రెండు రోజుల క్రితం చంద్రబాబు అనని మాటలను, పదే పదే అన్నారు అంటూ, వ్యాఖ్యల చేసిన జగన మోహన్ రెడ్డి పై, తెలుగుదేశం పార్టీ సభాహక్కుల నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ గేట్లు మూసేసి చంద్రబాబుని, ఎమ్మెల్యేలను ఆపిన సమయంలో, మార్షల్స్ కు, చంద్రబాబుకు మధ్య జరిగిన వాగ్వివాదంలో, చంద్రబాబు బాస్టార్డ్ అన్నారు అంటూ జగన్ పదే పదే చెప్పారు. అయితే, తాము నో క్వస్చిన్ అని అన్నామని, వెంటనే జగన్ మోహన్ రెడ్డి పై, సభా హక్కుల నోటీస్ కింద చర్యలు తీసుకోవాలని టిడిపి కోరింది. అయితే మూడు రోజులు అయినా, ఈ విషయం పై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ సభా హక్కుల నోటీస్ ఉండగానే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరో సభా హక్కుల నోటీస్ ఇచ్చింది. శాసనసభ కార్యదర్శికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాదర్ నోటీసులు అందజేశారు. నిన్న జరిగిన సభలో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి, వీరందరూ బఫూన్లు అంటూ, జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు.

jagan 17122019 2

దీని పై అభ్యంతరం చెప్తూ, తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్ పై సభా హకుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి, నిబంధనలను జగన్ ఉల్లంఘిస్తున్నారని నోటీసులో తెలుగుదేశం పార్టీ పేర్కొంది. అయితే ఇదే నోటీసులో స్పీకర్ పై కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. తాము పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే, పాయింటే లేదంటూ స్పీకర్ తమ పై వ్యాఖ్యలు చేస్తున్నారని, తమ హక్కులను కాలరాస్తున్నారని, అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా క్యస్షన్ హావర్ ప్రారంభం కావడానికి ముందే మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ మాట్లాడిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆ ఫిర్యాదులో తెలిపింది. అయితే ఇదే విషయం పై సభలో కూడా టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నిరసన తెలిపారు.

jagan 17122019 3

స్పీకర్ పై నిరసనతో, నల్లచొక్కాతో అసెంబ్లీకి హాజరయ్యారు. మీరు కనీసం పాయింట్ అఫ్ ఆర్డర్ కూడా లేవనెత్తే అవకాసం ఇవ్వటం లేదు, అందుకే నల్ల చొక్కా వేసుకొచ్చాను అంటూ, స్పీకర్ కే చెప్పారు. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ , వైసీపీ నేతగానే వ్యవహిరిస్తున్నారని అన్నారు. జగన మోహన్ రెడ్డి, సైగ చేస్తే మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ రూల్స్ కు విరుద్ధంగా సభ నడిపిస్తున్నారని అన్నారు. మమ్మల్ని బఫూన్ల అంటున్నారని, జగన్‌ కరుడుగట్టిన ఆర్థిక నేరస్థుడని, ఫ్యాక్షన్‌ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మరో పక్క చంద్రబాబు కూడా జగన్ వ్యాఖ్యల పై మాట్లాడుతూ, ‘‘మమల్ని సీఎం బఫూన్లు అని అంటున్నారు...మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి?. బఫూన్ల కంటే పెద్ద పదం వాడాల్సి వస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షంలో ఉండగా, ప్రభుత్వం పై ఆరోపణలు చెయ్యటం చాలా స్వర్వ సాధారణం. కాని, ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ మాత్రం, చంద్రబాబు ఆరు లక్షల కోట్లు అవినీతి చేసారని, ప్రతి స్కీంలో అవినీతి అంటూ ప్రచారం చేసారు. ఇదే కోవలో, తెలుగుదేశం ప్రభుత్వం బీసీల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదరణ పధకం పై కూడా ఆరోపణలు చేసారు. ఈ స్కీంలో చాలా అవినీతి చేసారని, బీసీలు పేరు చెప్పుకుని, చంద్రబాబు అవినీతి చేసారని ఆరోపణలు చేసారు. అయితే తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో, బీసీల విషయంలో అడిగిన ప్రశ్నకు, వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అవినీతి జరగలేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. బీసీల కోసం గత 5 ఏళ్ళలో ఎంత ఖర్చు పెట్టరు అని అడిగితే, మొత్తం 36 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ, 28.8 వేల కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ ప్రభుత్వం ఒప్పుకుంది. అదే సందర్భంలో, బీసీల కోసం చేపట్టిన ఆదరణ పధకంలో, వివిధ రకాల టూల్స్ కొనుగోలులో, అవినీతి జరిగిందా అనే ప్రశ్నకు, వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పింది.

aadarana 17122019 2

ఆదరణ పధకంలో అవినీతి జరిగినట్టు ఎలాంటి కంప్లైంట్ లు రాలేదని, అందుకే ఎలాంటి ఎంక్వయిరీ జగరలేదు అంటూ, ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అంటే గతంలో విపక్షంలో ఉండగా వైసీపీ చేసిన ఆరోపణలు అన్నీ తప్పే అని తేలిపోయింది. ఇప్పటికే పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటూ కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే, ఇసుక అక్రమాల పై కూడా, ఎలాంటి అవినీతి జరగలేదు అంటూ, గ్రీన్ ట్రిబ్యునల్ కు ప్రభుత్వం చెప్పింది. ఇలా గతంలో తాము చేసిన ఆరోపణలు అన్నిటికీ, ఇప్పుడు తామే క్లీన్ చిట్ ఇస్తూ, చంద్రబాబు హయంలో ఎలాంటి అవినీతి జరగలేదని, వైసీపీ ప్రభుత్వమే చెప్తూ వస్తుంది. అయితే ఈ విషయం పై, నిన్న టిడిపిలో కూడా చర్చ జరిగింది.

aadarana 17122019 3

అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తరువాత, మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో సోమవారం చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్ పి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాల పై చర్చించారు. "ఆదరణ పథకంలో అవినీతి జరగలేదని శాసనమండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా వైసిపి ప్రభుత్వమే పేర్కొంది. పోలవరంలో కూడా ఏవిధమైన అక్రమాలు జరగలేదని సాక్షాత్తూ కేంద్రమంత్రే పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమ్మిట్స్ ద్వారా రూ.1,39,000కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1,54,000మందికి ఉద్యోగాలు వచ్చాయని శాసన మండలిలో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిని బట్టే టిడిపి హయాంలో సమ్మిట్స్ విజయవంతం అయ్యాయని వైసిపి ప్రభుత్వమే ఒప్పుకుంది. దేశంలో 6సమ్మిట్స్ నిర్వహించి, సత్ఫలితాలను రాబట్టిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే. " అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, వరుసగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల ముందు, పార్టీ లైన్ దాటవద్దు, ఇష్టం వచ్చినట్టు ఎవరినీ కలవద్దు, విజయసాయి రెడ్డికి చెప్పే ఎవరిని అయినా కలవండి అంటూ జగన్ చెప్పినా, డోంట్ కేర్ అంటూ తన పంధాలోనే వెళ్తున్నారు. పార్లిమెంట్ సమావేశాల మొదటి రోజే, తెలుగు భాషకి సపోర్ట్ గా మాట్లాడుతూ, జగన్ కు షాక్ ఇచ్చారు. ఇక తరువాత, కేంద్ర మంత్రుల్ని కలవటం, అలాగే ప్రధాని మోడీని కలిసి, పాదాభివందనం చెయ్యటం, ఇవన్నీ చూసాం. చివరగా ట్విస్ ఇస్తూ, సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ హోదాలో, ఢిల్లీలో అందరి ఎంపీలకు విందు ఇవ్వాటం, సంచలనం అయ్యింది. దీనికి బీజేపీ వారిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విందుకు విజయసాయి రెడ్డి మాత్రం రాలేదు. అసలు విజయసాయి రెడ్డికి, రఘురామకృష్ణం రాజుకి గ్యాప్ ఎక్కువగా ఉందని, అందుకే ఇలా ఒకరి పై ఒకరు పై చేయి సాధిస్తూ, ప్రవరిస్తూ, వైసీపీ పార్టీకి, జగన్ కు చెడ్డ పేరు తెస్తున్నారని, వైసీపీలో ప్రచారం.

raghu 16122019 2

అయితే, వీటి అన్నిటి పై, ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ రఘురామకృష్ణం రాజు కుండ బద్దలు కొట్టేలా వ్యాఖ్యలు చేసారు. తాను వైసీపీ పార్టీలో ఒక్క జగన్ మాట తప్పితే, ఇంకా ఎవరి మాట వినను అంటూ కుండ బద్దలు కొట్టారు. విజయసాయరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి ఇది వరిస్తుందని, వారి మాట కూడా వినాల్సిన అవసరం తనకు లేదని, మంచి అయినా చెడు అయినా అన్నీ జగన్ తోనే అంటూ చెప్పుకొచ్చారు. తనకు, జగన్ కు మధ్య ఉన్నవి లేనివి చెప్పి, ఇద్దరి మధ్య గొడవలు పెట్టటానికి, ఇద్దరు ముగ్గురు ప్రస్తావిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే జగన్ మోహన్ రెడ్డి గారికి, తన పై పూర్తీ నమ్మకం ఉందని, అందుకే వీళ్ళు ఎన్ని చెప్పినా, తన పై అభిప్రాయం మారదు అంటూ చెప్పుకొచ్చారు.

raghu 16122019 3

తాను బీజేపీలోకి వెళ్తున్నాను అనేది ప్రచారం మాత్రమే అని, తాను చేరటం లేదని అన్నారు. అలాగే తనకు అన్ని పార్టీలతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని, వాటిని కొనసాగిస్తానని అన్నారు. నాకు ఒకరితో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. జగన్ చెప్తేనే వింటాను, వైవీ సుబ్బారెడ్డి చెప్పారని నోరు మూసుకుంటే నాకు ఓటు ఆయనొచ్చి వేస్తారా? ప్రజల కోసం ఎవరినైనా కలుస్తా అని అన్నారు. విజయసాయి రెడ్డి తనను పార్టీలోకి తీసుకు వచ్చారని, అక్కడితో ఆయన పని అయిపోయిందని, ఆయన పని ఆయనది, నా పని నాది అని, అసలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు, ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక పక్క ఢిల్లీలో విజయసాయి రెడ్డి పెద్ద దిక్కుగా ఉంటే, రఘురామకృష్ణం రాజు మాత్రం, విజయసాయి రెడ్డిని లెక్క చెయ్యకుండా మాట్లాడటం కొస మెరుపు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్ట్ లలో, ట్రిబ్యునల్ ల్లో, వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నే ప్రభుత్వం అన్ని ప్రభుత్వ భవనాలకు వేస్తున్న రంగుల పై, హైకోర్ట్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్యాట్ వంతు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం క్యాట్ ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు రోజుల క్రిందట, డెప్యుటేషన్ లో వున్న కేంద్ర ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ని, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం పై, జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్‍పై క్యాట్ స్టే విధించింది. కృష్ణకిషోర్‍ తన సస్పెన్ష న్‍పై క్యాట్‍ను ఆశ్రయించారు. దీంతో క్యాట్ ఏపి నిర్ణయం పై స్టే విధించింది. అయితే ఇది అతి పెద్ద నైతిక విషయంగా చెప్పాలి. ఏపి ప్రభుత్వ అవినీతి వాదనను క్యాట్ పట్టించుకోలేదు అనే చెప్పాలి. అందుకే ఇది ఏపి ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా చెప్తున్నారు. అయితే, ఇప్పుడు కృష్ణకిషోర్, తన మాతృ సంస్థ అయిన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయే అవకాసం ఉంది.

krishnakishore 16122019 2

అయితే అనూహ్యంగా ఆదివారం ఆదివారం రాత్రి 10 గంటలకు కృష్ణకిషోర్‍ పై సీఐడీ కేసు నమోదు చేసింది. రాత్రి 9.30కి కృష్ణకిషోర్‍ పై, ఇంతకు ముందు ఆయన సిఈఓ గా పనిచేసిన ఏపీఈడీబీ కి చెందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తులసిరాణి, కృష్ణకిషోర్ మీద అధికారికంగా ఫిర్యాదు చేసారు. రాత్రి 11 గంటలకు ఎ‍ఫ్‍ఐ‍ఆర్‍ను కోర్టుకు పంపినట్లు సీఐడీ పేర్కొంది. అయితే అంత రాత్రి పూట, అది కూడా ఆదివారం పూట, సీఐడీ కేసు నమోదు చేయడంపై క్యాట్ అధికారులు విస్మయం వ్యక్తం చేసారు. అంత తొందరగా ఈ పని చెయ్యాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ ప్రశ్నించారు. వాదనలు విని స్టే విధించారు. ఆయన సస్పెన్షన్ మీద స్టే విధించారు కాబట్టి , ఆయన మీద సిఐడీ పెట్టిన కేసులు కూడా ప్రస్తుతానికి అబెయన్స్ లో ఉంటాయని తెలుస్తోంది.

krishnakishore 16122019 3

ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళే అవకాసం లేకుండా, ఆయన పై సిఐడి, ఏసీబీ కేసులు పెట్టి, ఆరు నెలల పాటు విచారణ చేసి, ఆరు నెలలు ఏమి చెయ్యనివ్వకుండా, నిలువరిద్దామని ఏపి ప్రభుత్వ పెద్దలు అనుకున్నారు. అయితే, ఆదివారం హడావిడిగా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, అంత నేరాలు ఈయన చేసారా అనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో జరుగుతుంది. కృష్ణ కిషోర్ సస్పెన్షన్ పై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారులను కావాలని ఇబ్బంది పెడుతున్నారని, అసలు బడ్జెట్ లేని శాఖలో, అవినీతి ఏమి ఉంటుందని, వాళ్ళు చేసేది కేవలం ప్రమోషన్ మాత్రమే అని, చెప్పారు. దీని పై అసెంబ్లీలో నిలదీస్తాం అని, ప్రభుత్వం పారిపోతుందని అన్నారు. అయితే, ఇప్పుడు క్యాట్ ఏపి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటంతో, ఇప్పుడు ఏపి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read