తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే, చింతమనేని ప్రభాకర్ ని, ఎన్నికలు అయిన తరువాత, ముప్పు తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చింతమనేని పై 18 కేసులు పెట్టారు. ఈ కేసులు అన్నీ, ఏవో మర్డర్ కేసులో, లేక వేల కోట్లు అవినీతి చేసిన కేసులో కాదు. కొట్టాడంటూ, తిట్టాడంటూ, దాడి కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టటం, ఆ కేసులో అరెస్ట్ చూపించటం, దాంట్లో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టటం, దాంట్లో అరెస్ట్ చూపించటం, ఇలా చింతమనేనికి చుక్కలు చూపించారు పోలీసులు. సహజంగా, ఇలా వేధించటం ఎప్పుడూ జరగదు. అన్ని కేసులు ఒకేసారి పెట్టి, కోర్ట్ లో చూపించే అవకాసం ఉంటుంది. కాని, చింతమనేని కావాలని టార్గెట్ చేసారని తెలుగుదేశం పార్టీ అంటుంది. జరిగిన పరిణామాలు కూడా, దానికి బలం చేకూరుస్తూ, ఇవి రాజకీయ కక్ష సాధింపు గానే కనిపిస్తుంది.
అయితే, ఇప్పటి వరకు చింతమనేని, పై 18 కేసులు పెట్టి, అరెస్ట్ చూపిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు చింతమనేని 66 రోజులు జైలులో ఉన్నారు. అయితే ఈ రోజు విచారణకు రావటం, ఏలూరు కోర్ట్ చింతమనేనికి బెయిల్ ఇచ్చింది. మొత్తం 18 కేసుల్లో బెయిల్ లభించింది. అయితే ఈ రోజు సమయం అయిపోవటం, కోర్ట్ ఆర్డర్స్ రాకపోవటంతో, చింతమనేని, ఈ రోజు విడుదల అయ్యే అవకాసం లేదని జైలు అధికారులు అంటున్నారు. రేపు చింతమనేని విడుదల అయ్యే అవకాసం ఉంది. రేపు మధ్యాహ్నం సమయానికి, చింతమనేని జైలు నుంచి విడుదల అయ్యే అవకాసం ఉన్నట్టు, తెలుస్తుంది. అయితే ఈ లోపు ఏమైనా మరో కేసు పెట్టి, చింతమనేని అరెస్ట్ చూపిస్తారా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి.
అన్నీ బాగుంటే, చింతమనేని 66 రోజుల తరువాత బయటకు వస్తారు. సెప్టెంబర్ 11న చింతమనేని అరెస్ట్ అయ్యారు. చింతమనేనిని రేపు విడుదల చేసే అవకాశం ఉండటంతో, జైలు వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చెయ్యనున్నారు. చింతమనేనికి భారీ స్వాగతం పలకటానికి, తెలుగుదేశం శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. మరో పక్క, ఇప్పటికే చింతమనేనికి అండగా తెలుగుదేశం పార్టీ నిలిచింది. చింతమనేని జైల్లో, అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు పరామర్శించారు. అలాగే కుటుంబ సభ్యులను కూడా కలిసి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి నారా లోకేష్ కూడా చింతమనేని వెళ్లి కాలిసారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రేపు చింతమనేని విడుదల పై ఆయన అనుచరులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.