ఆరవ రోజు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్నోత్తరాల తరువాత ఈ రోజు వివిధ బిల్లుల పై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ..ఎస్టీ కమిషన్ ను, ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ గా, రెండు వేరు వేరుగా చేస్తూ, ప్రభుత్వం బిల్ ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నేతలు, వరుస పెట్టి చంద్రబాబు పై విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ఎస్సీలకు, ఎస్టీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేసారని, వరస పెట్టి విమర్శలు చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ హయంలో ఎస్సీలకు, ఎస్టీలకు చేసిన పని గురించి వివరించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు, బడ్జెట్ లో ఎస్సీలకు, ఎస్టీలకు పెట్టిన ఖర్చులో సగం కూడా చెయ్యలేదని, ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉందని గుర్తు చేసారు. తమ హయంలో ఎస్సీలకు, ఎస్టీలకు బడ్జెట్ లో ఎంత కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టింది లెక్కలు చదవి వినిపించారు. తాము 95 శాతం వరకు నిధులు ఖర్చు పెట్టిన విషయాన్ని చెప్పారు.

cbn 16122019 2

అలాగే ఎస్సీలకు, ఎస్టీల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు మార్చే నిర్ణయాలు తాము తీసుకున్నామని, అన్నీ చదివి వినిపించారు. తాము ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి, 2018-19లోనే, 10 వేల కోట్ల ఖర్చు చేసామన్న విషయాన్ని గుర్తు చేసారు. కేఆర్ నారాయణన్ లాంటి వారికి రాష్ట్రపతి పదవి ఇవ్వటంలో, అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ లో ఉండి కీలకంగా వ్యవహరించామని చెప్పారు. అలాగే, లోక్ సభలో స్పీకర్ గా బాలయోగిని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతిని అత్యున్నత స్థానంలో నియమించి, వారికి గుర్తింపునిచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. అలాగే చీఫ్ సెక్రటరీగా దళిత వర్గానికి చెందిన కాకి మాధవరావుకు అవకాశం ఇచ్చామన్నారు.

cbn 16122019 3

తాము ఎస్సీ సంక్షేమానికి ఇన్ని పనులు చేస్తే, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుగా, నిన్న కాక మొన్న వచ్చిన వీళ్ళు, తమకు పాఠాలు చెప్తున్నారని అన్నారు. జగన్ కావాలని సభ్యులను రెచ్చగొడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం గొప్పగా తెచ్చిన, దిశ చట్టం తీసుకొచ్చిన రోజునే గుంటూరు లో ఒక విద్యార్ధిని పైన జరిగిన దాడి గురించి అడిగితే, ఏమి సమాధానం చెప్తారని, జగన్ ను ప్రశ్నించారు. ఈ సభలో తాను అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించారని, తాము దీని పై ప్రివిలేజ్ నోటీసు ఇస్తే, దానికి ఇప్పటి వరకు సామాధానం చెప్పకుండా పారిపోయిన ముఖ్యమంత్రి అంటూ, జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలోనూ, వక్రీకరించి, పబ్బం గడుపుకోవం వీళ్ళకు అలవాటు అయిపోయిందని అన్నారు.

విశాఖపట్నం పర్యటనలో ఉన్న విజయసాయి రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. విశాఖలో కాపులు అందరూ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ సమావేశంలో వైసీపీ నాయకుడు, జగన్ సన్నిహితుడు, విజయసాయిరెడ్డి పాల్గొనడం పై అక్కడకు వచ్చన ప్రజలు ఎదురు తిరిగారు. అక్కడకు రావటమే కాకుండా, ప్రభుత్వం గురించి, జగన్ గురించి చెప్తూ ఉండటంతో, ప్రజలు ఎదురు తిరిగారు. ఇది కేవలం కాపులు అందరూ తమ సాధకబాధకాలు పై ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అని, విజయసాయి రెడ్డి లాంటి వేరే కులాల వారిని ఇక్కడకు ఆహ్వానించడంతో పాటుగా, స్టేజ్ ఎక్కించి, జ్యోతి ప్రజ్వలన చేయించడం పై అక్కడ ఉన్న వారు ఆగహ్రం వ్యక్తం చేసారు. మీ రాజకీయాలు పార్టీ కార్యాలయంలో చేసుకుని, ఈ పరిస్థితి కారణం మీరే అంటూ, అక్కడే ఉన్న మంత్రి అవంతి శ్రీనివాసరావును చుట్టుముట్టి, అక్కడ ఉన్న వారు నినాదాలు చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో కంబాలకొండ వద్ద ఆదివారం జరిగింది.

vsreddy 16122019 2

ఈ సమావేశం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. చాలా మంది కాపు పెద్దలు ఈ సమావేశానికి వచ్చారు. రిటైర్డ్‌ డీజీపీ సాంబశివరావు తదితరులు హాజరై ప్రసంగించారు. అయితే అంతా సాఫీగా సాగుతున్న సమయంలో, 12 గంటల సమయంలో మంత్రి అవంతితో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి, హంగామా చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే విజయసాయిరెడ్డితో మంత్రి జ్యోతిప్రజ్వలన చేయించడంతో అక్కడున్నవారు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అది కాపుల కోసం సమవేశమా, లేక వైసీపీ సమవేశమా అంటూ ఆందోళనకు దిగారు. మీ రాజకీయల కోసం, కాపులు కాని వారిని కూడా ఇక్కడ పిలిపించటం, రాజకీయ ప్రసంగాలు చేపించటం ఏమిటి, మమ్మల్ని అవమానిస్తారా, విజయసాయి కిందకు దిగాలి అంటూ నినాదాలు సెహ్సారు.

vsreddy 16122019 3

దీంతో విజయసాయి రెడ్డి కలగచేసుకుని, తాను కాపునే అని, నెల్లూరులో రెడ్లను కాపులు అనే పిలుస్తారని, పదో తరగతి సర్టిఫికెట్‌ లో కూడా, ఓసీ కాపు అని ఉంటుందని, చెప్పుకొచ్చే ప్రయత్నం చేసారు. అయినా అక్కడ ఉన్న వారు అందరూ, నిరసనలు, స్లొగన్స్ ఇస్తూ ఉండటంతో, కొంచెం సేపు అక్కడ ఉండి, చేసేది లేక విజయసాయి రెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే అవంతి సీరియస్ అయ్యి, నేను మంత్రి కాబట్టే సహనంగా ఉన్నాను, సహనాన్ని పరీక్షించకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినా నిరసనలు ఆగలేదు. కాపు రిజర్వేషన్ ఎత్తేసిన వారికి, కాపులను అడుగడుగునా అవమానిస్తున్న వారికి వత్తాసు పలుకుతారా అంటూ, నినాదాలు చేసారు. చివరకు ఈ సమావేశం రసాభాసగా ముగిసింది.

కేంద్రంలోనే బీజేపీ పెద్దలతో చెడిపోయిన సంబంధాలను, పునరుద్ధించే పనిలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిమగ్నమయ్యారు. ఇందు కోసం, ఆయనే రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. గత మూడు పర్యయాలుగా, ఆయనకు ఢిల్లీ పెద్దలతో అపాయింట్మెంట్ లేకపోవటంతో, ఇది విజయసాయి రెడ్డి చేతకాని తనంగా జగన్ భావిస్తున్నారని, అందుకే ఆయనే డైరెక్ట్ గా రంగంలోకి దిగి, కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలో, విభజన చట్టంలోనే అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎక్కడవి అక్కడ పెండింగ్ లో ఉండటం, రాష్ట్రంలో ఆదాయం పడిపోవటం, కేవలం సంక్షేమ పధకాలకే డబ్బు అంతా వెళ్ళిపోతూ ఉండటంతో, ఏదో ఒక విధంగా కేంద్రం నుంచి ఉదార సాహయం అందక పొతే, రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు నుంచి ఆరు నెలల్లో చేతులు ఎత్తేయటం ఖాయం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

bjp 15122019 2

అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి, రాజకీయ పరిస్థితి కూడా కలిసి వచ్చింది. కేంద్రంలోని బీజేపీతో సఖ్యతకు, ఇదే మంచి సమయం అని జగన్ కూడా భావిస్తున్నారని తెలుస్తుంది. కేంద్రం నుంచి శివసేన వైదోలగటంతో, బీజేపీకి ఉన్న ఒక నమ్మకమైన మిత్రపక్ష పార్టీ దూరం అయ్యింది. ఇప్పుడు కనుక బీజేపీకి దగ్గరయ్యి, ఎన్డీఏలో చేరితే, ఒక రెండు మంత్రి పదవులతో పాటుగా, కేంద్రం నుంచి నిధులు కూడా అధికంగా తెచ్చుకోవచ్చని, తద్వారా, రాష్ట్రంలో ఆదాయం పెరగక పోయినా, ఆర్ధిక పరిస్థితి నుంచి గట్టేక్కచ్చు అని జగన్ అభిప్రాయంగా తెలుస్తుంది. విజయసాయి రెడ్డిని, బీజేపీ పెద్దలు, దగ్గరకు రానివ్వకపోవటంతో, తానే స్వయంగా రంగంలోకి దిగి, బీజేపీ పెద్దల ముందు ఈ ప్రతిపాదన పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం.

bjp 15122019 3

అయితే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా, జగన్ ప్రతిపాదనకు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే శివసేన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది. శివసేన విభేదించినా, అది ఎప్పటికైనా బీజేపీతో కలుస్తుంది. ఎందుకంటే వారిది హిందుత్వ అజెండా. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై అనేక మత పరమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో, జగన్ మోహన్ రెడ్డిని, బీజేపీ దగ్గరకు తీసుకునే పరిస్థితి ఉండక పోవచ్చని తెలుస్తుంది. మరో పక్క ఇప్పటికే జగన్ తమ మాట వినటం లేదని, పీపీఏల విషయంలో కాని, పోలవరం విషయంలో కాని, ఇంటలిజెన్స్ చీఫ్ నియామకంలో కాని, తమ మాట లెక్క చెయ్యటం లేదని, సరైన విధంగా సమాధానం చెప్పటానికి, బీజేపీ పెద్దలు ఎదురు చూస్తున్నారని, ఈ తరుణంలో, ఇద్దరూ కలుస్తారా లేదా అనేది కూడా చూడాలి. రాజకీయాల్లో ఏమైనా జరగోచ్చు అంటారు. చూద్దాం..

మన దేశంలో అజిత్ ధోవల్‌ అనే తెలియని వారు ఉండరు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తరువాత, సెంటర్ లో అంత కీలక వ్యక్తీ అజిత్ ధోవల్‌. రియల్ జేమ్స్ బాండ్ గా ఆయనకు పేరు ఉంది. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్‌ ఉన్నారు. ఇది ఒక పదవే అయినా, ఆయన మాత్రం ఒక పెద్ద వ్యవస్థగా ఎదిగారు. మోడీ, అమిత్ షా తీసుకునే ప్రతి నిర్ణయం, అమలు చెయ్యటం వెనుక అజిత్ ధోవల్‌ ఉంటారు. ఆర్టికల్ 370 రద్దు వెనుక, తరువాత ఎక్కడా గొడవలు జరగకుండా చూడటంలో, అజిత్ ధోవల్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దేశ అంతర్గత బాధ్రతే కాకుండా, పొలిటికల్ ఇంటలిజెన్స్ విషయంలో కూడా అజిత్ ధోవల్‌ కీలక పాత్ర పోషిస్తూ, మోడీ, షా లకు, దగ్గర వ్యక్తీగా ఉంటున్నారు. అయితే, ఇంత పవర్ఫుల్ అజిత్ ధోవల్‌ విషయంలో, జగన్ చేసిన ఒక నియామకం, ఆయన ఆగ్రహానికి గురయ్యేలా చేసిందని తెలుస్తుంది. ఈ కారణంగానే, అమిత్ షా కూడా, జగన్ పై ఆగ్రహంగా ఉన్నారని, అందుకే అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని, ఢిల్లీలో టాక్.

ajitdoval 15122019 2

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ గా మనీష్ కుమార్ సిన్హాను నియమించటమే దీనికి కారణం. మనీష్ కుమార్ సిన్హా గతంలో సిబిఐలో పని చేసారు. రెండేళ్ళ క్రితం జరిగిన సిబిఐ వర్సెస్ సిబిఐ గొడవలో, మనీష్ కుమార్ సిన్హా, అమిత్‌షాకు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. కీలక వ్యవస్థలేవీ ఈ దేశంలో తమ పని తాము చేయలేకపోగా, చేస్తున్న వారికి అడ్డుపడ్డాయని ఆయన అజిత్‌ దోవల్‌ ను టార్గెట్ చేస్తూ, అఫిడవిట్ వేసారు. సిబిఐ వర్సెస్ సిబిఐ కేసులో, మనీశ్‌ కుమార్‌ను నాగపూర్‌కి ట్రాన్స్ఫర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే తన బదిలీ చెల్లదు అంటూ కోర్ట్ కు వెళ్లి, పైన చెప్పిన విధంగా అఫిడవిట్ వేసారు, మనీశ్‌ కుమార్‌ సిన్హా.

ajitdoval 15122019 3

మొత్తంగా 34 పేజీల అఫిడవిట్‌ లో, కేంద్రంలోని పెద్దల పై అనేక ఆరోపణలు చేసారు. నాగపూర్‌నుంచి డిప్యుటేషన్ పై, ఆంధ్రప్రదేశ్ వచ్చారు. దీంతో, మనీశ్‌ కుమార్‌ సిన్హాకు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పదవి కట్టబెట్టారు జగన్. అజిత్‌ దోబాల్‌ పై సంచలన ఆరోపణలు చేసి, సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన మనీశ్‌ కుమార్‌ సిన్హాకు, జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వటం పై, అజిత్‌ దోబాల్‌ తో పాటుగా, అమిత్ షా కూడా ఆగ్రహంగా ఉన్నారు. తాము శిక్షించిన వ్యకిని చేరదియ్యతమే కాక, కీలక పదవి ఇవ్వటం పై, ఢిల్లీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. తమ పై ఆరోపణలు చేసిన వారికే, కీలక పదవి ఇస్తారా అంటూ, అమిత్ షా కూడా ఆగ్రహంగా ఉన్నారని, జగన్ కు ఢిల్లీలో లభిస్తున్న అవమాలనాలకు, ఇది కూడా ఒక కారణంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ కారణంగానే ఎంకే సిన్హాను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించారని ప్రచారం జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read