ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదా యానికి మించిన ఆస్తుల కేసుల్లో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో సీబీఐ కోర్టు అనుబంధ చార్జిషీటు విచా రణకు స్వీకరించింది. ఈ క్రమంలో పలు వురు నేతలకు, అధికారులకు సమన్లు జారీ అయ్యాయి. తెలంగాణ విద్యా మంత్రి, ఆనాటి గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్, గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్ రాజగోపాల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్ల మ్మకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా ఈ నెల 17వ తేదీన వారంతా వ్యక్తిగతంగా హాజరుకావా లని ఆదేశించింది. రెండేళ్ల క్రితమే అను బంధ చార్జిషీటు దాఖలు చేసినా, హైకో ర్టు స్టే విధించడంతో విచారణ నిలిచిపో యింది. తాజాగా ఉన్నత న్యాయస్థానం ఈ కేసులో స్టే తొలగించడంతో దానిపై మళ్లీ విచారణ మొదలైంది. అయితే అను బంధ చార్జిషీట్లను స్వీకరించవద్దంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు వాద నలు వినిపించారు.

cbi 11012020 2

ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు మాత్రం ఆ వాదన లను తోసిపుచ్చారు. తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు మొదటి చార్జిషీ టను దాఖలు చేశామని, తర్వాత మరిన్ని వివరాలు వెలుగుచూడడంతో అనుబంధ చార్జిషీటు దాఖలు చేశామని వారు పేర్కొన్నారు. చట్టప్రకారం ఎప్పుడు కీలక సమాచారం లభించినా దానికి అనుగుణంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసే వెసులుబాటు ఉందని వారు పేర్కొన్నారు. గతంలో అనంతపురం జిల్లాలో పెన్నా సిమెంటు భూముల కేటాయింపు, తాండూరు ఇతర ప్రాంతాల్లో గనుల కేటా యింపు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని అనుబంధ చార్జిషీట్ లో సీబీఐ పేర్కొంది. అప్పుడు గనుల మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించగా, రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద వీరంతా నేరానికి పాల్పడినట్టు సీబీఐ అనుబంధ చార్జిషీట్ లో పేర్కొంది.

cbi 11012020 3

ఇక మరో పక్క, ఆదా యానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గతంగా శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు. జగ న్మోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీని యర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ అధికారి సీబీఐ కోర్టుకు హాజరైన ఏపీ సీఎం జగన్ శామ్యూల్ కూడా హాజరయ్యారు. రెండు గంటల పాటు జగన్ కోర్టులోనే ఉన్నారు. సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు రావడం ఇదే మొదటిసారి కావడంతో కోర్టు హాలు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుండి మిన హాయించాలని జగన్ కోరగా, ఆ అభ్యర్ధనపై చర్చించిన న్యాయస్థానం 21న తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. హెటిరో అరబిందో ఫార్మా కేసు, వ్యక్తిగత పెట్టు బడిదారుల కేసు, రాంకీ కేసు, వాపిక్ కేసు, దాల్మియా సిమ్మెంట్ కేసు, ఇండియా సిమెంట్ కేసు, రఘురాం సిమెంట్ కేసు, పెన్నా సిమెంట్, ఇందు టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జి హబ్, ఏపీ హౌసింగ్ ప్రాజెక్టు కేసులను జగన్ ఎదుర్కొంటున్నారు.

నిన్న సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు, రాజధాని అమరావతి రైతులకు ఆయుధంగా మారాయి. సుప్రీం ఆదేశాలను, ఇక్కడ కూడా పోలీసులు తుంగలోకి తొక్కుతున్నారని, ఏపి పోలీసుల పై, సుప్రీంలోనే తేల్చుకుంటామని రాజధాని రైతులు అంటున్నారు. భావప్రకటన స్వేచ్ఛను, ప్రజా ఉద్యమాలను, అణిచివేయటానికి, దేశవ్యాప్తంగా, ప్రభుత్వాలు ఇస్తానుసారంగా, 144 సెక్షన్‌ ప్రయోగిస్తున్న నేపధ్యంలోం, నిన్న సుప్రీ కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ-కశ్మీర్‌లో పెడుతున్న ఆంక్షల పై సుప్రీం స్పందిస్తూ, అత్యవసరంగా ప్రమాదం ఉంటే తప్ప 144 సెక్షన్‌ ప్రయోగించడానికి వీల్లేదని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే, వారిని అణచివేయడానికి 144 సెక్షన్‌ ప్రయోగించటం చూస్తుంటే, ఇది అధికారాన దుర్వినియోగానికి పాల్పడటమేనని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. 144 సెక్షన్‌ తో, ప్రజల ప్రాథమిక హక్కుల పై, ప్రభావితం చూపుతాయని, సుప్రీం కోర్ట్ చెప్పింది. ఈ హక్కులను నియంత్రించేందుకు, ఏకపక్షం నిర్ణయాలు తీసుకోకూడదని కోర్ట్ తెలిపింది.

court 11012020 2

అలాగే, ఇంటర్నెట్ సదుపాయాలు పొందడం కూడా ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని 19 అధికరణ కింద జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం అంతర్జాల సేవలపై సమీక్షించాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన త్రిసభ్య బెంచ్ ఆదేశించింది. ఇంటర్నెట్ సదుపాయం ప్రాథమిక స్వేచ్ఛ కిందకే వస్తుందన్న ధర్మాసనం వారం రోజుల్లో దీనిపై సమీక్షించి అడ్డంకులు తొలగించాలని స్పష్టం చేసింది. ఐపీసీలోని 144 సెక్షన్ (నిషేధాజ్ఞలు) ప్రయోగించి వాక్ స్వాతంత్రంపై నిరవధికంగా అణచివేతకు దిగడంపై బెంచ్ ఆక్షే పణ తెలిపింది. మీడియాపై ఆంక్షలను బెంచ్ తప్పుపట్టింది.

court 11012020 3

ఆంక్షలు విధించే టప్పుడు మెజిస్ట్రేట్లు ఔచిత్యం ప్రదర్శించాలని, ఎవరికి ఆపాలి, ఎవరికి ఉంచాలి అన్న విషయం ఆలోచించాలని కోర్టు పేర్కొంది. ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దుచేసిన తరువాత కాశ్మీర్ పై కేంద్రం అనేక రకాలు ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత కీలకమైం దని న్యాయవాది బ్రిందా గ్రోవర్ అన్నారు. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండటంతో, ఇప్పుడు రాజధాని రైతులు, సుప్రీం తీర్పుతో, ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎదుర్కుంటామని చెప్తున్నారు. శాంతియుతంగా మేము నిరసనలు తెలుపుతుంటే, 144 పెట్టి అడ్డుకుంటున్నారని, చివరకు గుడికి కూడా వెళ్ళనివ్వక పోవటం పై, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సుప్రీంలోనే తేల్చుకుంటామని చెప్తున్నారు.

రాజధాని అమరావతి పరిరక్షణతోనే ఏపిలో బీజేపీ భవితవ్యం ముడిపడి ఉందని ఆ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో పటిషమైన పునాదులు నిర్మించుకునేందుకు అమరావతి పరిరక్షణ రూపంలో ఒక సువర్ణావకాశం బిజెపి ముంగిటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నిఘావర్గాలు సైతం ఇదే విషయాన్ని ఢిల్లీ వర్గాలకు చేరవేసినట్లు వినికిడి. దీంతో అమరావతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తుంది. రాజధాని అమరావతి మార్పు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను అంచనా వేసేందుకు బీజేపీ అధిష్టానం కేంద్రం మంత్రి సదానంద గౌడను దూతగా పంపించనున్నట్లు బీజేపీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతుంది. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ ఈనెల 12వ తేదీన గుంటూరు రానున్నారు. సిఏఏ సదస్సు పేరిట గుంటూరు కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న కార్యక్రమానికి సదానంద గౌడ హాజరవుతారని బీజేపీ నాయకులు బాహాటంగా చెబుతున్నారు. అయితే 12వ తేదీ మధ్యాహ్నం సదానందగౌడ నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి చేరుకుంటారు.

amaravati 10012020 2

ఆ సమయంలో రాజధాని పరిణామాలపై అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వినికిడి. రాజధాని ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు కేంద్రమంత్రిని కలుసుకునేందుకు ఏర్పాటు జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరుతూ బిజెపి రాష్ట్ర శాఖ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఆ యోచనతోనే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 11వ తేదీన ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సంసాగత ఎన్నికలులో పార్టీ యంత్రాంగమంతా తలమునకలు అయి ఉన్న తరుణంలో ప్రత్యేకించి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సందరించుకుంది. సమావేశంలో తీర్మానం అనంతరం పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ ధియోదర్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని జాతీయ నాయకత్వ వద్దకు పంపించాలని బిజెపి తలపోస్తోంది.

amaravati 10012020 3

గతంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసిన తరహాలోనే తాజా పరిణామాల నేపధ్యంలో ఒక రాష్ట్రం ఒక రాజధాని' అని తీర్మానం చేయాలని భావిస్తున్నారు. అయితే పార్టీ విధానాన్ని అనుసరించి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర నాయకత్వాన్ని కోరే అవకాశముంది. ఈ నేపధ్యంలోనే గతంలో పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ గా వ్యవహరించిన ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సిద్ధార్థ నాదసింగ్ వ్యాఖ్యలు అమరావతి రైతాంగంలో ఆశలు రేకెత్తించింది. 75 జిల్లాలు ఉన్నా ఉత్తరప్రదేశ్ కు ఒకే రాజధాని ఉంది. అక్కడి నుంచే ఎంతో సమర్థవంతంగా పాలన జరుగుతుంది. ఆంధ్ర నుంచి అధికారులు వస్తే అక్కడకు తీసుకువెళ్ళి చూపిస్తాం అని సిద్ధార్థ నాద్ వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించటమే గాక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై పట్టు ఉన్న సిద్ధార్థ నాద్ సింగ్ ఈ తరుణంలో రాష్ట్రానికి రావడం బీజెపి వ్యూహంలో భాగంగానే
భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మహిళల పై, పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించటం పై, జాతీయ మహిళా కమిషన్ ఫైర్ అయ్యింది. ఈ రోజు విజయవాడలో జరిగిన మహిళా ర్యాలీలో, పోలీసులు మహిళలను అరెస్ట్ చేసారు. వారిని దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో కాకుండా, ఎక్కడి పడితే అక్కడికి పంపించారు. అయితే సాయంత్రం 6 దాటిన కొన్ని చోట్ల వారిని విడుదల చెయ్యకపోవటం, అది రూల్స్ కి వ్యతిరేకంగా కావటంతో, ఆందోళన చెయ్యటంతో, అప్పుడు కాని వదిలి పెట్టలేదు. మరో పక్క, ఇప్పటికీ 100 దాకా మహిళలను, విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లో ఉంచారని, వారి నుంచి కులం వివరాలు అడుగుతున్నారని, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. వారిని వదిలి పెట్టాలని, 8 దాటినా వదలలేదు అంటూ, రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేసారు. వీరికి విజయవాడ ఎంపీ కేశినేని నాని, అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా సంఘీభావం తెలుపుతూ, మహిళను విడిచి పెట్టాలని, రోడ్డు మీద కూర్చోవటంతో, వారిని అరెస్ట్ చేసారు.

rekhasharma 10012020 1

ఇది ఇలా ఉండగా, ఈ విషయం జాతీయ మహిళా కమిషన్ ద్రుష్టి వెళ్ళటంతో, ఎస్సీ డబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ, జగన మోహన్ రెడ్డిని ట్యాగ్ చేసి మరీ, మీ పోలీసులకు చెప్పండి అంటూ ట్వీట్ చేసారు. "Getting 100s of messages that women participating in peaceful protest on farmer's issue in #Amravati are been taken to police station and are in detention beyond 6pm. @AndhraPradeshCM . Pl tell your police to let women go back to their homes. Sending a team to meet women farmers.". ఇప్పటికే, అమరావతిలో జరిగిన దాడుల పై, నివేదిక ఇవ్వా లని డీజీపీ సవాంగ్ ను ఆదేశించినట్లు ఎస్సీ డబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ వెల్లడించారు. రేపు అమరావతిలో పర్యటిస్తున్నట్టు కూడా చెప్పారు.

rekhasharma 10012020 1

అమరావతి పరిరక్షణ సమితి మహిళా చైతన్య ర్యాలీతో దద్ధరిల్లిన బెజవాడ. పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి బెంజ్ సర్కిల్ వరకూ సేవ్ అమరావతి అంటూ కదంతొక్కిన మహిళలు. పోలీసుల ఆంక్షలు. చేధించుకుంటూ మరీ బెంజ్ సర్కిల్ వరకూ ఆందోళన నిర్వహించిన మహిళలు. మహిళా చైతన్య ర్యాలీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన. పలువుర్ని అదుపులోకి తీసుకొని వివిధ పీఎస్ లకు తరలించిన పోలీసులు. అమరావతి ఉద్యమ స్ఫూర్తిని ఉవ్వెత్తున ప్రకాశింపజేసిన మహిళాలోకం. తొలిసారిగా గడపదాటి బయటికొచ్చి ఏపీ రాజధాని ఉద్యమంలో పాల్గొన్న మహిళలు. యువత నుంచి వృద్ధ మహిళల వరకు ఆందోళనబాట. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ మహిళలు నినాదాలు, డిమాండ్ తో హోరెత్తిన బందరు రోడ్
. పోలీసుల తీరును వైఖర్ని ఎండగట్టిన మహిళలు

Advertisements

Latest Articles

Most Read