ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో, నిన్న అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో, అమరావతి ప్రాంతంలోని రైతులు షాక్ తిన్నారు. అమరావతి కేవలం లెజిస్లేటివ్ కాపిటల్ అని, జగన్ ప్రకటించటంతో, రైతులు అవాక్కయ్యారు. ఆరు నెలల నుంచి జగన్ మోహన్ రెడ్డి, మంచి నిర్ణయం ప్రకటిస్తారని ఎదురు చూస్తూ, తమ కొంప ముంచే నిర్ణయం తీసుకున్నారని రైతులు ఆందోళన బాట పట్టారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు, ఒక్క చిన్న ఆందోళన కూడా లేకుండా 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, ఈ రోజు మాత్రం జగన్ ప్రకటనతో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు విజన్ నచ్చి ఆయన పై నమ్మకంతో, 33 వేలు ఎకరాలు ఇచ్చామని, ఆరు నెలల నుంచి మంత్రులు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నా, తమకు జగన మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, ఆయన తమ పట్ల సానుకూల నిర్ణయం ప్రకటిస్తారని అనుకున్నామని, ఇప్పుడు మమ్మల్ని ముంచేసారని రాజధాని రైతులు వాపోయారు.

amaravati 18122019 2

రాజధాని గ్రామాలు అయిన వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం, మందడంలో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్ల పై బైఠాయించి జగన మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక వెంకటాయపాలెం గ్రామంలో, రైతులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఇక జగన్‌ ప్రకటనకు నిరసనగా తుళ్లూరులోని రైతులు, పురుగుల మందు డబ్బాలు పట్టుకుని రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు. మూడు రాజధానులు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, తమ గోడు వినాలని, లేకపోతే అందరం ఈ పురుగులు మందు తాగి చచ్చిపోతామని అన్నారు. రైతుల ఆందోళన గంట గంటకు తీవ్రం అవుతున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.

amaravati 18122019 3

ఎక్కడికక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలగటంతో, పోలీసులు క్లియర్ చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం, తమను అన్యాయం చేసారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారని అన్నారు. అసలు దక్షిణాఫ్రికాను ఆదర్శంగా ఎలా తీసుకుంటారని, అది ఒక దేశం అని, మనది ఒక చిన్న రాష్ట్రం అని, దానికి దీనికి పోలిక ఎలా పెడతారని అంటున్నారు. ఇప్పటికే కట్టిన పెద్ద పెద్ద భవనాలను ఏమి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తాము ఇచ్చిన భూములు ఇప్పటికే ఫ్లాట్ లు చేసి ఇచ్చారని, తమ భూములు తమకు ఇచ్చేసి, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ కొంత మంది రైతులు ఆందోళన బాట పట్టారు. భూములు ఇచ్చే సమయంలో కూడా ఆందోళన లేకుండా ఇచ్చామని, ఇప్పుడు తమను రోడ్డు ఎక్కించారని, రైతులు ఆందోళన వ్యక్తం చేసారు.

ఈ రోజు అసెంబ్లీలో అమరావతి పై చర్చ సందర్భంగా, బుగ్గన చేసిన విమర్శలకు, తమకు సమాధానం చెప్పే అవకాసం ఇవ్వాలి అంటూ, తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలు ఆందోళన చేసారు. అయితే, మైక్ ఇవ్వకపోగా, తెలుగుదేశం పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేసారు. దీంతో వారితో పాటుగా, చంద్రబాబు కూడా వాక్ అవుట్ చేసారు. ఈ సందర్భంగా అమరావతి పై జగన్ చూపిస్తున్న వైఖరికి నిరసనగా, ప్రజా వేదిక కూల్చిన స్థలంలో, చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఆరు నెలలు అయినా, ఇంకా ప్రజా వేదిక కూల్చిన వ్యర్ధాలు అలాగే ఉన్నాయి. దాని ముందే చంద్రబాబు ప్రెస్ మీట్ పెడుతూ, ఇది జగన్ మోహన్ రెడ్డి నైజం అంటూ, అవి చూపించారు. నేను అడిగితె ఈ బిల్డింగ్ నాకు ఇవ్వలేదు, ప్రజలకు ఉపయోగించలేదు, నేను కట్టానని కూల్చేసారు అంటూ, చంద్రబాబు అన్నారు. ఇదే సందర్భంలో అమరావతి పై అసెంబ్లీలో జరిగిన చర్చ, తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే అంశాల పై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

capital 17122019 2

ఇదే సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, మూడు రాజధానాలు విషయం గురించి ప్రకటన చేసారు. ఇదే సమయంలో ప్రెస్ మీట్ లో ఉన్న చంద్రబాబుకు, మూడు రాజధానుల విషయాన్ని అచ్చెన్నాయుడు చంద్రబాబుకు వివరించారు. ఇప్పుడే అసెంబ్లీలో చెప్పారట, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషయల్, లెజిస్లేటివ్ అంటూ మూడు రాజధానులు చేస్తారాట. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ రాజధాని అంట అంటూ చంద్రబాబుకు ప్రెస్ ముందే చెప్పారు. దీని పై చంద్రబాబు స్పందిస్తూ, ఇలా ఉంది మన రాష్ట్రం. పిచ్చోడి చేతిలో రాయలాగ, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ, జగన్ పై విమర్శలు గుప్పించారు.

capital 17122019 3

ఎక్కడైనా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ, పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కుంటారని అన్నారు. హైకోర్ట్ ఒక చోట, అసెంబ్లీ ఒక చోట, సెక్రటేరియట్ ఒక చోట పెడితే, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో, కనీసం ఆలోచించారా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో 70 వేల కోట్ల డేటా సెంటర్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేశారని, ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తే ప్రజలు జీవితాలు బాగుపడతాయి కాని, ఇలాంటి తుగ్లక్ చర్యలతో, ఇబ్బందులు పడతారని అన్నారు. ఇన్ని రాజధానులు ఏర్పాటు చేసి రేపు ముఖ్యమంత్రి ఏ రాజధానిలో కూర్చుంటాడని ప్రశ్నించారు. సీఎం అమరావతిలో ఉంటారా.. విశాఖలో ఉంటారా.. ఇడుపులపాయలో ఉంటారా? అని ప్రశ్నించారు. తరువాత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, టిడిపి విధానం చెప్పారు. అమరావతి రాజధానిగా ఉండాలని, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ పెట్టాలని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలనేదే తమ విధానం అని అన్నారు.

టైం ఎప్పుడూ ఒకేలా ఉండదని అంటారు. గతంలో చేసిన విమర్శలనే, ఇప్పుడు పొగడాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయాల్లో ఇది మరీ సహజంగా జరిగిపోతూ ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు పై అనేక ఆరోపణలు చేసే వారు. చంద్రబాబు పెట్టుబడులు కోసం, విదేశీ పర్యటనలు చేసినా, సిఐఐ సమ్మిట్లు పెట్టినా, ఇంకా ఏ విధమైన కార్యక్రమం చేసినా, అన్నిటినీ వ్యతిరేకిస్తూ, అన్నిటిలో అవినీతి జరిగిపోయిందని, చంద్రబాబు మభ్య పెడుతున్నారని, ఇలా అనేక విధాలుగా ప్రచారం చేసే వారు. చంద్రబాబు సుందర మొఖం చూసి పెట్టుబడులు వస్తాయా అని విమర్శలు చేసారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన వైసీపీ, చంద్రబాబు సుందర మొఖం చూసే, పెట్టుబడులు వచ్చాయని మెచ్చుకుంది. ఏ సిఐఐ సమ్మిట్ల ద్వారా కృష్ణ కిషోర్ లాంటి ఆఫీసర్ పై అభియోగాలు మోపారో, అవే సిఐఐ సమ్మిట్ ల ద్వారా, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో చెప్పింది. గతంలో చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా తేలేదు అనే ప్రచారం అబద్ధమని తేలిపోయింది.

ciisummit 17122019 1

గత ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్ల ద్వారా ఎన్ని పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అని, నిన్న శాసనమండలిలో, సభ్యులు అడిగిన ప్రశ్నకు, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో 1,182 భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటుకు ఎంవోయూలు కుదరగా, అందులో 309 సంస్థలు తమ ఉత్పత్తిని ప్రారంభించాయని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్ర్రంభించిన కంపెనీలు ద్వారా, రూ.1.39 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. 1.54 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, అలాగే మూడు సిఐఐ సదస్సుల నిర్వహణకు రూ.108 కోట్లు ఖర్చయిందని వివరించారు. అంటే 108 కోట్లు ఖర్చు పెడితే, 1.39 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.54 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.

ciisummit 17122019 1

2016, 2017, 2018లో నిర్వహించిన సదస్సుల్లో కుదిరిన ఎంవోయూల ద్వారా రూ.12.32 లక్షల కోట్ల పెట్టుబడులు, 22.81 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. ఇదీ విషయం పై, మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో సోమవారం చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్ పి సమావేశంలో కూడా చర్చించారు. "సమ్మిట్స్ ద్వారా రూ.1,39,000కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1,54,000మందికి ఉద్యోగాలు వచ్చాయని శాసన మండలిలో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిని బట్టే టిడిపి హయాంలో సమ్మిట్స్ విజయవంతం అయ్యాయని వైసిపి ప్రభుత్వమే ఒప్పుకుంది. దేశంలో 6సమ్మిట్స్ నిర్వహించి, సత్ఫలితాలను రాబట్టిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే. " అంటూ చంద్రబాబు, ఇతర నేతలు చెప్పుకొచ్చారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆరు నెలలుగా, అమరావతి పై, అనేక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీల్లో ఒకటిగా చేద్దామని ప్రణాళిక రచించిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి, అమరావతిని వ్యతిరేకిస్తూ వచ్చిన జగన్ మొహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అమరావతి పై అదే ధోరణితో వెళ్తున్నారు. అమరావతి పై ప్రభుత్వంలోని అందరూ అనేక ప్రకటనలు చేస్తున్నా, ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి అయితే మాత్రం, ఎప్పుడు ఒక్క మాట కూడా అమరావతి పై మాట్లాడట లేదు. అయితే ఈ రోజు అమరావతి పై అసెంబ్లీలో చర్చ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ర్ రాజధాని పై జగన్ సంచలన ప్రకటన చేసారు. సౌతాఫ్రికా లాంటి దేశానికి మూడు రాజధానులు ఉన్నాయని తెలియజేసిన జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బహుశా మూడు రాజధానులు రావచ్చునని అన్నారు.

amaravati 17122019 2

ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రానికి మూడు రాజధానిలో ఉండవచ్చని, అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ అంటే కేవలం అసెంబ్లీ మాత్రమే, అలాగే కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్‌ అంటే హైకోర్ట్, విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌, అంటే సెక్రటేరియట్ ఉండే అవకాసం ఉంది అంటూ జగన్ మొహన్ రెడ్డి చెప్పారు. రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని, తరువాత పూర్తీ క్లారిటీ వస్తుందని జగన్ మొహన్ రెడ్డి చెప్పారు. అయితే కమిటీ రిపోర్ట్ రాకముందే జగన్ చెప్పటంతో, దాదపుగా కమిటీ రిపోర్ట్ కూడా ఇలాగే వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. అయితే హైకోర్ట్ కర్నూల్ కు వెళ్ళాలి అంటే, సుప్రీం కోర్ట్, కేంద్రం పర్మిషన్ కావాల్సిన అవసరం ఉంది. మరి వారు ఒప్పుకుంటారా ?

amaravati 17122019 3

అలాగే, సెక్రటేరియట్ విశాఖపట్నంకు వెళ్ళాలి అంటే, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిలో, అది ఇప్పుడు సాధ్యమా అనే అంశం కూడా తెర మీదకు వస్తుంది. అయితే ఇవన్నీ జరిగే పనేనా అనే చర్చ జరుగుతుంది. కేవలం ప్రజల్లో ఇలా చర్చ పెట్టి, హంగామా చెయ్యలా అనే ఉద్దేశమా అనే అభిప్రాయం కలుగుతుంది. ఇవన్నీ ఇలా ఉంటే, 33 వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులను మాత్రం, జగన్ నిర్ణయం ముంచేసి నట్టే. కేవలం అసెంబ్లీ మాత్రమే ఇక్కడ ఉంటే, అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, రోడ్డున పడినట్టే చెప్పాలి. మొత్తానికి, ఎన్నో కలలు కన్న అమరావతి ఇక చరిత్రలో కలిసిపోయే అవకాసం కనిపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read