గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద శనివారం పొద్దు పోయాక, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ మంటలు ఎలా అందుకున్నాయి, లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పట్టిసీమ ప్రాజెక్ట్ వద్దకు మంటలు వ్యాపించక పోవటంతో, పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే, పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా తగలబడేది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు విద్యుత్‌ సరఫరా చేయడానికి, ప్రాజెక్ట్ పక్కనే పవర్ ప్లాంట్ ఉంటుంది. ఆ పవర్ ప్లాంట్ లో మూడు పెద్ద పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఈ ఒక్కొక్క ట్రాన్స్‌ఫార్మర్‌ కెపాసిటీ 220 కె.విగా ఉంటుంది. అయితే శనివారం అందులో ఒకటో నెంబర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. మంటలు వ్యాపించాయి అని తెలియగానే, పోలవరం ఎస్‌ఐ ఆర్‌.శ్రీను సంఘటనా స్తాలనికి చేరుకుని సబ్‌ స్టేషన్‌ వద్ద ఉన్న వాటర్‌ ట్యాంకర్ల ద్వారా, అక్కడ అంటుకున్న భారీ మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు.

pattiseema 15122019 2

అయితే, ఫైర్ ఇంజిన్ రావటానికి సుమార్కు గంట సేపు పట్టటంతో, మిగతా ట్రాన్స్‌ఫార్మర్‌లకు కూడా మంటలు అంటుకునే ప్రమాదం ఉందని అందరూ భావించారు. అయితే, ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక కేంద్రం,పోలవరం ప్రాజెక్ట్ ఏరియాకి 30 కిమీ దూరంలోని, కొవ్వూరులో ఉండటంతో వాహనం రావడం ఆలస్యమైంది. దీంతో మొదటి ట్రాన్స్‌ఫార్మర్‌ పూర్తిగా దగ్ధమైంది. ఈ భారీ ప్రమాదం చూసిన, చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దేశంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పటికీ పోలవరంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం గమనార్హం. ఎలాంటి ప్రమాదం జరిగినా 30 కిమీ నుంచి ఫైర్ ఇంజిన్ రావాలి.

pattiseema 15122019 3

అయితే మంటలు ఎలా వచ్చాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి నీటి విడుదలను గత 15 రోజుల క్రితం ఆపేశారు ఆపివేశారు. ఆపేసిన ప్రాజెక్ట్ లో ఎందుకు ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది అనే విషయం పై మాత్రం, ఇప్పటి వరకూ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. అధికారులు క్లారిటీ ఇస్తే కాని, జరిగిన విషయం పై ఒక అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి ఎవరికీ ప్రాణ నష్టం జరగక పోవటం, అలాగే పట్టిసీమ ప్రాజెక్ట్ ఏరియాలోకి మంటలు రాకపోవటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశంలోనే మొదటి నదుల అనుసంధానం, పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వార జరిగిన విషయం తెలిసిందే. చంద్రబాబు హయంలో కట్టిన ఈ ప్రాజెక్ట్, కృష్ణా డెల్టా రైతులకు వరప్రదాయనిగా ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా, పత్రికల పై ఆం-క్షలు పెరిగిపోయాయి. తెలంగాణాతో పోల్చుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో మరీ పర్సనల్ స్థాయిలో, మీడియా ను టార్గెట్ చేసారు. ఏకంగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో, జగన్ మూడు పత్రికలు/ఛానెల్స్ ను పేరు పెట్టి మరీ చెప్పి, వారి సంగతి చూస్తాం అన్నట్టు ఇన్ డైరెక్ట్ గానే చెప్పారు. దానికి తగ్గట్టే, ఏబీఎన్, టీవీ ఛానెల్స్ ని అనధికారికంగా బ్యాన్ చేయించారు. అయితే ట్రిబ్యునల్ చీవాట్లు పెట్టి, ఫైన్ కట్టమని ఆదేశాలు ఇవ్వటంతో, ఆ రెండు ఛానెల్స్ వదిలినట్టే వదిలి, మళ్ళీ వెంటనే ఒక నెల రోజులు లోపే, మళ్ళీ రాకుండా చేసారు. ఇక, అసెంబ్లీ నిబంధనలు పాటించలేదని, ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 ఛానెల్స్ ని అసెంబ్లీ ప్రసారాలు ఇవ్వకుండా వరుసుగా రెండో సెషన్ కూడా అడ్డుకున్నారు. ఇక మరో పక్క, జీవో నెంబర్ 2430 సంగతి అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా జాతీయ మీడియా కూడా దీన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం పై వ్యతిరేక వార్తలు రాస్తే కేసులు పెట్టే అధికారం, అధికారులకు ఇచ్చారు.

ramoji 14122019 2

ఇక సోషల్ మీడియాలో కూడా ఇలాగే వ్యతిరేకంగా రాస్తే ఇబ్బంది పెడుతున్నారు. ఈ రకంగా మీడియా, పత్రికల పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆం-క్షలు పెట్టారు. ఇది ఇలా ఉంటే, ఈ రోజు ఈనాడు పేపర్ చూసిన వారు, షాక్ అయ్యారు. 46 ఏళ్ళుగా, ఈనాడు పేపర్ పై, ఎడిటర్ గా పేరు ఉన్న రామోజీ రావు గారి స్థానంలో, ఫౌండర్ రామోజీ రావు అని, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు మానుకొండ నాగేశ్వరరావు, తెలంగాణ సంచికకు డీఎన్ ప్రసాద్‌ ఎడిటర్లుగా పేపర్ పై కనిపించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రామోజీ రావు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. మీడియాను, పేపర్లని ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్న తరుణంలో, 80 ఏళ్ళ వయసులో, కేసులు అవి పెడితే, ఇబ్బంది అని, ఇలా చేసారా అనే అభిప్రాయం కలుగుతుంది.

ramoji 14122019 3

మరో పక్క, రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తినే ఎదుర్కున్న రామోజీ, కేసుల గురించి భయపడే వ్యక్తి కాదని, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ ఇలా కాంప్రోమైజ్ అవ్వాలి అనుకుంటే, ఎడిటర్ గానే కొనసాగుతూ, ప్రభుత్వం పై, ఎలాంటి వ్యతిరేక వార్తలు రాయకుండా, అలా కొనసాగించే వారని అంటున్నారు. అలా కాకుండా, ప్రభుత్వం వ్యక్తిరేక విధానాలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్న కారణంగానే, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏపి ప్రభుత్వం స్పీడ్ చూస్తే, ఏదో ఒక రకంగా కేసులు పెట్టి ఇరికించే విధంగా ఉంది కాబట్టి, ఆయన వయసు ద్రుష్టిలో పెట్టుకుని, ముందు జాగ్రత్తగా ఎడిటర్ హోదా నుంచి తప్పుకున్నారని, అంటే దాని అర్ధం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై, ఇక వరుస కధనాలు రాబోతున్నాయని అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.

వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పై ఉన్న కేసుల్లోని సాక్ష్యాలను జగన్ తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్రం, దర్యాప్తు సంస్థలు ఇవన్నీ గమించాలని చంద్రబాబు కోరారు. తన అవినీతిని వెలికితీసిన అధికారుల పై, తనకు అధికారం ఉందని, జగన్ మోహన్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నారని, చంద్రబాబు అన్నారు. ఈ కక్ష సాధింపులో భాగంగానే, ఈడీబీ మాజీ సీఈవో ఉన్న జాస్తి కృష్ణకిశోర్‌ను అర్ధాంతరంగా సస్పెండ్ చేసారని చంద్రబాబు అన్నారు. నిన్న అసెంబ్లీ అయిన తరువాత, మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు. గతంలో జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్‌ కంపెనీలో జరిగిన స్కాంను, అప్పటి ఆదాయపు పన్ను అధికారుల బృందంలో ఒకరైన కృష్ణకిశోర్‌ బయట పెట్టారని, ఆ అక్కసుతోనే, ఇప్పుడు అధికారం ఉంది కదా అని, ఇష్టం వచ్చినట్టు కక్ష తీర్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

cbn 14122019 2

జగతి పబ్లికేషన్స్‌లో 10 రూపాయలు ఉన్న షేర్ ని, రూ.360 ప్రీమియం విలువతో అమ్మేశారని, ఇదంతా క్విడ్ ప్రోకోలో జరిగిన భాగంలో జరిగిందని, అప్పట్లో ఐటి డిపార్టుమెంటులో ఉన్న కృష్ణ కిషోర్ విచారణ చేసి, బయట పెట్టారని చంద్రబాబు అన్నారు. ఇదే విషయం తరువాత సిబిఐ, కోర్ట్ లు కూడా అంగీకరించాయని అన్నారు. అయినా ఈడీబీ సీఈవోగా, కృష్ణకిషోర్ కి, భూములిచ్చే అధికారం గానీ.. కంపెనీలకు రాయితీలిచ్చే అధికారం గానీ లేవని, కేవలం ప్రచారం చెయ్యటం, పరిశ్రమలతో సంప్రదింపులు వంటి కార్యక్రమాలే ఉంటాయని చంద్రబాబు అన్నారు. అసలు ఆయనకు అధికారాలే లేని చోట, అక్రమాలు జరిగాయాని నెపం నెట్టి, ఆయన్ను కావాలని కక్ష పూరితంగా సస్పెండ్ చేసారని అన్నారు.

cbn 14122019 3

తన అవినీతి వెలికితీసిన వారిని సస్పెండ్ చేస్తూ, తన అవినీతికి సహకరించిన సహా నిందితులకు, మంచి పోస్టింగులు, పదవులు ఇస్తున్నారని అన్నారు. మరో నిందితురాలైన శ్రీలక్ష్మిని ఢిల్లీలో ప్రతి చోట తిప్పుతున్నారని అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యాలను తారుమారు చేశారని, సీఎంగా ఉంటే ఆ అవకాసం ఇంకా ఎక్కువ అని సీబీఐ చెప్పిందని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, జగన్ సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారని తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. జగన్ చేసే పనులు అన్నీ, బెయిల్ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని, అన్నీ ఉల్లంఘిస్తున్నారని, కేంద్రం, సిబిఐ, ఈ పరిణామాలు అన్నీ గమనించాలని చంద్రబాబు అన్నారు. అధికారులను బెదిరించే ధోరణిలో ఈ చర్యలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఇవన్నీ మాట్లాడతాం అనే, అసెంబ్లీ జరగనివ్వకుండా చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

ప్రశాంత్ కిషోర్ గురించి తెలియని వారు మన రాష్ట్రంలో ఉండరు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ అందరికీ సుపరిచతమే. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ జేడీయూ ఉపాధ్యక్షుడు కూడా కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏమి చెప్తే అది జగన్ చేసే వారు. సొంత పార్టీ నేతలను కూడా పట్టించుకోకుండా, కేవలం ప్రశాంత్ కిషోర్ నే నమ్మి, ఆయన వ్యూహాలనే జగన్ అమలు చేసి, విజయం సాధించారు. ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలలు అయిన జగన్, అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూ రావటం, నేషనల్ మీడియాలో వరుస పెట్టి, జగన్ పరిపాలన పై నెగటివ్ ఎడిటోరియల్స్ రావటం, సోషల్ మీడియాలో కూడా వైసీపీ వీక్ అవ్వటంతో, జగన్ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు సందర్భం మాత్రం వేరు. ఎన్నికల వ్యూహకర్తగా, బీజేపీకి పని చేసి, నరేంద్ర మోడీ గెలుపులో, 2014లో ప్రశాంత్ కిషోర్ ఎంతో పని చేసారు. అయితే, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్, బీజేపీకి వ్యతిరేకం అయ్యారు.

pk 14122019 2

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన, ‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, 2019’(క్యాబ్‌)ని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత పార్టీ జేడీయూ కూడా, ఈ బిల్ కు సపోర్ట్ చెయ్యటం పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేసారు. అయితే, ఇప్పుడు ఈ బిల్ పై, ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. క్యాబ్‌ అమలుకు అడ్డుకొని ‘భారత ఆత్మ’ను కాపాడాలని, వివిధ రాష్ట్రాలను కోరారు. అయితే ఇప్పటికే ఈ బిల్ పార్లమెంట్ లో పాస్ అయ్యిందని, న్యాయవస్థ కూడా దాటి వెళ్ళిపోయింది అని, కాకపొతే, మన దేశంలో ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన 16 మంది బీజేపీ యేతర ముఖ్యమంత్రుల పైనే భారత ఆత్మను కాపాడాల్సిన బాధ్యత ఉందని, ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వీరే ఈ దేశాన్ని కాపాడాలని అన్నారు.

pk 14122019 3

ఇప్పటికే అయుదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈ బిల్ ను, తమ రాష్ట్రంలో అమలు చెయ్యం అని చెప్పారని, అలాగే ఇతర బీజేపీ యేతర ముఖ్యమంత్రులు కూడా, ఈ బిల్ ని తమ రాష్ట్రాల్లో అమలు చెయ్యకుండా చూడాలని కోరారు. ఈ చట్టం ప్రజల మధ్య వివక్షను పెంపొందించేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే వివధ రాష్ట్రాలు ఈ బిల్ ను అడ్డుకోవాలని అన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్, జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధం అందరికీ తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ సలహాని, ఇప్పుడు జగన్ పాటిస్తారా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీ ఈ బిల్ ని పార్లమెంట్ లో సపోర్ట్ తెలిపింది. మరి ప్రశాంత్ కిషోర్ సూచన జగన్ పాటిస్తారా ? బీజేపీని కాదని, ఈ బిల్ ని రాష్ట్రంలో జగన్ అడ్డుకోగలరా ? చూద్దాం...

Advertisements

Latest Articles

Most Read