తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తరువాత, వారానికి ఒకసారి, దేవినేని నెహ్రు తనయుడు, దేవినేని అవినాష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పార్టీ మారిపోతున్నారు అంటూ వార్తలు వస్తూ వచ్చాయి. అయితే అవినాష్ ఏమో చచ్చి పొతే పార్టీ జెండా కప్పుకుని చచ్చిపోవాలి అని మా నాన్న గారు చెప్పిన మాటలే నావి కూడా అన్నారు. వల్లభనేని వంశీ ఏమో, ఎన్నికల ముందు అన్నం తినే వాళ్ళు ఎవరూ ఆ పార్టీలో చేరారు అన్నారు, ఎన్నికల తరువాత, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్నారు. అయితే, అవినాష్ పార్టీ మారుతున్నారు అంటూ మూడు రోజుల నుంచి వార్తలు రావటం, నిన్న అనుచరులతో మీటింగ్ పెట్టుకోవటం, అక్కడ పార్టీలో గుర్తింపు లేదు అని తీర్మనించటం జరిగి పోయింది. ఈ రోజు నాలుగు గంటలకు అవినాష్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. మరో పక్క ఎవరూ ఊహించని విధంగా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్ మీట్ పెట్టరు.
దీపావళి నుంచి వంశే పార్టీ మారుతున్నారు అని వార్తలు వచ్చినా, వంశీ వైపు నుంచి క్లారిటీ రాలేదు. చంద్రబాబుకు మెసేజ్ చేసి, నేను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పారు. అయితే అప్పటి నుంచి స్పీకర్ కు మాత్రం, రాజీనామా లేఖ వెళ్ళలేదు. అయితే వంశీ పార్టీ మార్పు పై మాత్రం, ఎక్కడా స్పష్టత రాలేదు. అసెంబ్లీ కమిటిల్లో వంశీ పేరు రావటంతో, ఆయన ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యరు అనే విషయం అర్ధమైంది. ఆయన తటస్థంగా ఉంటారు అంటూ వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ పత్రికలో వంశీ మాట్లాడిన మాటలు ప్రచురిస్తూ, తాను ఎమ్మెల్యేగా ఉంటానని, అవసరం వచ్చినప్పుడు రాజీనామా చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం, జగన్ కు మద్దతు ఇస్తున్నాను అంటూ చెప్పినట్టు వార్త వచ్చింది.
అయితే అనూహ్యంగా వంశీ ఈ రోజు అయుదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. తాను జగన్ తో కలిసి నడుస్తానని, ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవి అడ్డు అందుకుంటే, అప్పుడు రాజీనామా చేస్తానని చెప్పారు. పనిలో పనిగా చంద్రబాబుని, లోకేష్ పై కూడా, విమర్శలు చేసారు. అయితే, చంద్రబాబు ఈ రోజు ఇసుక కోసం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం చంద్రబాబు ఈ దీక్షలో మాట్లాడుతూ, మన దీక్షను డైవర్ట్ చెయ్యటానికి, వైసీపీ పార్టీ, మన పార్టీలోని ఇద్దరితో, ఈ రోజు మన పై బురద చల్లించే కార్యక్రమం చేస్తున్నారు అంటూ చెప్పారు. చంద్రబాబు చెప్పినట్టే, దీక్ష ఎనిమిది గంటలకు ముగుస్తుంది అనగా, నాలుగు గంటలకు దేవినేని కండువా కప్పించుకుని, రాజీనామా లేఖ రాసి, మాకు గుర్తింపు లేదు అని చెప్తూ, వార్తల్లో నిలిచారు. అది అయిపోతుంది అనుకున్న టైంలో, వల్లభనేని వంశీ ప్రెస్ మీట్ పెట్టు, వార్తల్లో నిలిచారు. మొత్తానికి చంద్రబాబు చెప్పినట్టే, ఇద్దరూ బయటకు వచ్చారు. ఇది యాదృచ్చికమో, లేక నిజంగానే రాజకీయ గేమో అనేది వారికే తెలియాలి.