వంగవీటి రాధా.. వంగవీటి రంగా వారసుడిగా, ఈ పేరు తెలియని వారు ఆంధ్రప్రదేశ్ లో ఉండరు. రాధా గత కొంత కాలంగా, సైలెంట్ గా ఉంటున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించటం లేదు. 2018లో వైసీపీ పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు భరించ లేక, రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ సెంట్రల్ లో బొండా ఉమా, తూర్పులో గద్దె రామ్మోహన్ బలమైన టిడిపి అభ్యర్ధులుగా ఉన్నారు, తనకు సీటు రాదు అని తెలిసినా, రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఎన్నికల వరకు, టిడిపిలో చురుగ్గా ఉన్నారు. ఎన్నికల్లో, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల కోసం, తాను ప్రచారం కూడా చేసారు. అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తరువాత, అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళు ఎక్కువ అవటంతో, రాధా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొడాలి నాని, రాధాని వైసీపీలోకి తీసుకురావటానికి, అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రచారం జరుగుతుంది కూడా. అయితే, ఎన్నికల తరువాత, రాధా రెండు సార్లు పవన్ కళ్యాణ్ ని కలవటంతో, జనసేనలోకి వెళ్తారని అందరూ అనుకున్నారు.
అయితే ఇలా ప్రచారాలు సాగుతున్న వేళ, నిన్న రాధా, చంద్రబాబు ఇంట్లో ప్రత్యక్షం అవ్వటంతో, అందరూ షాక్ అయ్యారు. చాలా కాలం తరువాత, రాధాని చూసి, టిడిపి కార్యకర్తలు కూడా హర్షించారు. నిన్న బెంజ్ సర్కిల్ దగ్గర చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవటంతో, చంద్రబాబు మెరుపు ధర్నాకు దిగారు. అయితే అక్కడ నుంచి చంద్రబాబుని పోలీసులు అదుపులోకి తీసుకుని, చంద్రబాబు ఇంట్లో పోలీసులు దించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రాధా, పెద్దాయన్ని ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకుని, ఉన్నట్టు ఉండి, రాత్రి 10 గంటలు దాటిన తరువాత, చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. రాధాను చంద్రబాబు ఇంట్లో చూసిన మీడియాతో పాటుగా, కార్యకర్తలు కూడా షాక్ అఅయ్యారు.
ఇది ఇలా ఉంటే, నిన్న రాధా రాక సందర్భంగా, ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబుని అరెస్ట్ చేసి తీసుకు వస్తున్న బస్సు, కరకట్ట మీదకు రాగానే, వెనకాల వచ్చే కార్లు అన్నీ ఆపేసారు. అయితే రాధా కూడా ఒక కారులు ఉండి పోయారు. పోలీసులు వదలక పోవటంతో, ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి, చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి ఇంటి వరకు, కరకట్ట మీదుగా రాధా నడుచుకుంటూ వెళ్లారు. అయితే చంద్రబాబు ఇంటి వద్ద కూడా, రాధాను పోలీసులు లోపాలకి అనుంతించలేదు. దీంతో, రాధాను చూసిన లోకేష్, అక్కడకు వచ్చి, మా ఇంటికి మా కుటుంబ సభ్యులని కూడా రానివ్వరా అంటూ, పోలీసుల పై ఫైర్ అయ్యి, రాధాతో పాటుగా మిగతా కార్యకర్తలను లోపలకి తీసుకు వెళ్లారు. అయితే, టిడిపి కార్యకర్తలు మాత్రం, గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు, గుండెల మీద తన్ని వెళ్ళారని, రాధా మాత్రం, చంద్రబాబు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని, వచ్చి నిలబడ్డారని, రాధాని అభినందిస్తూ, రాధా ఆక్టివ్ గా రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నారు.