ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, పార్లిమెంట్ వేదికంగా, కేంద్రం పై తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. గత పార్లిమెంట్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజన హామీల్లో చేసిన అన్యాయం పై, మోడీ ప్రభుత్వం పై, ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ, పోరాడిన సంగతి తెలిసిందే. తరువాత దేశ వ్యాప్త పోరాటం కూడా తెలుగుదేశం చేసింది. అయితే, ఈ పోరాటంతో, తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నష్టపోయినా, ప్రధాని మోడీ , అమిత్ షా లను ధీటుగా ఎదుర్కున్న పార్టీగా, చరిత్రలో నిలిచింది. ఓడిపోయిన తరువాత కూడా, కేంద్రంలో ఉన్న బీజేపీ పై, అనేక సమస్యల పై తెలుగుదేశం పార్టీ, పోరాడుతూనే ఉంది. అమరావతిని ఇండియా మ్యాప్ లో పెట్టకపోవటంతో, తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తటంతో, అనూహ్యంగా ఒక్క రోజులోనే కేంద్రం స్పందించి, అమరావతిని ఇండియా మ్యాప్ లో పెట్టి, కొత్త మ్యాప్ ని రిలీజ్ చేసారు. ఆంధ్రులకు రాజధాని ఉంది, అనే అంశం పై పోరాడి సాధించారు.

galla 27112019 2

అయితే నిన్న మరో సమస్య పై కూడా, తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని నిలదీసింది. అమరావతిలో, 2015లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ), జరీ చేసిన డిగ్రీల పై , స్పష్టత ఇవ్వాలని, కేంద్రాన్ని కోరారు, తెలుగుదేశం పార్టీ నేత జయదేవ్‌ కోరారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్-2019 బిల్లు పై, లోకసభ లో మంగళవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా, జయదేవ్ ఈ అవకాశాన్ని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకుని, కేంద్రాన్ని ప్రశ్నించారు. అమరావతి ఎన్‌ఐడీ ఏర్పాటుకు, గెజిట్‌ జారీకి సంబంధించి, వేరే వేరే తేదీలు ఉన్నాయని, మరి గతంలో ఎన్‌ఐడీ అమరావతి జారీ చేసిన డిగ్రీలకు గుర్తింపు ఉంటుందో లేదో చెప్పాలని, దీని పై పూర్తీ స్పష్టత ఇవ్వాలని గల్లా కోరారు.

galla 27112019 3

ఈ బిల్లులో ఎన్‌ఐడీ 2014 అహ్మదాబాద్‌ నోటిఫికేషన్‌ జారీ నుంచే అమల్లో ఉందని, మరి అమరావతి, మిగతా రెండు ఎన్‌ఐడీల విషయంలో కేంద్రం వివక్ష ఎందుకు చూపుతున్నారో తెలపాలని కోరారు. అహ్మదాబాద్‌ ఎన్‌ఐడీలో లాగానే, అమరావతిలోనూ పీహెచ్‌డీకి అవకాశం కల్పించాలని కోరారు. అమరావతిలో ఎన్‌ఐడీ నాగార్జున విశ్వ విద్యాలయంలోని తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తోందని, వెంటనే నిర్మాణం పూర్తీ స్థాయి నిర్మాణం పూర్తీ చెయ్యాలని కోరారు. మరో పక్క ఇదే సందర్భంలో, వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, అమరావతి ఆకృతులు ఇక్కడ ఎవరూ చెయ్యలేరని, గతంలో చంద్రబాబు సింగపూర్ వద్దకు వెళ్లారు అంటూ, రాజకీయం చేసే ప్రయత్నం చెయ్యటంతో, గల్లా అడ్డుకున్నారు. ఆరు నెలలుగా అధికారంలోకి వచ్చి, అప్పటి నుంచి నిర్మాణాలు ఆపివేయడం, కూల్చివేయడం చేస్తున్న మీరు కూడా నిర్మాణాలు, ఆకృతుల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు.

మొన్నటి దాక నెమ్మదిగా సాగిన జగన్ అక్రమసస్తుల కేసు విచారణ, గత రెండు నెలలుగా స్పీడ్ అందుకుంది. ముఖ్యంగా జగన్ కు ప్రతి శుక్రవారం కోర్ట్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో, సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ చూస్తే, సిబిఐ ఇంత గట్టిగా వాదనలు వినిపించటం పై అందరూ ఆశ్చర్యపోయారు. సియం అయినా, సామాన్య ప్రజలు అయినా చట్టం ముందు ఒకటే అంటూ, సిబిఐ వాదనలు వినిపించింది. జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు సియం అని, ఆయన సాక్ష్యులను ప్రభావితం చేస్తారు అంటూ, వాదనలు వినిపించిటంతో, సిబిఐ వాదనలతో ఏకీభివించిన కోర్ట్, జగన్ మినహాయింపు పిటీషన్ కొట్టేసింది. మరో పక్క అన్ని చార్జ్ షీట్లు కలిపి, ఒకే పిటీషన్ గా విచారణ జరపాలి అంటూ, జగన్ పెట్టుకున్న పిటీషన్ పై కూడా, సిబిఐ పోయిన శుక్రవారం బలంగా వాదనలు వినిపించింది. నేరాలు అన్నీ వేరు వేరు అని, వేరు వేరు వ్యక్తులు ఈ నేరాల్లో ఉన్నారని, కాబట్టి ఒక్కో చార్జ్ షీట్, విడివిడిగా విచారణ జరపాలి అంటూ, కోర్ట్ ముందు సిబిఐ వాదనలు వినిపించింది.

ed 27112019 2

ఇంత బలంగా సిబిఐ వాదనలు జరుపుతున్న వేళ, ఇప్పుడు సీన్ లోకి ఈడీ కూడా ఎంటర్ అయ్యింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిన ఆస్తుల పై, నాలుగు నెలల క్రితం కోర్ట్ లో జగన్ కు రిలీఫ్ రావటంతో, దీని పై ఈడీ ఇప్పుడు మళ్ళీ కోర్ట్ గడప తొక్కింది. గతంలో భారతి సిమెంట్స్‌ వ్యవహారంలో రూ.749 కోట్ల ఆస్తులు జప్తు చేస్తూ, ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లోనే జగన్, ఆయన కంపెనీలకు చెందిన రూ.569.57 కోట్లు, జగన్ భార్య భారతికి చెందిన రూ.22 కోట్ల ఆస్తులను ఈదీ జప్తు చేసింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ ఇచ్చిన తాత్కాలిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ ధ్రువీకరించింది.

ed 27112019 3

అయితే దీని పై జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతితో పాటుగా, వారి కంపెనీలు అయిన సండూర్‌ పవర్‌, సిలికాన్‌ బిల్డర్స్‌, యుటోపియా ఇన్‌ఫ్రా, అప్పీలెట్‌ అథారిటీని ఆశ్రయించి, ఆస్తుల జప్తు నుంచి విముక్తి కల్పించాలని కోరాయి. దీని పై విచారణ జరిపిన అప్పీలెట్‌ అథారిటీ, ఈదీ చేసిన జప్తు చెల్లదు అంటూ తీర్పు ఇచ్చింది. అయితే, నాలుగు, అయుదు నెలలు క్రిందట జరిగిన ఈ విషయం పై, ఈడీ ఇప్పుడు మళ్ళీ కోర్ట్ కు వెళ్ళింది. అప్పీలెట్‌ అథారిటీ ఇచ్చిన తీర్పుని, హైకోర్ట్ లో సవాల్ చేసింది. దీని పై విచారణ ప్రారంభించిన హైకోర్ట్, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రస్తుత స్థితి కొనసాగించాలని చెప్తూ, జగన్‌, భారతి, కంపెనీలకు తదితరులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈడీ కూడా ఇంత బలంగా, వాదనలు వినిపించటం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చంద్రబాబు స్ట్రాటజీ మార్చారు. జగన్ మోహన్ రెడ్డి పై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించటానికి సిద్ధం అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా, జగన్ మోహన్ రెడ్డి పై, హిందూపురం ఎమ్మల్యే నందమూరి బాలకృష్ణను చంద్రబాబు రంగంలోకి దించుతున్నారు. ఇంతకీ చంద్రబాబు ప్రయోగించే అస్త్రం ఏమిటి ? ఏ విషయంలో బాలయ్యను చంద్రబాబు రాగంలోకి దించుతున్నారు ? అనే ప్రశ్నలకు సమాధానం, తెలుగు మీడియం బోధన ఎత్తి వేయటం. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియం ఎత్తేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండేలా, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇంగ్లీష్ మీడియం ఉండటం తప్పు కాదని, కాని తెలుగు మీడియం ఎత్తేయటం మాత్రం, మంచిది కాదని, ఆప్షన్ అనేది పిల్లలకు ఇవ్వాలని, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ గతి ఏంటి అంటూ ఆందోళన చేస్తున్నాయి.

balayya 26112019 2

అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేస్తూ, ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ప్రతిపక్షాల విమర్శల పై, అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పటానికి, జగన్ మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 9 నుంచి, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అక్కడే ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ గా చంద్రబాబు మరో స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు. తెలుగు మీడియం విషయంలో, జగన్ మోహన్ రెడ్డి పై, నందమూరి బాలకృష్ణ చేత సమాధానం చెప్పించటానికి చంద్రబాబు రెడీ అయ్యారు. తెలుగు మీడియం విషయంలో, తెలుగు భాష పై పూర్తీ పట్టు ఉన్న బాలయ్య చేత సమాధానం చెప్పించటానికి చంద్రబాబు రెడీ అయ్యారు.

balayya 26112019 3

తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, అలాగే తెలుగు మీడియం చదువులు కూడా అవసరం అని, ఎవరికి కావాల్సింది వారు ఎంపిక చేసుకునే స్వేఛ్చ ఇవ్వాలని తెలుగుదేశం వాదిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విషయం గట్టిగా చెప్పాలని, దీనికి తెలుగు భాష, పద్యాలు పై పట్టు ఉన్న బాలకృష్ణ అయితే, సరైన విధంగా చెప్పాలి అనుకున్నది చెప్పొచ్చు అని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంటులో అప్పటి రాజ్యసభ టీడీపీ ఎంపీ హరికృష్ణ అచ్చతెలుగులో మాట్లాడి తెలుగువారి ఔన్నత్యాన్ని, తెలుగు భాష గౌరవాన్ని చాటి చెప్పారని, ఇప్పుడు బాలకృష్ణ కూడా ఇదే విధంగా తెలుగు భాష గొప్పదనాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పి, జగన్ మోహన్ రెడ్డిని డిఫెన్సు లోకి నెట్టాలని, చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఈ విషయం పై, జగన్ మోహన్ రెడ్డి, ఎలా స్పందిస్తారో చూద్దాం.

తెలుగుదేశం పార్టీ నేతలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలోని ముగ్గురు నాయకులకు సభాహక్కుల నోటీసులు జారీ చేశారు. నారా లోకేష్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ కు సభాహక్కుల నోటీసులను స్పీకర్ కార్యాలయం అందించింది. అయితే లోకేష్ కు మాత్రం, నోటీస్ రాలేదని చెప్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, అసెంబ్లీ సెక్రటరీ, ఆ ముగ్గురికి సభాహక్కుల నోటీసులు పంపారు. నోటీస్ పై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, ఆ నోటీసు లో తెలిపారు. దీని కంటే ముందు తెలుగుదేశం పార్టీ నేతలు, స్పీకర్ తమ్మినేని పై, విమర్శలు చేసారని, అందుకే ముగ్గురు ముగ్గురు టీడీపీ నాయకులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. వారు అనుకున్నట్టే, అసెంబ్లీ సెక్రటరీ, ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులు పంపించారు.

speaker 26112019 2

మీదీ ఒక బతుకేనా...?, శాసనసభలో ఆంబోతు, దున్నపోతులా నిద్రిస్తున్నావ్ అంటూ అసభ్య పదజాలంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పై అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ దూషించారని, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా లేఖ రాసి, స్పీకర్ స్థానాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసారని అన్నారు. స్పీకర్ స్థానాన్ని, ఆయన గౌరవాన్ని భంగపర్చేలా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు, లోకేష్, కూన రవికుమార్‌కు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, వారు కనుక సారైన సమాధానం చెప్పకపోతే, తగిన చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు.

speaker 26112019 3

అయితే, స్పీకర్ అ్రగిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వ సాయం అందచేస్తున్న సమయంలో, చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గుడ్డలు ఊడదీసి, ప్రజల ముందు నుంచో పెడతాం అంటూ చంద్రబాబుని ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యలు చేసారు. అలాగే, ఆయన అనుభవం అంట, మడిచి ఎక్కడో పెట్టుకోండి అంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలకు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదే రీతిలో స్పందించటంతో, ఇప్పుడు స్పీకర్ పై వ్యాఖ్యలు చేసారని, సభా హక్కుల నోటీస్ ఇచ్చారు. వీరు ఇచ్చే సమాధానం, సంతృప్తి కరంగా లేకపోతే, ఈ మొత్తం వ్యవహారాన్ని స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసే అవకాశం ఉంది. గతంలో కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర రెడ్డి పై, నాడు అనేక సార్లు సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు చేసినా, అవి చర్యల వరకు రాలేదు. మరి ఇప్పుడు ఏమి అవుతుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read