ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ఈ రోజు అమరావతిలోనే కాదు, ఢిల్లీలో కూడా హీట్ ఎక్కింది. ఈ రోజు చంద్రబాబు అమరావతి పర్యటనతో, ఒక్కసారిగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటన సాఫీగా సాగితే ఇబ్బంది ఉండేది కాదు కాని, కావాలని చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చెయ్యటంతో, ఒక్కసారిగా వాతవరణం వేడెక్కింది. అయితే ఇక్కడ ఇలా ఉండగానే, ఢిల్లీలోని పార్లమెంట్ లో కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ తరుపున, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఈ రోజు పార్లమెంట్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితి గురించి వివరిస్తూ, ప్రధాని మోడీ ఈ విషయాల పై చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీరుతో, రాష్ట్రం దారుణంగా నష్టపోయిందని, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వచ్చే పెట్టుబడులు కూడా వెనక్కు వెళ్ళిపోతున్నాయని, లోక్ సభలో, గల్లా జయదేవ్ ఆరోపించారు.

galla 28112019 2

దేశంలో పెట్టుబడులు పెంచి, దేశం ఇమేజ్ పెంచి, ఆర్ధికంగా దేశాన్ని బలోపేతం చెయ్యాలని, కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, పెట్టుబడిదారులు వెనక్కి వెల్లిపోయేలా చేస్తున్నారని, గల్లా ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో కుదుర్చుకున్న కాంట్రాక్టలను రద్దు చెయ్యటం, అలాగే విద్యుత ఒప్పందాల పై సమీక్ష చెయ్యటం, రివర్స్ టెండరింగ్ లాంటి అనాలోచిత నిర్ణయాలతో, రాష్ట్రం పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతుందని, గల్లా జయదేవ్ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో, ఇప్పటికే కొన్ని దేశాలు చట్టపరమైన చర్యలకు కూడా దిగాయని, ఈ చర్యలు రాష్ట్రానికి కాదని, దేశానికే ఇబ్బందని, దేశం బ్రాండ్ ఇమేజ్ కూడా పోతుందని అభిప్రాయపడ్డారు.

galla 28112019 3

ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కు వెళ్ళిపోయిన కంపెనీల లిస్టు వివరిస్తూ, రూ.2200 కోట్లకు సంబంధించి లులూ గ్రూప్, బీఆర్ శెట్టి గ్రూపు రూ.12 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు, ఆదానీ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి 400 ఎకరాల స్థలాన్ని 89 ఎకరాలకు తగ్గించేశారని, తిరుపతిలో రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన రిలయన్స్ సంస్థ, ఒంగోలులో రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కావాల్సిన కాగిత పరిశ్రమ వెళ్లిపోయాయని, రాజధాని అమరావతి నిర్మాణం నుంచి సింగపూర్ ప్రభుత్వం కూడా వెళ్ళిపోయిందని ఆరోపించారు. అయితే గల్లా జయదేవ్ మాట్లాడే సమయంలో, వైసీపీ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. గల్లా జయదేవ్ ని చుట్టుముట్టినంత పని చేసారు. మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అని, ఆయన కూడా ఇలా మీద పడుతున్నారు అంటూ, గల్లా, స్పీకర్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు.

ఈ రోజు అమరావతి పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు పై, వైసీపీ సానుభూతిపరులు రాళ్ళ దాడి చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే వైసీపీ మాత్రం, మాకు సంబంధం లేదని చెప్తుంది. అయితే చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి, రాజధాని పర్యటనలో టెన్షన్ నేపధ్యంలో, డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి కేసులో, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. చెప్పులు విసిరిన వ్యక్తిని రైతుగాను, రాళ్ళు విసిరిన వ్యక్తీని, ఒక రియల్టర్‌గా గుర్తించామని చెప్పారు. చంద్రబాబు వల్ల తాము ఇబ్బంది పడ్డామని, వారు చెప్పారని, గౌతం సవాంగ్ అన్నారు. ప్రతి ఒక్కరికి, నిరసన తెలిపే హక్కు ఉంటుంది గౌతం సవాంగ్ చెప్పారు. ఇలాంటి పర్యటనల్లో, పోలీసులను తప్పుబట్టటం సహజం అని అన్నారు. చంద్రబాబు పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని మా విచారణలో తేలింది కాబట్టే పర్మిషన్ ఇచ్చామని సవాంగ్ అన్నారు.

dgp 28112019 2

అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు పై రాళ్ళ దాడి జరిగితే, ఆయన ప్రయాణిస్తున్న బస్సు అద్దం పగిలితే, రాష్ట్ర డీజీపీగా ఉండే వ్యక్తీ, అందరికీ నిరసన తెలిపే హక్కు ఉందని చెప్పటం, అలాగే చంద్రబాబు వల్లే మాకు ఇబ్బంది, అందుకే దాడి చేసాం అని వారు చెప్పారని, డీజీపీ చెప్పటంతో, తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోయారు. డీజీపీ ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వాలి కాని, ఇలా సింపుల్ గా, ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉందని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని టిడిపి నేతలు అంటున్నారు. ఈ నేపధ్యంలో, చంద్రబాబు కూడా డీజీపీ వ్యాఖ్యల పై స్పందించారు. ఇన్నేళ్ళలో, ఎన్నో సార్లు ప్రజల తరుపున పోరాటం చేసామని, ఎప్పుడూ ఇలా దాడి జరగలేదని అన్నారు.

dgp 28112019 3

నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంది, మేము ఆమోదించామని ఏపీ డీజీపీ అన్నారని, రేపు జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తే, తాము కూడా నిరసన తెలుపుతామంటే, డీజీపీ గారు పర్మిషన్ ఇస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. నా కాన్వాయ్ వస్తూ వుంటే వాళ్లొచ్చి రాళ్లు వేస్తూ వుంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారా? అదేమంటే నిరసన తెలిపే హక్కు ఉందంటారా ? ఇది ప్రభుత్వ దాడి కాదా? దీని కన్నా నీచం ఏముంది? దాడి చేస్తే మేము భయపడతామా? అని ప్రశ్నించారు. అలాగే బస్సు పై విసిరిన ఒక కర్ర చూపిస్తూ, ఇది పోలీసు లాఠీ, డీజీపీ సమాధానం చెప్పండి, వారికి మా పై విసరమని లాఠీలిచ్చారా అని ప్రశ్నించారు. మా దగ్గరే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొండి అంటూ చంద్రబాబు  ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతలో పర్యటిస్తున్నారు. ముందుగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభం అయిన చంద్రబాబు, పక్కనే ఉన్న ప్రజా వేదిక వద్దలు వెళ్లి, అక్కడ ఇంకా ఉన్న శిధిలాలను పరిశీలించారు. తరువాత, ఆయన అక్కడ నుంచి నేతలు, కార్యకర్తలు, రాజధాని రైతులతో కలిసి, అమరావతి శంకుస్థాపన చేసిన, ఉద్దండరాయునిపాలెం వద్దకు చేరుకున్నారు. అక్కడ శంకుస్థాపన స్థలంలో, వివిధ గ్రామాల నుంచి తెచ్చిన మట్టి దగ్గర, అమరావతి మట్టికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అయితే పర్యటన సందర్భంగా, ఒక ఇంటిలో నుంచి, మహిళలు పరిగెత్తుకుంటూ రావటం, వారి చేతిలో చంద్రబాబు ఫోటో ఉండటం చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. వీరిని చూసిన వారు, ఈ రైతులు, సమయం కోసం, సహనం చూపుతున్నారు అంటే వీరికి కడుపులో ఎంత బాధ ఉందొ అర్ధమవుతుంది, అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా వారికి అభివాదం చేసారు.

cbn 2811219 2

చంద్రబాబు పర్యటనలో ఇదే హైలైట్ సీన్ గా ఉంది. సోషల్ మీడియాలో కూడా, దీనికి సంబంధించిన ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే మరో పక్క, చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటూ, వైసీపీ సానుభూతిపరులు హడావిడి చేసారు. పర్యటన మొదట్లో, చంద్రబాబు బస్సు పై రాళ్ళు వెయ్యటంతో, చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు అద్దం కూడా పగుళ్ళు వచ్చింది. అయినా అవేమీ లెక్క చెయ్యకుండా చంద్రబాబు ముందుకు వెళ్లారు. తరువాత పరిస్థితి సద్దుమణిగింది. చంద్రబాబు ఏ గ్రామానికి వెళ్ళినా, అక్కడ ప్రజలు, రోడ్డుకు ఇరు వైపులా నుంచుని స్వాగతం పలికారు. చంద్రబాబు ఇప్పటికే 70 శాతం పూర్తయిన, భవనాలను పరిశీలిస్తూ, పర్యటన కొనసాగిస్తున్నారు.

cbn 2811219 3

ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిని, కొంత మంది మంత్రులు, శ్మశానంతో పోల్చడం చాలా బాధేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తుందని, ఒక పద్దతి ప్రకారం చంపేస్తుందని అన్నారు. వీళ్ళు చేసే పని వల్ల, భావితరాల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. మన రాష్ట్రానికి ఒక రాజధాని వద్దా ? తెలంగాణా కు హైదరాబాద్ ఉన్నట్టు, కర్ణాటకకు బెంగుళూరు ఉన్నట్టు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్టు, మనకు ఒక అమరావతి వద్దా, ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అంటూ ప్రశ్నించారు. వీరి చర్యతో, రాష్ట్రం నష్టపోతుందని, పెట్టుబడులు ఆగిపోతున్నాయని, ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఈ రోజు అమరావతిలో గత ఆరు నెలల నుంచి జరుగుతున్న వాస్తవ పరిస్థితిని వివరించటానికి, అమరావతిలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటన మొదట్లో, కొంత మంది చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు పై రాళ్ళతో దాడి చేసారు. చంద్రబాబుని రాళ్ళతో కొట్టాలని ప్లాన్ చేసినా, బస్సు అద్దం మాత్రమే పగుళ్ళు ఇచ్చింది. అయితే ఇది చేసింది కొంత మంది వైసీపీ సానుభూతిపరులు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంటే, కావాలనే చంద్రబాబు, రాళ్ళతో కొట్టించుకుని, సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటూ, వైసీపీ ఆరోపిస్తుంది. అయితే అసలు వాస్తవం గురించి, పర్యటనలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు పై ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అమరావతి పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ కార్యకర్తలు రాళ్ళతో దాడి చెయ్యటం పై లోకేశ్ తీవ్రంగా పరిగణించారు. రాల్లువ్ వేసింది వైసీపీ కార్యకర్తలే అని, వాళ్ళు ఇక్కడి వారు కూడా కాదు అని చెప్తూ, లోకేష్ ఒక వీడియోని కూడా పోస్ట్ చేసారు.

lokesh 28112019 2

ఆ వీడియో కూడా, జగన్ మోహన్ రెడ్డి సొంత ఛానెల్ అయిన సాక్షి వీడియో. ఆ వీడియోలో రాజధాని రైతులుగా కొంత మంది మాట్లాడుతున్నారు. వారిలో ఒకతను మాట్లాడుతూ, తాము తెనాలి నుంచి ఇక్కడకు వచ్చామని, చంద్రబాబు రైతులను అన్యాయం చేసారంటూ చెప్పుకొచ్చారు. అసలు అమరావతికి సంబంధం లేని వ్యక్తీ, తెనాలి నుంచి ఇక్కడకు ఎందుకు వస్తాడు ? తెనాలి నుంచి వచ్చి, అమరావతి రైతులు పేరుతొ, బ్యానర్లు పట్టుకుని, ఆందోళన చెయ్యాల్సిన అవసరం ఏముంది ?ఇదే విషయం పై, లోకేష్ ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసి, ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎక్కడో తెనాలి నుంచి మనుషులను అమరావతికి తీసుకోవచ్చి, రాళ్ళు వెయ్యాల్సిన అవసరం ఏముంది అంటూ లోకేష్ ప్రశ్నించారు.

lokesh 28112019 3

".@ncbnగారి అమరావతి పర్యటనలో వైసీపీకుట్రలు బయట పడతాయన్న భయంతో కాన్వాయిపై మీ పార్టీ గూండాలను రప్పించి దాడులు చేయిస్తారా? మరీ ఇంత పిరికితనమా? తెదేపా హయాంలో మేము కూడా ఇలా చేస్తే @ysjaganగారు పాదయాత్ర చేయగలిగేవారా?#ChaloAmaravati#PeoplesCapitalAmaravati#SaveAmaravati#JaganFailedCM" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు. ఇది ఇలా ఉంటే, ఉదయం కొంత హడావిడి చేసిన ఈ బ్యాచ్, తరువాత ఎక్కడా కనిపించలేదు. రాజధాని ప్రాంతం అడుగడుగునా, చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక రైతులు, మహిళలు పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

Advertisements

Latest Articles

Most Read