హుజూర్‌నగర్‌ ఏంటి జగన్ మోహన్ రెడ్డి ఏంటి అనుకుంటున్నారా ? తెలంగాణాలో గత 5 ఏళ్ళలో కనీసం పోటీ కూడా చెయ్యని వైసీపీ, ఒక ఉప ఎన్నిక కోసం, రంగంలోకి దిగటం ఏంటి అనే ఆలోచనా ? 2014లో వైసీపీ తరుపున గెలిచిన, ఎమ్మల్యే, ఎంపీ, టీఆర్ఎస్ లో చేరినా, జగన్ అసలు మాట్లాడ లేదు. కాని ఇక్కడ చంద్రబాబు చేస్తే మాత్రం, దేవుడి స్క్రిప్ట్ ఫిరాయింపులు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేసిఆర్ కు జగన్ కు మధ్య ఉన్న బాండింగ్ కు, ఉదాహరణ ఇది. అయితే ఇప్పుడు మరో 20 రోజుల్లో జరిగే హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం, కేసీఆర్ కు సహాయ పడటానికి, జగన్ రంగంలోకి దిగుతున్నారా, అంటే అవును అనే సమాచారం వస్తుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మికంగా తీసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చెయ్యటమే కారణం.

huzurnagar 30092019 2

కాంగ్రెస్ గెలిచిన ఈ సీటులో, ఉప ఎన్నిక జరుగుతూ ఉండటం, ప్రాధాన ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ కుటుంబం పోటీ చెయ్యటంతో, వారిని అక్కడ ఓడించి, తమకు తిరుగు లేదు అని కేసీఆర్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అక్కడ, ఊరికి ఒక ఎమ్మెల్యేని, మండలానికి ఒక మినిస్టర్ ని పెట్టి, ఎలా అయిన ఆ సీట్ ను కైవసం చేసుకోవటానికి కేసీఆర్ ఎత్తుగడ వేసారు. అయితే, తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చెయ్యదు అని, ఈ సారి కూడా మహా కూటమిగా వస్తారని, అనుకున్న కేసిఆర్ కు షాక్ ఇస్తూ, తెలుగుదేశం పార్టీ అక్కడ కాండేట్ ని నిలబెట్టింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, అక్కడ 25 వేల ఓట్లు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో, టిడిపికి ఎంతో కొంత పట్టు ఉంది. టిడిపి పోటీ చేస్తే, అక్కడ చీలేది టీఆర్ఎస్ ఓట్లే.

huzurnagar 30092019 3

అందుకే ఇప్పుడు టిడిపి గెలవకపోయినా, టిడిపి వల్ల నష్టం వస్తుందని, కేసిఆర్ గ్రహించి, వెంటనే సిపిఐ వద్దకు పొత్తు కోసం వెళ్లారు. అంతే కాకుండా ఇప్పుడు జగన్ సహాయం కూడా తీసుకోవాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తూ ఉండగా, టీఆరెస్ కూడా అదే సామాజికవర్గం నుంచి అభ్యర్థిని నిలబెడుతుంది. అయితే ఆ సామాజికవర్గం మద్దతు ఎక్కువగా ఉత్తమ్ భార్య పద్మావతికే ఉందనే రిపోర్ట్ రావటంతో, మిగతా సామాజికవర్గాల ఓట్లు తమకు పడినా రెడ్డి సామాజికవర్గ ఓట్లను ఎలాగైనా చీల్చాలని కేసీఆర్ వ్యూహం పన్ని, అందుకు అనుగుణంగానే అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిని నిలపాలని జగన్‌ను కోరినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి పడే రెడ్డి ఓట్లు, జగన్ చీలుస్తారని కేసిఆర్ గట్టిగా నమ్ముతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుంది ? జగన్ అక్కడ అభ్యర్ధిని నిలబెడతారా అనేది చూడాలి.

విజయసాయి రెడ్డి... ఈయనంటే తెలియని వారు ఎవరూ ఉండరు. వైసీపీ పార్టీలో, జగన్ మోహన్ రెడ్డి తరువాత స్థానం ఆయనదే. పార్టీలోనే కాదు, పార్టీ పెట్టక ముందు నుంచి, విజయసాయి రెడ్డి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా, ఆ కుటుంబ ప్రాధాన ఆడిటర్ గా, ఆయన చేసిన పనులకు, జగన్ తో పాటుగా కేసుల్లో కూడా ఇరుకున్నారు. జగన్ తో పాటుగా, జైలు జీవితం కూడా అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించటంలో, విజయసాయి పాత్ర చాలా కీలకం అని చెప్తూ ఉంటారు. ఆయన ఢిల్లీలో కూర్చుని చేసిన రాజకీయం, బీజేపీకి టిడిపికి గ్యాప్ తీసుకు రావటం, అదే సమయంలో వైసీపీకి దగ్గర చెయ్యటం, ఎన్నికల్లో కేంద్ర సహకారం తీసుకోవటం, అలాగే తమ కేసులు స్పీడ్ అవ్వకుండా చూడటం, ఇలా అన్ని విషయాల్లో విజయసాయి రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యారని, వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు.

vsreddy 30092019 2

జగన్ పాదయాత్ర ఎంత ముఖ్యమో, ఢిల్లీలో విజయసాయి చేసే లాబీ కూడా అంటే ముఖ్యం అని చెప్పే వారు. జగన్ కూడా, విజయసాయి రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారు. ఆయనకు దాదపుగా నాలుగు పదవులు కూడా ఇచ్చారు. అందులో ముఖ్యమైంది, ఢిల్లీలో ప్రత్యెక ప్రతినిధిగా. విజయసాయి రెడ్డి ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పారు జగన్. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలే సాక్ష్యం అని కూడా అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు గురించి వైసీపీ ప్రజా ప్రతినిధులు, విజయసాయి దగ్గర గోడు చేపుకున్నారు. ఇసుక కొరతతో ప్రజలు అల్లాడుతున్నారని, ప్రతిపక్షాల పై కక్ష సాధింపు మరీ ఎక్కువైందని, రేపు పార్టీ అధికారం పొతే, వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే వెంటాడుతారని, కొంచెం స్పీడ్ తగ్గించాల్సిందిగా చెప్తూ, జగన్ కు చెప్పమని, విజయసాయి దగ్గర చెప్పుకొచ్చారు.

vsreddy 30092019 3

విజయసాయి కొంచెం ధైర్యం చేసుకుని, ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, వాటికి తక్షణం చెయ్యవలసిన పని గురించి చెప్తూ ఉండగా, జగన్ వైపు నుంచి వచ్చిన సమాధానం చూసి, విజయసాయి సైలెంట్ అయిపోయారు అంటూ కధనాలు వచ్చాయి. మిమ్మల్ని ఢిల్లీలో చూసుకోమన్నానుగా, ఆంధ్రప్రదేశ్ విషయాలు నాకు వదిలేయండి అంటూ, సుతి మెత్తగా చెప్పారంట జగన్. అలాగే విజయసాయి ప్రెస్ తో మాట్లాడుతూ, మేము చేసే అన్ని పనులకు, మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పటం, ఢిల్లీ పెద్దలకు కోపం రావటం, జగన్ వెళ్లి వారికి సంజయషీ ఇవ్వటం కూడా, జగన్ మనుసులో పెట్టుకుని, ఏపి విషయాలు మీరు వదిలేయండి అని చెప్పటంతో, విజయసాయి రెడ్డి అప్పటి నుంచి ట్విట్టర్ లో బిజీ అయిపోయారు అని చెప్తున్నారు. ఇక పార్టీలో నెంబర్ 2,3 లేదని, అంతా జగనే అని, ఇప్పుడు ఆయనకు ఏదైనా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి అంటే, ఎవరితో చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అని, వైసీపీ నేతలు వాపోతున్నారు.

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, వైసీపీ నేతలు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో పాటుగా, గెలిచిన ఎమ్మెల్యేల పై బదులు తీర్చుకునే పనిలో ఉంది వైసీపీ. గెలిచిన 23 మందిని టార్గెట్ చేస్తూ, వారిని కూడా ఎమ్మెల్యే పదవిలో లేకుండా చెయ్యటానికి, సాంకేతిక అంశాలు వెతుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే, నిన్న హైకోర్ట్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇచ్చింది. ఆయన కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లో, తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ, ఆయాన ఎన్నిక రద్దు చెయ్యాలి అని కోరుతూ, వైసిపీ అభ్యర్ధిగా, చంద్రబాబుతో పోటీకి దిగిన, కృష్ణ చంద్రమౌళి, హైకోర్ట్ లో ఎన్నికల పిటీషన్ వేసారు. చంద్రబాబు గెలుపును సవాల్ చేస్తూ వేసిన పిటీషన్ పై, చంద్రబాబుకు శనివారం, హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.

amaravati 29092019 2

ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు, ఇతర ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్ట్. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. చంద్రబాబు ఆదాయ మార్గాల ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించకుండా చంద్రబాబు గోప్యంగా ఉంచారని, ఆయన ముఖ్యమంత్రిగా పొందిన విషయాన్ని అఫిడవిట్ లో వెల్లడించలేదని అభియోగం. అలాగే కృష్ణా జిల్లా, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటుగా అప్పటి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వల్లభనేని వంశీ ఎన్నికను రద్దు చేయాలంటూ, గన్నవరం వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకటరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

amaravati 29092019 3

ఎన్నికల ప్రచారం సమయంలో వంశీ సూచన మేరకు ఆయన ప్రతినిధులు ఇంటి స్థలాల నకిలీ పట్టాలను పంచి ప్రలోభ పెట్టారని తెలిపారు. అలాగే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ చట్ట విరుద్ధంగా జరగడంతో తాను 990 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని వెల్లడించారు. అందుకే వల్లభనేని వంశీని, ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని యార్లగడ్డ హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్ట్, న్యాయమూ, వంశీతో పాటు రిటర్నింగ్‌ అధికారికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కేసు పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. అయితే దీని పై తెలుగుదేశం నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. చిన్న చిన్న అంశాలను కూడా పెద్దగా చూపించి, ఎదో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి, విపరీతంగా, అనధికారిక కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూటల కరెంటు కూతలతో, ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల ధర్నాలు కూడా జరుగుతున్నాయి. కారెంటు కూతలు ఎక్కువ అవ్వటంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ, ప్రభుత్వాన్ని తిడుతూ ఉండటంతో, ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో తీవ్ర బొగ్గు కొరత ఉందని, అందుకే ఈ సమస్య వచ్చిందని ప్రకటనలో తెలిపింది. ఏపి జెన్కో ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు తీవ్ర బొగ్గు కొరత ఉండటంతో, ఉత్పత్తి తగ్గిందని, అందుకే ఈ ఇబ్బందులని తెలిపింది. ఈ ఇబ్బందులు తొందరలోనే తీరిపోతాయని తెలిపింది. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు 57 శాతానికి పడిపోయిందని తెలుపుతూ, దానికి కారణాలుగా వర్షాలు, ప్రమాదాలు, సమ్మెలు అంటూ ప్రకటనలో తెలిపింది.

jagan 29092019 2

థర్మల్‌ పవర్‌ప్లాంట్లలో విద్యుదుత్పత్తికి ఆటంకమేర్పడి 1100 మెగావాట్ల లోటు తలెత్తింది. మరో పక్క బొగ్గు సరఫరా కోసం, సింగరేణీతో పాటు, కేంద్రాన్ని కూడా అడుగుతున్నామని తెల్పింది. దీని పై కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు జగన్ లేఖ రాసి, అక్కడ అధికారులతో టచ్ లో ఉన్నారు. అయితే మరో పక్క, ఈ రోజు మరో వార్త కూడా బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్ర కారం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వక పోవటంతో, విద్యుత్‌ కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే వేదిక విద్యుత్‌ ఎక్స్చేంజ్‌ లో, రాష్ట్రం పై నిషేధం విధించారని, రాష్ట్రానికి ఈ పరిస్థితి రావటం, ఇదే మొదటిసారని, అందుకే విద్యుత్ లేక ఇలా కోతలు విధుస్తున్నారని వార్తలు వచ్చాయి.

jagan 29092019 3

అయితే ప్రభుత్వం మాత్రం, ఇది కారణం కాదని, బొగ్గు నిల్వలు లేకపోవటమే కారణం అని చెప్తున్నారు. అయితే, ఇక్కడ ప్రభుత్వ ప్రకటన పై విస్మయం కలుగుతుంది. బొగ్గు నిల్వలు, 57 శాతానికి పడిపోతుంటే, ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు ఏమి చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. అత్యవసరం అయిన విద్యుత్ విషయంలో, ఇలా ఉదాసీనంగా ఉంటూ, ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండటంతో, ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయటం ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త తీసుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాది వర్షా కాలం ఉంటుందని, వర్షాలు పడుతున్నాయి అని, అందుకే బొగ్గు లేదని చెప్పటం కూడా విస్మయం కలిగుస్తున్న అంశం. అన్ని విషయాల్లో, కేసీఆర్ కు సహాయం చేస్తున్న జగన్, సింగరేణి నుంచి బొగ్గు ఎందుకు తెచ్చుకోలేక పోయారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఏది ఏమైనా, విద్యుత్ విషయంలో, ఇలా ఉదాసీనంగా ఉంటే, వేసవిలో ఏపి ప్రజలకు ఇక చుక్కలు కనిపించటం ఖాయం.

Advertisements

Latest Articles

Most Read