వైఎస్ వివేకానంద రెడ్డి... స్వయానా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు, జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్. సరిగ్గా ఎన్నికల ముందు, వివేక చనిపోవటం పెను సంచలనం అయ్యింది. అయితే ఆయన చనిపోయిన తరువాత, సన్నిహితులు చేసిన ప్రకటనలే, ఈ సంచలనానికి కారణం అయ్యింది. వివేక మరణ వార్త విన్న వెంటనే, ఆయన గుండెపోటు వచ్చి చనిపోయారు అంటూ వైసిపీ అనుకూల వర్గాలు అన్నీ చెప్పుకొచ్చాయి. అయితే ఒక రెండు గంటల తరువాత అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ఆయన్ను న-రి-కి చం-పా-రు. తల పై న-రి-కి-న గాట్లు ఉన్నాయి. ఆయన తలకి కుట్లు కూడా వేసి, అక్కడ ఉన్న రక్తం అంతా తుడిచేసారు. అయితే, ఇంత జరిగితే, ముందుగా గుండె నొప్పి వచ్చి చనిపోయారని ఎందుకు ప్రచారం చేసారు ? ఆయాన భార్య ఎదురు తిరగటంతో, అసలు విషయం ఎందుకు చెప్పారు ?
ఆయన బాడీకి కుట్లు వేసింది ఎవరు ? చనిపోయారని తెలిసినా, ఎందుకు అలా చేసారు ? అక్కడ రక్తం అంతా తుడిచింది ఎవరు ? ఇలాంటివి అన్నీ ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఈ ఉదంతం రావటంతో, అప్పటి అధికార, ప్రతిపక్షాలు, ఈ విషయం పై నువ్వంటే నువ్వు అని అనుకున్నాయి. జగన్ మోహన్ రెడ్డి, ఈ విషయం పై సిబిఐ ఎంక్వయిరీ కావాలని ప్రతి రోజు డిమాండ్ చేసే వారు. అయితే అప్పట్లోనే, అప్పట్లో రాహుల్‌దేవ్‌శర్మ కడప ఎస్పీగా ఉండే వారు. వైసిపీ ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి, ఆయన్ను బదిలీ చెయ్యమని కోరింది. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ఎస్పీని మార్చాలంటూ వైసీపీ నేతలు అప్పట్లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈసి ఆయన్ను బదిలీ చెయ్యటంతో, అభిషేక్ మహంతిని ఎస్పీగా నియమించారు.
ఈయన ఆయనకంటే స్ట్రిక్ట్ అనే పేరు ఉంది. ఆయన్ను అప్పటి ప్రభుత్వం, సిట్ వేసి, విచారణ అధికారిగా పెట్టింది. ఈ లోపు ప్రభుత్వం మారి జగన్ వచ్చారు. వివేక కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రధాన నిందితులను గుర్తించేందుకు పలువురిని విచారించారు. ఇటీవల నలుగురికి కోర్టు అనుమతితో నార్కో అనాలసిస్ పరీక్షలు సైతం నిర్వహించారు. నిందితులు ఏం చెప్పారనే విషయం ఇంకా బయటకు రాలేదు. వివేక కేసు విచారణ చివరి దశకు వచ్చిందని త్వరలోనే అసలు నిందితులు ఎవరో తేలిపోతుందని, వారి అరెస్టు జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ నేపథ్యంలో కడప ఎస్పీ అభిషేక్‌మహంతి ఉన్నట్టు ఉండి బదిలీ అయ్యారు. ఇంత హై ప్రొఫైల్ కేసులో, కేసు చివరి దశలో ఉన్న సమయంలో, ఆయన బదిలీ కావటం, విచారణపై ప్రభావం చూపుతుందనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు మహంతి బదిలీ కావడంతో కేసు విచారణ జాప్యం అయ్యే అవకాశం ఉందని పలువర్గాలు చర్చించుకుంటున్నాయి.