66 రోజుల తరువాత, జైలు నుంచి విడుదల అయిన చింతమనేని ప్రభాకర్, ఆయన స్వగృహంలో ప్రెస్ మీట్ పెట్టరు. ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి పెడుతున్న ఇబ్బందుల పై విరుచుకు పడ్డారు. నేను దోపిడీ చెయ్యలేదు అని, హత్యలు చెయ్యలేదని, చిన్న చిన్న కేసులు పెట్టి, లోపల ఉంచారని అన్నారు. దళితులను నన్ను తిట్టారు అంటున్నారు, దళితుల వద్దకు రండి,నేను ఎవరి భూములు అయినా లాక్కున్నానా నిరూపించండి, నా మీద పెట్టిన కేసుల మీద బహిరంగ విచారణ చేయించండి, దళితుల దగ్గరకు వెళ్లి మాట్లాడండి, నేను అన్యాయం చేశానేమో అడగండి, పెట్టిన కేసుల్లో నిజం ఉంటే ఏ శిక్ష అయినా వేయండి., ఏ విచారణకు అయినా సిద్ధం.. మొత్తం 13 ఊళ్ళ నుంచి, 13 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, వారి దగ్గరికే వెళ్లి అడుగుదాం, మిమ్మల్ని కూడా తీసుకు వెళ్తా, ఒక్కరైన వారికి నేను అన్యాయం చేసారు అని చెప్తే, జగన్ అవసరం లేదు, కోర్ట్ లు అవసరం లేదు, నాకు నేనే ప్రజల ముందే శిక్ష వేసుకుంటా అని చింతమనేని అన్నారు.

chintaman 161192019 2

ఇక అలాగే జగన్ సర్కార్ కి మరో ఛాలెంజ్ విసిరారు. ఈ కేసులు ఇవన్నీ అవసరం లేదు, మీరు మమ్మల్ని ఎలాగూ ఇబ్బంది పెడుతున్నారు, మీకే ఆఫర్ ఇస్తున్నా అంటూ సవాల్ విసిరారు. "నేను వనజాక్షిపై ధౌర్జన్యం చేశానని.. ఈడ్చేశానని..ధుర్భాషలాడాని..ఆరోపణలు చేశారు.. మీడియా మిత్రులూ అలానే రాశారు.. మరి ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టినోళ్లు ఆ విషయం మీద కేసు ఎందుకు పెట్టలేదు? మీడియా మిత్రులు ఆ విషయం మీరెందుకు అడగరు ప్రబుత్వాన్ని? నేను ఇప్పుడు డిమాండ్ చేస్తన్నా.. ఆ విషయం మీద విచారణ జరపండని .. మీడియా మిత్రులూ మీరూ అడగండి .. ఆ విషయంలో నాపై కేసు ఎందుకు పెట్టట్లేదు అని ..ఆరోజు చెప్పా.. నేడు చెప్తున్నా.. వనజాక్షి విషయంలో ఏవిధమైన అమర్యాద పూర్వకంగా నేను ప్రవర్తించలా. ఆ కేసు రీఓపెన్ చేసి, మళ్ళీ ఎంక్వయిరీ చేసి, నేను తప్పు చేసాను అని నిరూపించి, లోపల వెయ్యండి అంటూ, ప్రభుత్వానికే చింతమనేని సవాల్ విసిరారు.

chintaman 161192019 3

మరి చింతమనేని ప్రభాకర్ సవాల్ పై, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో పక్క మీడియా పై కూడా చింతమనేని వ్యాఖ్యలు చేసారు. ఉన్నది ఉన్నట్టుగా రాయటానికి కూడా మీడియా భయపడుతుందని అన్నారు. ఇంత ఘోరంగా పరిపాలన జరుగుతుంటే, మన మీడియా మాత్రం, అసలు పట్టించుకోవటం లేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు చెప్పలేక పోతున్నారని అన్నారు. ధైర్యంగా రాయండి అంటూ, మీడియాకు సూచించారు. మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవడం అంటే, రైతు భరోసా అమలు చేయడం, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇవ్వడం, ఆరోగ్య శ్రీ అమలు చేయడం మాత్రమే కాదు, శాంతిభద్రతలను అమలు చేసి, ఇతరుల మనసులు గాయపర్చకుండా ఉన్నప్పుడే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటారని హితవు పలికారు.

తెలుగుదేశం పార్టీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే, చింతమేని ప్రభాకర్ 66 రోజుల తరువాత, ఏలూరు సబ్ జైలు నుండి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చింతమనేనికి స్వాగతం పలికారు. పోలీసులు సెక్షన్ 30 ఆక్ట్ ఉంది అంటూ చెప్పినా, చింతమనేని ర్యాలీగా కొంత దూరం వెళ్లారు. అయితే పోలీసులు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అయితే, చింతమనేనికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసారు. "ఈ 5 నెలల్లోనే పనిగట్టుకుని ప్రభాకర్ పై 11కేసులు పెట్టారు. 9ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడంకన్నా అన్యాయం ఇంకోటి లేదు. వైసిపి అక్రమ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి. తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుంది" అంటూ చంద్రబాబు ధైర్యం చెప్పారు. సోమవారం నుంచి మూడు రోజల పాటు పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి, అక్కడ పరిస్థితి పై సమీక్ష చేస్తున్నామని, అక్కడ కలుద్దామని చంద్రబాబు, చింతమనేనితో అన్నారు.

phone 16112019 2

చింతమనేని ప్రభాకర్ పై 18 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటికే 14 కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. మళ్ళీ శుక్రవారం మరో నాలుగు కేసుల్లో చింతమనేనికి బెయిల్ మంజూరు అయింది. ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరుకు జోసెఫ్ పై చింతమనేని దాడి చేసి కులం పేరుతో తిట్టారని, పెదపాడు పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసులో సెప్టెంబర్‌ 11న పోలీసులు చింతమనేని అరెస్టు చేసి, కోర్ట్ లో హాజరు పరచటంతో, ఆయనకు రేమాండ్ విధించారు. అప్పటి నుంచి, పీటీ వారెంట్‌పై మరో 17 కేసుల్లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి, 66 రోజులుగా చింతమనేని ఏలూరు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

phone 16112019 3

అయితే, చింతమనేని పై మరో రెండు పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అంటున్నారు. ఇప్పటికే చింతమనేనికి, తెలుగుదేశం పార్టీ మొత్తం అండగా నిలిచింది. నారా లోకేష్ తో పాటుగా, అనేక మంది తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లి ఆయన్ను జైలులో కలిసారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా కలిసి పరామర్శించి, వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అయితే ఇప్పుడు చింతమనేని తరువాత అడుగు ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. ఆయన దూకుడు తెలిసిన వారు మాత్రం, ఇది చింతమనేనికి, జగన్ చేతులారా ఇచ్చిన అవకాసం అని, ఆయన ఒక పెద్ద నాయకుడుగా ఎదుగుతారని, ఈ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కుంటారని, ఆయన అభిమానులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పనులు పై, జాతీయ స్థాయిలో ఫోకస్ వస్తున్న సంగతి తెలిసిందే. అవి మంచి పనులు అయితే పరవాలేదు కాని, ప్రభుత్వం చేస్తున్న వివాదాస్పద పనుల పై, జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తూ, అవే ఎడిటోరియల్స్ గా కూడా మారుతున్నాయి. పీపీఏల రద్దుతో మొదలైన విమర్శలు, మొన్నటి పత్రికా స్వేఛ్చకు సంకెళ్ళు వేస్తూ ఇచ్చిన జీవో దాకా అనేక వివాదాస్పద నిర్ణయాలను, జాతీయ మీడియా విమర్శిస్తుంది. తాజాగా అమరావతిలోని స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ ప్రభుత్వం వైదోలగటం పై, అనేక మండి ఆశ్చర్యం వ్యక్తం చేసారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్సు ఉండేది. తాజాగా, ఇదే విషయం పై ఇండియన్ ఎక్ష్ప్రెస్ లో ఒక ఎడిటోరియల్ వచ్చింది. "రిగ్రసివ్ పాలిటిక్స్, సియం జగన్ రెడ్డి" అంటూ వచ్చిన ఈ ఎడిటోరియల్ పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. చంద్రబాబు పై కోపంతో, రాష్ట్ర అభివృద్ధిని ఇబ్బంది పెట్టవద్దు అని ఎడిటోరియల్ సారంశం.

edit 16112019 2

ఈ ఎడిటోరియల్ లో వచ్చిన హైలైట్స్ ఇలా ఉన్నాయి. "అమరావతి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ వెళ్ళిపోవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, మన దేశానికే పెద్ద దెబ్బ. విదేశీ పెట్టుబడిదారులకు, ఇలాంటి చర్యల వల్ల, ఇండియా మీదే, కాన్ఫిడెన్సు పోయే ప్రమాదం ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారు, ఈ నిర్ణయాన్ని ఒకసారి మళ్ళీ సమీక్షించుకోవాలి. ఈ ఒప్పందం రద్దు వెనుక ఉన్న ఒకే ఒక కారణం, రాజకీయం కక్ష అని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు కాబట్టే ఆపేసారు. కాని అది తప్పు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన పనులను, తరువాత వచ్చిన జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి, ముందుకు తీసుకు వెళ్లారు. చంద్రబాబు ఐటికి ఇచ్చిన ప్రాధాన్యతను, వైఎస్ఆర్ కొనసాగించారు కాబట్టే, ఈ రోజు హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉంది"

edit 16112019 3

అలాగే ఉత్తర్ ప్రదేశ్ లో, మాయవతి చేసిన మంచి పనులను, తరువాత వచ్చిన అఖిలేష్ యాదవ్ కొనసాగించారు, పూర్తీ చేసారు. జగన్ మోహన్ రెడ్డి గారు కూడా, ఇలాంటి ఆలోచనలే చేసి, అమరావతి లాంటి మంచి ప్రాజెక్ట్ ని పూర్తీ చెయ్యాలి. అన్ని ఇప్పటికీ సమకూరి ఉన్నాయి కాబట్టి, అమరావతిని పూర్తీ చేసి, దేశంలోనే ఒక మోడల్ గా నిలపాలి. అలా కాకుండా ప్రజా వేదిక కుల్చటం, పనులు అన్నీ ఆపేయటం, రాజకీయ కక్ష చూపించటం మంచిది కాదు. ఠిస్ ఈజ్ బ్యాడ్ పాలిటిక్స్" అంటూ ఎడిటోరియల్ రాసారు. అయితే ప్రతిపక్షాలు, వీటిని ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి గారు, కనీసం ఇప్పుడైనా, వీటిని కొనసాగించి, తానే పూర్తీ చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి. లేదంటే, ఇలాగే కూల్చేస్తా, అన్నీ ఆపేస్తా అంటే, ఇప్పటికి వచ్చిన చెడ్డ పేరు రెట్టింపు అవుతుంది, ప్రజల్లో కూడా పలుచన అవుతారు.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, జరుగుతున్న పరిణామాల పై మనస్తాపానికి గురయ్యారు. మొన్న ఒక టీవీ ఛానెల్ చర్చలో భాగంగా, వల్లభనేని వంశీ, రాజేంద్రప్రసాద్ మధ్య జరిగిన చర్చ, గొడవకు దారి తీసి, బూతులు తిట్టే స్థాయికి వెళ్ళింది. ఈ సందర్భంలో, వ్యక్తిగత ఆరోపణలుకు దిగిన వంశీ, వైవీబీ పై విరుచుకు పడ్డారు. అయితే మాలలో ఉండి, ఇలా మాట్లాడకూడదు కదా అంటే, వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు ఇలాగే చెప్తాను అంటూ, వంశీ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. అయితే, ఈ విషయంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అయితే, తనని అంత పర్సనల్ గా తిట్టినా, ఎవరూ తనకు మద్దతుగా రాలేదని, సొంత పార్టీ నేతల పై, వైవీబీ అలిగారు. పార్టీ కోసం నేను మాట్లాడితే, అతను అన్ని బూతులు తిడుతుంటే, ఎవరూ రాలేదని ఆయన ఆవేదన చెందారు. అయితే, ఆ రోజు చంద్రబాబు దీక్ష ఉండటం, నాయకులు అందరూ వంశీ, చంద్రబాబు పై విరుచుకు పడుతూ చేస్తున్న కామెంట్స్ పై ఫోకస్ పెట్టారని, అందుకే వైవీబీకి మద్దతుగా రాలేకపోయమని అంటున్నారు.

bode 16112019 2

అయితే నిన్న సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ లో, వంశీ భాషను ఖండించామని గుర్తు చేస్తున్నారు. అయితే, వైవీబీ మనస్తాపానికి గురయ్యారని తెలుసుకున్న చంద్రబాబు, వైవీబీకి ఫోన్ చేసి, జరిగిన విషయం తెలుసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేసి మిమ్మల్ని బాధ పెట్టిన విషయాన్ని ఖండిస్తున్నామని, పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని చెప్పారు. మరో పక్క అదే నియోజకవర్గానికి చెందిన బోడె ప్రసాద్ కూడా, ఆయన్ను వెళ్లి కలిసారు. జరిగిన విషయం అడిగి తెలుసుకుని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఆ రోజు దీక్ష ఉండటం, ఉదయమే, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఉండటంతో, బిజీగా ఉన్నామని, సాయంత్రం నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ లో, ఖండించామని గుర్తు చేసారు.

bode 16112019 3

ఈ విషయం పై బోడె ప్రసాద్ మాట్లాడారు. వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి మాట్లాడానని బోడె ప్రసాద్ తెలిపారు. స్నేహం వేరు, రాజకీయం వేరని, వంశీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వ్యక్తిగత దూషణలు ఎవరి పై చేసినా మంచిది కాదని బోడె ప్రసాద్ హితవుపలికారు. రాజేంద్రప్రసాద్ కు తాము ఏమి డబ్బు ఇవ్వలేదని, వంశీ ఇలాంటి ప్రచారాలు కావలనే చేస్తున్నారని అన్నారు. మరో పక్క, వంశీ చేసిన వ్యక్తిగత ఆరోపణల పై, వైవీబీ న్యాయ పోరాటానికి కూడా సిద్ధం అవుతునట్టు తెలుస్తుంది. ఇలా వదిలేస్తే, అందరి మీదకు ఇలాగే వెళ్తాడని, పార్టీ కనుక న్యాయ సహాయం అందిస్తే, దీని పై తాను ముందుకు తీసుకు వెళ్లి పోరాడతానని, చెప్పినట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read