చంద్రబాబు ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, భారీ అవినీతికి పాల్పడింది అని చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆరోపణలు చేస్తూ, రివర్స్ టెండరింగ్ వెళ్ళింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్ విషయంలో, నిబంధనలు సవరించి మరీ, ఒకే సంస్థకు ప్రాజెక్ట్ కట్టబెట్టటం అనుమానాలకు తావు ఇస్తుంది. కేవలం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఒక్కటే సింగెల్ టెండర్ వేసి, ప్రాజెక్ట్ దక్కించుకునే విధానం చూస్తుంటే, ఎదో జరిగిందనే అనుమానం అందరికీ కలుగుతుంది. ఒక పక్క కేంద్రం కూడా, రివర్స్ టెండరింగ్ వద్దు అంటూ, చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్ళింది. ఇనీషియల్ బెంచ్ మార్కు కంటే, రూ.628 కోట్లు తక్కువకు బిడ్ వేసిందని, నవయుగకు 4.8 శాతం ఎక్కువకు ఇచ్చారని, అది కూడా లెక్కిస్తే, రూ.780 కోట్లు ఆదా అయ్యింది అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. మేఘాకు ఇవ్వటం పై, పెద్ద చర్చ జరుగుతున్న వేళ, ఇప్పుడు జలవనరుల నిపుణులు ప్రభుత్వం ముందు కొత్త ప్రశ్నలు పెడుతున్నారు.
ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ 73 శాతం పూర్తీ అయ్యింది, మరో ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ప్రాజెక్ట్ పూర్తీ అవుతుంది అంటూ అధికారులు చెప్పారు. అయితే ఇప్పుడు నాలుగు నెల నుంచి ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళటం లేదు. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. పనులు మొదలు పెట్టిన తరువాత, 14 నెలలకు ప్రాజెక్ట్ పూర్తీ అవుతుందని చెప్తున్నారు. అయితే పోలవరం పూర్తీ అయితే, పట్టిసీమ ఉపయోగం ఉండదు, ఇప్పుడు మళ్ళీ పట్టిసీమ ఆన్ చెయ్యల్సిన పరిస్థితి. పోలవరం లేకపోవటం వల్ల, ఇప్పుడు పట్టిసీమ ఆన్ చేస్తే, రూ.400 కోట్లు అదనంగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. కొత్త టెండర్ ప్రకారం, పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణం 21 నెలలు ఆలస్యం అయితే బయట నుంచి విద్యుత్ కొనుక్కోవాలి.
దీని కోసం ప్రభుత్వం రూ.2,900 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల రెండు పనుల్లో లేట్ అవ్వటం కారణంగా రూ.3,300 కోట్లు ప్రభుత్వ ఖజానా పై భారం పడుతుందని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెప్తున్న, ఆదా రూ.780 కోట్లను లెక్కిస్తే, రూ.2,520 కోట్ల మేర ప్రభుత్వం పై అధిక భారం పడనుంది. ఇక మరో పక్క, బిడ్డర్ వార్షిక టర్నోవర్‌ను రూ.1,800 కోట్ల నుంచి రూ.442.86 కోట్లకు ఎలా తగ్గిస్తారు అంటూ కూడా నిపుణులు ప్రశ్నించారు. రూ.2,250 కోట్ల ఎక్కడ, రూ.442.86 కోట్ల ఎక్కడ, కేవలం ఒక కంపెనీకి లబ్ది కోసమే, ఇలా చేసినట్టు తెలుస్తుందని అన్నారు. రివర్స్ టెండర్లలో కనీసం ఇద్దరు బిడ్డర్లయినా పాల్గొనాలని ప్రభుత్వమే జారీచేసిన ఉత్తర్వులో ఉన్న, వాటిని కూడా లెక్క చెయ్యకుండా మేఘాకు ఇచ్చారని అన్నారు.