పేద ప్రజలు, కేవలం 5 రూపాయలకే, ఉదయం టిఫిన్, మధ్యహ్నం భోజనం, రాత్రికి భోజనం పెడుతూ, అన్న క్యాంటీన్ల పేరుతొ, చంద్రబాబు, పేదల కడుపు నింపారు. పేదలకు పెట్టేదే కదా అని తెలంగాణాలో పెట్టినట్టు, ఒక చిన్న షెడ్డు పెట్టి, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ భోజనం పెట్టలేదు. మంచి భవనం కట్టి, అన్ని సదుపాయాలు పెట్టి, సూచితో, శుభ్రంతో, భోజనం పెట్టే వారు. అయితే వైసీపీ ప్రభుత్వం రావటంతోనే, ఒక నెల ఆగి, జూలై 1 నుంచి ఈ అన్న క్యాంటీన్ లు ఆపేశారు. దీంతో పేదలు మళ్ళీ ఆకలితో అలమటిస్తున్నారు. ఒక పక్క ఇసుక లేక, పనులు లేక, డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే, 5 రూపాయలతో కడుపు నింపుకుందాం అంటే, అది కూడా లేకుండా చేసారు. అసలు అన్న క్యాంటీన్ లు ఎందుకు తీసారో ఎవరికీ అర్ధం కాలేదు. దీని పై మంత్రులు స్పందిస్తూ, అన్న క్యాంటీన్లలో అవినీతి జరిగిందని అన్నారు.
చంద్రబాబు ఈ బిల్డింగ్ ల్లో కూడా అవినీతి చేసారని, అందుకే అన్న క్యాంటీన్లు ముసేస్తున్నాం అని చెప్పారు. దీని పై బొత్సా సత్యన్నారాయణ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లు మళ్ళీ సెప్టెంబర్ 1 నుంచి తెరుస్తున్నామని చెప్పూర్. అయితే ఇప్పుడు సెప్టెంబర్ అయిపొయింది కాని, ఇంకా అన్న క్యాంటీన్ లు అయితే మొదలు కాలేదు. మరో పక్క అన్న క్యాంటీన్ భవనాలు పూర్తిగా మూసేసారు. వాటి రంగులు కూడా తీసి వేసి, తెలుపు రంగు వేసారు. కొంత మంది ఇక్కడ, మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే, అది పుకారుగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ అన్న క్యాంటీన్ భవనాలను వార్డు సచివాలయంగా మారుస్తున్నారు. గ్రామాల్లో అయితే, ఇప్పటికే ఉన్న పంచాయతీ ఆఫీస్ లను, గ్రామ సచివాలయంగా మారుస్తున్నారు.
వాటికి వైసీపీ జెండా రంగులు వేస్తున్నారు. మరో పక్క అన్న క్యాంటీన్ భవనాలకు, ఇప్పటికే తెలుపు రంగు వెయ్యటంతో, వాటిని వార్డు సచివాలయంగా మారుస్తున్నారు కాబట్టి, వాటికి కూడా వైసీపీ జెండా రంగు వేసారు. ఇప్పటికే నెల్లూరులో ఏడు అన్న క్యాంటీన్ భవనాలను వార్డు సచివాలయాలుగా మారుస్తూ, వాటికి రంగులు కూడా వేసేసారు. అయితే ఇవి అవినీతి బిల్డింగ్ లు అని, అందుకే దీంట్లో అవినీతి బయటకు తీసే దాకా, ఎలాంటి పనులు చెయ్యమని చెప్పి, ఇప్పుడు వార్డు సచివాలయంగా మారుస్తూ ఉండటంతో, ఇక్కడ కూడా వారికి ఎలాంటి అవినీతి దొరకలేదనే అనుకోవచ్చు. మొత్తానికి పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్ లు, చివరకు వైసీపీ రంగులు పులుముకుని, వార్డు సచివాలయం అయ్యాయి.