగా తీసుకున్న హైకోర్టు , రాష్ట్రంలో రాక్షసరాజ్యం నడుస్తోందని, పాశవికంగా దాడిచేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని, జరిగినదానిపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించిందని, న్యాయస్థానం వ్యాఖ్యలు రాష్ట్రానికి చెంపపెట్టని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ఆనందంకోసం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాడుతున్న భాషని చూసి సభ్యసమాజం సిగ్గుపడుతోందని, వారుచేస్తున్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పైశాచికానందం పొందుతున్నాడని ఉమా మండిపడ్డారు. హైకోర్టు వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం పోలీస్‌బలగాల్ని ఉపసంహరించుకొ ని, రైతులు, జే.ఏ.సీనేతలు చేస్తున్న శాంతియుత ధర్నాలకు అనుమతివ్వాలన్నారు. ఎక్కడ మహిళలు బయటకువస్తే, అక్కడ సెక్షన్లు 14-4, 30 అమలుచేస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏంచేసినా వారికే సెక్షన్లు వర్తించవన్నారు.

జగన్‌, కేసీఆర్‌లు ఇప్పటివరకు 6సార్లు భేటీ అయ్యారని, ఏప్రయోజనాలకోసం, ఏఅంశాలకోసం చర్చలు జరిపారో ఒక్కసారికూడా జగన్‌ వివరణ ఇవ్వలేదన్నారు. రెండురాష్ట్రాలమధ్య రూ.లక్షా97వేలకోట్ల ఆస్తుల పంపకాలు జరగాల్సిఉందని, షెడ్యూల్‌ 9, 10 కింద అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌ ఆస్తులకి సంబంధించి రూ.5,500కోట్లు పంపకాలు జరగాల్సి ఉందని, ఏపీజెన్‌కోకు తెలంగాణ డిస్కంలనుంచి రూ.5,700కోట్లు రావాల్సిఉందని, వేలాదిఉద్యోగుల సమస్య అలానే ఉందని, దానికి సంబంధించిన కోర్టుఉత్తర్వులు అమల్లోకి రాలేదన్నారు. ఇన్ని సమస్యలుంటే, అధికారులులేకుండా జగన్మోహన్‌రెడ్డి ఏకాంతచర్చలకు వెళ్లడమేం టని ఉమా నిలదీశారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని తన వందలఎకరాల సెటిల్‌మెంట్‌ కోసం వెళ్లాడో, తన అనుమాయుల కంపెనీల్లో తనకున్న వాటాలపై చర్చించడానికి వెళ్లాడో జగనే సమాధానం చెప్పాలన్నారు. పాము తనపిల్లల్నితానే తిన్నట్లుగా, పక్క రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ అభివృద్ధికోసం ఈరాష్ట్ర ముఖ్యమంత్రి పాటుపడటం సిగ్గుచేట న్నారు. 5కోట్లమంది నమ్మకాన్ని వమ్ముచేసిన జగన్మోహన్‌రెడ్డి, హైదరాబాద్‌ అభివృద్దికి సహకరిస్తూ, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడని ఉమా దుయ్యబట్టారు.

అమరావతి అనేది ఒకస్ఫూర్తని, 5కోట్లమందికి ప్రతీకని, అలాంటి రాజధానిని మూడు రాజధానుల ప్రకటనతో చంపేశారని, పోలవరాన్ని పండబెట్టి, కేసీఆర్‌తో ఏకాంతచర్చలు జరపడం జగన్మోహన్‌రెడ్డికే చెల్లిందన్నారు. వెన్నెముకలేని మంత్రులు కోటలోఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనని, వారికి పౌరషం, బాధ్యత లేవన్నారు. 151మంది ఎమ్మెల్యేలు తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్నారన్నారు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ సహా, 9నగరాల అమరావతి నిర్మాణానికి రైతులు తమభూములు త్యాగం చేశారనే విషయాన్ని మరిచిన మంత్రులు ప్లాట్లు ఇస్తాం.. భూములిస్తాం.. డబ్బులిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో సాగిన భూములదందా, 23వ తేదీనుంచి విశాఖకేంద్రంగా కొనసాగుతుందని ఉమా స్పష్టంచేశారు. జగన్‌ ఆలోచనలు ముఖ్యమంత్రిస్థాయిలో లేవని, అందువల్లే ప్రజలకు ఇన్ని సమస్యలన్నారు. గుడివాడలో జరుగుతున్న కోతముక్క, కోడిపందాలు, మూడుముక్కలాటను చూడటానికి వెళుతున్న జగన్మోహన్‌రెడ్డి, ఇళ్లపట్టాలివ్వడానికి వెళుతున్నట్లు చెబుతున్నాడన్నారు. రోమ్‌ నగరం తగలడుతుంటే, నీరోచక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్లుగా, ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాలకు వెళుతున్నాడన్నారు. విజయవాడలో ర్యాలీచేశారన్న నెపంతో 3000 మంది మహిళల్ని అరెస్ట్‌చేసిన పోలీసులు, వారిలో 490మందికి తాఖీదులిచ్చార ని, పాస్‌పోర్టులు రద్దుచేస్తామని బెదిరిస్తున్నారన్నారు. మహిళలపై పోలీసులు ప్రవర్తించి న తీరు, వారిపై జరిగిన దాడిని ఎవరూ సమర్థించరన్నారు. ఆరుభేటీల్లో కేసీఆర్‌తో ఏం చర్చించారో.. ఈనాడేం మాట్లాడారో జగన్‌ స్పష్టంచేయాలన్నారు. కేసీఆర్‌ ఉదార ంగా నీళ్లిస్తున్నాడని కోతలుకోసిన జగన్‌, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇతరజిల్లాల్లో జరుగుతున్న సాగునీటిప్రాజెక్టుల పనులన్నింటినీ ఎందుకు రద్దుచేశాడని ఉమా ప్రశ్నిం చారు. మద్యం దుకాణాల రద్దుపేరుతో నాన్‌డ్యూటీ పెయిడ్‌లిక్కర్‌ను రాష్ట్రంలో విచ్చల విడిగా విక్రయిస్తున్నారని, జగన్‌ తెలివితక్కువనిర్ణయం వల్ల మద్యానికి బానిసలైనవా రంతా తెలంగాణకు వేలకోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్నారని ఉమా దుయ్యబట్టారు.

రాజధాని ఉద్యమంకోసం రైతులు, మహిళలు, కూలీలు చనిపోయినా, ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీనేతల్లో కనీసస్పందన లేదని, పిచ్చోడికి, వెర్రివెంగళప్పకు అధికారమి వ్వడంద్వారా ఇదంతా ప్రజలుచేసుకున్న దురదృష్టమని ఉమా మండిపడ్డారు. తన, తన సహచరుల రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాభివృద్ధికోసమే, జగన్‌ విశాఖజపం చేస్తున్నాడన్నా రు. పక్కరాష్ట్రాల్లో స్వరాష్ట్రంగురించి చులకనగా మాట్లాడుతున్నా, ఆంధ్రులను అవమా నిస్తున్నా జగన్‌లో చలనం లేదన్నారు. జీ.ఎన్‌.రావు, బీ.సీ.జీ కమిటీలుపోయాయని, ఇప్పుడు పవర్‌లేని హైపవర్‌కమిటీ ఏం చేస్తుందన్నారు. కమిటీలు చెప్పాల్సిందాన్ని ముఖ్యమంత్రి ముందే శాసనసభలో చెప్పాడని, దానికి అనుగుణంగానే అజయ్‌కల్లం ఆదేశాలప్రకారం ఆయా కమిటీలు రిపోర్టులు ఇచ్చాయన్నారు. అమరావతిని చంపడాని కి ముఖ్యమంత్రి ఇప్పటివరకు 5కమిటీలు వేశాడని, 34వేలఎకరాలు, రూ.10వేలకోట్ల నిర్మాణాలు, రాజధాని వెలుపల రూ.10వేలకోట్లకు పైగా జరిగిననిర్మాణాలు ఆయనకు కనిపించడంలేదన్నారు. రాష్ట్ర జీడీపీ రూ.9లక్షల20వేలకోట్ల జీడీపీలో విశాఖపట్నం జీడీపీ రూ.2లక్షల30వేలకోట్లని, అలాంటి నగరాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన పనిలేదన్నారు. జగన్‌నిర్ణయంతో రాజధానికి భూములిచ్చామని అమరావతి రైతులు ఏడుస్తుంటే, తమ భూములు లాక్కుంటారని విశాఖవాసులు ఏడుస్తున్నారని ఉమా దెప్పిపొడిచారు. గత ఏడునెలల్లో విజయసాయి ఆధ్వర్యంలో విశాఖచుట్టుపక్కల 52వేల ఎకరాలు చేతులు మారాయన్నారు. బయటిరాష్ట్రాల నాయకులుకూడా జగన్‌కనుసన్నల్లో విశాఖలో భూములుకొన్నారని, వాటిలావాదేవీలకోసమే జగన్మోహన్‌రెడ్డి కీలుబొమ్మలా మారాడని, 23వతేదీకల్లా విశాఖవెళ్లేలా ఇప్పటికే తట్టాబుట్టా సర్దేశాడన్నారు. జే.ఏ.సీ ఆధ్యర్యంలో రేపు భోగిమంటల్లో జీ.ఎన్‌.రావు, బీ.సీ.జీ, ఇతరకమిటీలిచ్చిన బోగస్‌ నివేదికలను తగులబెట్టాలని, రాష్ట్రమంతా నిరసనప్రదర్శనలు నిర్వహించాలని ఉమా పిలుపునిచ్చారు.జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌తో ఏఏ అంశాలు, సమస్యలపై చర్చించాడో మీడియా ముందుకు వచ్చి కేసీఆర్‌ సమక్షంలో చెప్పే దమ్ము,ధైర్యం జగన్‌కున్నాయా అని దేవి నేని సవాల్‌విసిరారు.

గత 26 రోజుల్లో అమరావతిలో పరిస్థితి ఎలా ఉందొ అందరికీ తెలిసిందే. 26 రోజులుగా, అమరావతిలో రైతులు శాంతియుతంగా నిరస-నలు చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే, ప్రభుత్వం, పోలీసులు మాత్రం, వాళ్ళు శాంతియుతంగా నిరస-నలు చెప్తున్నా, రైతులని మాత్రం, బయటకు రానివ్వటం లేదు. బయటకు వస్తుంటే, ముళ్ళ కం-చెలు వేస్తున్నారు. కొడుతున్నారు. అరె-స్ట్ లు చేస్తున్నారు. ఇలా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో ఇప్పటికే ఢిల్లీ నుంచి జాతీయ మహిళా కమిషన్ వచ్చి, నిన్న అమరావతి, విజయవాడలో పర్యటించింది. అలాగే నేషనల్ మీడియాలో కూడా, అమరావతిలో పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న హడావిడి పై, వ్యతిరేకత వస్తుంది. మరో పక్క, ఇప్పటికే సుప్రీం కోర్ట్ కూడా, దేశంలో అనవసరంగా 1-4-4 సెక్షన్ ఎందుకు పెడుతున్నారు, ఇది ప్రజల ప్రాధమిక హక్కుని హరించటమే అంటూ సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. ఈ నేపధ్యంలోనే, అమరావతిలో జరుగుతున్న పరిణామాల పై హైకోర్ట్ సుమోటోగా తీసుకుంది. అంతే కాకుండా కొంత మంది రైతులు పిటీషన్ కూడా వేసారు.

court 13012020 2

వీటి అన్నిటి పై విచారణ చేసిన హైకోర్ట్, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. అమరావతిలో పరిస్థితి పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. అమరావతిలో ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు అంటూ హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గ్రామాల్లోకి వచ్చి, పోలీసులు మార్చ్ చెయ్యటం ఏమిటి, అక్కడ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించింది. రాజధాని గ్రామాల్లో, కర్ఫ్యూ వాతావరణం ఎందుకు పెట్టారు అంటూ, హైకోర్టు నిలదీసింది. ఇదే సందర్భంలో, పిటీషన్ వేసిన వారు కూడా, అక్కడ పరిస్థితిని హైకోర్ట్ దృష్టికి తీసుకువచ్చారు. ఆడవారిని కూడా బయటకు రానివ్వటం లేదని, వారి పై కూడా దాడులు చేస్తున్నారని, రాజధాని తరలింపు పై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా, అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కోర్ట్ దృష్టికి తీసుకు వచ్చారు.

court 13012020 3

అలాగే, వీడియోలను కూడా కోర్ట్ కు చూపించారు. మా ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది, రాజధాని గ్రామాలని రక్షించండి అంటూ కోర్ట్ లో వేడుకున్నారు. దీని పై ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాడనలు వినిపిస్తూ, ఈ కేసుని సోమవారానికి వాయిదా వెయ్యాలని కోరారు. అయితే దానికి కోర్ట్ ఒప్పుకోలేదు. దీని పై త్వరగా విచారణ జరపాల్సిన పరిస్థితి ఉందని, పూర్తీ వివరాలతో మాకు శుక్రవారం లోపు అఫ్ఫిదవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్ట్ లో సెలవులు ఉన్నా, హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజధాని గ్రామాల్లో 1-4-4 సెక్షన్‌, పోలీస్‌ యాక్టు 3-0 అమలును సవాల్‌ చేస్తూ కొంత మంది రైతులు పిటీషన్ వెయ్యగా, హైకోర్ట్ మహిళల పై దౌర్జన్యాన్ని, సుమోటోగా తీసుకుంది.

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక ఆంత ర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా తయారైంది. అత్య వసరంగా శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఇప్పటి వరకూ ఎవరినీ ఇంకా కలవ లేదని సమాచారం. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం మధ్యలో అంత అర్జంటుగా ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఏమిటనేది సందిగ్ధంగా తయా రైంది. ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ అసలు ఏం చేస్తు న్నారు. ఎవరిని కలుస్తున్నారనేది అంతా గోప్యంగా జరు గుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు జరుగుతున్న సమయంలో అమరావతికి అనుకూలంగా కార్యాచరణ చేపట్టాలని పవన్‌ కల్యాణ్ నిర్ణయించారు. ఇందుకుగాను ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేం దుకు భారీ స్థాయిలో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ను నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు అమరావతి నుండి రాజధానిని విశాఖపట్నం తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపధ్యంలో దీనికి వ్యతిరేకంగా, రైతుల ఆం దోళనలకు మద్దతుగా మరోసారి లాంగ్ మార్చ్ నిర్వ హించాలని పవన్ కల్యాణ్ భావించారు. ఇందుకు వేది కగా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసు కునే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్న ట్టుండి ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక ఢిల్లీలో పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసిగా మారి ఆయన పర్యటన అంతారహస్యంగా సాగుతోంది. శనివారం నుండి అక్కడ ఆయన ఎవరికీ చిక్కడం లేదు. కనీసం ఆయన ఎక్కడ ఉన్నారన్నదాని పైన కూడా ఎటువంటి , సమాచారం బయటకు అందడం లేదు.

ఎవరిని కలుస్తారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఆయనను ఢిల్లీకి ఎవరు పిలిచారన్నది కూడా తెలియరావడం లేదు. మీడియాకు సైతం ఆయన దూరంగా , ఉంటుండడం సర్వత్రా చర్చనీయాంశంగా తయారైంది. అయితే ఆయన రాజకీయ కారణాలతో ఢిల్లీకి వెళ్లారా, లేదంటే వ్యక్తిగత అంశాలపై వెళ్లారా అనేది సస్పెన్స్ గా మారింది. ఢిల్లీలో ఉన్న వవన్ కల్యాణ్ శనివారం రోజునే బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, పార్టీ అధ్యక్షులు అమిత్ షా తదితర పలువురు బిజెపి పెద్దలను కూడా , కలువనున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో వవన్ పర్యటన వెనుక ఉన్న మతలబు ఏమిటనేది ఆసక్తి రేపుతోంది. మరోపక్క రాజధాని అమరావతి విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఇటీవల పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనను బిజెపి పెద్దలే పిలిచా రన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మూడోసారి కూడా వెళ్లడంతో రాజకీయంగా పెద్దలతో పావులు కదుపుతున్నానే బలమైన ప్రచారం జరుగుతోంది. కాగా డిసెంబర్ నెలలో ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాన్ ఆ పర్యటనను కూడా రహస్యంగా ఉంచారు. ఎవరిని, ఎప్పుడు కలుస్తున్నారనేది తెలియనీ యకుండా జాగ్రత్త పడ్డారు.

ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత వపన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని రాజకీయ వ్యూ హాలకు పదును పెట్టారు. ఢిల్లీ వర్యటనను అత్యంత సీక్రెట్ గా ఉంచిన ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చిన అనంతరం కొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల నుండి హిందుత్వ ఎజెండాకు మారారని పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న ఆయ బిజెపిపై మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. తన రాయలసీమ వర్యటనలో మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. దీంతో తన దారి ఢిల్లీ వైపు నకు అంటూ సంకేతాలు ఇచ్చినట్లయ్యిందని రాజకీయ వర్గాల్లో అప్పుడు చర్చ జరిగింది. అంతేకాకుండా బిజెపికి తాను ఏనాడూ దూరం లేనని, అమిత్ షా లాంటి నాయకులు దేశానికి ఎంతో అవసరం అని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోని 40 మందిని మత మార్పిడి చేశారని పవన్ కల్యాణ్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీ యాల్లో వెడెక్కించాయి. అంతేకాకుండా తాను బిజెపి ఏనాడూ దూరం కాలేదని కేవలం ప్రత్యేక హోదా కోసమే ఒంటరిగా పోరాడానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వపన్ కల్యాణ్ జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేస్తు న్నారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ విమర్శలకు తెరలేపారు. మరోవైపు బిజెపి నేతలు సైతం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతించారు. ప్రాంతీయ పార్టీల విలీనాన్ని తాము ఎప్పుడూ కోరుకుంటామనే సంకేతాలను బిజెపి నేతలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి పర్యటనకు అత్యవసరంగా వెళ్లడం, ఆద్యంతం పర్యటన వివరాలు రహస్యంగా ఉంచడంతో మరోసారి రాజకీయవర్గాల్లో వేడిని రేకెత్తిస్తోంది.

రాజధానినిర్మాణం కోసం స్వచ్చందంగా భూములిచ్చి సహకరించిన తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వ నిర్ణయంపై శాంతియుతంగా నిరస-నలు వ్యక్తం చేస్తుంటే అకారణంగా దాడికి పాల్పడ్డారని పోలీసులపై జాతీయ మహిళా కమిషను రాజధాని మహిళలు, రైతులు ఫిర్యాదు చేశారు. నక్స-లైట్లు, టెర్రరి-స్టులను ఏ విధంగా అణచివేస్తారో అదే తరహాలో తమపట్ల పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పరిధిలోని తుళ్లూరు గ్రామంలో పోలీసులు మహిళలపై లా-ఠీ-ఛార్జ్ చేసిన ఘటనను సుమో-టోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఆదివారం విజయవాడ క్లబ్ కు చేరుకుంది. మహిళా కమిషన్ కౌన్సిలర్ ప్రవీణ్ సింగ్, సీనియర్ కోఆర్డినేటర్ కాంచన కట్టర్‌ను తొలుత టీడీపీ ప్రతినిధి బృందం కలిసి, అమరావతి పరిణామాలను వివరించింది. గడిచిన 25 రోజులుగా పోలీసులు మహిళలు, రైతుల పట్ల వ్యవహరించిన తీరును క్షుణ్ణంగా వివరించింది. దాదాపు 3 వేల మంది మహిళలను పోలీసు-లు ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదు చేసారు.

farmers 13012020 21

గత 26 రోజులుగా, అయితే నిత్యం వేలాది మంది పోలీ-సులతో ఉన్న అమరావతి ప్రాంతం, నిన్న మధ్యానం నుంచి మాత్రం మారిపోయింది. పోలీసు-ల తీరుతో, అక్కడ వారు అవాక్కయ్యారు. జాతీయ మహిళా కమిషన్ అమరావతి పర్యటనకు వచ్చిన సమయంలో పోలీసులు మాయమయ్యారు. గడిచిన 25 రోజులుగా వేలసంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు ఆదివారం మచ్చుకు కూడా కనపడకపోవడం విశేషం. ఇదే విషయాన్ని తుళ్లూరు మహిళలు, రైతులు మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. రోజు వేల సంఖ్యలో పోలీ-సులు తమ గ్రామాల్లో ముళ్లకంచెలు వేసి అడ్డుకుంటున్నారని మీ పర్యటనతో వారంతా మాయమయ్యారని తెలిపారు. అంతేకాకుండా నిన్న-నేడు పేరిట రైతులు ఒక వీడియోను విడుదల చేశారు. దానికి సంబంధించిన ప్రతిని మహిళా కమిషన్‌కు అందజేశారు.

farmers 130120203

రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు, ముఖ్యంగా మహిళ లపై జరుగుతున్న దా-డుల తీరును చూసి జాతీయ మహిళా కమిషన్ సభ్యులు స్పందించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జాతీయ మహిళా కమిషనను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని ఆదివారం ట్విట్టర్‌లో ఆయన విమర్శించారు. మహి కలు నోరువిప్పితే వైకాపా ప్రభుత్వం చేసిన నీచమైన పనులు ప్రపంచానికి తెలుస్తాయని భయమా? అంటూ ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో 1-4-4 సెక్షన్ పెట్టి మహిళల్ని ఇళ్లలోనే బంధి-స్తారా అని నిలదీశారు. పోలీసుల ముసుగులో మహిళలపై జరిగిన దా-డి దాచేస్తే దాగద న్నారు. పోలీసుల బూ-టు-కాలితో తన్నించారని విమర్శించారు. ఆందోళ-న-కారులను విడిచిపెట్టడానికి కులం ప్రస్తావన కూడా తెస్తున్నారని వాపోయారు. మహిళలపై పోలీసుల ముసుగులో జరిగిన అరాచ కాలన్నిటినీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామ న్నారు. మహిళలపై జరిగిన దా-డి ఫొటో లను ట్యాగ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read