ఇసుక స‌మ‌స్య ప్ర‌భుత్వానికి చాలా చెడ్డ‌పేరు తెచ్చి పెడుతుంది. జ‌గ‌న్ అంటే బాగా మోజుగా ఉన్న జ‌నాలు కూడా ఇసుక విష‌యంలో ఇబ్బంది ప‌డుతున్నారు. ఇసుక కొర‌త‌పై ప‌వ‌న్ లాంగ్ మార్చ్ అనుకున్న‌దానికంటే విజ‌యవంతం అయ్యింది. ఇంటిలిజెన్స్ నివేదిక‌తోపాటు వైకాపా ఫీల్డ్ ఫీడ్ బ్యాక్ కూడా ఇసుక కొర‌త‌తో ఇబ్బందులు నిజ‌మేన‌ని ప్ర‌భుత్వానికి నివేదించాయి. ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు గారు చేప‌డుతున్న దీక్ష ప్ర‌భుత్వాన్ని షేక్ చేస్తోంది. తెలుగుదేశం ప్ర‌భుత్వం ఇసుక కొర‌త‌పై చేస్తున్న ఉద్య‌మాలు,దూకుడుతో వైకాపాని చాలా చికాకు పెడుతున్నాయి. దీనిని డైవ‌ర్ట్ చేయ‌డానికి వారు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. రేపు చంద్రబాబు దీక్ష అనగా, ఈ రోజు మరో కొత్త ప్రచారానికి తెర లేపారు. ఇసుక వెబ్సైటు హ్యాక్ అయ్యింది అని, వెబ్సైటు మొత్తం హ్యాక్ కాదు, వెబ్సైటు లో ఉన్న ఓక ఫీచర్ హ్యాక్ చేసి, నో స్టాక్ అంటూ చూపిస్తున్నారని, ఇది నారా లోకేష్ సన్నిహిత కంపెనీ ఒకటి చేస్తుంది అంటూ, ఈ రోజు సాయంత్రం నుంచి సాక్షిలో వార్తలు ఇస్తున్నారు. అయితే, ఈ వార్తలు రాగానే లోకేష్ ఘాటుగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డికి, లేఖ రాసారు.

కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 42 మంది భవన నిర్మాణ కార్మికులను పొట్టనపెట్టుకున్న వైకాపా ప్రభుత్వం, జగన్ గారు చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు మరో కుట్రకి తెరలేపారు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇంత కాలం వరద కారణంగా ఇసుక కొరత ఏర్పడింది, పోలీసులే అక్రమ ఇసుక రవాణాని ప్రోత్సహిస్తున్నారు అని తలో మాటా చెప్పిన వైకాపా నేతలు ఇప్పుడు తన పై అసత్య ప్రచారాలకు తెర లేపారని లోకేష్ అన్నారు. వైకాపా ఇసుకాసురులు అడ్డంగా దొరికోపోయారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైకాపా నేతల జాతకాలు టిడిపి బయటపెట్టడం తో వైకాపా ప్రభుత్భం మరో కొత్త నాటకం మొదలు పెట్టిందని అన్నారు.

"5 నెలలుగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్ల పాలు చేసి 42 మందిని వైకాపా ఇసుకాసురులు బలి తీసుకున్నారు. ఇప్పుడు చేసిన తప్పులు బయటపడి ప్రజలు మోహన ఉమ్ము వేసే పరిస్థితి రావడంతో మరో సారి కట్టు కథ రెడీ చేసింది.గతంలోనే జగన్ గారు నాపై అనేక ఆరోపణలు చేసారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలల అయినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేక ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసారు. విశాఖ లో బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ పై సిఐడి దాడులు లోకేష్ కి అత్యంత సన్నిహితుడు కంపెనీ అంటూ మరో అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు.నేను గతంలో అనేక సార్లు జగన్ గారికి నేరుగా సవాల్ చేసా.ఇప్పుడు మరోసారి సవాల్ విసురుతున్నా జగన్ గారి చెత్త మీడియా కి కూడా నేరుగా సవాల్ చేస్తున్నా దోంగ చాటుగా అసత్య వార్తలు ప్రచారం చేసి ఆనంద పడటం కాదు దమ్ముంటే నా పై మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించండి.బ్లూ ఫ్రాగ్ కంపెనీ కి నాకు ఎటువంటి సంబంధం లేదు.నాకు ఆ కంపెనీకి సంబంధాలు ఉన్నట్టు అసత్య వార్తలు సృష్టించిన వారిపైనా సోషల్ మీడియా ఒక కుట్ర ప్రకారం నా పై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానాని తెలియజేస్తున్నాను. ....టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్"

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో, ఇన్వెస్టర్స్ లో భరోసా పోతుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న స్టార్ట్ అప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేసుకుంటూ జీవో ఇవ్వటం, వెంటనే సింగపూర్ ప్రభుత్వం కూడా, మేము అమరావతి నుంచి తప్పుకుంటున్నాం అని ప్రకటించటంతో, ఏపి ప్రభుత్వం తీసుకున్న చర్య వివాదాస్పదం అవుతుంది. ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలి అంటేనే, పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా, తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. అలాంటిది సింగపూర్ ప్రభుత్వం, ఏకంగా రంగంలో దిగిటంతో, మిగతా పారిశ్రామిక వేత్తలకు కూడా కాన్ఫిడెన్సు వచ్చి, పెట్టుబడులకు ముందుకు వచ్చారు. అయితే, ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం, అమరావతి నుంచి వెళ్ళిపోవటంతో, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఏకంగా దేశాని పరువు, ప్రతిష్టతకు సంబంధించిన విషయంగా మారింది. సింగపూర్ ప్రభుత్వం, ఏపి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోవటం, పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

mohandas 13112019 2

కర్ణాటకకు చెందిన ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, అక్షయ పాత్ర సంస్థ సహవ్యవస్థాపకుడు, మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఛైర్మన్‌, ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ టి.వి.మోహన్‌దాస్‌ పాయ్‌ కూడా, ఈ విషయం పై స్పందించారు. ఆయన ఈ విషయం పై ట్వీట్ చేస్తూ, ఒకింత ఘాటుగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ వైదోలగటం, ఆంధ్రప్రదేశ్ కు బ్యాడ్ న్యూస్ అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఇది, హరాకిరీ అని స్పందించారు. హరాకిరీ అంటే, ఆత్మహత్య అని అర్ధం. అంటే, జగన్‌ చేజేతులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, మోహన్‌దాస్‌ పాయ్‌ ట్వీట్ చేసారు. జగన్ చేస్తున్న ఈ పనితో, ఒంటి చేత్తో ఆంధ్రప్రదేశ్‌ పై పెట్టుబడి సంస్థల నమ్మకాన్ని నాశనం చేస్తున్నారు అని అన్నారు.

mohandas 13112019 3

ఇలాంటి చర్యలతో, ఎవరూ అక్కడ పెట్టుబడి పెట్టరు, ఉద్యోగాలు రావు, అభివృద్ధి ఆగిపోతుంది, ఇది నిజంగానే చాలా బాధకారమైన విషయం అంటూ ఆయన పెర్కున్నారు. అయితే ట్విట్టర్ వేదికగా ఈ అభిప్రాయం చెప్పటంతో, ఆయన ట్వీట్ పై, వైసీపీ సోషల్ మీడియా, దాడి చేసింది. గతంలో కూడా, విద్యుత్ పీపీఏల విషయంలో, జపాన్ ప్రభుత్వం మోడీ కి లేఖ రాయటం పి, మోహన్ దాస్ స్పందిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని ఒక "గవర్నమెంట్ టెర్రర్" అంటూ స్పందించారు. దీని పై వైసీపీ ఎదురు దాడి చేస్తూ, ఈయన చంద్రబాబు అజేంట్ అని, చంద్రబాబు డబ్బులు ఇచ్చి వేయిస్తున్నాడు అంటూ, ఆయన ట్వీట్ పై కొంత మంది వైసిపీ సానుభూతి పరులు ఎదురు దాడి చేసారు. అయితే, మోహన్‌దాస్‌ పాయ్‌ అనే వ్యక్తీ, చంద్రబాబు చెప్తే చేస్తారా ? ఆయన అక్షయ పాత్ర సంస్థ సహవ్యవస్థాపకుడు, మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఛైర్మన్‌, ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ అనే విషయం, వీరికి తెలుసో తెలియదో.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు, ఈ నెల 14న, భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాటం చేస్తూ, 12 గంటల పాటు, ఇసుక దీక్ష చెయ్యనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మికంగా తీసుకుంది. ఈ కార్యక్రమం విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర జరుగుతూ ఉండటంతో, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ , ఈ దీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఈ క్రమంలోనే, సోమవారం, అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మొన్నటి దాక ఎడమొఖం, పేద మొఖంగా ఉన్న నాయకులు, ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవటం, పక్కపక్కనే కూర్చువటంతో, తెలుగుదేశం కార్యకర్తలు, మొదట ఆశ్చర్యపోయినా, చంద్రబాబు దీక్ష వల్ల, మా నాయుకులు ఇద్దరూ కలిసి పోయారు అంటూ, సంతోషిస్తున్నారు. వారు ఎవరో కాదు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, మరో టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఇసుక దీక్ష, వీరిద్దరినీ మళ్ళీ కలిపిందనే చెప్పాలి.

nani 12112019 2

ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నకల తరువాత నుంచి, విజయవాడ టిడిపిలో చిన్న పాటి తుఫాను వచ్చింది. ఎన్నికల ఫలితాలు తరువాత నుంచి, కేశినేని నాని, బుద్దా వెంకన్న ఒకరి పై ఒకరు, విమర్శలు చేసుకున్నారు. ఇదంతా ట్విట్టర్ వేదికగా జరిగింది. అయితే ఈ ట్విట్టర్ యుద్ధం కొనసాగుతూ ఉండటం, ప్రతి రోజు వార్తల్లో విషయం కావటంతో, చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని, ఇరువురికి సర్ది చెప్పారు. అప్పటి నుంచి, ఇరువు నేతలు, ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. అసలు జరిగిన విషయం ఏమిటో, క్లారిటీ లేకపోయినా, ఇద్దరు నేతల మధ్య మాత్రం, తేడాలు గమనించిన క్యాడర్ మాత్రం, అసంతృప్తితో ఉంది. వచ్చే మునిసిపల్ ఎన్నికలకు ధీటుగా ఎదుకోవాల్సిన టైంలో, ఇలా మనలో మనకే ఇబ్బందులు ఉంటే ఎలా అంటూ, కార్యకర్తలు ఆందోళన చెందారు.

nani 12112019 3

అయితే, నిన్న అనూహ్యంగా, ఇరువురి నేతలు, ఒకే వేదిక పై కుర్చుని, పక్క పక్కనే కూర్చుని, మాట్లాడుకోవటంతో, ఇరువురి మధ్య మళ్ళీ స్నేహం చిగురించిందని, ఇది పార్టీకే మంచిదని, కార్యకర్తలు అంటున్నారు. సోమవారం విజయవాడలోని కేశినేని భవన్‌లో నిర్వహించిన టీడీపీ అర్బన్‌ కమిటీ సన్నాహక సమావేశంలో, ఈ కలయిక చోటు చేసుకుంది. సమావేశం కేశినేని భవన్ లో జరగటం, అక్కడకు, బుద్దా వెంకన్న రావటం, కేశినేని నాని కూడా బుద్దా వెంకన్నతో సఖ్యతగా ఉండటంతో, ఇక నుంచి మళ్లీ అర్బన్‌ టీడీపీ నాయకులంతా ‘టీమ్‌ విజయవాడ’గా ముందుకు వెళ్తూ, వచ్చే మునిసిపల్ ఎన్నికల నాటికి, పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తామని, కార్యకర్తలు అంటున్నారు. ఏది ఏమైనా, చంద్రబాబు దీక్ష, ఇరువురి నాయకులను మళ్ళీ ఏకం చెయ్యటం, శుభ పరిణామం.

"And today's prize for most ridiculous excuse-making goes to..... the government of Andhra Pradesh. Hard to fathom how much damage the decision unilaterally to scrap this new city project will have for India's reputation as a reliable international partner." ఈ మాటలు చెప్పెంది, సింగపూర్ దేశానికి చెందిన ఒక ప్రముఖ ప్రొఫెసర్. ఆయన పేరు "జేమ్స్ క్రాబ్ ట్రీ". సింగపూర్ ప్రభుత్వం, అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాం అంటూ ఇచ్చిన ప్రకటన పై, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. "ఇలాంటి వింత వింత కారణాలు చెప్తూ, తప్పించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బహుమతి ఇవ్వాలి. మంచి ఇంటర్నేషనల్ పార్టనర్ గా, భారత దేశానికి పేరు ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, భారత దేశ ప్రతిష్టకే ఇబ్బందికర వాతావరణం ఉండే పరిస్థితి ఉంది అంటూ, ఈయన చేసిన ట్వీట్ తో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

singapoire 13112019 2

ఆరు నెలల్లో, దేశం మొత్తం, మన రాష్ట్రం వైపు చూసేలా చేస్తాం అని అంటే, ఏంటో అనుకున్నాం అని, ఇప్పుడు భారత దేశమే కాదు, ప్రపంచ దేశాలే మన వైపు చూసేలా, జగన్ చేసారని, కాకపొతే, అది మంచి అయితే పరవాలేదు, చెడుగా మన రాష్ట్రాన్ని చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో పీపీఏల విషయంలో జపాన్ ప్రభుత్వం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని మోడీకే ఉత్తరం రాసింది. ఏపిలో జరుగుతున్నవి చూస్తుంటే, మా పెట్టుబడి దారులు పెట్టుబడులు పెట్టాలి అంటేనే భయపడుతున్నారు, ఇది ఒక రాష్ట్రంతో ఆగదు, మీ దేశం మొత్తానికి ఇబ్బంది అంటూ, అప్పట్లో జపాన్ ఉత్తరం రాసింది. ఇప్పుడు, సింగపూర్ ప్రభుత్వం, కూడా ఇంచుమించు ఇలాగే స్పందించింది. గతంలో చంద్రబాబు హయంలో, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే, ఇప్పుడు అది రివర్స్ అయ్యింది.

singapoire 13112019 3

సింగపూర్ లో ఉన్న జాతీయ పత్రికలు కూడా, సింగపూర్ ప్రభుత్వం, ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో, చెప్తూ కధనాలు రాసారు. నిన్న సింగపూర్ ప్రభుత్వం ఆఫిషియల్ ప్రెస్ నోట్ గురించి చెప్తూ, ఈ కధనాల్లో, అసలు ఎందుకు సింగపూర్ ప్రభుత్వం తప్పుకుంది అని చెప్తూ రాసిన విశ్లేషణల్లో, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అమరావతి పై ఆసక్తి లేదని రాసాయి. దీనికి ఉదాహరణగా, అమరావతికి లోన్ ఇవ్వకుండా, ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్ళిపోవటం, అలాగే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా వెనక్కు వెళ్ళిపోవటం పై, ప్రస్తావించాయి. అలాగే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి కూడా కారణం అని చెప్తూ, చంద్రబాబు నాయుడు లెగసి లేకుండా చెయ్యాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తుందని రాసాయి. అలాగే, సింగపూర్ దేశానికి ఉన్న డైరెక్ట్ ఫ్లైట్ కూడా, ఈ కొత్త ప్రభుత్వం రద్దు చేసింది అంటూ, అన్ని వివరాలతో, కధనాలు రాసారు.

Advertisements

Latest Articles

Most Read